Friday, July 14, 2023

తెలంగాణ లో విద్య ఎలా ఉండాలి

*ప్రియమైన మిత్రులకు,SDF నుండి శుభాభివందనములు....*

*మేము రేపు అనగా 15-07-2023 ఉదయము 11 గంటల నుండి 2 గంటల వరకు ప్రెస్ క్లబ్, సోమాజిగూడ హైదరాబాద్ లో 'తెలంగాణ లో విద్య ఎలా ఉండాలి' అనే అంశం మీద ఒక మీటింగ్ పెడుతున్నాము. ఈ మీటింగ్ లో మీడియా ద్వారా ప్రజలకు రాజకీయ పార్టీలకు రాష్ట్రం లో విద్య అభివృద్ధి ఎలా చేస్తే బాగుంటుందో SDF ప్రతిపాదిస్తుంది ( SDF Recommended manifesto on Education ) దయచేసి ఈ మీటింగ్ కి మీరు హాజరు కావాలని మేము కోరుతున్నాము.అలాగే మన like minded మిత్రులను మీ whaysapp group ల ద్వారా ఆహ్వానించ గలరు.

 - ఆకునూరి మురళి IAS (retd ), కన్వీనర్ ,సోషల్ డెమోక్రాటిక్ ఫోరమ్ ( SDF ),

బాపట్ల కృష్ణమోహన్(SDF general body member),

హైదరాబాద్.

Thursday, July 13, 2023

ఉచిత విద్యుత్ పై నా వ్యాఖ్యలు వక్రీకరించారు.... రేవంత్ రెడ్డి...!

*ఉచిత విద్యుత్ పై  నా వ్యాఖ్యలు వక్రీకరించారు.... రేవంత్ రెడ్డి...!*

హైదరాబాద్‌: అమెరికాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఉచిత విద్యుత్‌పై తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తెలిపారు.హైదరాబాద్‌లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ''ఐటీ మంత్రి కేటీఆర్‌ తనకున్న ఐటీ నైపుణ్యంతో నేను వేర్వేరుగా మాట్లాడిన మాటలను ఎడిట్‌ చేసి తప్పుదారి పట్టించారు. ఉచిత విద్యుత్‌పై ప్రభుత్వ పెద్దలతో బహిరంగ చర్చకు సిద్ధం. రైతులకు ఉచిత విద్యుత్‌ను తీసుకువచ్చిందే కాంగ్రెస్‌ పార్టీ. బషీర్‌బాగ్‌ కాల్పుల ఘటన జరిగినప్పుడు కేసీఆర్‌ తెలుగుదేశం పార్టీలో ఉన్నారు.

ఉచిత విద్యుత్‌ ఇవ్వడం కుదరదు అని ఆనాడు కేసీఆర్‌ తెదేపా ప్రభుత్వంతో చెప్పించారు. వైఎస్‌ఆర్‌ ముఖ్యమంత్రిగా తొలి సంతకం ఉచిత్‌ విద్యుత్‌ దస్త్రంపైనే పెట్టారు. సాగుకు 9గంటల పాటు నాణ్యమైన విద్యుత్‌ను ఇచ్చింది కాంగ్రెస్‌ పార్టీ. ఉచిత విద్యుత్‌తో పాటు రాయితీపై ఎన్నో వ్యవసాయ పనిముట్లు ఇచ్చింది. రాష్ట్రవిభజన తర్వాత విద్యుత్‌ విషయంలో నష్టం జరగకుండా కాంగ్రెస్‌ అధిష్ఠానం జాగ్రత్తలు తీసుకుంది. వినియోగం ఆధారంగా
తెలంగాణకే ఎక్కువ విద్యుత్‌ వచ్చేలా సోనియాగాంధీ చర్యలు తీసుకున్నారు. కన తెలంగాణకు 53శాతం, ఏపీకి 47 శాతం విద్యుత్‌ కేటాయించారు. అందుకోసం అప్పటి కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి, కాంగ్రెస్‌ నేతలు కృషి చేశారు. ఉచిత విద్యుత్‌ పేటెంట్‌ కాంగ్రెస్‌ పార్టీదే'' అని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.

