Thursday, April 14, 2022

హిందూ రాజ్యాన్ని అంబేడ్కర్ అతి పెద్ద ప్రమాదంగా ఎందుకు భావించారు? - అభిప్రాయం

Ambedkar Jayanti: హిందూ రాజ్యాన్ని అంబేడ్కర్ అతి పెద్ద ప్రమాదంగా ఎందుకు భావించారు? - అభిప్రాయం

Courtesy by : BBC తెలుగు మీడియా 
  • డాక్టర్ సిద్ధార్థ్
  • సామాజికవేత్త, బీబీసీ కోసం

భీమ్‌రావ్ అంబేడ్కర్

భారతదేశాన్ని హిందూ రాజ్యంగా మార్చాలనే కల ఇటీవలి కాలానిదేమీ కాదు. కాకపోతే అది ఈ మద్య కాలంలో ఎక్కువ ప్రాచుర్యం పొందింది.

సంఘ్ (ఆర్ఎస్ఎస్) అనుబంధ సంఘాలు జాతీయగీతం, బీఫ్, గోరక్షణ, రామమందిరం వంటి వాటిపై చూపుతున్న దూకుడు ధోరణి దానికే ముందస్తు సంకేతాలు.

గోహత్యను నిషేధించే చట్టాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ వాదిస్తున్నారు. రిజర్వేషన్లపై పునస్సమీక్ష చేయాలనే ప్రకటన కూడా ఆయన గతంలో చేసి ఉన్నారు.

హిందూ సంస్కృతిని భారతదేశమంతటా ఆదర్శ జీవన నియమావళిగా మార్చాలనేది సంఘ్ ప్రకటిత లక్ష్యం. మహిళలకు డ్రెస్ కోడ్, లవ్ జిహాద్‌కు వ్యతిరేకంగా క్యాంపెయిన్ వంటి వాటిని వారు నడిపిస్తూనే ఉన్నారు.

నిజానికి ఇస్లామ్ ఆధారిత ప్రత్యేక దేశం, హిందూ దేశం రెండు డిమాండ్లూ కవల పిల్లల్లాగే పుట్టాయి. ఇవి రెండూ పరస్పరం మద్దతు ఇచ్చుకున్నాయి.

ఫొటో సోర్స్,THINKSTOCK

మత ఆధారిత దేశం

వాస్తవం ఏంటంటే హిందూ మెజారిటీ పాలనా భయం నీడలోనే పాకిస్తాన్ కావాలనే డిమాండ్ పుట్టి, పెరిగి పెద్దధైంది.

డాక్టర్ అంబేడ్కర్ 1940లో మత ఆధారిత పాకిస్తాన్ దేశం కోసం చేస్తున్న డిమాండ్‌ సందర్భంగా హెచ్చరిక చేస్తూ ఇలా అన్నారు - "ఒకవేళ హిందూ దేశం ఏర్పడినట్టయితే అది దేశానికి భారీ ప్రమాదం అవుతుందనడంలో అనుమానం లేదు. హిందువులు చెప్పేది ఏమైనా కావొచ్చు కానీ, హిందుత్వ అనేది స్వాతంత్ర్యం, సమానత్వం, సౌభ్రాతృత్వం అన్న భావనలకు ప్రమాదకరం. అలా చూసినపుడు ఇది ప్రజాస్వామ్యానికి ఏ మాత్రం అనుగుణమైంది కాదు. ఎట్టి పరిస్థితిలోనైనా సరే హిందూ రాజ్యం ఏర్పాటును వ్యతిరేకించాలి."

81ఏళ్ల క్రితం అంబేడ్కర్ ఏ ప్రమాదం గురించి హెచ్చరించారో, అది నేడు భారతదేశం ముంగిట్లోకి శక్తిమంతంగా వచ్చి నిలుచుంది.

రాజ్యాంగంలో మార్పేమీ జరగనప్పటికీ, లాంఛనంగా మనది ఇంకా లౌకికవాద దేశమే అయినప్పటికీ, వాస్తవిక జీవితంలో మాత్రం హిందుత్వవాద శక్తులు సమాజం, సంస్కృతులతో పాటు అధికార పీఠంపైనా బలమైన పట్టు సాధించాయి.

