Saturday, June 24, 2023

ఫ్రీ లాంచ్ ఆఫర్ పేరుతో కళ్ళముందే మోసాలు

అదిత్రీ హౌసింగ్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ కొల్లూరులో  ఫ్రీ లాంచ్ఆఫర్ పేరుతో 2018 లోనే విల్లా లను అమ్మి ఐదు సంవత్సరాలు గడుస్తున్న ఇంతవరకు ఒక్క విల్లా కూడా మొదలు పెట్టలేదు.
ఇప్పుడు అమీన్పూర్ పెద్ద చెరువు పక్కన డౌన్ స్ట్రీమ్ లో కింగ్ ఫిషర్ పాండ్ ని మూసేసి తూములను మూసేసి 18 ఎకరాల్లో విల్లా లు కడుతున్నామని ఫ్రీ లాంచ్ ఆఫర్ పేరుతో మార్కెటింగ్ చేసి తక్కువ ధరకు ఆశ చూపి చాలా ప్లాట్లను అమ్మేశారు.
సంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారిని జీవో ఎంఎస్ నెంబర్ 168 ఆఫ్ 2012 ఒకసారి పూర్తిగా చదవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను.
ఒక్క ఇరిగేషన్ ఎన్వోసీ తప్ప ఎటువంటి అప్రూవల్సు లేకుండా కింగ్ ఫిషర్ పౌండ్ ని మూసివేసి అవుట్ ఫ్లో ఛానల్ ని మూసివేసి చెరువు అలుగు మీద ఫ్రీ కాస్ట్ షెడ్లను ఏర్పాటు చేస్తే చర్యలు తీసుకోవాల్సిన కలెక్టర్ గాని ఎమ్మార్వో గాని మున్సిపల్ కమిషనర్ గాని మున్సిపల్ చైర్మన్ హెచ్ఎండిఏ గాని ఇరిగేషన్ శాఖ  గాని నిమ్మకు నీరెత్తినట్టు కూర్చోవడం వాళ్ల అవినీతికి నిదర్శనంగా కనిపిస్తోంది.
ఇలా ఫ్రీ లాంచ్ ఆఫర్ పేరుతో కళ్ళముందే మోసాలు చేస్తున్న కూడా సంబంధిత అధికారులు లంచాలకు కక్కుర్తి బడి చట్టాలకు తూట్లు పొడుస్తూ నిమ్మకు నీరెత్తినట్టు చూస్తూ కూర్చుంటున్నారు. ఇరిగేషన్ సంగారెడ్డి ఎస్సీ అదిత్రీ సంస్థ తూములను మూయలేదు అని ఎమ్మార్వోకు చెప్పడం వారి లోపాయాకారి ఒప్పందాలకు నగ్నసాక్షి.
కళ్ళముందు స్పష్టంగా ఒక చదువు రాని వ్యక్తి కూడా అర్థమయ్యే విధంగా తూములను మూసినట్టు కనిపిస్తున్న కూడా ఇరిగేషన్ వారు రియల్ ఎస్టేట్ సంస్థకు వత్తాసు పలుకుతున్నారు అంటే వారికి ముట్టాల్సినవి ముట్టినయాన్ని స్పష్టంగా కనిపిస్తోంది. మున్సిపల్ మరియు ఇరిగేషన్ శాఖ అధికారులు అమీన్పూర్ బయోడైవర్సిటీ లేదా జీవవైవిద్య చెరువుగా గుర్తింపు పొందినటువంటి చెరువులో నీరు బయటికి వెళ్లే దారులన్నీ మూసివేసి డ్రనేజీ పైప్లైన్ కలపడం పారిశ్రామిక వ్యర్థాలను చెరువులోకి వదలడం ఒక దుర్మార్గమైన చర్య. కళ్ళముందే చట్టాలను కారరాస్తున్న పరిరక్షించాల్సిన అధికారులు రియల్ ఎస్టేట్ మాఫియా తో కుమ్మక్కయి బరితెగించి ప్రవర్తిస్తున్నారు.
రాష్ట్ర గవర్నర్ గారిని తెలంగాణ చీఫ్ సెక్రటరీ గారిని ఈ విషయంలో తక్షణం కలగజేసుకొని తగిన చర్యలు తీసుకోవాలని సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను.
 @Collector_SRD
@TelanganaCS @MinisterKTR @PIBHyderabad @moefcc @CGWB_CHQ @CWCOfficial_GoI @DrTamilisaiGuv @KTRoffice @Praja_Snklpm 

No comments:

Post a Comment