*సుజీవన్ వావిలాల*🖋️

పైలట్ రోహిత్ రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు

*వై... కేటగిరి సెక్యూరిటీతో తాండూర్ MLA... రోహిత్ రెడ్డి!*

తాండూరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆయనకు కల్పించిన సెక్యూరిటీ సిబ్బందితో ఏకంగా రీల్స్ చేయడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.ప్రభుత్వ, పోలీస్ సెక్యూరిటీతో రోహిత్ రెడ్డి సినిమా స్టైల్ లో వాడుకోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ వీడియోలో రోహిత్ రెడ్డి మధ్యలో నడుచుకుంటూ వెళ్తుంటే అతని చుట్టూ పోలీస్, ఇతర సెక్యూరిటీ వారు బందోబస్తు కల్పిస్తున్నట్టు ఉంది. కొన్నిరోజులుగా రోహిత్ రెడ్డి యాగం చేస్తున్నారు. ఈ క్రమంలోనే సెక్యూరిటీతో రీల్స్ చేసిన వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగా ఎమ్మెల్యేల కొనుగోలు సమయంలో భద్రతా దృష్యా రోహిత్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వం అదనపు భద్రత కల్పించిన విషయం తెలిసిందే.

*సుజీవన్ వావిలాల*🖋️

Wednesday, July 12, 2023

రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పేవరకు తిరగనీయొద్దు... MLC కవిత....!

*రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పేవరకు  కాంగ్రెస్ నేతలను తిరగనీయొద్దు... MLC కవిత....!*

హైదరాబాద్‌: రైతులు సంతోషంగా బతకాలంటే పంటలకు నాణ్యమైన విద్యుత్‌ ఉండాలని భారాస ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఉచిత విద్యుత్‌పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా నగరంలోని విద్యుత్‌సౌధ వద్ద భారాస (BRS) ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.ఈ నిరసన కార్యక్రమంలో పెద్ద ఎత్తున భారాస నేతలు, కార్పొరేటర్లు పాల్గని రేవంత్‌, కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం రేవంత్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు.

ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ రైతులకు సీఎం కేసీఆర్‌ నాణ్యమైన విద్యుత్‌.. కాళేశ్వరం నీళ్లు ఇస్తున్నారని చెప్పారు. తెలంగాణలో అమలవుతున్న రైతుబంధు పథకం దేశంలో ఎక్కడా లేదన్నారు. రేవంత్‌ చేసిన వ్యాఖ్యలతో కాంగ్రెస్‌ రైతు డిక్లరేషన్‌ బోగస్‌ అని అర్థమైందని ఆమె వ్యాఖ్యానించారు. ''60 ఏళ్ల పాటు దేశంలో అధికారంలో కొనసాగిన కాంగ్రెస్‌ పాలనలో రైతులు ఇబ్బందులు పడ్డారు. రైతులుకు 24 గంటల విద్యుత్‌ ఎందుకు ఇవ్వొద్దు? పరిశ్రమలకు ఇవ్వొద్దు అనే ధైర్యం రేవంత్‌కు ఉందా?మూడు పూటలా అన్నం పెట్టే రైతులకు 3 గంటలే విద్యుత్‌ ఇవ్వాలనే రేవంత్‌ను ఊరు పొలిమేర వరకు తరిమికొట్టాలి. రైతులకు ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలి. రేవంత్‌ క్షమాపణ చెప్పే వరకు కాంగ్రెస్‌ నేతలను గ్రామాల్లోతిరగనీయొద్దు'' అని కవిత మండిపడ్డారు.

*సుజీవన్ వావిలాల*🖋️ 

Tuesday, July 11, 2023

టీ కాంగ్రెస్ లో సీఎం సీటు లొల్లి

*టీ కాంగ్రెస్ లో సీఎం సీటు లొల్లి.... అధిష్టానం దృష్టికి రేవంత్ వ్యాఖ్యలు*

హైదరాబాద్‌: తెలంగాణ కాంగ్రెస్‌లో మరోసారి సీఎం పదవి లొల్లి మొదలైంది. 'సీఎం సీటు'పై ఆ పార్టీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు అధిష్టానం దృష్టికి చేరాయి.సీఎం సీటు కోసం పోటీ నెలకొన్న క్రమంలో.. నిన్న మొన్నటి వరుకు చర్చలో రేవంత్‌ రెడ్డి, భట్టి విక్రమార్క, జానారెడ్డి పేరు వినిపించాయి.. తాజాగా ఈ జాబితాలోకి సీతక్క కూడా చేరింది.

అమెరికా పర్యటనలో ఉన్న రేవంత్‌.. ఇండియన్‌ ఓవర్సీస్‌ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో నిర్వ హించిన మీట్‌ అండ్‌ గ్రీట్‌ కార్యక్రమంలో గిరిజన మహిళగా సీతక్క సీఎం అయ్యే అవకాశం లేకపోదన్న రేవంత్‌ వ్యాఖ్యలపై పార్టీలో, అటు సోషల్‌ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది.

