Friday, April 8, 2022

ప్రభుత్వం, గవర్నర్‌ పంచాయితీపై స్పందించిన రేవంత్‌..!

ప్రభుత్వం, గవర్నర్‌ పంచాయితీపై స్పందించిన రేవంత్‌..!

Courtesy by : తొలివెలుగు మీడియా website

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, గవర్నర్‌ మధ్య జరుగుతున్న పంచాయితీపై టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేవారు. గాంధీభవన్‌ లో మీడియాతో చిట్‌ చాట్‌ నిర్వహించారు. చేసిన తప్పులు కప్పిపుచ్చుకునేందుకే గవర్నర్‌ పై ప్రభుత్వం నిందలు వేస్తోందన్నారు. ప్రభుత్వం, గవర్నర్‌ సఖ్యతతో పనిచేయాలని చెప్పారు. గవర్నర్‌ ఢిల్లీ పర్యటనలో కీలకమైన అంశాలు బయటకు వచ్చాయని తెలిపారు.

విద్యా వైద్య రంగాలను కేసీఆర్‌ నిర్వీర్యం చేస్తున్నారని తాము చెప్పిందే గవర్నర్‌ మీడియాకు వివరించారన్నారు రేవంత్‌. సెక్షన్‌ 8 పరిధిలో ఉన్న ఏ అంశమైనా గవర్నర్‌ ఫైనల్‌ చేయొచ్చన్న ఆయన.. గ్రేటర్‌ పరిధిలో ఏదైనా సమీక్ష చేసే అధికారం గవర్నర్‌ కు ఉంటుందని స్పష్టం చేశారు. విద్య, వైద్యం, డ్రగ్స్‌ పై గవర్నర్‌ సమీక్ష చేయొచ్చన్నారు. తనకున్న అధికారాలు ఉపయోగించి గవర్నర్‌ అన్నింటినీ సరిదిద్దాలని కోరారు.
ప్రోటోకాల్‌ పాటించని అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలన్నారు రేవంత్‌. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఏ పార్టీ అని ఆయనకు టీఆర్ఎస్ ఓటేసిందని ప్రశ్నించారు. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఏ పార్టీ అని ఆయనకు ఓటేశారో చెప్పాలన్నారు. కానీ.. గవర్నర్ విషయంలో టీఆర్ఎస్ కు ఎందుకు ఈ అనుమానాలు వచ్చాయో చెప్పాలని.. రాజ్‌ భవన్‌ లో ఉగాది వేడుకలకు కిషన్‌ రెడ్డి, బండి సంజయ్‌ ఎందుకు రాలేదని ప్రశ్నించారు. కేసీఆర్‌ కు కోపం వస్తుందనే వారు హాజరు కాలేదని చెప్పారు.

ఇల్లు కూల్చేసిన GHMC అధికారులు.. దయనీయంగా మహిళా క్రికెటర్ పరిస్థితి

ఇల్లు కూల్చేసిన GHMC అధికారులు.. దయనీయంగా మహిళా క్రికెటర్ పరిస్థితి

Courtesy by : dishadaily Media Twitter 

దిశ, వెబ్‌డెస్క్: క్రికెటర్ భోగి శ్రావణి ఇంటిని కూల్చివేసిన జీహెచ్ఎంసీ అధికారులు సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తుకారాంగేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో భోగి శ్రావణి వాళ్ళ తండ్రి బి.మల్లేశ్‌తో కలిసి నివసిస్తున్నారు. ఆమె ఉంటున్న పురాతన ఇల్లు ఏ క్షణంలో అయినే కూలిపోయే ప్రమాదం ఉందని ముందుగా నోటీసులు జారీ చేసి, బుధవారం సాయంత్రం 5 గంటల సమయంలో GHMC అధికారులు కూల్చి వేశారు. ఈ విషయమై భోగి శ్రావణి తుకారాం గేట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కాగా, శ్రావణి తండ్రి మల్లేష్ ప్లంబర్ పని చేస్తుండగా, ఇల్లు కూల్చివేయడంతో పక్కనే ఉన్న కమ్యూనిటీ హాల్‌కు షిఫ్ట్ అయ్యారు. గత 35 ఏళ్లుగా అక్కడే నివాసం ఉంటున్నట్లు శ్రావణి తెలిపింది. మా ఇంటి వెనుక గోడ కూలిపోయేలా ఉందంటూ కొన్ని రోజుల క్రితం మాకు జీహెచ్ఎంసీ నుంచి నోటీసు వచ్చింది. మేం దానిని ఫిక్స్ చేశాం. అయితే, ఆ గోడను చెక్ చేయడానికి జీహెచ్ఎంసీ అధికారులు రాకపోగా, ఒక్కసారిగా ఇంటిపై వచ్చి, వస్తువులను బయట పడేసి చూస్తుండగానే ఇంటిని కూల్చేశారని శ్రావణి ఆవేదన వ్యక్తం చేసింది. కాగా, ఈనెల 15 నుంచి పుదుచ్చేరి జరిగే మహిళల టీ-20 టోర్నమెంట్‌లో తాను పాల్గొనాల్సి ఉందని, అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో తాను క్రికెట్ ఆడాలా? లేక తన ఇంటి కోసం పోరాడాలో తెలియట్లేదని శ్రావణి బాధ పడితుంది.

