Monday, September 12, 2022

వందకో..500 వందలకో..అమ్ముడుపోయి ఓటేసి

*మనం కాదా!దొంగలం*??

కొడుకు యూఎస్ లో ఉంటాడు, 
కూతురు ఆస్ట్రేలియాలో  ఉంటది, 
నెలకు 50 వేలొచ్చే ఉద్యోగముంటది,
నెలకు 60 వేల రెంటొచ్చే అపార్టుమెంట్లు
ఓ రెండుంటాయి.
 
*అయినా ...*
సర్పంచ్ మనోడేనని తెల్లకార్డు తీసుకుంటిమి,
రేషన్ సరుకులు నెలనెలా టంచన్ గా తీసుకుంటుమి,
ఆ రేషన్ బియ్యం పదికి కిలో పదికి బ్లాక్ లో అమ్ముకుంటిమి,
MLA తెలిసినోడేనని గవర్నమెంట్ ఇల్లు కూడా రాయించుకుంటిమి,
ఆరోగ్య శ్రీ కార్డు మీద ఆపరేషన్ లు చేయించుకుంటిమి,
ఇంకా సాలదన్నట్టు ఓ గవర్నమెంట్ స్థలం కూడా రాయించుకుంటిమి,

*ఇక ....*
నీరవ్ మోడీ యో, విజయ్ మాల్యాదో ముచ్చటలు టీవీలో వినబడగానే.....
శివమెత్తి ఊగిపోతూ లుంగీ చేతపట్టి వీళ్లంతా దొంగలంటూ రచ్చబండ దగ్గర ముచ్చట్లు చెప్తిమి.

పక్కింటి జోగేశ్వర్ కొడుకు రామేశ్వర్ మునిసిపల్ ఆపీసులో పనిచేసి వంద కోట్లు ఆస్తులు కూడబెట్టింది తెలుసు..
ఇంటెనుక ప్రసాద్  చిట్టీల వ్యాపారం పెట్టుకుని బిల్డింగుల మీద బిల్డింగ్లు కట్టుకున్నది తెలుసు.....

మూల మీద ప్రకాశం గాడు కరెంట్ ఆపీసులో పనిచేస్తూ 4 కోట్లు ఎనుకేసుకున్నదీ తెలుసు .....

మేనల్లుడు కుమార్ బ్యాంకులో పనిచేస్తూ దొంగలోన్లిప్పిచ్చి కమిషన్లతో లెక్కలేనన్ని ప్లాట్లు సంపాదించింది తెలుసు.......

సందు దొరికితే చాలు ఎనకముందు చూడకుండా నొక్కెయ్యడం.. ఎం ఎరగనట్టు గురువింద గింజలా సుద్దులు చెప్పటం ప్రతోడికి కామన్ అయిపోయింది బాబాయ్...
అవినీతి నీ ఇంట్లో నా ఇంట్లో పక్కింట్లో ఏరులై పారుతూనే ఉంది.. 

ఎదుటోడికి కనపడకుండా తుడుచుకుని కొందరు ..  
చూస్తే చూసార్లే ఎం చేస్తారని ఇంకొందరు... 

ఆ మనకేడుందిరా నీతి అని ముడ్డికంటిదాన్ని మూతికి తుడుసుకుని ఇంకొందరు.. 
ఇలా భూమిపై అడుగంటి పోయింది నీటిచుక్కొక్కటే కాదు నీతి నిజాయితీలు కూడా బాబాయ్...

*బ్యాంకు కుంభకోణమైనా ...*
బంతాట కుంభకోణమైనా.....
గడ్డి మోపుల కుంభకోణమైనా....
పెన్నుల కంపిని అవినీతైనా ....
నువ్వో నేనో వాడో వీడో చెయ్యందిస్తేనే అయింది......
పైనున్న దేవుడు నిజం చెబితే 
పై నుండి కింది దాకా మనవే పేర్లుంటాయి..

మొన్న ఒక మిత్రుడు ఓ పెద్ద లెక్కేశాడు:
విజయ్ మాల్యా, నీరవ్ మోడీ లు చేసిన మొత్తం మోసం /120 కోట్లమందికి = 
ఒక్కొక్కరికి 185 రూపాయలని,
ఇది కచ్చితంగా తప్పే. 
నియమాలను కఠినం చెయ్యాల్సిందే. 
తప్పులను అరికట్టాల్సిందే.

