Friday, September 9, 2022

తెలంగాణలో డెంగీ డేంజర్ బెల్స్....హైదరాబాద్ లో పరిస్థితి ఆందోళనకరం

*తెలంగాణలో డెంగీ డేంజర్ బెల్స్....హైదరాబాద్ లో పరిస్థితి ఆందోళనకరం*

*దడ పుట్టిస్తున్న జ్వరాలు*

*3,602 ఒక్క ఆగస్టులోనే నమోదైన కేసులు*

*సెప్టెంబర్‌ మొదటి నాలుగు రోజుల్లోనే 599 మంది బాధితులు*

*ఈ ఏడాది మొదటి ఏడు నెలల్లో 1,950 కేసులే*
*ఈ నెల 4 వరకు మొత్తం 6,151 కేసులు రికార్డు*

*హైదరాబాద్‌ను హీటెక్కిస్తున్న డెంగీ*

*రంగారెడ్డి, మేడ్చల్, ఖమ్మం, సంగారెడ్డి జిల్లాల్లోనూ విజృంభణ*

*ప్రభుత్వానికి రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ నివేదిక*

హైదరాబాద్‌: డెంగీ విజృంభిస్తోంది. రోజురోజుకూ కేసులు గణనీయంగా పెరిగిపోతున్నాయి. ఆగస్టు నెలలో రోజుకు సగటున వందమందికి పైగా దీని బారినపడ్డారు. సెప్టెంబర్‌లో మొదటి నాలుగు రోజుల్లోనే 599 మందికి జ్వరం సోకడం వ్యాధి విజృంభణను స్పష్టం చేస్తోంది. ఈ ఏడాది జనవరి నుంచి ఈనెల నాలుగో తేదీ వరకు 6,151 కేసులు నమోదయ్యాయని ప్రభుత్వానికి వైద్య ఆరోగ్యశాఖ సమర్పించిన తాజా నివేదిక వెల్లడించింది. జనవరి నుంచి జూలై వరకు 1950 కేసులు మాత్రమే నమోదు కాగా, ఒక్క ఆగస్టులోనే ఏకంగా 3,602 కేసులు నమోదు కావడం గమనార్హం. మరోవైపు ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో నమోదవుతున్న కేసులు చాలావరకు ప్రభుత్వం దృష్టికి రావడం లేదని అధికారులు అంటున్నారు *అత్యధికంగా హైదరాబాద్‌లోనే..*
రాష్ట్రంలో ఈ ఏడాది నమోదైన కేసుల్లో అత్యధికంగా హైదరాబాద్‌లో 2,998 రికార్డు అయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 588, మేడ్చల్‌లో 411, ఖమ్మంలో 361, సంగారెడ్డి జిల్లాలో 208 నమోదయ్యాయని నివేదిక వెల్లడించింది. జూలై నుంచి మొదలైన వర్షాలు కొన్ని రోజులు మినహా ఎడతెరపి లేకుండా కురుస్తుండటంతో ఎక్కడికక్కడ నీటి నిల్వలు పేరుకుపోవడంతో దోమలు స్వైర విహారం చేస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్‌లోనైతే పరిస్థితి ఆందోళనకరంగా ఉందంటున్నారు.

*సుజీవన్ వావిలాల*🖋️
ప్రజల పక్షం 

No comments:

Post a Comment