https://www.dishadaily.com/telugunews/ghmc-officials-demolish-a-woman-cricketer-house-122453

Wednesday, April 6, 2022

పోలీసుల పై రెచ్చిపోయిన మరో ఎంఐఎం కార్పొరేటర్

*పోలీసుల పై రెచ్చిపోయిన మరో ఎంఐఎం కార్పొరేటర్*

హైదరాబాద్ బోలక్‌పూర్‌లో కార్పొరేటర్‌ గౌసుద్దీన్ ఘటన మరువక ముందే..మరో MIM కార్పొరేటర్ పోలీసులపై రెచ్చిపోయారు. పాతబస్తీలోని యునాని హాస్పిటల్ ముందు అర్ధరాత్రి హంగామా సృష్టించారు.యునాని హాస్పిటల్‌ ముందు కొందరు వ్యక్తులు వెహికిల్స్ పార్క్ చేశారు. ఇబ్బందిగా మారడంతో పలువురు స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. వెహికిల్స్ తొలగించేందుకు అక్కడకు వచ్చిన పోలీసులతో MIM కార్పొరేటర్ సయ్యద్ సొహైల్ ఖాద్రి వాగ్వాదానికి దిగారు. ఎన్నో ఏళ్లుగా ఇలాగే పార్కింగ్ చేస్తున్నామంటూ ఆయన గొడవకు దిగారు. అంతేకాకుండా పోలీసులకి ఫిర్యాదు చేసిన యునాని హాస్పిటల్‌ సిబ్బంది పై కూడా సయ్యద్ మండిపడ్డారు.

link Media ప్రజల పక్షం🖋️

పోలీసుల వద్దకు సహాయం కోసం వచ్చే ప్రతి వ్యక్తినీ కూడా "సార్" అనే పిలవాలి

https://twitter.com/MuluguSP/status/1511279193199636481?t=8I8dyFnfFjrZegRR5GUQkQ&s=08...  *పోలీసుల వద్దకు సహాయం కోసం వచ్చే ప్రతి వ్యక్తినీ కూడా "సార్" అనే పిలవాలి,వారు కట్టే పన్నుల ద్వారా మాత్రమే మన నెలసరి జీతం ముడిపడి ఉంటుంది కావున  మన దగ్గరికి వచ్చే ప్రతి వ్యక్తిని మన యాజమానుల లాగానే గురించాలి*
*రాష్ట్ర పోలీస్ డీజీపీ మహేందర్ రెడ్డి గారు*
@TelanganaDGP 
@TelanganaCOPs https://t.co/y6TzfIR5Ot        -----------------------------------------  *@MuluguSP సర్ 🙏*

*సర్ డీజీపీ సారు గారు ఈ విశ్లేషణ ఇచ్చి రెండు సంవత్సరాలు అయింది... కానీ పోలీస్ వ్యవస్థ లో మార్పు  రాలేదు.... రాదు కూడా*

*ఒక కేసుకు సంబందించి నేనే ప్రత్యక్ష సాక్షిని. నన్ను విచారణ కోసం పిలిచి ఒక CI & SI మాటల్లో చెప్పలేని భూతులు తిట్టారు ....సిగ్గుశరం లేని ఆ పోలీస్ అధికారులు....న్యాయస్థానంలో పోరాటం చేస్తున్నాను. వారిని జైలుకు పంపించే వరకు పోరాటం చేస్తాను 👍...Bplkm🪶*