*ఇపుడు నేనో లెక్క చెపుతా...*
*ఒక ఇంట్లోంచి ఒక సంవత్సరానికి 1000 రూపాయల అవినీతి  జరిగితే:*🤔
*1000 రూపాయలు X ??? కోట్ల జనాభా = ఎన్ని వేల కోట్లు మరి దీనిని ఆపటం ఎలా..?*

*ముందు మారాల్సింది మనం, వందకో, 500 వందలకో, అమ్ముడుపోయి ఓటేసి, తీరా చాతగాని దద్దమ్మగాన్ని కోట్లకు కోట్లు మాయం చేసే  గాన్ని గెలిపిస్తే, వాడు తిరిగి నీకే ఎసరు పెట్టి, నీ అవసరాన్నే అవినీతికి అడ్డాగా మార్చుకుని ఇలా నీరవ్ , మాల్యా , లలిత్ లను మించిపోక మానడు ..*

*అసలు అవినీతి నీ ఇంట్లో పెట్టుకుని నీతులు చెప్పడం ఆపనంత వరకు ఈ దేశం కుంభకోణాలకు పుట్టినిల్లే, అప్పటికి, ఇప్పటికి, ఎప్పటికి అభివృద్ది చెందుతున్న భారతమే ..*


.

Telangana High Court : పబ్స్‌కు షాక్‌.. రాత్రి 10 దాటితే నో సౌండ్స్‌..

అప్పటి ఏపీ సీయం చేతిలో ప్రధాని కీలు బొమ్మలా మారారు... కేసీఆర్.....!

అప్పటి ఏపీ సీయం చేతిలో ప్రధాని కీలు బొమ్మలా మారారు... కేసీఆర్.....!

హైదరాబాద్‌: రాష్ట్రాలు ఎంత విద్యుత్‌ వినియోగిస్తున్నాయనేది ప్రగతి సూచికలో ముఖ్యమైనదని తెలంగాణ సీఎం కేసీఆర్‌ అన్నారు. ఉమ్మడి ఆంధప్రదేశ్‌లో విద్యుత్‌ విషయంలో తెలంగాణ ప్రజలు ఇబ్బందులు పడ్డారని..
ఆనాడు అనేక ప్రాంతాల్లో విద్యుదాఘాతాలతో ప్రజలు చనిపోయారని చెప్పారు. బిల్లులు కట్టలేదని విద్యుత్‌ అధికారులు దాడులు చేయబోతే కొందరు విషం తాగి చనిపోయారన్నారు. విద్యుత్‌ రంగం సహా అనేక సమస్యలపై పోరాడి తెలంగాణ సాధించుకున్నామని సీఎం గుర్తుచేశారు. శాసనసభ సమావేశాల్లో భాగంగా రెండో రోజు ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం విద్యుత్‌ చట్ట సవరణ బిల్లుపై కేసీఆర్‌ మాట్లాడారు. దేశాల విద్యుత్‌ వినియోగాన్ని ప్రగతి సూచికలో ముఖ్యమైనదిగా ఆధునిక ప్రపంచం పరిగణిస్తుందన్నారు.

''పునర్విభజన హామీల అమల్లో తెలంగాణకు అన్యాయం చేశారు. విద్యుత్‌ కేటాయింపుల్లో రాష్ట్రానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని కోరాం. ఇరు రాష్ట్రాల కేటాయింపుల్లో భాగంగా లోయర్‌ సీలేరు విద్యుత్‌ ప్రాజెక్టును తెలంగాణకు అప్పగించారు. సింగరేణి కాలరీస్‌పై హక్కు తెలంగాణకే ఉంటుందని కేటాయించారు. 2014లో అప్పటి ఏపీ సీఎం చేతిలో ప్రధాని కీలుబొమ్మగా మారారు. అప్రజాస్వామికంగా ఏడు మండలాలపై ఆర్డినెన్స్‌ తెచ్చారు. శాసనసభకు ప్రతిపాదించకుండానే కర్కశంగా 7 మండలాలను ఏపీకి అప్పగించారు. సీలేరు విద్యుత్‌ ప్రాజెక్టును కూడా వారికే కేటాయించారు'' అని కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