హిందూ రాజ్యం హిందువులకే ఎక్కువ ప్రమాదకరం'

ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే, భారత్‌ను హిందూ దేశంగా మారిపోకుండా అడ్డుకోవాలని అంబేడ్కర్ భావించారు. ఎందుకంటే హిందూ జీవన నియమావళి స్వాతంత్ర్యం, సమానత్వం, సౌభ్రాతృత్వం వంటి విలువలకు పూర్తిగా విరుద్ధమైందని ఆయన భావించేవారు.

హిందూ రాజ్యాన్ని ఆయన వ్యతిరేకించడానికి కారణం ముస్లింల పట్ల హిందువులు కలిగి ఉన్న ద్వేషానికే పరిమితం కాదు.

వాస్తవం ఏంటంటే, 'హిందూ రాజ్యం ముస్లింలకన్నా, హిందువులకే ఎక్కువ ప్రమాదకరం' అని ఆయన భావించేవారు.

ఆయన హిందూ రాజ్యం దళితులకూ, మహిళలకూ వ్యతిరేకమైందని భావించారు. కుల వ్యవస్థను నిలబెట్టి ఉంచడానికి అనివార్యమైన షరతు మహిళలు కులాంతర వివాహాలు చేసుకోకుండా వారిని అడ్డుకోవడమే అని ఆయన స్పష్టంగా చెప్పారు.

హిందుత్వ, ప్రజాస్వామ్యం

ఈ పరిస్థితిని అడ్డుకునేందుకే ఆయన హిందూ కోడ్ బిల్లును ప్రవేశపెట్టారు. హిందూ రాజ్యాన్ని ఆయన పెను ప్రమాదంగా భావించడం వెనుక కుల వ్యవస్థ నుంచి తలెత్తిన అసమానత్వం ఒక పెద్ద కారణం. అది స్వాతంత్ర్యం, సమానత్వం, సౌభ్రాతృత్వం, ప్రజాస్వామ్యం వంటి విలువకు గొడ్డలిపెట్టు అని ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ అసమానత్వం ఇలా ఉండడం వల్ల వాస్తవిక స్వాతంత్ర్యం మనుగడలో ఉండలేదు. సమానత్వం, స్వాతంత్ర్యం వంటివి లేనప్పుడు సామాజిక సౌభ్రాతృత్వాన్ని ఊహించనే లేం.

కులవాద అసమానత్వం హిందుత్వకు ప్రాణం వంటిది. ఈ అంశం ఆధారంగానే ఆయన "హిందుత్వ, ప్రజాస్వామ్యం రెండు పరస్పర విరుద్ధమైన అంశాలు" అనే నిర్ధారణకు వచ్చారు.

కులపరమైన అసమానత్వం విషయంలోనైనా, దీనిని నిలిపి ఉంచడం కోసం మహిళలు వర్ణానికీ, కులానికీ ఆవల జీవిత భాగస్వామిని ఎంచుకోకుండా వారిని నియంత్రించే విషయంలోనైనా హిందువుల్లో మౌలికమైన మార్పేమీ రాలేదు.

మొత్తంగా చూస్తే, హిందువులు దేన్నైనా వదులుకుంటారు కానీ తమ మూలాధారమైన కులాన్ని మాత్రం వదులుకోరు. దీనిని నిర్మూలించకుండా ప్రజాస్వామిక సమాజాన్ని ఊహించను కూడా ఊహించలేమని అంబేడ్కర్ ఆనాడే భావించారు.


Wednesday, April 13, 2022

అక్బరుద్దీన్ నీ నిర్దోషిగా తేల్చిన నాంపల్లి కోర్ట్......!