ఎస్సీ, ఎస్టీల పట్ల కాంగ్రెస్‌ వైఖరి ఎలా ఉంటుంది? ఎస్సీల నుంచి భట్టివిక్రమార్కను సీఎంగా ప్రతిపాదిస్తున్నారు. ఎస్టీల నుంచి సీతక్కకు కనీసం ఉప ముఖ్యమంత్రిగా అవకాశం ఇస్తారా? అన్న ప్రశ్నకు స్పందించిన రేవంత్‌.. కాంగ్రెస్‌ నాలుగు రాష్ట్రాల్లో అధికారంలో ఉంటే ముగ్గురు సీఎంలు ఓబీసీలేనని చెప్పారు. పేదలు, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల పక్షాన పార్టీకి స్పష్టమైన విధానం ఉందని చెప్పారు.
అయితే, ఫలానా పోస్టుకు ఫలానా నేతను ఎంపిక చేస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్‌ పార్టీ చెప్పదని స్పష్టం చేశారు. సీతక్కకు ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వాలన్న ఎన్‌ఆర్‌ఐల సూచనను పార్టీ వేదికల మీద చర్చిస్తామని, అవసరమనుకుంటే సందర్భాన్ని బట్టి సీతక్క సీఎం కూడా అవుతుందని ఆయన వ్యాఖ్యానించారు. రేవంత్‌ వ్యాఖ్యలపై ఆ పార్టీ సీనియర్లు స్పందిస్తూ ఇప్పుడే సీఎం ఎవరనే విషయంపై కామెంట్స్‌ చేయొద్దంటూ వార్నింగ్‌ ఇస్తున్నారు.

*సుజీవన్ వావిలాల*🖋️ 

Monday, July 10, 2023

12న పాఠశాలలు,ఇంటర్ కళాశాలల రాష్ట్ర వ్యాప్తంగా బంద్: ఎస్ఎఫ్ఐ

ప్రచురణార్ధం/ప్రసారర్ధం:
తేదీ: 10-07-2023

విద్యారంగ సమస్యలు పరిష్కారం కోసం జూలై 12న పాఠశాలలు,ఇంటర్ కళాశాలల రాష్ట్ర వ్యాప్తంగా బంద్: ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మేడ్చల్ మండలంలో విద్యాసంస్థల బంద్ ను విజయవంతం చేయాలని పిలుపు. నిరసన చేసి పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది.

 మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో విద్యారంగ సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ ఈ నెల 12 న రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు,ఇంటర్ కళాశాలల బంద్ నిర్వహిస్తున్నట్లు ఈ బంద్ లో విద్యార్థులు పాల్గొని జయప్రదం చేయాలని ఎస్ఎఫ్ఐ పిలుపునిచ్చాయి.
 
ఈ సందర్భంగా *ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రాథోడ్ సంతోష్, మాట్లాడుతూ*....
రాష్ట్రంలో కార్పోరేట్, ప్రైవేట్ ఫీజులు దందా కోనసాగుతున్న ఇప్పటికీ ప్రభుత్వం వాటి నియంత్రణ కోసం ఎలాంటి చర్యలు తీసుకోలేదని మంత్రులు ఉపసంఘం, తిరుపతిరావు కమిటీ రిపోర్ట్ బహిర్గతం చేయకపోవడం చూస్తే ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు అనూకులంగా వ్యవరిస్తున్నట్లుగా ఉందని అన్నారు. విద్యాసంవత్సరం ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా యూనిఫామ్ ఇవ్వలేదు, కోన్ని టైటిల్స్ పాఠ్యపుస్తకాలు పంపలేదు, చదువులు చెప్పే టీచర్లు లేరు, పారిశుద్ధ్య కార్మికులు లేరు ,అనేక సమస్యలతో విద్యాసంవత్సరం ప్రారంభమైన నిర్ధిష్టమైన చర్యలు ప్రభుత్వం తీసుకోవడం లేదు. త్రాగునీరు, మధ్యాహ్న భోజనం బిల్లుల పెండింగ్, ముత్రశాలలు, సరైన మౌళిక సదుపాయాలు లేక ప్రభుత్వ విద్యారంగం గోల్లుమంటుంది. మన ఊరు-మనబస్తీ-మనబడి నిధులు గుత్తేదారులు తూతూమంత్రంగా మాత్రమే పనులు జరిగాయి కానీ ఎక్కడ సరిగ్గా పాఠశాలలకు ఉపయోగ పడింది లేదు. ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం హామీ అందని ద్రాక్షగా మారింది. ఇంటర్ విద్యార్ధులకు పాఠ్యపుస్తకాలు ఇంకా అందివ్వలేదు. లెక్చరర్స్ లేరు. ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయి.
- రాష్ట్రంలో గత నాలుగేళ్ల నుండి ఫీజు రీయంబర్స్ మెంట్స్& స్కాలర్ షిప్స్ 5,177 కోట్లు పెండింగులో ఉన్నాయి. వాటిని కనీసం విడుదల చేయడం లేదు.
-గురుకులాలు, కెజిబివిలు, ఇంటర్ కళాశాలలుగా అఫ్ గ్రేడ్ చేసిన కెజిబివిలు భవనాలు లేక అరకోక సౌకర్యాలతో అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. వాటికి నిధులు లేవు, లెక్చరర్స్, టీచర్స్ లేరు. నాణ్యమైన భోజనం లేక పుడ్ ఫాయిజాన్స్ అవుతున్న ఘటనలు కో కొల్లలు గా ఉన్నాయి. 
- రాష్ట్రంలో భారీ సంఖ్యలో టీచర్,లెక్చరర్స్ ఖాళీలు ఉన్నాయి. వాటి భర్తీ చేయడం లేదు, ఒక్క డిఎస్సీ ఇప్పటివరకు వేయలేదు. అందుకే ఈ సమస్యలను పరిష్కారం చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులను కదిలించి బంద్ నిర్వహిస్తున్నామని ప్రభుత్వం తక్షణమే స్పందించి సమస్యలు పరిష్కారం చేయాలని అన్నారు. జిల్లాలో బంద్ విజయవంతం చేయాలని విద్యార్ధి లోకానికి వామపక్ష విద్యార్ధి సంఘాలు పిలుపునిస్తున్నాయి. ఎస్ఎఫ్ఐ మేడ్చల్ మండల కార్యదర్శి M.కిరణ్,యశ్వంత్, శివ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

