Friday, September 30, 2022

న్యాయ వాది ఆత్మహత్య.... హైకోర్టుకు నిప్పు

*న్యాయ వాది ఆత్మహత్య.... హైకోర్టుకు నిప్పు*

*మధ్యప్రదేశ్‌లో లాయర్ల నిరసన....!*

జబల్‌పుర్‌: మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని జబల్‌పుర్‌లో హైకోర్టు న్యాయవాది ఆత్మహత్య పెను విధ్వంసానికి కారణమైంది.అనురాగ్‌ సాహూ అనే న్యాయవాది బలవన్మరణానికి పాల్పడగా.. ఆయన తోటి న్యాయవాదులు శుక్రవారం తీవ్రస్థాయిలో నిరసనలు చేపట్టారు. హైకోర్టు ప్రాంగణంలో విధ్వంసానికి దిగి, న్యాయస్థానానికి నిప్పు పెట్టారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు లాయర్లపై పోలీసులు లాఠీఛార్జ్‌ చేశారు.

జబల్‌పుర్‌ హైకోర్టులో న్యాయవాది అయిన అనురాగ్‌ సాహూ ఓ అత్యాచారం కేసులో బాధితుల పక్షాన వాదించారు. ఈ కేసులో నిందితుడి బెయిల్‌ పిటిషనుపై శుక్రవారం జస్టిస్‌ సంజయ్‌ ద్వివేది ధర్మాసనం ఎదుట విచారణ జరిగింది. ఆ సమయంలో.. అనురాగ్‌ సాహూకు, నిందితుడి తరఫు న్యాయవాదికి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటుచేసుకొంది.

చివరకు ఇద్దరూ వ్యక్తిగత దూషణల స్థాయికి వెళ్లారు. ఈ నేపథ్యంలో అనురాగ్‌ సాహూ కోర్టు నుంచి హడావుడిగా ఇంటికి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే తోటి న్యాయవాదులు ఆగ్రహావేశాలకు లోనయ్యారు.

అనురాగ్‌ మృతదేహంతో నేరుగా హైకోర్టు ప్రాంగణానికి చేరుకొని మొత్తం వ్యవహారంపై సీబీఐ దర్యాప్తునకు డిమాండ్‌ చేస్తూ నిరసనకు దిగారు. ఈ నిరసన కాసేపటికి హింసాత్మకంగా మారింది. లాయర్లు కోర్టు లోపలకు ప్రవేశించి విధ్వంసానికి పాల్పడ్డారు. అక్కడి వస్తువులకు నిప్పంటించారు.

పోలీసులు పెద్దసంఖ్యలో అక్కడికి చేరుకోగా.. లాయర్లు వారిని అడ్డుకున్నారు. మంటలు ఆర్పేందుకు వచ్చిన అగ్నిమాపక సిబ్బందినీ చాలాసేపు లోపలకు రానివ్వలేదు. చివరకు.. న్యాయవాదులపై పోలీసులు లాఠీఛార్జ్‌ చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు

*సుజీవన్ వావిలాల*🖋️ 

Thursday, September 29, 2022

గురువుగారూ... గురువుగారూ...అంటూ దోచేశారు....!

*గురువుగారూ... గురువుగారూ...అంటూ దోచేశారు....!*

*జోగిపేటలో రిటైర్డ్‌ టీచర్‌ ఇంట్లో రూ.30 లక్షల నగదు, 10 తులాల బంగారం చోరీ*

*కొంప ముంచిన మద్యం వ్యసనం*

*జోగిపేట (అందోల్‌): గురువు గారూ మేం మీ* విద్యార్థులం'అంటూ నమ్మించిన యువకులు ఓ రిటైర్డ్‌ ఉపాధ్యాయుడి ఇంట్లో నుంచి రూ. 30 లక్షల నగదు , 10 తులాల నగలు అపహరించుకు పోయారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా జోగిపేట పట్టణంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి.. ఎస్సీ బాలుర హాస్టల్‌ ప్రాంతంలో రిటైర్డ్‌ టీచర్‌ లక్ష్మీనారాయణ ఒంటరిగా ఉంటున్నారు.

