Tuesday, October 11, 2022

Our time is now—Our rights, Our future

"Our time is now—Our rights, Our future"
ప్రతి సంవత్సరం లాగానే థీం తీర్మానం చేశారు,కాని ఎక్కడ బాలికల పై జరుగుతున్న అత్యాచారాలు,హింస,చిన్నచూపు ఎన్ని చట్టాలు చేసినా వాటి అమలు చేయడంలో వివక్ష చూపనంత వరకు ఏమి మారదు
#బాలలహక్కులసంఘం తరపున బాలికలకు శుభాకాంక్షలు
తెలుపుతూ మీపై మీకు  విశ్వాసం పెంచుకుని ఏ విధంగా మేం తక్కువ కాదు. మీ హక్కుల కోసం మీరు వెనుకంజ వేయవద్దు,మీ కోసం బాలల హక్కుల సంఘం ఎప్పుడూ మీతో ఉంటుంది.
@Praja_Snklpm @SocietySachin @hydnewstoday @RamMohanINC @IndiraShobanAAP @HelpingspotOrg @PintodeepakD @SrinivasRTIA

Courtesy by : అనురాధ రావు (బాలలహక్కులసంఘం ఫౌండర్)

Monday, October 10, 2022

ఉద్యోగాలు లేవు...విద్యావిధానాన్ని ధ్వంసం చేసారు.... ఫ్రొఫెసర్ హరగోపాల్....!

*ఉద్యోగాలు లేవు...విద్యావి ధానాన్ని ధ్వంసం చేసారు.... ఫ్రొఫెసర్ హరగోపాల్....!*

CM KCR: ప్రొఫెసర్ హరగోపాల్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక తెలంగాణ వచ్చాక తమ జీవితాలు బాగుపడతాయని ప్రజలు అనుకున్నారని..కానీ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయని చెప్పారు. రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్ లేక ఎంతోమంది నిరుద్యోగ యువత ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కొన్ని దేశాల్లో హింస లేకుండా శాంతియుత పాలన సాగుతోందని.. సమాజంలో నిరుద్యోగ సమస్య ఏర్పడినప్పుడే హింసలకు పాల్పడుతారని పేర్కొన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఉద్యోగాలు వస్తాయని నిరుద్యోగులు అనుకున్నారని.. కానీ రాష్ట్రం ఏర్పడ్డాక ఉద్యోగాలు లేవని, నిరుద్యోగ సమస్య వెంటాడుతూనే ఉందని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం విద్యా విధానాన్ని ధ్వంసం చేసిందని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం విద్యారంగానికి, నిరుద్యోగులకు అన్యాయం చేస్తోందని ఆరోపించారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలని రిజర్వేషన్ అడుగుతున్నామన్నారు. రాష్ట్రంలో ఉద్యోగాలు లేక విద్యార్థులు చెట్ల కింద కూర్చొని చదువుతున్నారని, రూ. 5 భోజనం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారని తెలిపారు. ఐటీ కంప్లీట్ చేసిన తర్వాత కూడా యువత చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకోవాల్సిన పరిస్థితి రాష్ట్రంలో ఉందన్నారు. సీఎం కేసీఆర్ విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు.

