Monday, June 26, 2023

తెలంగాణ మలిదశ ఉద్యమకారులు తమ ఆవేదన

https://twitter.com/Praja_Snklpm/status/1673530326948380674?t=fnPIgA7EzVxSZSPCTpPm_Q&s=08                                                                                        *#తెలంగాణ #డైనమిక్ మంత్రివర్యులు @KTRBRS సారూ తెలంగాణ మలిదశ ఉద్యమకారులు తమ ఆవేదనను మీకు వినతిపత్రం ద్వారా ఇవ్వడం చూస్తుంటే బాధేస్తుంది 😔.*
*తెలంగాణ ద్రోహులకు పెద్దపీఠ వేసి... ఉద్యమంలో నిస్వార్థంగా పనిచేసి సర్వం కోల్పోయిన వారిని మీరు పట్టించుకోవడం లేదు ఎందుకు??*                                                                                                                                                             *4నెలలలో ఎన్నికలు రాబోతున్నాయి ఇప్పుడైనా "గరిక సుధాకర్" లాంటి ఉద్యమకారులు చాలా మంది వున్నారు ఇలాంటి వారిని గుర్తించి ప్రభుత్వం తరపున న్యాయం చేయాలి అని  "ప్రజాసంకల్పం" విజ్ఞప్తి చేస్తుంది 🙏*

*@TelanganaCMO*
*#kcr*
*#తెలంగాణమలిదశఉద్యమకారులు*
*#KTR*
*#askktr*

*#జోహార్లుతెలంగాణఅమరవీరులకు*
*Bplkm🪶*                                                                                                                         *NOTE : Copy To Group Link Media*

కేంద్రం నిధులు.... తెలంగాణకు 2102 కోట్లు....!

*16 రాష్ట్రాలకు కేంద్రం నిధులు.... తెలంగాణకు 2102 కోట్లు....!*

దిల్లి....దేశంలోని 16 రాష్ట్రాలకు మూలధన పెట్టుబడి కింద రూ.56,415 కోట్లు కేంద్రం విడుదల చేసేందుకు కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది.ఈ ఏడాది బడ్జెట్‌లో  ప్రతిపాదించిన ప్రత్యేక సాయం పథకం కింద ఈ నిధులు కేటాయించింది. ఇందులో భాగంగా తెలంగాణకు రూ.2,102 కోట్లు కేటాయించింది. ఏపీకి మాత్రం ఈ జాబితాలో చోటు దక్కలేదు.

2023-24 ఆర్థిక సంవత్సరానికి గానూ 'స్పెషల్‌ అసిస్టెన్స్‌ టు స్టేట్స్‌ ఫర్‌ క్యాపిటల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌' పేరిట ప్రత్యేక పథకాన్ని కేంద్రం ఈ ఏడాది బడ్జెట్‌లో ప్రకటించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.1.3 లక్షల కోట్లు ఇవ్వాలని నిర్ణయించింది. 50 ఏళ్లకు గానూ వడ్డీలేని రుణంగా ఈ మొత్తం రాష్ట్రాలకు అందుతుంది. ఈ నేపథ్యంలో రూ.56,415 కోట్లు విడుదల చేసేందుకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. ఈ మొత్తంతో విద్య, వైద్యం, నీటి పారుదుల, మంచినీటి సరఫరా, విద్యుత్‌, రహదారులు వంటి వాటి కోసం వినియోగించుకోవచ్చు.ఈ పథకం కింద నిధులు అందుకోనున్న రాష్ట్రాల్లో దక్షిణాది నుంచి కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలు ఉండగా.. కేరళ, ఏపీ మాత్రం ఈ జాబితాలో లేవు. అత్యధికంగా బిహార్‌కు రూ.9640 కోట్లు కేంద్రం రుణం మంజూరు చేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఇదే తరహా పథకాన్ని కేంద్రం ప్రవేశపెట్టింది. ఈ స్కీమ్‌ కింద రూ.95,147.19 కోట్లకు ఆమోదం తెలపగా.. రూ.81,915.35 కోట్లు కేంద్రం విడుదల చేసింది. కొవిడ్‌ అనంతరం రాష్ట్రాలు తమ మూలధన వ్యయాలను పెంచాలన్న ఉద్దేశంతో 2020-21 సంవత్సరంలో ఈ పథకాన్ని తొలుత ప్రవేశపెట్టారు.

