Friday, February 17, 2023

గిరిజన రిజర్వేషన్ల పెంపు....తెలంగాణ హైకోర్టునే ఆశ్రయించండి.....సుప్రీం....!

*గిరిజన రిజర్వేషన్ల పెంపు....తెలంగాణ హైకోర్టునే ఆశ్రయించండి.....సుప్రీం....!*

హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం గిరిజన రిజర్వేషన్లు పెంచుతూ జారీ చేసిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. విచారణ చేపట్టిన విక్రమ్‌నాథ్‌, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా ధర్మాసనం పిటిషనర్లకు పలు సూచనలు చేసింది.ఈ అంశంపై రాష్ట్ర హైకోర్టులోనే పిటిషన్‌ దాఖలు చేసుకోవాలని సూచించింది. రిజర్వేషన్ల పెంపు జీవో చట్టబద్ధం కాదని, జీవో వల్ల ఆదివాసీలకు నష్టం జరుగుతుందని.. రాజ్యాంగ ధర్మాసనం తీర్పునకు విరుద్ధంగా ఉన్న జీవోని కొట్టి వేయాలని కోరుతూ సర్వోన్నత న్యాయస్థానంలో పలు గిరిజన సంఘాలు పిటిషన్లు దాఖలు చేశాయి. ఆధార్‌ సొసైటీ, ఆదివాసీ గిరిజన ఉద్యోగుల సంక్షేమ అసోసియేషన్‌, ఆదిమ ఆదీవాసుల సంక్షేమ, హక్కుల పరిరక్షణ గిరిజన సంఘాలు జనవరి 6న సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశాయి.

తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 50శాతానికి మించి రిజర్వేషన్లు ఇస్తున్నట్టు ఉందని, ఇది రాజ్యాంగ ధర్మాసనం తీర్పును ఉల్లంఘించడమేనని పిటిషన్‌లో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో వల్ల ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన సుగాలి, లంబాడా, బంజారా గిరిజనులకు మాత్రమే లబ్ధి చేకూరుతుందని వెల్లడించారు. రాజ్యాంగబద్ధంగా ఈ జీవో చట్టబద్ధం కాదని, చట్టబద్ధం సాధ్యం కాని జీవో వల్ల గిరిజనులకు నష్టం చేకూరుతుందని పిటిషనర్లు తెలిపారు. ఎటువంటి లబ్ధి చేకూర్చని ఉత్తర్వులను కొట్టేయాలని న్యాయస్థానాన్ని కోరారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన ద్విసభ్య ధర్మాసనం.. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోను సవాలు చేస్తూ రాష్ట్ర హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేయవచ్చని సూచిస్తూ విచారణను ముగించింది.

*సుజీవన్ వావిలాల*🖋️

No comments:

Post a Comment