*బీసీలకు 50శాతం సీట్లు ఇవ్వాలి....బండి సంజయ్ ను తప్పించడం సరైంది కాదు.... R కృష్ణయ్య*
బండి సంజయ్ లాంటి బీసీ నేతని బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించడం సరికాదు.. రానున్న తెలంగాణ ఎన్నికల్లో ప్రధాన పార్టీలన్నీ బీసీలకు 50శాతం టికెట్లు ఇవ్వాలి..అంటూ బీసీ ఉద్యమనేత, ఎంపీ ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. సుధీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న సమస్యలని పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్న ఏఎన్ఎంల ధర్నాలో పాల్గొని ఎంపీ ఆర్ కృష్ణయ్య మద్దతు తెలిపారు.. ఈ సందర్భంగా కృష్ణయ్య హాట్ కామెంట్స్ చేసారు.. సమస్యలు పరిష్కరించాలని ఆరోగ్య శాఖ మంత్రిని కలిస్తే వేరే పని చేస్కోండి అని అంటారా..? వెంటనే మంత్రి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కరోనా టైంలో ఎవరు బయటకి రాని సమయంలో anmలు ఇంటింటికి తిరిగారు. అలాంటి వారిపై చిన్న చూపు ఎందుకు అని ప్రశ్నించారు.
ఏఎన్ఎంల సమస్యలు పరిష్కరించకపోతే వైద్య ఆరోగ్య వ్యవస్థని స్తంభింప చేస్తాం అని ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు. వెంటనే సమస్యలు పరిష్కరించకపోతే ప్రగతి భవన్, సచివాలయం ముట్టడికి పిలుపునిస్తామని పేర్కొన్నారు. ఎన్నికలు వస్తున్నాయని వీళ్లను పట్టించుకోకపోతే మీకు తగిన బుద్ది చెబుతారని హెచ్చరించారు.Anm ల ధర్నాలో పాల్గొన్న అర్ కృష్ణయ్య బీసీల రాజ్యాధికారంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీసీల రాజ్యాధికారం కోసం కొట్లాట చేస్తున్నామని.. రానున్న ఎన్నికల్లో అన్ని పార్టీలు బీసీలకు 50శాతం టికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బండి సంజయ్ లాంటి బీసీ నేతని బిజెపి రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించడం సరికాదని దీన్ని వ్యతిరేకిస్తున్నామని తెలిపారు.
*సుజీవన్ వావిలాల*🖋️
No comments:
Post a Comment