*సుజీవన్ వావిలాల*🖋️ 

Sunday, June 25, 2023

MLA రోహిత్ రెడ్డి క్షేమంగా రావడంతో అభిమానుల సందడి!

*MLA రోహిత్ రెడ్డి క్షేమంగా రావడంతో అభిమానుల సందడి!*

*దేవాలయాల్లో పూజలు, ఇంటి వద్ద అభిమానుల కోలాహలం...!*

తాండూరు: తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి క్షేమంగా ఇంటికి తిరిగి రావడంతో అభిమానులు సందడి చేశారు.తాండూరు నియోజకవర్గంలోని తాండూరు, పెద్దేముల్, బషీరాబాద్, యాలాల మండలాలతోపాటు తాండూరు పట్టణానికి చెందిన అభిమానులు, కార్యకర్తలు, నాయకులు ఎమ్మె ల్యే నివాసానికి పెద్దఎత్తున తరలివచ్చారు.

తాండూరు ప్రజలు ప్రేమానురాగాలు, దేవుని కృపతో ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి ప్రమాదం నుంచి బయట పడటం తో అభిమానులు, నాయకులు దేవాలయాల్లో, చర్చిలలో, మసీదుల్లో, దర్గాలలో ప్రత్యేక పూజలు చేయించారు. ఎమ్మెల్యే ఇంటి ముందు కొందరు నాయకులు 1101 కొబ్బరికాయలు పగులకొట్టారు. మిఠాయిలు పంచుకున్నారు. టపాకాయలు కాల్చారు. తమ నాయకుడు రోహిత్‌రెడ్డి ప్రమాదం నుంచి తప్పించుకుని క్షేమంగా తిరిగి రావడంతో అభిమానులు కోలాహానికి అవదులు లేకుండా పో యాయి. ఎమ్మెల్యేను కలిసి క్షేమంగా ఉండాలని నాయకులు, అభిమానులు కోరారు.

*సుజీవన్ వావిలాల*🖋️

Saturday, June 24, 2023

*పాత్రికేయులకు... త్వరలో ఇళ్ల స్థలాల పంపిణీ.... మంత్రి KTR.....!

*పాత్రికేయులకు... త్వరలో ఇళ్ల స్థలాల పంపిణీ.... మంత్రి KTR.....!*

*న్యూదిల్లి....!*
పాత్రికేయులందరికీ వీలైనంత త్వరగా ఇళ్ల స్థలాలు ఇస్తామని మంత్రి కేటీఆర్‌ హామీ ఇచ్చారు. ఈ ప్రక్రియను మీడియా అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణకు అప్పగించామని తెలిపారు.ఢిల్లీ టీయూడబ్ల్యూజే-143 అధ్యక్షుడు నాగిళ్ల వెంకటేష్‌ అధ్యక్షతన శనివారం పాత్రికేయుల బృందం మంత్రి కేటీఆర్‌ తో సమావేశమైంది. ఈ సందర్భంగా ఢిల్లీలో పనిచేస్తున్న తెలంగాణ పాత్రికేయులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించాలని కేటీఆర్‌కు విజ్ఞప్తి చేశారు.

దీనికి ఆయన సానుకూలంగా స్పందిస్తూ.. హైదరాబాదు లోని పాత్రికేయులందరికీ స్థలాలు ఇస్తామని స్పష్టం చేశారు. ఇందులోనే ఢిల్లీలో పనిచేస్తున్న తెలంగాణ పాత్రికేయుల్ని సైతం చేరుస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు జీవోలో ఆ అంశాలను పొందుపరుస్తామన్నారు. జవహర్‌లాల్‌ నెహ్రూ జర్నలిస్టు సొసైటీకి, హైదరాబాద్‌ పాత్రికేయులకు ఒకేసారి ఇళ్ల స్థలాలు ఇస్తామని స్పష్టం చేశారు. భేటీలో బీఆర్‌ఎస్‌ ఎంపీలు గడ్డం రంజిత్‌ రెడ్డి, కొత్త ప్రభాకర్‌ రెడ్డి, మాజీ స్పీకర్‌ ఎమ్మెల్సీ మధుసూదనాచారి ఉన్నారు.