అంతకుముందు కూడా.. తెలంగాణలో వరుసగా చోటు చేసుకుంటున్న నేరాల విషయంలోనూ ప్రభుత్వ విధానాన్ని ప్రొఫెసర్ హరగోపాల్ దుయ్యబట్టారు. చదువుకుంటున్న పిల్లలు కూడా నేరాల్లో పాల్గొంటున్నారని, ప్రభుత్వం ఆ నేరాలను కంట్రోల్ చేయకుండా నేరం చేస్తోందని మండిపడ్డారు. రాజకీయ పార్టీలు.. సమాజానికి ఏం విలువలు ఇస్తున్నామనేది చూసుకోవాలని సూచించారు. తెలంగాణ వస్తే మెరుగైన సమాజం వస్తుందని అనుకున్నామని.. కానీ అత్యాచారాలు, తల్లిదండ్రులు పిల్లల్ని చంపడం లాంటివి దుర్మార్గమైన చర్యలు చోటు చేసుకుంటున్నాయని అన్నారు. ఇలాంటి ఘటనల్ని ఎలా కట్టడి చేయాలనే దానిపై ప్రభుత్వం ఆలోచన చేయాలన్నారు. తెలంగాణను ప్రజాస్వామ్య సమాజంగా మార్చే ప్రయత్నం ప్రభుత్వం చేయడం లేదని విమర్శించిన ఆయన.. పాత చట్టాలు ఉంటే రాష్ట్రం ఏం మారుతుంది? అని ప్రశ్నించారు. తెలంగాణ కోసం రాసిన పాటలు కూడా బ్యాన్ అయ్యాయని.. అన్ని జేఏసీలు ధ్వంసం అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక, డ్రగ్స్ మాఫియా పెరిగిపోయిందని అన్నారు. టీఆర్ఎస్‌ అధికారంలోకి వచ్చాక.. ఇష్టారాజ్యంగా పబ్బులు పెంచారని.. ఇది చాలా దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

*సుజీవన్ వావిలాల*🖋️ 

Sunday, October 9, 2022

ఢిల్లీ లిక్కర్ స్కామ్... అభిషేక్ బోయిన్ పల్లి అరెస్ట్...!

*ఢిల్లీ లిక్కర్ స్కామ్... అభిషేక్ బోయిన్ పల్లి అరెస్ట్...!*

దిల్లీ: దిల్లీ మద్యం కుంభకోణం వ్యవహారంలో విచారణను కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) వేగవంతం చేసింది. గతకొన్ని రోజులుగా పలువురిని విచారించిన సీబీఐ..తాజాగా ఒకరిని అరెస్ట్‌ చేసింది. ఈ మేరకు సీబీఐ కేంద్ర కార్యాలయం వెల్లడించింది.

ఈ కేసులో హైదరాబాద్‌కు చెందిన అభిషేక్‌ బోయినపల్లి అరెస్ట్‌ చేశామని.. ఆయన్ను కోర్టులో హాజరుపరుస్తామని తెలిపింది. దీంతో ఈ వ్యవహారంలో ఇప్పటి వరకు సీబీఐ అరెస్ట్‌ చేసిన వారి సంఖ్య 2కి చేరింది. అభిషేక్‌కు ముందు విజయ్‌ నాయర్‌ను సీబీఐ అరెస్ట్‌ చేసింది. మరోవైపు ఇదే కేసులో విచారణ చేస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) కూడా సమీర్‌ మహేంద్ర అనే వ్యక్తిని అరస్ట్‌ చేసిన విషయం తెలిసిందే.

*సుజీవన్ వావిలాల*🖋️ 

ములాయం సింగ్‌ యాదవ్‌ కన్నుమూత

*ములాయం సింగ్‌ యాదవ్‌ కన్నుమూత*

గురుగ్రామ్‌: సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకులు, ఉత్తర్‌ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్‌ యాదవ్‌(82) కన్నుమూశారు. గతకొంత కాలంగా అనారోగ్యంతో గురుగ్రామ్‌లోని మేదాంత ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన.. ఆరోగ్యం మరింత క్షీణించి ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. యూపీ ముఖ్యమంత్రిగా మూడుసార్లు పనిచేసిన ములాయం.. కేంద్ర రక్షణ మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. 

టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో గ్రూప్‌-1 హాల్ టికెట్లు

టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో గ్రూప్‌-1 హాల్ టికెట్లు

టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో గ్రూప్‌-1 హాల్ టికెట్లు


టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో గ్రూప్‌-1 హాల్ టికెట్లు
హైద‌రాబాద్‌: గ్రూప్‌-1 ప్రిలిమిన‌రీ ప‌రీక్ష‌కు సంబంధించిన హాల్ టికెట్ల‌ను తెలంగాణ స్టేట్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (టీఎస్‌పీఎస్సీ) త‌న వెబ్‌సైట్‌లో పొందుప‌ర్చింది. ఈ మేర‌కు అభ్య‌ర్థుల‌కు స‌మాచారం ఇస్తూ మీడియా సంస్థ‌ల‌కు ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. గ్రూప్‌-1కు ద‌ర‌ఖాస్తు చేసుకున్న అభ్య‌ర్థులు https://www.tspsc.gov.in వెబ్‌సైట్ నుంచి హాల్ టికెట్‌ల‌ను డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చ‌ని తెలిపింది.

ఈ హాల్ టికెట్స్ డౌన్‌లోడ్ స‌దుపాయం ఇవాళ్టి నుంచి ప‌రీక్ష జరిగే తేదీ అయిన అక్టోబ‌ర్ 16 వ‌రకు అందుబాటులో ఉంటుంద‌ని టీఎస్‌పీఎస్సీ త‌న ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. అయితే, ఆఖ‌రి స‌మ‌యంలో ర‌ద్దీకి అవ‌కాశం ఇవ్వ‌కుండా అభ్య‌ర్థులు ముందుగానే హాల్ టికెట్‌ల‌ను డౌన్‌లోడ్ చేసుకోవ‌డం ఉత్త‌మ‌మ‌ని సూచించింది.

గ్రూప్‌-1 ప్రిలిమిన‌రీ ప‌రీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో జ‌రుగుతుంది. ప‌రీక్షకు హాజ‌ర‌య్యే అభ్య‌ర్థులు హాల్ టికెట్‌పైన‌, వెబ్‌సైట్‌లో ఉన్న సూచ‌న‌లను, మార్గ‌ద‌ర్శ‌కాల‌ను తూచా త‌ప్ప‌కుండా పాటించాల‌ని టీఎస్‌పీఎస్సీ కోరింది. కాగా, అక్టోబ‌ర్ 16న ఉద‌యం 10 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం ఒంటిగంట వ‌ర‌కు రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో ప‌రీక్ష జ‌రుగుతుంది.

Courtesy by : నమస్తే తెలంగాణ మీడియా 


ఎవరెస్టు పై తెలుగు దేశం జెండా ఎగరవేసిన 80ఏళ్ల శివప్రసాద్....!

*ఎవరెస్టు పై తెలుగు దేశం జెండా ఎగరవేసిన 80ఏళ్ల శివప్రసాద్....!*

అమరావతి: దార్శనికుడు, రాష్ట్రాన్ని సక్రమంగా పరిపాలించగలిగే నాయకుడైన చంద్రబాబును మళ్లీ ఆంధ్రప్రదేశ్‌ గద్దెపై కూర్చోబెట్టాలని ఎవరెస్ట్‌ శిఖరాన్ని 5 వేల మీటర్ల వరకు అధిరోహించిన 80 ఏళ్ల వృద్ధుడు గింజుపల్లి శివప్రసాద్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ఎవరెస్ట్‌పై ఆయన తెదేపా జెండాను ఎగరేశారు. 'యావన్మంది తెలుగు ప్రజలు ప్రపంచంలో ఎక్కడున్నా మీ రాష్ట్రాన్ని, దేశాన్ని మరచిపోకండి. ప్రస్తుతం మీ రాష్ట్రం చాలా ఇబ్బందుల్లో, దయనీయ స్థితిలో ఉంది. అందరికీ చెప్పి.. చంద్రబాబును గద్దెపై కూర్చోబెట్టండి. రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది' అని వీడియో సందేశం విడుదల చేశారు. 80 ఏళ్ల వయసులో ఎవరెస్ట్‌పై తెదేపా జెండా ఎగరేసిన శివప్రసాద్‌ను చంద్రబాబు అభినందించారు.