*అక్బరుద్దీన్ నీ నిర్దోషిగా తేల్చిన నాంపల్లి కోర్ట్......!*

హైదరాబాద్‌: మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసంగించారంటూ నమోదైన కేసులో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీని కోర్టు నిర్దోషిగా తేల్చింది.విద్వేషపూరిత ప్రసంగాలు చేసినట్లు ఆధారాలు చూపించలేదని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ మేరకు నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల న్యాయస్థానం తీర్పు వెలువరించింది. భవిష్యత్తులో వివాదాస్పద వ్యాఖ్యలు చేయొద్దని అక్బరుద్దీన్‌ను కోర్టు ఆదేశించింది. దేశ సార్వభౌమత్వం దృష్ట్యా వివాదాస్పద వ్యాఖ్యలు చేయకూడదని అక్బరుద్దీన్‌కు సూచించింది.
*అసలేం జరిగింది.....*
2012 డిసెంబర్ 8న నిజామాబాద్‌లో, అదే నెల 22న నిర్మల్‌లో విద్వేషపూరిత ప్రసంగం చేశారని అక్బరుద్దీన్‌పై కేసు నమోదైంది. దీనిపై 2013, జనవరి 2న నిర్మల్, నిజామాబాద్ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. జనవరి 8న అక్బర్‌ను అరెస్టు చేసి హైదరాబాద్ నుంచి నిర్మల్‌కు తరలించారు. జనవరి 9న అక్బర్‌ను నిర్మల్ కోర్టులో న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. కోర్టు ఆదేశాల మేరకు 40 రోజుల పాటు అక్బరుద్దీన్ జైల్లోనే ఉన్నారు. ఫిబ్రవరి 16న అక్బర్ బెయిల్‌పై విడుదలయ్యారు. అక్బరుద్దీన్‌పై నిజామాబాద్, ఉస్మానియా విశ్వవిద్యాలయం పీఎస్, దిల్లీ పీఎస్‌లలో నమోదైన కేసులను 2013 జనవరి 1న అప్పటి ప్రభుత్వం సీఐడీకి బదిలీ చేసింది. అయితే నిర్మల్ కేసును మాత్రం స్థానిక పోలీసులే దర్యాప్తు చేశారు. విచారణలో భాగంగా నిజామాబాద్ కేసులో 41 మందిని, నిర్మల్ కేసుకు సంబంధించి 33 మంది సాక్షులను పోలీసులు విచారించారు. 2016లో సీఐడీ, నిర్మల్ పోలీసులు ఛార్జ్‌షీట్లు దాఖలు చేశారు. ఛార్జ్‌షీట్‌లో ఏ-1గా అక్బరుద్దీన్, ఏ-2గా యాయా ఖాన్‌ను చేర్చారు. అక్బరుద్దీన్‌ విద్వేషపూరితంగా మాట్లాడినట్లు తెలిపే వీడియో ఫుటేజ్‌ను సీఎఫ్ఎస్ఎల్‌కు పంపించారు. సుదీర్ఘ విచారణ అనంతరం ఇవాళ నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు తుది తీర్పు వెలువరించింది.

link Media ప్రజల పక్షం🖋️ 

Tuesday, April 12, 2022

గవర్నర్ వ్యవహారశైలిపై.... CM కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

*గవర్నర్ వ్యవహారశైలిపై.... CM  కేసీఆర్  ఆసక్తికర వ్యాఖ్యలు*

హైదరాబాద్‌: తెలంగాణ గవర్నర్‌ తమిళిసై ఇటీవల చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర కేబినెట్‌లో చర్చ జరిగినట్లు తెలిసింది. ఈ అంశంపై సీఎం కేసీఆర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం.మంత్రివర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ గవర్నర్‌ అత్యుత్సాహంతో వ్యవహరిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందులు కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. చాలా అంశాల్లో తమిళిసైది వితండవాదమని.. రాష్ట్ర ప్రభుత్వంతో ఏమాత్రం సంబంధం లేనట్లుగా వ్యవహరిస్తున్నారని సీఎం వ్యాఖ్యానించినట్లు సమాచారం. మంత్రులు సైతం ఇదే రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు తెలిసింది

