Saturday, September 24, 2022

ఇండియా – ఆస్ట్రేలియా మ్యాచ్ నేపథ్యంలో వెహికల్స్ దారి మళ్లింపు

ఇండియా – ఆస్ట్రేలియా మ్యాచ్ నేపథ్యంలో వెహికల్స్ దారి మళ్లింపు

Courtesy by : V6 వెలుగు మీడియా సౌజన్యంతో 

ఇండియా – ఆస్ట్రేలియా మ్యాచ్ నేపథ్యంలో వెహికల్స్ దారి మళ్లింపు
  • సాయంత్రం 4.30 గంటల నుంచి స్టేడియంలోకి అనుమతి
  • వీఐపీలకు గేట్-1 నుంచి ఎంట్రీ

హైదరాబాద్,వెలుగు: ఇండియా– ఆస్ట్రేలియా మధ్య జరగనున్న ట్వంటీ–20 క్రికెట్ మ్యాచ్ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం 4 గంటల నుంచి అర్ధరాత్రి వరకు ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. స్టేడియంలోకి సాయంత్రం 4.30 గంటల నుంచి అనుమతించనున్నారు. వీఐపీలు, వీవీఐపీలకు గేట్‌‌– 1 ద్వారా స్టేడియంలోకి ఎంట్రీ ఉంటుందని పోలీసులు తెలిపారు. వెహికల్ పార్కింగ్‌‌ కోసం స్టేడియం లోపల ‘ఎ’, ‘సి’ పార్కింగ్‌‌ స్లాట్స్ ఏర్పాటు చేశారు. హెచ్‌‌సీఏ మెంబర్స్, స్టాఫ్‌‌ కోసం గేట్‌‌–‌‌ 2ను  కేటాయించారు. సాధారణ ప్రేక్షకులను అన్ని గేట్ల నుంచి అనుమతిస్తారు. పరిస్థితులకు అనుగుణంగా ఉప్పల్ క్రాస్‌‌ రోడ్స్, సికింద్రాబాద్‌‌, రామంతాపూర్‌‌‌‌, నాగోల్‌‌, అంబర్‌‌‌‌పేట్‌‌ రూట్‌‌లో వచ్చే వెహికల్స్​ను దారి మళ్లించనున్నారు.  సాయంత్రం 4 గంటల నుంచి అర్ధరాత్రి వరకు భారీ వెహికల్స్​ను ఉప్పల్ వైపు అనుమతించరు. 

21 పార్కింగ్ ఏరియాలు

మ్యాచ్ చూసేందుకు స్టేడియానికి వచ్చే వారి కోసం 21 పార్కింగ్‌‌ స్లాట్స్‌‌ ఏర్పాలు చేశారు. 4,100 కార్లు, 5,350 బైక్​లు పార్కింగ్ చేసేందుకు స్లాట్స్ ఫిక్స్ చేశారు. కేటాయించిన ఏరియాల్లో మాత్రమే వెహికల్స్ పార్కింగ్ చేయాలని పోలీసులు సూచించారు. పార్కింగ్ ఏరియాలో సీసీ కెమెరాలను ఫిక్స్ చేశారు. స్టేడియం బయట 5 క్రేన్లను అందుబాటులో ఉంచారు. మిగతా వాహనదారులు స్టేడియం రూట్​లో కాకుండా  నాగోల్, ఎల్​బీనగర్, దిల్​సుఖ్​నగర్, అంబర్ పేట మీదుగా వెళ్లాలని రాచకొండ ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. 

మ్యాచ్​ కోసం  స్టేడియానికి వచ్చే వారి రూట్​ మ్యాప్

    తార్నాక వైపు నుంచి వచ్చే వీఐపీ పాస్‌‌ హోల్డర్స్‌‌: హబ్సిగూడ వైపు,ఎన్‌‌జీఆర్‌‌‌‌ఐ,ఏక్ మినార్ వద్ద రైట్‌‌ టర్న్‌‌ తీసుకుని గేట్ నం.1 నుంచి స్టేడియంలోకి వెళ్లాలి.

    అంబర్‌‌పేట్ వైపు నుంచి వచ్చే వీఐపీ పాస్ హోల్డర్స్‌‌: దూరదర్శన్, రామంతాపూర్ - స్ట్రీట్ నం.8 వద్ద లెఫ్ట్‌‌ టర్న్‌‌ తీసుకుని గేట్ నం.1కు చేరుకోవాలి. 

   నాగోల్, వరంగల్ హైవే నుంచి వచ్చే వీఐపీ పాస్‌‌ హోల్డర్స్‌‌: ఉప్పల్ క్రాస్‌‌ రోడ్,- సర్వే ఆఫ్ ఇండియా, ఏక్ మినార్ వద్ద లెఫ్ట్‌‌ టర్న్‌‌ తీసుకుని గేట్‌‌ నం.1 ద్వారా  స్టేడియంలోకి వెళ్లాలి.

పార్కింగ్‌‌ ఇలా..

  •     హబ్సిగూడ  నుంచి ఉప్పల్  వైపు వచ్చే కార్లు,బైక్స్‌‌: ఎన్‌‌జీఆర్‌‌‌‌ఐ లెఫ్ట్‌‌ సైడ్‌‌ గేట్ నం.1 లెఫ్ట్‌‌  నుంచి 3వ గేట్‌‌ వరకు మెట్రో పార్కింగ్‌‌లో వెహికల్స్ పెట్టాలి. 
  •     ఉప్పల్ నుంచి హబ్సిగూడ రోడ్డులో వచ్చే వెహికల్స్‌‌: హిందూ ఆఫీస్ లేన్ వైపు జెన్‌‌పాక్ట్ సర్వీస్ రోడ్ నుంచి ఎన్‌‌జీఆర్‌‌‌‌ మెట్రోస్టేషన్‌‌ వద్ద పార్క్‌‌ చేయాలి.
  •     ఉప్పల్,రామాంతపూర్ రూట్‌‌లో వచ్చే కార్లు: సినీపోలీస్ సెల్లార్‌‌, మోడ్రన్ బేకరీ లోపల, శక్తి డిటర్జెంట్ ఓపెన్ ప్లేస్, డీఎస్‌‌ఎల్‌‌ ఓపెన్ ల్యాండ్, మెరియా ఇంటర్నేషనల్ స్కూల్​లో పార్క్‌‌ చేయాలి.
  •     ఉప్పల్, రామంతాపూర్ నుంచి వచ్చే బైక్స్: మోడ్రన్ బేకరీ, అమ్మ భగవన్ సేవా లేన్‌‌, కేవీ స్కూల్‌‌ నుంచి డీఎస్‌‌ఎల్‌‌,ఎల్జీ గొడౌన్ వద్ద పార్క్ చేయాలి.

No comments:

Post a Comment