Monday, April 12, 2021

భార‌త్ లో మ‌రో వ్యాక్సిన్

హైదరాబాద్ : 12/04/2021

వ్యాక్సిన్ ఇచ్చేందుకు డా.రెడ్డీస్ కు అనుమ‌తి

భారత్ లో మరో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. రష్యా తయారు చేసిన స్పుత్నిక్ వి వ్యాక్సిన్ ను అత్య‌వ‌సరంగా వాడేందుకు అనుమ‌తి ఇచ్చింది. టీకా అత్యవసర వినియోగానికి డాక్ట‌ర్ రెడ్డీస్ ద‌ర‌ఖాస్తు చేయ‌‌గా డీసీజీఐ అనుమతించింది. అనుమతుల విషయంపై సోమవారం భేటీ అయిన నిపుణుల కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

COVID-19: Russia's Sputnik V vaccine may get authorisation in India soon, says report - cnbctv18.comCOVID-19: Russia's Sputnik V vaccine may get authorisation in India soon, says report - cnbctv18.com

దేశంలో ప్రస్తుతం సీరం ఇనిస్టిట్యూట్‌ తయారు చేస్తున్న కొవిషీల్డ్, భారత్ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకాలను వినియోగిస్తున్నారు. అయితే చాలా రాష్ట్రాల్లో ఆయా టీకాల కొరత ఏర్పడింది. తమకు అత్యవసరంగా టీకాలను పంపాలని వివిధ రాష్ట్రాలు కేంద్రానికి ఇప్పటికే విజ్ఞప్తి చేస్తున్నాయి.

ప్ర‌స్తుతం ఇండియాలో కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలు అందుబాటులో ఉండ‌గా, ఇప్పుడు ర‌ష్యాకు చెందిన స్పుత్నిక్ వి రానుంది. త్వ‌ర‌లోనే జాన్స‌న్ అండ్ జాన్స‌న్ వ్యాక్సిన్ కంపెనీ బ‌యోలాజిక్ ఇ ద్వారా, నొవావాక్స్ వ్యాక్సిన్ సీర‌మ్ ద్వారా, జైడ‌స్ కాడిలా వ్యాక్సిన్‌, భార‌త్ బ‌యోటెక్‌కు చెందిన ముక్కు ద్వారా వేసే వ్యాక్సిన్‌లు అందుబాటులోకి రానున్నాయి.

No comments:

Post a Comment