మార్కెట్‌ యార్డు ఆవరణలో రెండు నెలల క్రితం లక్ష్మీనారాయణ మద్యం సేవిస్తుండగా అటువైపుగా వచ్చిన ఇద్దరు యువకులు.. 'గురువుగారు బాగున్నారా? మమ్మల్ని గుర్తుపట్టారా? మేము మీ శిష్యులం'అంటూ మాట కలిపారు. దీంతో పలుసార్లు కలుసుకోవడం, మద్యం సేవించడంతో వారి మధ్య చనువు ఏర్పడింది. కాగా, లక్ష్మీనారాయణ ఎప్పటిలాగే ఈనెల 24వ తేదీన మార్కెట్‌ యార్డు వద్దకు ఇద్దరు యువకులను తీసుకువెళ్లగా, అక్కడ దోమలు ఉన్నాయని, అన్నాసాగర్‌ వద్ద మంచి చోటు ఉంటుందని ఆ యువకులు తీసుకువెళ్లారు. ఆయన్ను మద్యం మత్తులోకి దింపిన ఆ యువకులు ఇంకా మద్యం, తినడానికి ఏమైనా తీసుకువస్తామని చెప్పి లక్ష్మీనారాయణ బైక్‌ను వెంట తీసుకువెళ్లారు.
*దొంగతనం జరిగింది ఇలా..*బైక్‌ తాళం చెవిగుత్తికే ఇంటి తాళం చెవి ఉండటంతో నేరుగా వారు లక్ష్మీనారాయణ ఇంటికి వెళ్లి బీరువా తాళాన్ని పగలగొట్టి దొంగతనానికి పాల్పడ్డారు. కేవలం 14 నిమిషాల్లో వారు దొంగతనం పూర్తి చేసుకున్నట్లు సీసీ కెమెరా ఫుటేజీల ద్వారా పోలీసులు గుర్తించారు. సాయంత్రం 4, 5 గంటల సమయంలో వెళ్లిన యువకులు రాత్రి 8 గంటల వరకు కూడా రాకపోయేసరికి లక్ష్మీనారాయణ తమ దగ్గరి బంధువుల ఇంటికి వెళ్లి, 25వ తేదీన ఉదయం 5 గంటల సమయంలో తాను అద్దెకు ఉంటున్న ఇంటికి వెళ్లారు. ఇంటికి తాళం లేకుండా గడియ పెట్టి ఉండడంతో లోనికి ప్రవేశించి చూడగా బీరువాలో దాచుకున్న డబ్బులు, బంగారు నగలు కనిపించకపోవడంతో పోలీసు స్టేషన్‌కు వెళ్లి జరిగిన విషయాన్ని వివరించారు.

*ఇంటి స్థలం కొందామనుకున్నా*
రిటైర్‌మెంట్‌ ద్వారా వచ్చిన డబ్బులతో ఇంటి స్థలం కొందామనుకొని డబ్బు దాచుకున్నానని బాధితుడు లక్ష్మీనారాయణ విలేకరులకు తెలిపారు. ఇద్దరు వ్యక్తులు రెండు నెలల క్రితం పరిచయమయ్యారని, తమది సంగారెడ్డి అని చెప్పారని, పేర్లు మాత్రం చెప్పలేదని అన్నారు.

*సుజీవన్ వావిలాల🖋️*

Wednesday, September 28, 2022

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలో ఎన్ని ట్విస్టులో?.. బరిలో దిగ్విజయ్ సింగ్

ప్రశ్నించే ప్రతి ఒక్కరు #జర్నలిస్టే

*#మెయిన్ స్ట్రీమ్ మీడియా యాజమాన్యాలు అమ్ముడుపోయాయి అని అందరికి తెలిసిందే.... కానీ అందులో పనిచేసే కొందరు జర్నలిస్ట్ లు #జర్నలిజం అంటే అన్యాయాలపై / అవినీతి మీద  వాస్తవాలతో నిస్వార్థంగా #ప్రజాప్రయోజనాలకోసం తమ #కలానికి  ఎవరికీ భయపడకుండా ఉండాలని పనిచెపుతున్నారు.... ప్రస్తుతం #తెలంగాణ లో జర్నలిస్ట్ అనే పదానికి ఎంత మంది న్యాయం చేస్తున్నారో అందరికి తెలుసు.... అవినీతి మీద *ప్రశ్నించే" ప్రతి ఒక్కరు #జర్నలిస్టే 👍.... Bplkm🪶*                                                                         

*NOTE*:#సోషల్ మీడియా ప్రభంజనం ప్రస్తుతం అవినీతి మీద యుద్ధం చేస్తుంది*                                                                       

*Copy to Group link Media*

28/09/2022  prajasankalpam1.blogspot.com 

Monday, September 26, 2022

టాస్క్ ఫోర్స్ అదుపులో నయీమ్ ప్రధాన అనుచరుడు శేషన్న

*బ్రేకింగ్*

*హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ అదుపులో నయీమ్  ప్రధాన అనుచరుడు శేషన్న* 