link Media ప్రజల పక్షం🖋️ 

జీవో 111 పరిధిలో సీయం..... సంభందికుల..... భూములు

*జీవో 111 పరిధిలో సీయం..... సంభందికుల..... భూములు*

*అందుకే రద్దు చేశారన్న మాజీ ఎంపీ కొండా....*

హైదరాబాద్‌: జీవో111 పరిధిలోని భూములను సీఎం సంబంధీకులు, ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు చెందినవారు కొనుగోలు చేయడం వల్లే..రాష్ట్ర ప్రభుత్వం ఆ జీవోను ఎత్తేసిందని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. ఇప్పటికే దాదాపు 25 వేల ఎకరాలు చేతులు మారాయని ఆయన ఆరోపించారు. 2014 తర్వాత ఈ పరిధిలో భూములు కొనుగోలు చేసిన ప్రాంతాలను గ్రీన్‌జోన్లుగా ప్రకటించాలని, అంతకుముందు నుంచి భూములున్న వారిని గ్రీన్‌జోన్‌ పరిధిలోకి తీసుకురావొద్దని అన్నారు. ఈ ప్రాంతాన్ని 'సస్టెయినబుల్‌ డెవలప్‌మెంట్‌ జోన్‌'గా మార్చాలని డిమాండ్‌ చేశారు.

జీవో 111ను ఎత్తేస్తూ రాష్ట్ర కేబినెట్‌ నిర్ణ యం నేపథ్యంలో కొండా విశ్వేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఇక్కడ సాగులో ఉన్న కూరగాయలు, వరి ఇతర పంటలకు వాడుతున్న పురుగు, కలుపు నివారణ మందులతోనే కాలుష్యం వ్యాపిస్తోందన్నారు. అందుకే అతి తక్కువ కాలుష్యాన్ని వ్యాప్తి చేసే పరిశ్రమలు పెట్టాలని తాను సూచించినట్లు గుర్తు చేశారు. హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్‌ జంట జలాశయాల్లో కాలుష్యాలు చేరకుండా ఇచ్చిన జీవో 111కు, పర్యావరణ పరిరక్షణకు పెద్దగా సంబంధం లేదని, 11కి.మీనుంచి అనేక కాలుష్యకారక పరిశ్రమలు ఉన్నాయని తెలిపారు. 1974లో అప్పటి కేంద్రం తెచ్చిన 'సెంట్రల్‌ వాటర్‌యాక్ట్‌'ను వికారాబాద్‌ దాకా అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.

link Media ప్రజల పక్షం🖋️ 

జీవో 111 క్లోజ్‌.. ప్లానేంటో చెప్పిన కేసీఆర్‌..!

జీవో 111 క్లోజ్‌.. ప్లానేంటో చెప్పిన కేసీఆర్‌..!

Courtesy by : తొలివెలుగు మీడియా website

__111 జీవోపై కేసీఆర్‌ కీలక ప్రకటన

– జీవో ఎత్తివేతకు కేబినెట్‌ ఆమోదం
– త్వరలో సీఎస్‌ నేతృత్వంలో కమిటీ
– 111 జీవో రద్దు ఎవరికి లాభం..?

జీవో 111 జీవోను ఎత్తేస్తూ తెలంగాణ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. ప్రగతిభవన్ వేదికగా కేసీఆర్‌ అధ్యక్షతన మంత్రి వర్గ సమావేశం జరిగింది. మూడు గంటల పాటు సాగిన ఈ చర్చల్లో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది కేబినెట్‌. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు కేసీఆర్‌. 111 జీవోను రద్దు చేయాలని కేబినెట్‌ నిర్ణయించినట్లు తెలిపారు. త్వరలో సీఎస్‌ నేతృత్వంలో కమిటీ వేస్తున్నట్లు స్పష్టం చేశారు కేసీఆర్‌.

జీవో 111 ఏంటి? ఎందుకొచ్చింది?