*నాకు తెలిసి 5% మాత్రమే పోలీస్ అధికారులు (IPS స్థాయి నుంచి కానిస్టేబుల్ వరకు)ప్రజాప్రయోజనాలకోసం  పని చేస్తున్నారు. ఇది నిజం... సోషల్ మీడియా లేకపోతే తెలంగాణ పోలీస్ రజాకార్లను తలపించేవారు ఈ తెరాస ప్రభుత్వంలో.... Bplkm🪶** https://t.co/ZJfWYzl7XM

Tuesday, April 5, 2022

హలాల్, హిజాబ్ అంశాలపై కాక ఇన్ ఫ్రా, ఐటీలపై దృష్టిపెడదాం...కర్నాటక పీసీసీ చీఫ్ డీకే, మంత్రి కేటీఆర్ ట్వీట్ల చర్చ

హలాల్, హిజాబ్ అంశాలపై కాక ఇన్ ఫ్రా, ఐటీలపై దృష్టిపెడదాం, మన నగరాల అభివృద్ధికోసం పోటీపడదాం – కర్నాటక పీసీసీ చీఫ్ డీకే, మంత్రి కేటీఆర్ ట్వీట్ల చర్చ

ట్విట్టర్ వేదిగ్గా సవాళ్లు చేసుకున్నారు తెలంగాణ మంత్రి కేటీఆర్, కర్నాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్. ఈసందర్భంగా హైదరాబాద్, బెంగళూరు అభివృద్ధిపై వారిద్దరి మధ్య ఆసక్తికర చర్చ సాగిందనే చెప్పవచ్చు.
కర్నాటకలో అధికార బీజేపీని నిందిస్తూ…”హెచ్‌ఎస్‌ఆర్, కోరమంగళ ఈ ప్రాంతాలు భారతదేశంలో సిలికాన్ వ్యాలీలుగా ప్రాచుర్యం పొందుతున్నాయి. ఇక్కడ స్టార్టప్‌లు ఇప్పటికే బిలియన్ల డాలర్ల పన్నులను సృష్టిస్తున్నాయి. కానీ రోడ్లు చూస్తే ఇంకా అధ్వానస్థితిలో ఉన్నాయి. విద్యుత్ కోతలు, నాణ్యత లేని నీటి సరఫరా, ఉపయోగించలేని ఫుట్ పాత్‌లు ఎన్నోనగరంలో కనిపిస్తాయి. మన ఈ సిలికాన్ వ్యాలీకంటే మెరుగ్గా భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాలున్నాయి. ” అని ఎద్దేవా చేశారు ఒక నెటిజెన్.
అయితే ట్వీట్ కు స్పందిస్తూ..”మీ బ్యాగ్‌లు సర్దుకుని హైదరాబాద్‌కి వచ్చేయండి. మా దగ్గర మెరుగైన మౌలిక సదుపాయాలు ఉన్నాయి. మా విమానాశ్రయం అత్యుత్తమమైనది.. నగరంలోకి వెళ్లడం, అలాగే నగరం బయట కూడా చాలా అందంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా ఆవిష్కరణ, మౌలిక సదుపాయాలు & సమ్మిళిత వృద్ధి పై మా ప్రభుత్వ దృష్టి ఉంది” అని కేటీఆర్ ట్వీట్ చేశారు.
దానికి స్పందించిన డీకే శివకుమార్… ” నిజమే మిత్రమా కానీ… 2023 చివరి నాటికి.. కర్నాటకలో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి రావడంతో, భారతదేశపు అత్యుత్తమ నగరంగా బెంగళూరు కీర్తిని పునరుద్ధరిస్తాం.” అని ట్వీట్ చేశారు.

