Saturday, April 24, 2021

రాష్ట్రంలో వున్న మిగితా వారందరికీ ఉచితంగా వాక్సినేషన్ ఇవ్వాలి: సీఎం శ్రీ కేసీఆర్


హైదరాబాద్ : 24/04/2021

*తెలంగాణ సీఎం గారి సందేశం*

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సుమారు 4 కోట్ల జనాభాలో ఇప్పటికే 35 లక్షలకు పైగా ప్రజలకు కోవిడ్ వాక్సినేషన్ ఇవ్వడం జరిగింది. ఇకపై వయసుతో సంబంధం లేకుండా, రాష్ట్రంలో వున్న మిగితా వారందరికీ ఉచితంగా వాక్సినేషన్ ఇవ్వాలి: సీఎం శ్రీ కేసీఆర్.

వయోపరిమితి లేకుండా ప్రజలందరికీ టీకాలు ఇవ్వడానికి సుమారు రూ. 2500 కోట్లకు పైగా ఖర్చు అవుతుందనీ, అయితే ప్రజల ప్రాణాల కంటే డబ్బు ముఖ్యం కాదని అన్న సీఎం దీనికి సంబంధించిన ఆదేశాలను సీఎస్, వైద్యశాఖ అధికారులకు ఇవ్వడం జరిగింది.

ఇప్పటికే భారత్ బయోటెక్ వాక్సిన్స్ తయారీ చేస్తున్నదని, రెడ్డీ ల్యాబ్స్ తో సహా మరికొన్ని సంస్థలు టీకాల తయారీకి ముందుకు వచ్చాయని, కాబట్టి ఈ విషయంలో ఎలాంటి ఇబ్బంది వుండబోదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

ప్రజలు ఏ విధమైన భయభ్రాంతులకు గురికావద్దని, కరోనా సోకినవారికి పడకల విషయంలోనూ, మందుల విషయంలోనూ ప్రభుత్వం చేయాల్సినదంతా చేస్తున్నదని, ప్రజలను కోవిడ్ బారి నుండి కాపాడడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నదని, పెద్ద ఎత్తున సానిటేషన్ చేపట్టిందనీ ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు.

పెద్ద ఎత్తున ఒక చోట కూడవద్దని, ఊరేగింపులలో పాల్గొనవద్దని, అత్యవసరమైతేనే తప్ప బయట తిరగవద్దని, స్వయం క్రమశిక్షణ పాటించాలని సీఎం ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజల క్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న ప్రభుత్వం కరోనా మహమ్మారి విషయంలో చేయాల్సినదంతా పటిష్టంగా చేస్తుందని మరోమారు స్పష్టం చేశారు.

@TelanganaCMO Twitter (సౌజన్యంతో)

Bapatla Krishnamohan
prajasankalpam1@gmail.com
@Praja_Snklpm (Twitter)
prj_snklpm9456 (Instagram)
prajasankalpam1 (youTube)
కూ యాప్‌లో @praja_snklpm యొక్క ఆసక్తికరమైన ఆలోచనలను వినండి - https://www.kooapp.com/profile/praja_snklpm
https://prajasankalpam1.blogspot.com/

No comments:

Post a Comment