*సుజీవన్ వావిలాల*🖋️ 

షాద్ న‌గ‌ర్‌లో ధ‌ర‌ణి దొంగ‌లు

షాద్ న‌గ‌ర్‌లో ధ‌ర‌ణి దొంగ‌లు

– రికార్డుల్లో పేరొచ్చిందని దోపిడీ
– అధికారుల స‌హకారంతో రూ.వందల కోట్ల భూస్కాములు
– 90 మంది వృద్ధుల ప్లాట్స్ కు టోక‌రా?
– చ‌క్రం తిప్పిన రెవెన్యూ అధికారులు!
– త‌క్కువ‌లో కొని.. ఎక్కువ లాభాలకు అమ్మకం
– త‌న్నుకు చావండి.. మేము సేఫ్ అంటున్న రియ‌ల్ట‌ర్స్
– డీటీసీపీ వ‌ర్సెస్ హెచ్ఎండీఏ లే అవుట్స్ ర‌గ‌డ‌

క్రైంబ్యూరో, తొలివెలుగు:హైద‌రాబాద్ శివార్ల‌లో ఎకరం భూమి ఎక్క‌డ చూసినా రూ.10 కోట్ల‌కు త‌క్కువ లేదు. అలాంటప్పుడు హైద‌రాబాద్-బెంగ‌ళూరు హైవేకి ఆనుకుని వున్న భూమిలో యజమానిగా తాతల పేరు ధరణిలో కనిపిస్తే ఈ త‌రం వాళ్లు ఊరుకుంటారా? ఎలాంటి పొజిష‌న్ లేకున్నా.. తాతలు చ‌నిపోయి ప‌దేళ్లు దాటినా.. ఆ భూమిని కొట్టేసేందుకు చ‌ట్టాల్లోని లొసుగుల‌ను వాడేస్తున్నారు. హెచ్‌ఎండీఏ అనుమ‌తులు అంటూ ఎల్పీ నెంబ‌ర్‌ తో అమ్మేసుకుని కోట్లు గ‌డిస్తూ ప‌రార్ అవుతున్నారు. ఇలా గ్రామ పంచాయతీ, డీటీసీపీ లే అవుట్స్ చేసి అమ్మిన ప్లాట్స్ కు ఇంకా రైతుబంధు తింటూ లిటిగేష‌న్ సృష్టిస్తున్నారు. దీనికి చక్కటి ఉదాహరణే షాద్ న‌గ‌ర్ ఫారుఖ్ న‌గ‌ర్ లోని 8 ఎక‌రాల లే అవుట్.

dharani thieves in shadhnagar

జరిగింది ఇదే..!

హైద‌రాబాద్-బెంగుళూరు హైవేకి ఆనుకుని ఉన్న కొత్తూరు శివారులోని తిమ్మాపూర్ స‌ర్వే నెంబ‌ర్ 97, 98లోని 10 ఎక‌రాల భూమి. దాన్ని అన్నీ లీగ‌ల్ గా చూసుకుని 6 ఎక‌రాలు డీటీసీపీ లే అవుట్ తో ప్లాట్స్ అమ్మ‌కాలను జ‌రిపాయి జ‌న‌ సాయి హౌసింగ్, సుప్ర‌జ హౌసింగ్. ఇందులోని రోడ్లు, పార్క్ ప్లేస్ అంతా తిమ్మాపూర్ గ్రామ పంచాయతీకి గిఫ్ట్ డీడ్ చేశారు. ఇంత వరకు బాగానే ఉంది. కానీ, 2019 తర్వాత అసలు కథ మొదలైంది. త‌హసీల్దార్ ఆఫీస్‌ లో ప‌నిచేసే భాను, రిటైర్డ్ ఎమ్మార్వో వెంక‌ట్ రెడ్డి క‌లిసి ఆ భూమికి పట్టా పాసు బుక్ ఇచ్చి వివాదం సృష్టించారనే ఆరోపణలు ఉన్నాయి. గతంలో ఐపీఎస్‌ లు, ఓ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు, పలువురు ప్రముఖులు ప్లాట్స్ తీసుకున్నారంటే ఆ భూమి విలువ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలాంటి లే అవుట్‌ లోని భూమిలో ధరణి వచ్చాక మళ్లీ మార్పులు చోటు చేసుకున్నాయని అంటున్నారు ప్లాట్స్ కొన్నవారు. 2009లో మరణించిన కొండ అంజయ్య(గతంలో భూ యజమాని) పేరు ఇటీవల మళ్లీ తెరపైకి వచ్చింది. 2018 ఫిబ్ర‌వ‌రి 15న కొండయ్య వారసులు డెత్ సర్టిఫికేట్ సమర్పించి ఆయ‌న భార్య రాధమ్మ పేరు మీద 2019లో పాస్ బుక్స్ తీసుకున్నారు. ఆ త‌ర్వాత వెంట‌వెంట‌నే బొల్లినేని శ్రీవ‌ల్లి, ప‌త్తిపాటి శ్రీధ‌ర్ పేర్ల మీదకి ఆ భూమి వచ్చేసింది. సంజీవ‌ని పేరుతో క‌ల‌ర్ ఫుల్ బ్రౌచ‌ర్స్ వేయించి ఓపెన్ స్పేస్ అంతా అమ్మ‌కాలు జ‌రిపారు. రీ లే అవుట్ చేసి మూడు నెలల్లోనే రూ.25 కోట్లు దండుకున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