*9 MM పిస్టల్ స్వాధీనం చేసుకున్న టాస్క్ఫోర్స్ పోలీసులు*

కొంతకాలంగా ల్యాండ్ సెటిల్మెంట్లు చేస్తూ ఈరోజు కొత్తపేట్ లోని  ఒక హోటల్లో  సెటిల్మెంట్ చేస్తున్న సమయంలో 

పక్కా సమాచారంతో శేషన్న ను  అదుపులోకి తీసుకున్న టాస్క్ఫోర్స్ పోలీసులు

Sunday, September 25, 2022

నేడు బాసర ట్రిపుల్ ఐటికీ.... కేటీఆర్

*నేడు బాసర ట్రిపుల్ ఐటికీ.... కేటీఆర్*

నిర్మల్‌ జిల్లాలోని బాసర ట్రిపుల్‌ ఐటీకి సోమవారం ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ వస్తున్నారు. ఆయనతో పాటు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి కూడా రానున్నారు.ఇటీవలే ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే జోగు రామన్న తల్లి మృతి చెందిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యేను పరామర్శించిన తర్వాత మధ్యాహ్నం ఒంటి గంటకు హెలికాప్టర్‌లో మంత్రి కేటీఆర్‌ బాసర రానున్నారు. ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొని అనంతరం వారితో కలిసి మధ్యాహ్నం భోజనం చేయనున్నారు. కాగా, ట్రిపుల్‌ ఐటీలో సమస్యలు పరిష్కరించాలంటూ జూన్‌లో విద్యార్థులు ఆందోళకు దిగిన విషయం తెలిసిందే. ట్రిపుల్‌ ఐటీకి ముఖ్యమంత్రి లేదంటే మంత్రి కేటీఆర్‌ రావాలని ఆందోళన చేసిన నేపథ్యంలో ఇప్పుడు మంత్రి పర్యటన ప్రాధాన్యం సంత రించుకుంది.

*సుజీవన్ వావిలాల*🖋️

Saturday, September 24, 2022

ఇండియా – ఆస్ట్రేలియా మ్యాచ్ నేపథ్యంలో వెహికల్స్ దారి మళ్లింపు

ఇండియా – ఆస్ట్రేలియా మ్యాచ్ నేపథ్యంలో వెహికల్స్ దారి మళ్లింపు

Courtesy by : V6 వెలుగు మీడియా సౌజన్యంతో 

ఇండియా – ఆస్ట్రేలియా మ్యాచ్ నేపథ్యంలో వెహికల్స్ దారి మళ్లింపు
  • సాయంత్రం 4.30 గంటల నుంచి స్టేడియంలోకి అనుమతి
  • వీఐపీలకు గేట్-1 నుంచి ఎంట్రీ

హైదరాబాద్,వెలుగు: ఇండియా– ఆస్ట్రేలియా మధ్య జరగనున్న ట్వంటీ–20 క్రికెట్ మ్యాచ్ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం 4 గంటల నుంచి అర్ధరాత్రి వరకు ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. స్టేడియంలోకి సాయంత్రం 4.30 గంటల నుంచి అనుమతించనున్నారు. వీఐపీలు, వీవీఐపీలకు గేట్‌‌– 1 ద్వారా స్టేడియంలోకి ఎంట్రీ ఉంటుందని పోలీసులు తెలిపారు. వెహికల్ పార్కింగ్‌‌ కోసం స్టేడియం లోపల ‘ఎ’, ‘సి’ పార్కింగ్‌‌ స్లాట్స్ ఏర్పాటు చేశారు. హెచ్‌‌సీఏ మెంబర్స్, స్టాఫ్‌‌ కోసం గేట్‌‌–‌‌ 2ను  కేటాయించారు. సాధారణ ప్రేక్షకులను అన్ని గేట్ల నుంచి అనుమతిస్తారు. పరిస్థితులకు అనుగుణంగా ఉప్పల్ క్రాస్‌‌ రోడ్స్, సికింద్రాబాద్‌‌, రామంతాపూర్‌‌‌‌, నాగోల్‌‌, అంబర్‌‌‌‌పేట్‌‌ రూట్‌‌లో వచ్చే వెహికల్స్​ను దారి మళ్లించనున్నారు.  సాయంత్రం 4 గంటల నుంచి అర్ధరాత్రి వరకు భారీ వెహికల్స్​ను ఉప్పల్ వైపు అనుమతించరు. 