*సుజీవన్ వావిలాల🖋️*
ప్రజల పక్షం 

Friday, September 9, 2022

తెలంగాణలో డెంగీ డేంజర్ బెల్స్....హైదరాబాద్ లో పరిస్థితి ఆందోళనకరం

*తెలంగాణలో డెంగీ డేంజర్ బెల్స్....హైదరాబాద్ లో పరిస్థితి ఆందోళనకరం*

*దడ పుట్టిస్తున్న జ్వరాలు*

*3,602 ఒక్క ఆగస్టులోనే నమోదైన కేసులు*

*సెప్టెంబర్‌ మొదటి నాలుగు రోజుల్లోనే 599 మంది బాధితులు*

*ఈ ఏడాది మొదటి ఏడు నెలల్లో 1,950 కేసులే*
*ఈ నెల 4 వరకు మొత్తం 6,151 కేసులు రికార్డు*

*హైదరాబాద్‌ను హీటెక్కిస్తున్న డెంగీ*

*రంగారెడ్డి, మేడ్చల్, ఖమ్మం, సంగారెడ్డి జిల్లాల్లోనూ విజృంభణ*

*ప్రభుత్వానికి రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ నివేదిక*

హైదరాబాద్‌: డెంగీ విజృంభిస్తోంది. రోజురోజుకూ కేసులు గణనీయంగా పెరిగిపోతున్నాయి. ఆగస్టు నెలలో రోజుకు సగటున వందమందికి పైగా దీని బారినపడ్డారు. సెప్టెంబర్‌లో మొదటి నాలుగు రోజుల్లోనే 599 మందికి జ్వరం సోకడం వ్యాధి విజృంభణను స్పష్టం చేస్తోంది. ఈ ఏడాది జనవరి నుంచి ఈనెల నాలుగో తేదీ వరకు 6,151 కేసులు నమోదయ్యాయని ప్రభుత్వానికి వైద్య ఆరోగ్యశాఖ సమర్పించిన తాజా నివేదిక వెల్లడించింది. జనవరి నుంచి జూలై వరకు 1950 కేసులు మాత్రమే నమోదు కాగా, ఒక్క ఆగస్టులోనే ఏకంగా 3,602 కేసులు నమోదు కావడం గమనార్హం. మరోవైపు ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో నమోదవుతున్న కేసులు చాలావరకు ప్రభుత్వం దృష్టికి రావడం లేదని అధికారులు అంటున్నారు *అత్యధికంగా హైదరాబాద్‌లోనే..*
రాష్ట్రంలో ఈ ఏడాది నమోదైన కేసుల్లో అత్యధికంగా హైదరాబాద్‌లో 2,998 రికార్డు అయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 588, మేడ్చల్‌లో 411, ఖమ్మంలో 361, సంగారెడ్డి జిల్లాలో 208 నమోదయ్యాయని నివేదిక వెల్లడించింది. జూలై నుంచి మొదలైన వర్షాలు కొన్ని రోజులు మినహా ఎడతెరపి లేకుండా కురుస్తుండటంతో ఎక్కడికక్కడ నీటి నిల్వలు పేరుకుపోవడంతో దోమలు స్వైర విహారం చేస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్‌లోనైతే పరిస్థితి ఆందోళనకరంగా ఉందంటున్నారు.