డీటీసీపీ వ‌ర్సెస్ హెచ్ఎండీఏ!

2005 నాటికి అమలులో ఉన్న చ‌ట్టానికి అనుకూలంగా లే అవుట్‌ తో ఉన్న భూమికి హెచ్ఎండీఏ మ‌ళ్లీ అనుమ‌తులు ఇవ్వ‌డంతో వివాదం మొదలైనట్టు తెలుస్తోంది. వృద్ధులైన ప్లాట్ ఓన‌ర్స్ న‌గ‌రంలోనే ఉండేవారు. దీంతో ఇష్టానుసారంగా సంజీవ‌ని ప్రాజెక్ట్స్ ఆ ప్లాట్స్ ను అమ్ముకున్నారని ఆరోపణలు వున్నాయి. రెండేళ్ల త‌ర్వాత ఇప్పుడిప్పుడే ప్లాట్ ఓన‌ర్స్ వెళ్లి చూడగా.. డీటీసీపీ లే అవుట్ ప్లాట్స్ ను భూ మాఫియా మింగేసిందని వాపోతున్నారు. హుటాహుటిన కోర్టుకు వెళ్లి అక్ర‌మ పాస్ బుక్స్ ను స‌స్పెండ్ చేయించారు. హెచ్ఎండీఏలో ఫిర్యాదు కూడా చేశారు. కానీ, అప్ప‌టికే రూ.25 కోట్లు తీసుకున్న రియల్టర్స్ మాత్రం.. తమకు సంబంధం లేదని మీరంతా కొట్టుకు చావండి అంటున్నారని కొత్తగా ప్లాట్స్ కొన్న వ్యక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

హెచ్ఎండీఏ నుంచి అనుమ‌తులు తీసుకుంటే.. 200 నుంచి 500 గజాల వ‌ర‌కు అమ్మకాలు చేసి బిజినెస్ చేస్తారు. కానీ, త‌ప్పుడు స‌మాచారం ఇచ్చి పూర్తి అనుమ‌తులు అంటూ.. ఒక్కొక్క‌రికి 700 గ‌జాల నుంచి 2,500 గ‌జాల వ‌ర‌కు అమ్మేశారని అంటున్నారు. గతంలో కొనుగోలు చేసిన వారు.. తాజాగా కొనుగోలు చేసిన వారు కొట్టుకోని చావండని.. తాము, అధికారులు రెండేళ్ల‌లో రూ.25 కోట్లు వెనకేసుకున్నాం అంటూ బొల్లినేని శ్రీవ‌ల్లి, ప‌త్తిపాటి శ్రీధ‌ర్ నేరుగా చెబుతున్నారంటూ వారంతా వాపోతున్నారు. అక్ర‌మ పాస్ బుక్స్ ను స‌స్పెండ్ చేయించినా ధ‌న బ‌లం, ఎమ్మెల్యే అంజ‌య్య అండ‌దండ‌ల‌తో చుట్టూ ప్రహరీ గొడ‌లు నిర్మిస్తున్నార‌ని ప్లాట్ ఓన‌ర్స్ ఆరోపిస్తున్నారు.

 

హెచ్ఎండీఏ ఎం చేస్తోంది?