ధన్యవాదములతో....

రాథోడ్ సంతోష్
SFi జిల్లా కార్యదర్శి

బీసీలకు 50శాతం సీట్లు ఇవ్వాలి....బండి సంజయ్ ను తప్పించడం సరైంది కాదు.... R కృష్ణయ్య

*బీసీలకు 50శాతం సీట్లు ఇవ్వాలి....బండి సంజయ్ ను తప్పించడం సరైంది కాదు.... R కృష్ణయ్య*
బండి సంజయ్ లాంటి బీసీ నేతని బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించడం సరికాదు.. రానున్న తెలంగాణ ఎన్నికల్లో ప్రధాన పార్టీలన్నీ బీసీలకు 50శాతం టికెట్లు ఇవ్వాలి..అంటూ బీసీ ఉద్యమనేత, ఎంపీ ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. సుధీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న సమస్యలని పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్న ఏఎన్ఎంల ధర్నాలో పాల్గొని ఎంపీ ఆర్ కృష్ణయ్య మద్దతు తెలిపారు.. ఈ సందర్భంగా కృష్ణయ్య హాట్ కామెంట్స్ చేసారు.. సమస్యలు పరిష్కరించాలని ఆరోగ్య శాఖ మంత్రిని కలిస్తే వేరే పని చేస్కోండి అని అంటారా..? వెంటనే మంత్రి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కరోనా టైంలో ఎవరు బయటకి రాని సమయంలో anmలు ఇంటింటికి తిరిగారు. అలాంటి వారిపై చిన్న చూపు ఎందుకు అని ప్రశ్నించారు.

ఏఎన్ఎంల సమస్యలు పరిష్కరించకపోతే వైద్య ఆరోగ్య వ్యవస్థని స్తంభింప చేస్తాం అని ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు. వెంటనే సమస్యలు పరిష్కరించకపోతే ప్రగతి భవన్, సచివాలయం ముట్టడికి పిలుపునిస్తామని పేర్కొన్నారు. ఎన్నికలు వస్తున్నాయని వీళ్లను పట్టించుకోకపోతే మీకు తగిన బుద్ది చెబుతారని హెచ్చరించారు.Anm ల ధర్నాలో పాల్గొన్న అర్ కృష్ణయ్య బీసీల రాజ్యాధికారంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీసీల రాజ్యాధికారం కోసం కొట్లాట చేస్తున్నామని.. రానున్న ఎన్నికల్లో అన్ని పార్టీలు బీసీలకు 50శాతం టికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బండి సంజయ్ లాంటి బీసీ నేతని బిజెపి రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించడం సరికాదని దీన్ని వ్యతిరేకిస్తున్నామని తెలిపారు.

*సుజీవన్ వావిలాల*🖋️