*సుజీవన్ వావిలాల*🖋️
ప్రజల పక్షం 

కలలు కనడం....వాటిని సాకారం చేసుకోవడం తెలంగాణకు తెలుసు... KTR

కలలు కనడం....వాటిని సాకారం చేసుకోవడం తెలంగాణకు తెలుసు... KTR*

హైదరాబాద్‌: తెలంగాణ ప్రగతి చక్రానికి కేంద్రం కొన్ని ఆటంకాలు కలిగించవచ్చు కానీ అభివృద్ధి దిశగా రాష్ట్ర పయనాన్ని మాత్రం అడ్డుకోలేరని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు.ఈ మేరకు ట్విటర్‌ వేదికగా కేంద్ర ప్రభుత్వ తీరుపై కేటీఆర్‌ మండిపడ్డారు. ఐటీఐఆర్ రద్దు చేసినప్పటికీ తెలంగాణ ఐటీ రంగం గత 8 ఏళ్లలో 3.2 రెట్లు వృద్ధి చెందిందన్నారు. నిరుడు దేశంలో మూడు ఐటీ ఉద్యోగాల్లో ఒకటి హైదరాబాద్‌లోనే వచ్చిందని పేర్కొన్నారు. సకాలంలో నిధులు ఇవ్వకపోయినా, ఎఫ్ఆర్‌బీఎం ఆంక్షలు విధించినప్పటికీ దేశంలో 2.5 శాతం జనాభా ఉన్న తెలంగాణ వాటా జీడీపీలో 5 శాతంగా ఉందని చెప్పారు. ఎనిమిదేళ్లలో తెలంగాణ తలసరి ఆదాయం దాదాపుగా రెట్టింపు అయిందన్నారు.

''పారిశ్రామిక కారిడార్లు తిరస్కరించినప్పటికీ రాష్ట్రంలో అద్భుతమైన వృద్ధి నమోదైంది. 20వేల పారిశ్రామిక యూనిట్ల మంజూరుతో పాటు 16 లక్షల మందికి కొత్త ఉద్యోగాలు లభించాయి. తెలంగాణకు బల్క్ డ్రగ్ పార్కు ఇవ్వకపోయినా ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మాసిటీ నిర్మించాం. మిషన్ కాకతీయకు తోడ్పాటు ఇవ్వకపోయినా 20వేల చెరువులు పునరుద్ధరించాం. కేంద్ర ప్రభుత్వ అమృత్ సరోవర్ పథకానికి మిషన్ కాకతీయ ఆదర్శంగా నిలిచింది. కేంద్రం ఒక్క వైద్య కళాశాల ఇవ్వకపోయినా జిల్లాకు ఒకటి చొప్పున 33 వైద్యకళాశాలలు నిర్మిస్తున్నాం. జాతీయ హోదా ఇవ్వకపోయినా ప్రపంచంలోనే పెద్దదైన కాళేశ్వరం ప్రాజెక్టును రాష్ట్రం సొంతంగా నిర్మించింది. కేంద్రం మద్దతు ఉన్నా, లేకపోయినా పెండింగ్‌లో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తి చేసి తీరుతాం. మిషన్ భగీరథకు సాయం చేసేందుకు నిరాకరించినా ప్రతి ఇంటికీ నల్లా నీరు ఇస్తున్న మొదటి రాష్ట్రంగా దేశంలోనే అగ్రస్థానంలో నిలిచాం. ప్రతికూల పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో.. ఎలా పోరాడాలో మాకు తెలుసు. కలలు కనడం.. వాటిని సాకారం చేసుకోవడం తెలంగాణకు బాగా తెలుసు'' అని కేటీఆర్ వెల్లడించారు.

*సుజీవన్ వావిలాల*🖋️
ప్రజల పక్షం 

Thursday, September 8, 2022

నిమజ్జనం పై నిఘా

*నిమజ్జనం పై నిఘా*

హైదరాబాద్‌ : ఎటువంటి ఆటంకాలూ లేకుండా గణేశ్‌ నిమజ్జనం సాగేలా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.ఎక్కడికక్కడ నిఘా ఉంచారు. మూడు కమిషనరేట్లలో 45 వేల మంది సిబ్బంది బందోబస్తులో ఉంటారని అధికారులు చెప్పారు. గురువారం నగర సీపీ సీవీ ఆనంద్‌, అదనపు సీపీలు నిమజ్జన రూట్‌ను, బాలాపూర్‌ నుంచి హుస్సేన్‌సాగర్‌ వరకు 18కి.మీ. రూట్‌ భద్రత, బందోబస్తు చర్యలను పరిశీలించారు. కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచి పర్యవేక్షణతో పాటు నగరంలో డ్రోన్‌ కెమెరాలతోపాటు ఏరియల్‌ వ్యూ ఏర్పాట్లు చేశామని, మూడు కమిషనరేట్లలో సుమారు 30 వేలకు పైగా విగ్రహాలు ఉన్నాయని పోలీసు అధికారులు చెప్పారు. 10వ తేదీ సాయంత్రం వరకు ట్యాంక్‌బండ్‌ పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు అమలులో ఉంటాయన్నారు.

హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ కమిషనరేట్ల పరిధుల్లో 45 వేల మంది పోలీసు సిబ్బందితోపాటు గ్రేహౌండ్స్‌, ఆక్టోపస్‌ బృందాలు, లా అండ్‌ ఆర్డర్‌, ట్రాఫిక్‌, ఎస్‌బీ, టాస్క్‌ఫోర్స్‌, సిటీ సెక్యూరిటీ వింగ్‌, సిటీ ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ పోలీసులు, ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీంలు, డాగ్‌ స్క్వాడ్‌, బాంబు, మెటల్‌ డిటెక్టర్లు బందోబస్తులో వినియోగించనున్నారు. సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో గణేష్‌ నిమజ్జనానికి భారీ భద్రతతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు సీపీ స్టీఫెన్‌ రవీంద్ర వెల్లడించారు. సున్నితమైన ప్రాంతాల్లో, సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయలేని ప్రాంతాల్లో 30 మంది ప్రత్యేక లా అండ్‌ ఆర్డర్‌ సిబ్బందిని కేటాయించి వారికి బాడీవోన్‌ కెమెరాలు అందించి రంగంలోకి దింపారు. కమిషనరేట్‌ పరిధిలో 10,510 విగ్రహాలకు జియోట్యాగింగ్‌ పూర్తయిందన్నారు. రాచకొండ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో 7వేల విగ్రహాలు ఉన్నాయి. 6 వేల మంది సిబ్బంది బందోబస్తులో పాల్గొంటున్నట్లు సీపీ మహేశ్‌ భగవత్‌ వెల్లడించారు.

*సుజీవన్ వావిలాల*🖋️
ప్రజల పక్షం 

గవర్నర్ వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం....!

*గవర్నర్ వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం....!*

హైదరాబాద్: గవర్నర్ తమిళిసై  కామెంట్స్పై ఎమ్మెల్సీ కవిత  ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ వ్యాఖ్యలపై ట్విటర్లో తీవ్రంగా స్పందించారు
సీఎం కేసీఆర్ (CM KCR), తెలంగాణ సర్కార్ను అపఖ్యాతి పాలు చేయడానికి.. తెలంగాణ గవర్నర్ కార్యాలయాన్ని రాజకీయ వేదికగా మార్చారని దుయ్యబట్టారు. తప్పుడు ప్రచారంతో ప్రజల మన్నన పొందలేమని బీజేపీ గ్రహించిందని, ఆ నేపథ్యంలోనే గవర్నర్ నుంచి ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని కవిత మండిపడ్డారు.

తన మూడేళ్ల పదవీకాలంలో తెలంగాణ ప్రభుత్వంపై తమిళిసై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కాలంలో ఆమెకు జరిగిన అవమానాలను ఏకరువు పెట్టారు. ప్రోటోకాల్ ఇతర విషయాల్లో తనకు ఎలాంటి ప్రధాన్యత ఇవ్వలేదని, ఇది రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధమని తెలిపారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా తన బాధ్యతలను నిర్వర్తిస్తానని స్పష్టం చేశారు. రాజ్‌భవన్‌, ప్రగతిభవన్ మధ్య పెరుగుతున్న గ్యాప్‌పై ఒకింత అసహనానికి గురవుతున్నారు. మహిళా గవర్నర్‌గా తనను చాలా తక్కువ అంచనా వేశారని, తన పరిధి ఏంటో తెలుసని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తన మనోధైర్యాన్ని ఎవరూ దెబ్బతీయలేరని, తనకు ఎవరిపై వ్యక్తిగత ద్వేషం లేదని తమిళిసై చెప్పుకొచ్చారు.

*సుజీవన్ వావిలాల*🖋️
ప్రజల పక్షం