సైబ‌ర్ మోస‌గాళ్లు తాము చట్టానికి దొరక్కుండా ఉండేందుకు సిమ్ కార్డులు ఎలా మారుస్తారో.. అలాగే అక్ర‌మ‌ ప్రాజెక్ట్స్ చేసే రియ‌ల్ట‌ర్స్ కూడా తప్పుడు పత్రాలతో అప్లికేష‌న్స్ పెట్టి.. జ‌నాల‌ను మోసం చేస్తున్నారని ఆరోపణలు వున్నాయి. తాము చేసేందే క‌రెక్ట్ అంటూ పోలీసులు, పొలిటిష‌న్స్ ముందు క‌ల‌రింగ్ ఇస్తున్నారని చెబుతున్నారు. దోచుకుని.. త‌లా కొంత‌ ఇచ్చిన వారికే మ‌ద్ద‌తు ప‌లకడం కామ‌న్ గా మారిందని వాపోతున్నారు. అస‌లు రికార్డ్స్ ఏంటి? ఎవరెవరు ఏ ప్రాంతంలో పొజిష‌న్స్ లో ఉన్నారు? 2019లో వ్య‌వ‌సాయ భూమి అంటే ఎలా సాధ్య‌మో క‌నీసం గుర్తించ‌కపోవ‌డం… మున్సిపాలిటీ ఆథారిటీ అధికారులు ఇప్ప‌టికీ లేక‌పోవ‌డం న‌గ‌ర శివారులోని వారికి శాపంగా మారిందంటున్నారు. పోలీసులు ఎఫ్‌ఐఆర్ చేశామ‌ని చేతులు దులుపుకున్నారని చెబుతున్నారు.

రిటైర్డ్ ఎమ్మార్వో నిర్వ‌ాకంతోనే గొడ‌వ‌లు!

డీటీసీపీ లే అవుట్స్‌ లో భాగంగా 2005లో 6 ఎక‌రాలు నాలా కన్వ‌ర్ష‌న్ అయింది. గ్రామ పంచాయతీకి గిఫ్ట్ డీడ్ లు పూర్తి చేశారు. కానీ, మ‌ళ్లీ అదే ప్రాంతంలో 2019లో అక్కడ వ్య‌వ‌సాయం సాగు చేస్తున్న‌ట్లు అప్పటి తహసీల్దార్ పంచ‌నామా రిపోర్టు ఇచ్చినట్టు తెలుస్తోంది. మ‌ళ్లీ నాలా క‌న్వ‌ర్ష‌న్ చేశారని, ఒకే భూమికి రెండు సార్లు ఎలా చేశారో వారికే తెలియాలని గ్రామస్తులు అనుకుంటున్నారు. రిటైర్డ్ అయ్యే ముందు అడ్డ‌గోలు వ్య‌వ‌హారాలు చేసి.. కోట్లాది రూపాయ‌లు రియ‌ల్ట‌ర్స్ కి దొచిపెట్టేందుకు కార‌కులు అయ్యారంటూ ప్లాట్ ఓనర్స్ ఆరోపిస్తున్నారు.