21 పార్కింగ్ ఏరియాలు

మ్యాచ్ చూసేందుకు స్టేడియానికి వచ్చే వారి కోసం 21 పార్కింగ్‌‌ స్లాట్స్‌‌ ఏర్పాలు చేశారు. 4,100 కార్లు, 5,350 బైక్​లు పార్కింగ్ చేసేందుకు స్లాట్స్ ఫిక్స్ చేశారు. కేటాయించిన ఏరియాల్లో మాత్రమే వెహికల్స్ పార్కింగ్ చేయాలని పోలీసులు సూచించారు. పార్కింగ్ ఏరియాలో సీసీ కెమెరాలను ఫిక్స్ చేశారు. స్టేడియం బయట 5 క్రేన్లను అందుబాటులో ఉంచారు. మిగతా వాహనదారులు స్టేడియం రూట్​లో కాకుండా  నాగోల్, ఎల్​బీనగర్, దిల్​సుఖ్​నగర్, అంబర్ పేట మీదుగా వెళ్లాలని రాచకొండ ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. 

మ్యాచ్​ కోసం  స్టేడియానికి వచ్చే వారి రూట్​ మ్యాప్

    తార్నాక వైపు నుంచి వచ్చే వీఐపీ పాస్‌‌ హోల్డర్స్‌‌: హబ్సిగూడ వైపు,ఎన్‌‌జీఆర్‌‌‌‌ఐ,ఏక్ మినార్ వద్ద రైట్‌‌ టర్న్‌‌ తీసుకుని గేట్ నం.1 నుంచి స్టేడియంలోకి వెళ్లాలి.

    అంబర్‌‌పేట్ వైపు నుంచి వచ్చే వీఐపీ పాస్ హోల్డర్స్‌‌: దూరదర్శన్, రామంతాపూర్ - స్ట్రీట్ నం.8 వద్ద లెఫ్ట్‌‌ టర్న్‌‌ తీసుకుని గేట్ నం.1కు చేరుకోవాలి. 

   నాగోల్, వరంగల్ హైవే నుంచి వచ్చే వీఐపీ పాస్‌‌ హోల్డర్స్‌‌: ఉప్పల్ క్రాస్‌‌ రోడ్,- సర్వే ఆఫ్ ఇండియా, ఏక్ మినార్ వద్ద లెఫ్ట్‌‌ టర్న్‌‌ తీసుకుని గేట్‌‌ నం.1 ద్వారా  స్టేడియంలోకి వెళ్లాలి.

పార్కింగ్‌‌ ఇలా..

  •     హబ్సిగూడ  నుంచి ఉప్పల్  వైపు వచ్చే కార్లు,బైక్స్‌‌: ఎన్‌‌జీఆర్‌‌‌‌ఐ లెఫ్ట్‌‌ సైడ్‌‌ గేట్ నం.1 లెఫ్ట్‌‌  నుంచి 3వ గేట్‌‌ వరకు మెట్రో పార్కింగ్‌‌లో వెహికల్స్ పెట్టాలి. 
  •     ఉప్పల్ నుంచి హబ్సిగూడ రోడ్డులో వచ్చే వెహికల్స్‌‌: హిందూ ఆఫీస్ లేన్ వైపు జెన్‌‌పాక్ట్ సర్వీస్ రోడ్ నుంచి ఎన్‌‌జీఆర్‌‌‌‌ మెట్రోస్టేషన్‌‌ వద్ద పార్క్‌‌ చేయాలి.
  •     ఉప్పల్,రామాంతపూర్ రూట్‌‌లో వచ్చే కార్లు: సినీపోలీస్ సెల్లార్‌‌, మోడ్రన్ బేకరీ లోపల, శక్తి డిటర్జెంట్ ఓపెన్ ప్లేస్, డీఎస్‌‌ఎల్‌‌ ఓపెన్ ల్యాండ్, మెరియా ఇంటర్నేషనల్ స్కూల్​లో పార్క్‌‌ చేయాలి.
  •     ఉప్పల్, రామంతాపూర్ నుంచి వచ్చే బైక్స్: మోడ్రన్ బేకరీ, అమ్మ భగవన్ సేవా లేన్‌‌, కేవీ స్కూల్‌‌ నుంచి డీఎస్‌‌ఎల్‌‌,ఎల్జీ గొడౌన్ వద్ద పార్క్ చేయాలి.