*సుజీవన్ వావిలాల*🖋️ 

Saturday, October 8, 2022

ఇలాంటి స్నేహితుడు శత్రువును మించిన ప్రమాదకారి.... నమ్మకం పెట్టుకుంటే... జీవితాంతం నరకమే

*ఇలాంటి స్నేహితుడు శత్రువును మించిన ప్రమాదకారి.... నమ్మకం పెట్టుకుంటే... జీవితాంతం నరకమే*

ప్రతి వ్యక్తి జీవితంలో స్నేహితుల పాత్ర ఎంతో కీలకమైనది. నిజమైన స్నేహితుడు తోటి స్నేహితుడి సంతోషంలో, దుఃఖంలో నీడలా ఉంటాడు. కొందరికి పరిమిత సంఖ్యలో స్నేహితులు ఉంటారు.మరికొందరికి స్నేహితులు అధికంగా ఉంటారు. అవతలి వ్యక్తిలోని గుణాలు తెలియకుండా వారితో స్నేహం చేస్తే, ఆ తరువాత పశ్చాత్తాప పడాల్సివస్తుంది. ఆచార్య చాణక్య తన నీతి శాస్త్రంలో స్నేహితులను ఎలా ఎంపిక చేసుకోవాలి? స్నేహితులు శత్రువులుగా ఎలా పరిణమిస్తారు? అనే విషయాలను తెలియజేశాడు. చాణక్య నీతిలోని రెండవ రెండవ అధ్యాయంలో ఆచార్య చాణక్య స్నేహం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేశాడు, ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. మన ముందు మంచిగా మాట్లాడుతూ, మన వెనుక గోతులు తవ్వే స్నేహితులకు దూరంగా ఉండాలని ఆచార్య చాణక్య తెలిపారు. దీనిగురించి ఆచార్య వివరంగా తెలియజేస్తూ... విషం నిండిన కుండలో కొద్దిగా పాలు పోసినా దానిని విషపు కుండ అనే అంటారు. అదే విధంగా నీ ముందు మృదువుగా మాట్లాడి, నీ వెనుక కుట్రలు పన్నే మిత్రుడు విషం నిండిన కుండలాంటివాడని ఆచార్య తెలిపారు. అందుకే అలాంటి స్నేహితులకు దూరంగా ఉండటం సరైనదని ఆచార్య చాణక్య తెలిపారు. నిజానికి ఇలాంటివారిని మిత్రుడు అని కూడా పిలువలేమని ఆచార్య పేర్కొన్నారు. అతన్ని శత్రువుగా పరిగణించడమే మంచిదని తెలిపారు. ఎవరైనాసరే స్నేహితులను త్వరగా విశ్వసించకూడదని, ఎందుకంటే మీ రహస్యాలను వారితో పంచుకుంటే ముప్పు ఏర్పడుతుందని చాణక్య హెచ్చరించారు.

మోసపూరిత మనస్తత్వం గల స్నేహితులను అస్సలు నమ్మకూడదని, అతనికి మీపై కోపం వచ్చినప్పుడు అందరి ముందు మీ రహస్యాలను వెల్లడిస్తాడని చాణక్య తెలిపారు. అలా జరిగితే మీరు పశ్చాత్తాపపడవలసి వస్తుందని ఆచార్య తెలిపారు. అదేవిధంగా కొందరు స్నేహితులు మీ రహస్యాలను తెలుసుకుని, బెదిరింపులకు పాల్పడి మిమ్మల్ని తప్పుడు పనులు చేయాలని బలవంతపెట్టే అవకాశాలుంటాయి. అందుకే మీరు ఎవరినైనా మంచి స్నేహితునిగా భావించినా వారికి మీ రహస్యాలను ఎప్పుడూ చెప్పకూడదని ఆచార్య చాణక్య తెలిపారు. వ్యక్తిగత విషయాలకు దాపరికం అవసరమని ఆచార్య చాణక్య సూచించారు.

*సుజీవన్ వావిలాల*🖋️