ఫ్రీ లాంచ్ ఆఫర్ పేరుతో కళ్ళముందే మోసాలు

అదిత్రీ హౌసింగ్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ కొల్లూరులో  ఫ్రీ లాంచ్ఆఫర్ పేరుతో 2018 లోనే విల్లా లను అమ్మి ఐదు సంవత్సరాలు గడుస్తున్న ఇంతవరకు ఒక్క విల్లా కూడా మొదలు పెట్టలేదు.
ఇప్పుడు అమీన్పూర్ పెద్ద చెరువు పక్కన డౌన్ స్ట్రీమ్ లో కింగ్ ఫిషర్ పాండ్ ని మూసేసి తూములను మూసేసి 18 ఎకరాల్లో విల్లా లు కడుతున్నామని ఫ్రీ లాంచ్ ఆఫర్ పేరుతో మార్కెటింగ్ చేసి తక్కువ ధరకు ఆశ చూపి చాలా ప్లాట్లను అమ్మేశారు.
సంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారిని జీవో ఎంఎస్ నెంబర్ 168 ఆఫ్ 2012 ఒకసారి పూర్తిగా చదవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను.
ఒక్క ఇరిగేషన్ ఎన్వోసీ తప్ప ఎటువంటి అప్రూవల్సు లేకుండా కింగ్ ఫిషర్ పౌండ్ ని మూసివేసి అవుట్ ఫ్లో ఛానల్ ని మూసివేసి చెరువు అలుగు మీద ఫ్రీ కాస్ట్ షెడ్లను ఏర్పాటు చేస్తే చర్యలు తీసుకోవాల్సిన కలెక్టర్ గాని ఎమ్మార్వో గాని మున్సిపల్ కమిషనర్ గాని మున్సిపల్ చైర్మన్ హెచ్ఎండిఏ గాని ఇరిగేషన్ శాఖ  గాని నిమ్మకు నీరెత్తినట్టు కూర్చోవడం వాళ్ల అవినీతికి నిదర్శనంగా కనిపిస్తోంది.
ఇలా ఫ్రీ లాంచ్ ఆఫర్ పేరుతో కళ్ళముందే మోసాలు చేస్తున్న కూడా సంబంధిత అధికారులు లంచాలకు కక్కుర్తి బడి చట్టాలకు తూట్లు పొడుస్తూ నిమ్మకు నీరెత్తినట్టు చూస్తూ కూర్చుంటున్నారు. ఇరిగేషన్ సంగారెడ్డి ఎస్సీ అదిత్రీ సంస్థ తూములను మూయలేదు అని ఎమ్మార్వోకు చెప్పడం వారి లోపాయాకారి ఒప్పందాలకు నగ్నసాక్షి.
కళ్ళముందు స్పష్టంగా ఒక చదువు రాని వ్యక్తి కూడా అర్థమయ్యే విధంగా తూములను మూసినట్టు కనిపిస్తున్న కూడా ఇరిగేషన్ వారు రియల్ ఎస్టేట్ సంస్థకు వత్తాసు పలుకుతున్నారు అంటే వారికి ముట్టాల్సినవి ముట్టినయాన్ని స్పష్టంగా కనిపిస్తోంది. మున్సిపల్ మరియు ఇరిగేషన్ శాఖ అధికారులు అమీన్పూర్ బయోడైవర్సిటీ లేదా జీవవైవిద్య చెరువుగా గుర్తింపు పొందినటువంటి చెరువులో నీరు బయటికి వెళ్లే దారులన్నీ మూసివేసి డ్రనేజీ పైప్లైన్ కలపడం పారిశ్రామిక వ్యర్థాలను చెరువులోకి వదలడం ఒక దుర్మార్గమైన చర్య. కళ్ళముందే చట్టాలను కారరాస్తున్న పరిరక్షించాల్సిన అధికారులు రియల్ ఎస్టేట్ మాఫియా తో కుమ్మక్కయి బరితెగించి ప్రవర్తిస్తున్నారు.
రాష్ట్ర గవర్నర్ గారిని తెలంగాణ చీఫ్ సెక్రటరీ గారిని ఈ విషయంలో తక్షణం కలగజేసుకొని తగిన చర్యలు తీసుకోవాలని సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను.
 @Collector_SRD
@TelanganaCS @MinisterKTR @PIBHyderabad @moefcc @CGWB_CHQ @CWCOfficial_GoI @DrTamilisaiGuv @KTRoffice @Praja_Snklpm 

24 గంటల్లో క్షమాపణ చెప్పకపోతే ముదిరాజుల తడాఖా చూపిస్తాం

*24 గంటల్లో క్షమాపణ చెప్పకపోతే ముదిరాజుల తడాఖా చూపిస్తాం* 

 *షాద్ నగర్ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అందే బాబయ్య*  

 *ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డికి  పాడె కడుతామని అల్టిమేటం* 

 *షాద్ నగర్ చౌరస్తాలో ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్దం* 

 *పోలీస్ స్టేషన్లో ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డిపై ముదిరాజ్ సంఘం నేతల ఫిర్యాదు* 

