Thursday, September 8, 2022

నిమజ్జనం పై నిఘా

*నిమజ్జనం పై నిఘా*

హైదరాబాద్‌ : ఎటువంటి ఆటంకాలూ లేకుండా గణేశ్‌ నిమజ్జనం సాగేలా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.ఎక్కడికక్కడ నిఘా ఉంచారు. మూడు కమిషనరేట్లలో 45 వేల మంది సిబ్బంది బందోబస్తులో ఉంటారని అధికారులు చెప్పారు. గురువారం నగర సీపీ సీవీ ఆనంద్‌, అదనపు సీపీలు నిమజ్జన రూట్‌ను, బాలాపూర్‌ నుంచి హుస్సేన్‌సాగర్‌ వరకు 18కి.మీ. రూట్‌ భద్రత, బందోబస్తు చర్యలను పరిశీలించారు. కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచి పర్యవేక్షణతో పాటు నగరంలో డ్రోన్‌ కెమెరాలతోపాటు ఏరియల్‌ వ్యూ ఏర్పాట్లు చేశామని, మూడు కమిషనరేట్లలో సుమారు 30 వేలకు పైగా విగ్రహాలు ఉన్నాయని పోలీసు అధికారులు చెప్పారు. 10వ తేదీ సాయంత్రం వరకు ట్యాంక్‌బండ్‌ పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు అమలులో ఉంటాయన్నారు.

హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ కమిషనరేట్ల పరిధుల్లో 45 వేల మంది పోలీసు సిబ్బందితోపాటు గ్రేహౌండ్స్‌, ఆక్టోపస్‌ బృందాలు, లా అండ్‌ ఆర్డర్‌, ట్రాఫిక్‌, ఎస్‌బీ, టాస్క్‌ఫోర్స్‌, సిటీ సెక్యూరిటీ వింగ్‌, సిటీ ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ పోలీసులు, ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీంలు, డాగ్‌ స్క్వాడ్‌, బాంబు, మెటల్‌ డిటెక్టర్లు బందోబస్తులో వినియోగించనున్నారు. సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో గణేష్‌ నిమజ్జనానికి భారీ భద్రతతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు సీపీ స్టీఫెన్‌ రవీంద్ర వెల్లడించారు. సున్నితమైన ప్రాంతాల్లో, సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయలేని ప్రాంతాల్లో 30 మంది ప్రత్యేక లా అండ్‌ ఆర్డర్‌ సిబ్బందిని కేటాయించి వారికి బాడీవోన్‌ కెమెరాలు అందించి రంగంలోకి దింపారు. కమిషనరేట్‌ పరిధిలో 10,510 విగ్రహాలకు జియోట్యాగింగ్‌ పూర్తయిందన్నారు. రాచకొండ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో 7వేల విగ్రహాలు ఉన్నాయి. 6 వేల మంది సిబ్బంది బందోబస్తులో పాల్గొంటున్నట్లు సీపీ మహేశ్‌ భగవత్‌ వెల్లడించారు.

*సుజీవన్ వావిలాల*🖋️
ప్రజల పక్షం 

No comments:

Post a Comment