1996 నాటికి హైద‌రాబాద్ అభివృద్దిని అంచ‌నా వేసి తాగునీటి స‌మ‌స్య‌లు రాకుండా ఉండాల‌నే ఉద్దేశంతో.. జంట జలాశయాలను కాపాడటానికి 111 జీవోను తీసుకొచ్చారు. దాదాపు లక్షా 32 వేల ఎకరాల భూమి ఈ జీవో పరిధిలోని ఉంది. అదంతా 84 గ్రామాల్లో విస్తరించి ఉంది. 1908లో మోక్ష‌గుండం విశ్వేశ‌ర‌య్య హైద‌రాబాద్ కు వ‌చ్చే వ‌ర‌ద‌ల‌ను దృష్టిలో ఉంచుకొని ఉస్మాన్ సాగ‌ర్, హిమ‌య‌త్ సాగ‌ర్ ను నిర్మించారు.కేవ‌లం పైపుల‌తోనే 4 వంద‌ల ఏళ్ల చ‌రిత్ర ఉన్న న‌గ‌రానికి మంచి నీళ్లు అందించేలా ప్లాన్ చేశారు. అయితే తాగునీరు పొల్యుషన్ కాకుండా ఉండ‌టంతో పాటు.. ప‌శ్చిమ క‌నుమ‌ల నుంచి వ‌చ్చే గాలి శీతోష్ణస్థితిని మార్చేస్తుంద‌ని అన్ని న‌గ‌రాల కంటే ఇక్కడ భిన్న‌మైన వాతావార‌ణం ఉంటుంద‌ని.. ఈ ప్రాంతంలో ఎలాంటి కట్టడాలు, ఫ్యాక్టరీలు పెట్టినా పర్యావరణ హితం కాదనే సదుద్దేశంతో 111 జీవోకి ప్రాణం పోశారు.

జీవో ఎత్తేస్తే నష్టమా?

111 జీవో ఎత్తేస్తున్నట్లు కేసీఆర్‌ ప్రకటించారు. అదే జరిగితే ఈ 26 ఏళ్ల అభివృద్ధికి ఆ ప్రాంతం త‌ట్టుకోవడం కష్టమని చెబుతున్నారు నిపుణులు. 111 ఎత్తివేస్తే హైద‌రాబాద్ కి ఊపిరితిత్తుల్లాంటి జ‌లాశ‌యాల‌కు ఉరి పోసిన‌ట్లేనని అంటున్నారు. 111 ప్రకారం.. 84 గ్రామాల్లోని వ్య‌వ‌సాయ భూముల్లో ఎలాంటి భ‌వంతులు నిర్మించ‌రాదు. లే అవుట్స్ ఏర్పాటు చేయ‌కూడ‌దు. చెక్ డ్యాములు, లిఫ్ట్‌ ఇరిగేష‌న్ ప‌నులు చేప‌ట్ట‌కుండా స్థానిక సంస్థల ఆథారిటీకి ఆ బాధ్య‌త ఇచ్చారు. ఉస్మాన్ సాగ‌ర్ నుంచి ఆసీఫ్ న‌గ‌ర్ వ‌ర‌కు ఉన్న నాలాకు 100 ఫీట్ల వ‌ర‌కు నిర్మాణాలు చేప‌ట్ట‌రాద‌ని జీవోలో స్ప‌ష్టంగా ఉన్నా.... ఇప్పటికీ అతిక్ర‌మిస్తూనే వస్తున్నారు. అందుకు రాజకీయ నేతలే ప్రధాన కారణమనే విమర్శలు ఉన్నాయి. జీవో 111ను అతిక్రమించిన అక్రమ నిర్మాణాల్లో ఎందరో ప్రముఖుల నిర్మాణాలు కూడా ఉండటంతో ఆ జీవోను ఎత్తివేయిస్తామని కొందరు నేతలు హామీలిస్తూ వచ్చారు. వారిలో కేసీఆర్‌ కూడా ఒకరు. ఇప్పుడు అనుకున్నది చేస్తున్నారు.

జీవో ఎత్తివేత ఎవరికి లాభం?

