Friday, February 17, 2023
గిరిజన రిజర్వేషన్ల పెంపు....తెలంగాణ హైకోర్టునే ఆశ్రయించండి.....సుప్రీం....!
జన్మదిన వేడుకల్లో.... అపశృతి....కింద పడిపోయిన MLA
*జన్మదిన వేడుకల్లో.... అపశృతి....కింద పడిపోయిన MLA*
హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుక ల్లో అపశృతి చోటు చేసుకుంది. నగరంలోని కాచిగూడలో కేసీఆర్ జన్మదిన వేడుకలను అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ క్రమంలో బీఆర్‌ఎస్ కార్యకర్తలు బాణాసంచా కాల్చగా నిప్పురవ్వలు అక్కడ ఏర్పాటు చేసిన గ్యాస్ బెలూన్లపై పడ్డాయి. దీంతో వెంటనే మంటలు అంటుకున్నాయి. ఊహించని ఈ ఘటనతో కార్యకర్తలు పరుగులు తీశారు. తోపులాటలో అంబర్‌పేట ఎమ్మెల్యే వెంకటేష్ కిందపడిపోయారు.కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా బీఆర్‌ఎస్ నేతలు అంబర్‌పేటలో పెద్దఎత్తున ఏర్పాటు చేశారు. అంబర్‌పేట ఎమ్మెల్యే వెంకటేష్ ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. ఎమ్మెల్యే కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ తరుణంలో బీఆర్‌ఎస్ కార్యకర్తలు పెద్దఎత్తున బాణాసంచా పేల్చారు. అయితే నిప్పురవ్వలు ఎగిసిపడి అక్కడే ఉన్న గ్యాస్ బెలూన్లపై పడటంతో మంటలు చెలరేగాయి. కార్యకర్తలపై నిప్పురవ్వలు పడ్డాయి. వెంటనే కార్యకర్తలు అక్కడి నుంచి పరుగులు తీశారు. కార్యకర్తలతో పాటు ఎమ్మెల్యే పరుగులు పెట్టేందుకు ప్రయత్నించి కిందపడిపోయారు. కాగా.. ఎమ్మెల్యే వెంకటేష్‌కు పెను ప్రమాదం తప్పింది. స్వల్పగాయాలైన వెంకటేష్‌ను వెంటనే అక్కడి నుంచి తరలించారు.
*సుజీవన్ వావిలాల*🖋️
Thursday, February 16, 2023
రామంతాపూర్ చిన్న చెరువునుండి దుర్గంధపు వాసనలు
Wednesday, February 15, 2023
జర్నలిస్టులపై అట్రాసిటీ కేసుపై.... కీలక తీర్పు....!
*జర్నలిస్టులపై అట్రాసిటీ కేసుపై.... కీలక తీర్పు....!*
హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. జర్నలిస్టుల పై అట్రాసిటీ కేసు నమోదు చేయడాన్ని సవాలు చేస్తూ ఇద్దరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.దీనిపై ధర్మాసనం విచారణ జరిపింది. విధుల్లో ఉన్న జర్నలిస్టులకు ఎదుటివారు ఏ సామాజిక వర్గమో ఎలా తెలుస్తుంది? అని కోర్టు ప్రశ్నించింది. ఓ మహిళా కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా వారిపై ఎస్సీ, ఎస్టీ కేసు ఎలా నమోదు చేస్తారని పోలీసుల (Police) ను నిలదీసింది. ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలంటే ఫిర్యాదుదారు ఏ సామాజికవర్గానికి చెందినవారో నిందితులకు తెలిసి ఉండాలని, కానీ ప్రస్తుత కేసులో ఫిర్యాదుదారు కులం గురించి విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులకు తెలియదని అభిప్రాయపడింది. అందువల్ల జర్నలిస్టులపై ఎస్సీ, ఎస్టీ కేసు చెల్లదని న్యాయస్థానం స్పష్టం చేసింది. తమపై ఎస్సీ, ఎస్టీ చట్టం సెక్షన్ 3(2)(ఎ) కేసు నమోదు చేయడాన్ని సవాల్ చేస్తూ ఇద్దరు జర్నలిస్టులు హైకోర్టును ఆశ్రయించగా మంగళవారం ఈ పిటిషన్‌పై జస్టిస్ ఎం. మానవేంద్రనాథ్ రాయ్ విచారణ జరిపారు.
*సుజీవన్ వావిలాల*🖋️
Tuesday, February 14, 2023
కొండగట్టు అంజన్న దర్శించుకున్న సీఎం కేసీఆర్
కొండగట్టు అంజన్న దర్శించుకున్న సీఎం కేసీఆర్
సుప్రసిద్ధత కొండగట్టు ఆంజనేయస్వామిని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు దర్శించుకున్నారు. బుధవారం జేఎన్టీయూ కళాశాలలో ఏర్పాటుచేసిన హెలిప్యాడ్ నుండి ఆలయానికి వచ్చిన సీఎం కేసీఆర్ కు ఆలయ అధికారులు, పూజారులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆంజనేయ స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. సీఎం వెంట మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యేలు రవిశంకర్, సంజయ్, విద్యాసాగర్ రావు, దాసరి మనోహర్ రెడ్డి, కోరు కంటి చందర్ తోపాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు
*సుజీవన్ వావిలాల*🖋️
అజారుద్దీన్ కు చుక్కెదురు....హెచ్ సీ ఏ కమిటీని రద్దు చేసిన.... సుప్రీం కోర్టు
*అజారుద్దీన్ కు చుక్కెదురు....హెచ్ సీ ఏ కమిటీని రద్దు చేసిన.... సుప్రీం కోర్టు*
హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) తాత్కాలిక అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న భారత మాజీ కెప్టెన్ అజహరుద్దీన్‌కు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది.అజహర్ నేతృత్వం వహిస్తున్న హెచ్‌సీఏ కమిటీని రద్దు చేస్తున్నట్లు అత్యున్నత న్యాయస్థానం మంగళవారం తీర్పునిచ్చింది. ప్రస్తుత కమిటీ స్థానంలో ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు సుప్రీం కోర్టు వెల్లడించింది.
మాజీ జడ్జ్ లావు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఏకసభ్య కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంది. ఇకపై హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వ్యవహారాలను ఏకసభ్య కమిటీ చూసుకుంటందని తెలిపింది. త్వరలోనే హెచ్‌సీఏకు ఎన్నికలు నిర్వహించాలని సూచించింది.
*సుజీవన్ వావిలాల*🖋️