దీనికి కేటీఆర్ బదులిస్తూ… “శివకుమార్ అన్నా, నాకు కర్ణాటక రాజకీయాల గురించి పెద్దగా తెలియదు, ఎవరు గెలుస్తారో అనేది నాకు తెలియదు.. కానీ సవాలు అంగీకరిస్తున్నా. మన యువతకు ఉద్యోగాలు కల్పించడంలో, హైదరాబాద్ , బెంగళూరు నగరాల అభివృద్ధికోసం ఆరోగ్యకరంగా పోటీపడదాం. హలాల్, హిజాబ్‌ అంశాలపై కాకుండా ఇన్‌ఫ్రా, IT&BT పై దృష్టి పెడదాం.” అని అన్నారు.
అయితే తెలంగాణలో కాంగ్రెస్ ను ప్రత్యర్థిగా భావిస్తూనే…పక్క రాష్ట్రంలోని పీసీసీ చీఫ్ తో కలిసి పనిచేద్దామని కేటీఆర్ అనడమేంటంటున్నారు నెటిజన్లు. కానీ వాళ్ల ఉమ్మడి విధానం హిందూ వ్యతిరేకతేనని స్పష్టమవుతోందని అభిప్రాయపడుతున్నారు.

https://twitter.com/KTRTRS/status/1510830605667168260?t=pa76W86On0DedLDF64fGgA&s=19

సమాజానికి చీడ పురుగులుగా మారకండి....!!

సూర్యాపేట జిల్లా కొదాడలో పిల్లలు గంజాయికి బలి అవుతున్న పట్టించుకోని ప్రభుత్వం.పోలీసు అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నది #బాలలహక్కులసంఘం, దయచేసి ఆ ముఠాను పెట్టుకోండి,చిన్నారులకు రక్షణ కల్పించండి.
@CollectorSRPT @spsuryapet @TelanganaCOPs @Praja_Snklpm @TSEduDept @RamMohanINC @KTRTRS https://t.co/Gt0VDKq4to

మీ పిల్లలను పబ్లిక్ లో  సమర్దించు కోవడంలో తప్పు లేదు,వారికి కనీసం ఇంట్లో అయినా బుద్ధి చెప్పండి.సెలెబ్రిటీ పిల్లలు మీ తల్లిదండ్రులు ఈ సెలెబ్రిటీ హోదా పొందడానికి జీవిత కాలం పట్టింది.
సమాజానికి చీడ పురుగులుగా మారకండి.
@Praja_Snklpm  @Aditya2607 @santoshajmeera #Balalahakkuladangham https://t.co/tyJvfpbT7r

కేంద్రంతో సమరానికి సిద్దమైన TRS....!!

*కేంద్రంతో  సమరానికి సిద్దమైన TRS......!*

హైదరాబాద్: కేంద్రం, తెలంగాణ మధ్య వరి పంట అయితే ఇప్పట్లో తెగేలాలేదు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం క్లారిటీ ఇవ్వడంతో టీఆర్ఎస్ సమరానికి సిద్ధమైంది.ధాన్యం కొనుగోళ్లపై కేంద్రాన్ని నిలదీసేందుకు సీఎం కేసీఆర్ మరోసారి హస్తినానే నమ్ముకున్నారు. తెలంగాణలో పండించిన ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలని గత ఏడాది నవంబర్ 18న ధర్నా చౌక్ వద్ద సీఎం కేసీఆర్ ఆందోళన చేశారు. కేంద్రం వైఖరిని నిరసిస్తూ స్వయాన ముఖ్యమంత్రే ఆందోళన చేయడం అదే మొదటిసారి. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం వైఖరి తేలే వరకు నిరసనలు కొనసాగుతాయని అప్పట్లో సీఎం అల్టిమేటం జారీ చేశారు. పార్లమెంట్ సమావేశాల్లో ధాన్యం కొనుగోళ్లపై కేంద్రమంత్రి పియూష్ గోయర్ క్లారిటీ ఇవ్వడంతో ఖంగుతిన్న గులాబీ నేతలు సమరానికి సిద్ధమయ్యారు. ఖరీఫ్, రబీ సీజన్‌లో పండించిన పంటను కేంద్రమే కొనాలని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. యాసంగిలో దాదాపు 40 లక్షల ఎకరాల్లో రైతులు వరిసాగు చేశారు. యాసంగికి వరి వేయొద్దంటూ సీఎం చెప్పినా వినకుండా రైతులు వరినే సాగు చేశారు. బాయిల్డ్ రైస్‌కు బదులు రా రైస్ మాత్రమే కొంటామని కేంద్రం చెప్పడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర ప్రభుత్వంపై ఇంకో స్టాండ్ తీసుకున్నారు.

link Media ప్రజల పక్షం🖋️