ఈ జీవో రద్దు వల్ల స్థానికులకు ఎంతో ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు కేసీఆర్‌. కానీ.. అసలైన లబ్ధి అక్రమార్కులకు, రియల్‌ ఎస్టేట్‌ ముఠాకు జరుగుతుందని అంటున్నారు నిపుణులు. అయినా.. 111 జీవోని ఎత్తివేయడం అంత ఈజీ ప్రాసెస్‌ కాదని వివరిస్తున్నారు. సుప్రీం కోర్టు తీర్పు ప్ర‌కారం 111 జీవో ఏరియాలోని 84 గ్రామాల్లో గ్రామకంఠం త‌ప్ప.. మ‌రెక్క‌డా అక్ర‌మ నిర్మాణాలు చేప‌ట్ట‌రాదు. దీనిపై 2000 సంవ‌త్స‌రంలోనే సుప్రీం సివిల్ అప్పీల్ పిటిష‌న్ పై స్ప‌ష్ట‌మైన తీర్పు ఇచ్చింది. ఆ తీర్పును ఉల్లంఘించిన వారిపై 2,500 కేసులు కోర్టు ధిక్క‌ర‌ణ కింద హైకోర్టులో విచార‌ణ కొనసాగుతున్నాయి.వీటన్నింటిపై ఏరోజూ కోర్టుకు స‌మాధానం చెప్పలేదు. కానీ.. ఇప్పుడు ఎత్తివేస్తామంటే కోర్టుల్లో క‌నీసం 5 ఏళ్ల విచార‌ణ జ‌ర‌గాల్సి ఉంటుంది. మరోవైపు జీవో పరిధిలో చాలా అక్రమ నిర్మాణాలు ఉన్నాయి. వాటిలో కేసీఆర్‌ కుటుంబసభ్యులకు చెందినవి కూడా ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి. మొత్తానికి ఈ జీవో విషయంలో కేసీఆర్‌ ప్రజలను మభ్య పెట్టేందుకే ప్రయత్నిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

క‌ష్ట ప‌డ్డ వారికే.. పార్టీ టికెట్.. బండి సంజయ్

క‌ష్ట ప‌డ్డ వారికే.. పార్టీ టికెట్

Courtesy by : తొలివెలుగు మీడియా website

బీజేపీలో క‌ష్ట ప‌డ్డ‌వారికే ఫ‌లితం ద‌క్కుతోంద‌ని వ్యాఖ్యానించారు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌. ముఖ్యమంత్రులవుతామని చెప్పుకునే వారెవ‌రూ సీఎంలు కాలేర‌ని స్పష్టం చేశారు. తాను పార్టీ అధ్యక్షుడైనప్పటికీ.. తన టికెట్ పై కూడా స్పష్టత లేదని ఖరాఖండిగా చెప్పారు. పార్టీ కోసం కష్టపడిన వారికే ఎన్నికల్లో టికెట్ల ద‌క్కుతాయ‌ని తేల్చిచెప్పారు.

వ్యక్తుల కోసం పనిచేసేవారికి టికెట్లు రావన్నారు. టికెట్లు ఇప్పిస్తామని కొందరు నాయకులు వెంట‌ తిప్పుకుంటున్నారని.. అలా తిప్పుకున్న వారికి తిరిగిన వారికి ఇద్దరికీ సీట్లు రావని తేల్చి చెప్పారు. బీజేపీ జాతీయ ఆర్గనైజింగ్ సెక్రటరీ సంతోష్ కూడా ఇదే విషయం చెప్పారని పేర్కొన్నారు.

దీనికి ముందు పార్టీ కార్యాలయంలో రాష్ట్ర పదాధికారులతో సంజయ్​ సమావేశమయ్యారు. ఈనెల 14 నుంచి జోగులాంబ గద్వాల్ జిల్లాలో రెండో విడత ‘ప్రజా సంగ్రామ యాత్ర’ ప్రారంభం కానున్న నేపథ్యంలో యాత్ర ఏర్పాట్లపై చర్చించారు. ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకునేందుకు సీఎం కేసీఆర్ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.

