*24 గంటల్లో క్షమాపణ చెప్పకపోతే ముదిరాజుల తడాఖా చూపిస్తాం*
*షాద్ నగర్ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అందే బాబయ్య*
*ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డికి పాడె కడుతామని అల్టిమేటం*
*షాద్ నగర్ చౌరస్తాలో ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్దం*
*పోలీస్ స్టేషన్లో ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డిపై ముదిరాజ్ సంఘం నేతల ఫిర్యాదు*
*ఎమ్మెల్సీ పదవి నుండి తొలగించాలని సీఎం కేసీఆర్ ను కోరిన ముదిరాజులు*
: బాధ్యతగల పదవిలో ఉంటూ ఓ వీడియో జర్నలిస్టును దుర్భాషలాడి అతని కెమెరా లాక్కొని అతనిపై దాడికి పాల్పడడమే కాకుండా సభ్య సమాజం తలదించుకునేలా ముదిరాజ్ కులాన్ని దుర్భాషలాడిన ఎమ్మెల్సీ పాడే కౌశిక్ రెడ్డిని వెంటనే ఎమ్మెల్సీ పదవి నుండి తొలగించాలని, 24 గంటల్లో అతనిపై సీఎం కేసీఆర్ చర్య తీసుకోకపోతే ముదిరాజుల తడాఖా ఏమిటో? రాష్ట్రవ్యాప్తంగా చూపిస్తామని ముదిరాజ్ సంఘం తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు హెచ్చరించారు. శనివారం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణ చౌరస్తాలో ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు ఆధ్వర్యంలో నియోజక వర్గంలోని ముదిరాజు నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున షాద్ నగర్ చౌరస్తాలో ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా బీఆర్ఎస్, కాంగ్రెస్, బిజెపి ఆయా పార్టీలకు చెందిన ముదిరాజ్ సంఘం నాయకులు ఈ ధర్నాలో పాల్గొనడం గమనార్హం. ఈ సందర్భంగా షాద్ నగర్ పోలీస్ స్టేషన్లో ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి పై లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. కౌశిక్ రెడ్డి పై వెంటనే చర్యలు తీసుకోవాలని సంఘం డిమాండ్ చేసింది. అనంతరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు అందే బాబయ్య మాట్లాడుతూ బాధ్యత గల పదవిలో ఉంటూ ఒక వీడియో జర్నలిస్టును కిడ్నాప్ చేసి అతని హింసించడం కులాన్ని అవమానపరిచే విధంగా మాట్లాడడం సబబు కాదని అన్నారు ముదిరాజులు తలుచుకుంటే కౌశిక్ రెడ్డి మిగలడని హెచ్చరించారు. అనేక సందర్భాల్లో రౌడీలా వ్యవహరించిన కౌశిక్ రెడ్డిని వెంటనే ఎమ్మెల్సీ పదవి నుండి తొలగించాలని బాబయ్య డిమాండ్ చేశారు. స్థానిక అధ్యక్షుడు అంచె రాములు మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డిని ముదిరాజులు వదిన పెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. అధికార మదంతో కన్ను మిన్ను కానకుండా సామాన్య ప్రజలను బాధ్యత గల జర్నలిస్టులను భయభ్రాంతులకు గురి చేసే విధంగా వ్యవహరించడం సరికాదని అన్నారు. ఇంత పనికిమాలిన వ్యక్తిని ఎమ్మెల్సీ పదవిలో కొనసాగించడం ఎంత మాత్రం సబబు కాదని ముఖ్యమంత్రి కేసీఆర్ కు ముదిరాజ్ సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తున్నట్టు చెప్పారు. వెంటనే అతన్ని పదవి నుండి తొలగించాలని లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా బిఆర్ఎస్ పార్టీని ముఖ్యమంత్రిని బాధ్యుడిని చేసి ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. యువ నాయకుడు శ్రీధర్ వర్మ మాట్లాడుతూ 24 గంటల్లో క్షమాపణ చెప్పకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ముదిరాజులు స్పందిస్తారని తమ ఆగ్రహానికి కౌశిక్ రెడ్డి బలి కాక తప్పదని హెచ్చరించారు. ఈ సంఘటనపై కౌశిక్ రెడ్డిపై చర్య తీసుకోవాలని ముఖ్యమంత్రి డిమాండ్ చేస్తున్నట్టు చెప్పారు. ముదిరాజ్ సంఘం యువనేత అందే మోహన్ మాట్లాడుతూ 24 గంటల్లో ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డిని అరెస్టు చేయకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. అధికార మదంతో వీర్రవీగుతున్న కౌశిక్ రెడ్డి పై చట్టపరంగా చర్యలు చేపట్టాలని హెచ్చరించారు. ఇంకా ఈ ఆందోళన కార్యక్రమంలో పలువురు నాయకులు కౌశిక్ రెడ్డి పై తీరుపై విరుచుకుపడ్డారు. కౌశిక్ రెడ్డిని బండ బూతులు తిడుతూ అతని బొమ్మను చెప్పులతో కొడుతూ నిరసన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం నాయకులు కౌన్సిలర్ కానుగు అనంతయ్య, ప్యాట అశోక్,*టీజెఫ్ తెలంగాణ రాష్ట్ర ప్రాసిడెంట్ చెక్కల శ్రీశైలం*, అంచెరాజు, కుడుముల బాలరాజ్, ఎలికట్ట ఎంపిటిసి శ్రీశైలం, బుడ్డ నరసింహ, చెట్ల వెంకటేష్, రమేష్, నలమొని శ్రీధర్, అందే పైలయ్య, మంగ వెంకటేశ్, కొండే యాదయ్య, భాస్కర్, గూడూరు నర్సింహ, సంద శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు....
No comments:
Post a Comment