హైదరాబాద్ : 26/04/2021
*ప్రాణంమొచ్చింది : హైదరాబాద్ చేరిన ఆక్సిజన్ ట్యాంకర్లు!*
కరోనా వైరస్ బాధితులు ప్రాణవాయువు లేక అల్లాడిపోతున్నారు. వారికోసం ఒడిశా నుంచి ఆక్సిజన్ ట్యాంకర్లు రాష్ట్రానికి వచ్చాయి. *యుద్ధ విమానాల్లో* వెళ్లిన ఆక్సిజన్ ట్యాంకర్లు సోమవారం సాయంత్రం హైదరాబాద్‌కు చేరుకున్నాయి. 9 ట్యాంకర్ల లో 150 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను తెలంగాణకు తరలించారు. ఒడిశాలోని అంగుల్, రూర్కెలా నుంచి ఆక్సిజన్ ట్యాంకర్లు వస్తున్నాయి.నాలుగు రోజుల కిందట హైదరాబాద్ నుంచి యుద్ధ విమానాల్లో ఆక్సిజన్ ట్యాంకర్లు వెళ్లిన విషయం తెలిసిందే.ఆక్సిజన్ నింపుకొని రోడ్డు మార్గాన ట్యాంకర్లు వచ్చాయి. ఆ ట్యాంకర్లు ముందుగా హైదరాబాద్ గచ్చిబౌలిలోని టీమ్స్ ఆస్పత్రికి వచ్చాయి. అనంతరం కరీంనగర్, చర్లపల్లి, కింగ్ కోఠి, ఛాతీ ఆస్పత్రి, ఖమ్మంలోని ఆస్పత్రులకు ఆక్సిజన్ ట్యాంకర్లు వెళ్తున్నాయి. ఈ ట్యాంకర్ల రాకతో కొంతలో కొంత ఆక్సిజన్ కొరత తగ్గింది. కరోనా బాధితులకు ఆక్సిజన్ ఎంతో అవసరం. ప్రస్తుతం అవసరాలకు మరికొంత ఆక్సిజన్ అవసరం ఉంది. కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణించి ట్యాంకర్లు హైదరాబాద్‌కు తరలివచ్చాయి.
*link Media SVL🖋️*
*ధన్యవాదములు Indian Army & Airforce... Bplkm*
Bapatla Krishnamohan
prajasankalpam1@gmail.com
@Praja_Snklpm (Twitter)
prj_snklpm9456 (Instagram)
prajasankalpam1 (youTube)
కూ యాప్‌లో @praja_snklpm యొక్క ఆసక్తికరమైన ఆలోచనలను వినండి - https://www.kooapp.com/profile/praja_snklpm
https://prajasankalpam1.blogspot.com/
No comments:
Post a Comment