రైతుల ముసుగులో దాడులు చేయించి యాత్రను భగ్నం చేయాలన్నదే కేసీఆర్ లక్ష్యంగా పెట్టుకున్నారని చెప్పారు. తెలంగాణ ప్రజల కోసం రాళ్ల దాడులనైనా భరించేందుకు సిద్ద‌మేన‌న్నారు. ఎన్ని దాడులు జ‌రిగినా బీజేపీ కార్య‌క‌ర్త‌లు ఎదురు దాడుల‌కు పాల్ప‌డొద్ద‌ని పిలుపునిచ్చారు. కేసీఆర్ ఎన్ని కుట్రలు చేసినా.. అక్రమ కేసులతో భయపెట్టాలని చూసినా బెదిరేది లేదని స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజా సంగ్రామ యాత్రను కొనసాగించి తీరుతామని పునరుద్ఘాటించారు బండి సంజ‌య్.

GHMC కౌన్సిల్ భేటీ.... పొడియం వద్ద తెరాస... భాజపా... డీ

*GHMC   కౌన్సిల్ భేటీ.... పొడియం వద్ద  తెరాస... భాజపా... డీ*

హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ బడ్జెట్‌ ప్రవేశపెట్టే సందర్భంగా మేయర్‌ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన కౌన్సిల్‌ భేటీ అయింది. ఈ సమావేశం వాడీవేడిగా జరిగింది.ప్రజా సమస్యలను కార్పొరేటర్లు ఏకరువు పెట్టారు. ఈ క్రమంలో తెరాస, భాజపా కార్పొరేటర్ల మధ్య వాగ్వాదం జరిగింది. తెరాస కార్పొరేటర్లు మాట్లాడుతూ భాజపా వాళ్లకు వరికి గోధుమలకు తేడా తెలియదని ఆరోపించారు. ఈ క్రమంలో తెరాస కార్పొరేటర్‌ కవిత చేసిన వ్యాఖ్యలపై భాజపా కార్పొరేటర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అభివృద్ధిపై చర్చించకుండా పక్కదారి పట్టస్తున్నారంటూ పోడియం వద్దకు నిరసన తెలిపారు. దీంతో అక్కడ ఒకింత ఉద్రిక్తత తలెత్తింది. భాజపా కార్పొరేటర్ల ఆందోళన నేపథ్యంలో తెరాస కార్పొరేటర్‌ చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తామని మేయర్‌ తెలిపారు.అంతకుముందు ఎంఐఎం కార్పొరేటర్‌, మాజీ మేయర్‌ మాజిద్‌ హుస్సేన్‌ మాట్లాడుతూ నగరంలో ఎక్కడ చూసినా చెత్త పేరుకుపోయిందని కౌన్సిల్ దృష్టికి తీసుకొచ్చారు. పన్నులు కట్టే వారికి జరిమానాలు విధిస్తున్నారన్నారని.. చెల్లించని వారి జోలికి అధికారులు వెళ్లడం లేదన్నారు. దీనిపై చర్యలు చేపడతామని మేయర్‌ ఆయనకు తెలిపారు.

తొలుత మేయర్‌ గద్వాల విజయలక్ష్మి జీహెచ్‌ఎంసీ వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టి ఆమోదించాల్సిందిగా సభను కోరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అభివృద్ధి, సౌకర్యాల కల్పనలో హైదరాబాద్‌ పురోగతి సాధిస్తోందని చెప్పారు. 2022-23 ఏడాదికి సంబంధించి రూ.6,150 కోట్లతో జీహెచ్‌ఎంసీ వార్షిక బడ్జెట్‌ ఆమె ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు. రోడ్ల అభివృద్ధి స్కైవేలు, పై వంతెనలు కోసం రూ.1,500కోట్లు కేటాయించినట్లు వివరించారు. ఎస్ఎన్డీపీలో భాగంగా చేపడుతున్న పనులకు రూ.340 కోట్లు, ఇతర నాలా పనుల నిర్వహణకు రూ.200కోట్లు, ఈ ఏడాది వరద నివారణ కోసం రూ.340 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. నగరంలో పచ్చదనం పెంపునకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు వివరించారు. గ్రీనరీ పెంపునకు రూ.332.23 కోట్లతో గ్రీన్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టినట్లు మేయర్‌ తెలిపారు.

link Media ప్రజల పక్షం🖋️