 *ఎమ్మెల్సీ పదవి నుండి తొలగించాలని సీఎం కేసీఆర్ ను కోరిన ముదిరాజులు* 

: బాధ్యతగల పదవిలో ఉంటూ ఓ వీడియో జర్నలిస్టును దుర్భాషలాడి అతని కెమెరా లాక్కొని అతనిపై దాడికి పాల్పడడమే కాకుండా సభ్య సమాజం తలదించుకునేలా ముదిరాజ్ కులాన్ని దుర్భాషలాడిన ఎమ్మెల్సీ పాడే కౌశిక్ రెడ్డిని వెంటనే ఎమ్మెల్సీ పదవి నుండి  తొలగించాలని, 24 గంటల్లో అతనిపై సీఎం కేసీఆర్ చర్య తీసుకోకపోతే ముదిరాజుల తడాఖా ఏమిటో? రాష్ట్రవ్యాప్తంగా చూపిస్తామని ముదిరాజ్ సంఘం తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు హెచ్చరించారు. శనివారం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణ చౌరస్తాలో ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు ఆధ్వర్యంలో నియోజక వర్గంలోని ముదిరాజు నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున షాద్ నగర్ చౌరస్తాలో ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా బీఆర్ఎస్, కాంగ్రెస్, బిజెపి ఆయా పార్టీలకు చెందిన ముదిరాజ్ సంఘం నాయకులు ఈ ధర్నాలో పాల్గొనడం గమనార్హం. ఈ సందర్భంగా షాద్ నగర్ పోలీస్ స్టేషన్లో ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి పై లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. కౌశిక్ రెడ్డి పై వెంటనే చర్యలు తీసుకోవాలని సంఘం డిమాండ్ చేసింది. అనంతరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు అందే బాబయ్య మాట్లాడుతూ బాధ్యత గల పదవిలో ఉంటూ ఒక వీడియో జర్నలిస్టును కిడ్నాప్ చేసి అతని హింసించడం కులాన్ని అవమానపరిచే విధంగా మాట్లాడడం సబబు కాదని అన్నారు  ముదిరాజులు తలుచుకుంటే కౌశిక్ రెడ్డి మిగలడని హెచ్చరించారు. అనేక సందర్భాల్లో రౌడీలా వ్యవహరించిన కౌశిక్ రెడ్డిని వెంటనే ఎమ్మెల్సీ పదవి నుండి తొలగించాలని బాబయ్య డిమాండ్ చేశారు. స్థానిక అధ్యక్షుడు అంచె రాములు మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డిని ముదిరాజులు వదిన పెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. అధికార మదంతో కన్ను మిన్ను కానకుండా సామాన్య ప్రజలను బాధ్యత గల జర్నలిస్టులను భయభ్రాంతులకు గురి చేసే విధంగా వ్యవహరించడం సరికాదని అన్నారు. ఇంత పనికిమాలిన వ్యక్తిని ఎమ్మెల్సీ పదవిలో కొనసాగించడం ఎంత మాత్రం సబబు కాదని ముఖ్యమంత్రి కేసీఆర్ కు ముదిరాజ్ సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తున్నట్టు చెప్పారు. వెంటనే అతన్ని పదవి నుండి తొలగించాలని లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా బిఆర్ఎస్ పార్టీని ముఖ్యమంత్రిని బాధ్యుడిని చేసి ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. యువ నాయకుడు శ్రీధర్ వర్మ మాట్లాడుతూ 24 గంటల్లో క్షమాపణ చెప్పకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ముదిరాజులు స్పందిస్తారని తమ ఆగ్రహానికి కౌశిక్ రెడ్డి బలి కాక తప్పదని హెచ్చరించారు. ఈ సంఘటనపై కౌశిక్ రెడ్డిపై చర్య తీసుకోవాలని ముఖ్యమంత్రి డిమాండ్ చేస్తున్నట్టు చెప్పారు. ముదిరాజ్ సంఘం యువనేత అందే మోహన్ మాట్లాడుతూ 24 గంటల్లో ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డిని అరెస్టు చేయకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. అధికార మదంతో వీర్రవీగుతున్న కౌశిక్ రెడ్డి పై చట్టపరంగా చర్యలు చేపట్టాలని హెచ్చరించారు. ఇంకా ఈ ఆందోళన కార్యక్రమంలో పలువురు నాయకులు కౌశిక్ రెడ్డి పై తీరుపై విరుచుకుపడ్డారు. కౌశిక్ రెడ్డిని బండ బూతులు తిడుతూ అతని బొమ్మను చెప్పులతో కొడుతూ నిరసన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం నాయకులు కౌన్సిలర్ కానుగు అనంతయ్య, ప్యాట అశోక్,*టీజెఫ్ తెలంగాణ రాష్ట్ర ప్రాసిడెంట్  చెక్కల శ్రీశైలం*, అంచెరాజు, కుడుముల బాలరాజ్, ఎలికట్ట ఎంపిటిసి శ్రీశైలం, బుడ్డ నరసింహ, చెట్ల వెంకటేష్, రమేష్, నలమొని శ్రీధర్, అందే పైలయ్య, మంగ వెంకటేశ్, కొండే యాదయ్య, భాస్కర్, గూడూరు నర్సింహ,  సంద శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు....