Wednesday, February 16, 2022

ప్రారంభమైన తెలంగాణ కుంభమేళా సమ్మక్క – సారలమ్మ జాతర – వనదేవతల మహాజాతరకు పోటెత్తుతున్న భక్తకోటి

ప్రారంభమైన తెలంగాణ కుంభమేళా సమ్మక్క – సారలమ్మ జాతర – వనదేవతల మహాజాతరకు పోటెత్తుతున్న భక్తకోటి

తెలంగాణ కుంభమేళాగా చెప్పే సమ్మక్క-సారలమ్మ జాతర నేడు ప్రారంభమైంది. ఈనెల 19 వరకు వనదేవతల మహా జాతర జరగనుంది. అయితే కొద్ది రోజుల ముందునుంచే ములుగు జిల్లాలోని మేడారంలో కొలువైన అమ్మలిద్దరి దర్శనం కోసం భక్తులు పోటెత్తుతున్నారు. వనదేవతల వేడుక నేపథ్యంలో మేడారం పరిసరాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. భక్తులు ఎత్తు బంగారాలతో వచ్చి అమ్మలకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. చీర, సారె, పసుపు కుంకుమలు సమర్పించుకుంటున్నారు.


తెలంగాణ మాత్రమే కాక దేశవ్యాప్తంగా జరిగే అతిపెద్ద గిరిజన జాతర మేడారం జాతర. ప్రతి రెండేళ్లకోసారి జాతర జరుగుతుందది. కుంభమేళ తరహాలో లక్షలాదిగా భక్తులు తరలివస్తారు. ఓరుగల్లు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతం తాడ్వాయ్ మండలంలో జరిగే ఈ జాతరకు వందల ఏళ్ల చరిత్ర ఉంది. మొదట్లో గిరిజనులు మాత్రమే జాతరలో పాలు పంచుకునేవారు. రాన్రాను అన్ని అందరూ అమ్మలకు భక్తులైపోయారు. ఇక ఈ ఏడాది తొలిరోజు నుంచి ఇప్పటి వరకు 50 లక్షల మందికి పైగా భక్తులను మేడారం దర్శించుకున్నారు. దర్శనానికి ముందు జంపన్నవాగులో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి గద్దెలపై కొలువైన అమ్మలకు మొక్కులు చెల్లిస్తున్నారు. ఇక ఈ జాతర జరిగే ముఖ్య దినాల కోసం అమ్మవార్లను అడవి మార్గాన తీసుకొచ్చే సందర్భంగా ఉద్వేగభరిత క్షణాలు అక్కడ కనిపిస్తాయి.
మేడారం జాతర వేళ ములుగు సమీపంలోని గట్టమ్మ ఆలయం కూడా భక్తులతో కిటకిటలాడుతోంది. సమ్మక్క-సారలమ్మల దర్శనం కోసం వచ్చే భక్తులంతా తొలుత ఇక్కడే ఆగి గట్టమ్మ తల్లిని దర్శించుకొని పూజలు చేస్తారు. ఇక్కడ పూజలు చేసిన తర్వాతే మేడారం జాతరకు వెళ్లడం ఆనవాయితీగా వస్తోంది. అందుకే గట్టమ్మ ఆలయాన్ని గేట్ వే ఆఫ్ మేడారంగా పిలుస్తారు. మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతరకు మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్ల గ్రామంలోని పగిడిద్ద రాజును గిరిజన సంప్రదాయంలో ముందు మేడారానికి చేరుస్తారు. తరువాత అమ్మలిద్దర్నీ గద్దెలకు చేరుస్తారు.
నాలుగు రోజుల జాతర సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాటు చేసింది. రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ బేగంపేటలోని పాత ఎయిర్‌పోర్ట్‌లో హెలికాఫ్టర్ సర్వీసును ప్రారంభించారు.

(మైఇండ్ మీడియా ఫేస్‌బుక్, ట్విటర్‌, ఇన్‌స్టాగ్రామ్‌ను ఫాలో అవ్వండి. యూట్యూబ్‌ చానల్ ను సబ్‌స్క్రైబ్ చేయండి.)

చెరువుల పరిరక్షణ కోసం NGO's తో ప్రత్యేక కమిటీ వేయాలి కేటీఆర్ సారు

https://youtu.be/SWjG0ORtp7Q... **మొదటగా ఈటీవీ మీడియా తెలంగాణ వారికి ధన్యవాదములు మంచి విశ్లేషణ ఇచ్చినందుకు 🙏*  

*తెలంగాణ డైనమిక్ మంత్రివర్యులు @KTRTRS సారు గారు మీరు చెరువులను పరిరక్షించి భూగర్భ జలాలను అభివృద్ధిచెందేలా మరీ ముఖ్యంగా భవిష్యత్ తరాలకు ప్రయోజనంగా ఉండేలా ప్రజాప్రయోజనాలగురించి ప్రజలకు జవాబుదారీతనంగా పనిచేయాలనుకుంటే Dr లుబ్నా సర్వత్ మేడం గారిని మరియు చెరువుల పరిరక్షణ కోసం నిస్వార్థంగా ఉద్యమం చేస్తున్న స్వచ్చందసంస్థలతో కమిటీ ఏర్పాటు చేయండి. ఈ కమిటీ ఇచ్చే సూచనలు సలహాలు మీ అధికారులు కూడా ఇవ్వకపోవచ్చు ఇది వాస్తవం. సర్ ఈరోజు త్రాగునీరు కొనే పరిస్థితికి వచ్చామంటే ప్రభుత్వాల వైఫల్యమే. వేల కోట్లు పెట్టి వందల కిలోమీటర్ల దూరం నుండి పైపులైనుల ద్వారా నీటిని జంటనగరాలకు సరఫరా చేయడం అభివృద్ధి కాదు సర్. భూగర్భ జలాలను పెరగకుండా చేసిన ఘనత ప్రభుత్వాలాదే ఎందుకంటే చెరువులు కబ్జాలకు గురిఅవుతున్నాయి స్వచ్చంద సంస్థలు ఎన్ని సార్లు మీ ద్రుష్టికి & సంబంధిత అధికారుల దృష్టికి & ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకొచ్చినా ఫిర్యాదు చేసినా ఈరోజు వరకు స్పందించలేదు సర్ అందుకే గౌరవ న్యాయస్థానాలను ఆశ్రాయించాము. ఇప్పటికయినా మేలుకోండి సర్ 🙏*

*Note : మీడియా యాజమాన్యాలకు విజ్ఞప్తి చేస్తున్నాము మా ఈ పోరాటానికి మీరు కూడా బాధ్యతతో మాకు సహకరించి అధికారులు దృష్టికి తీసుకెళ్లి చెరువులను కబ్జాదారులనుంచి కాపాడి భవిష్యత్ తరాలవారికి మార్గదర్షులుగా అవుదాము 🙏.... Bplkm*
*Copy to Group link Media*
16/02/2022

Bapatla Krishnamohan 
prajasankalpam1@gmail.com
@Praja_Snklpm (Twitter)
https://youtube.com/channel/UCO3m8P1ULX6soj73A43nhMg   (youTube)
https://prajasankalpam1.blogspot.com/

తెలంగాణ కోసం ఏం అడిగినా ప్రధాని మోదీ పట్టించుకోవడం లేదు.... కేటీఆర్

*తెలంగాణ కోసం ఏ అడిగినా ప్రధాని మోదీ పట్టించుకోవడం లేదు*

నిజామాబాద్‌: తెలంగాణ కోసం ఏం అడిగినా ప్రధాని మోదీ పట్టించుకోవడం లేదని మంత్రి కేటీఆర్‌ మండిపడ్డారు.వర్ని మండలంలో సిద్ధాపూర్ రిజర్వాయర్ పనులకు మంత్రులు కేటీఆర్, ప్రశాంత్ రెడ్డి, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. కాళేశ్వరం, పాలమూరుకు కేంద్రం జాతీయ హోదా ఇవ్వలేదని మండిపడ్డారు.కుల,మతాలకు అతీతంగా టీఆర్‌ఎస్‌ అభివృద్ధి చేస్తోంది. కానీ కొందరు మతాల మధ్య చిచ్చు పెడుతున్నారు. విషం నింపడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. తెలంగాణకు కేంద్రం ఏం చేశారో చెప్పే దమ్ముందా.. నేను సవాల్ చేస్తున్నా ఇలా అడిగితే ఇష్ట మొచ్చినట్లు మాట్లాడుతున్నారు. పక్కనే కర్ణాటకకు జాతీయ ప్రాజెక్టు ఇచ్చిన మోదీ.. తెలంగాణలో కాళేశ్వరం, పాలమూరుకు అడిగితే ఇవ్వలేదు. గిరిజన రిజర్వేషన్లు పెంచమంటే నాలుగేళ్లయినా దున్నపోతు మీద వాన పడ్డ చందంగా ఉంది. ఏం అడిగినా ప్రధాని మోదీ పట్టించుకోవడం లేదు. ఉత్తరప్రదేశ్, ఉత్తర భారతానికి మాత్రమే మోదీ ప్రధాని అనుకుంటా'' అంటూ మంత్రి కేటీఆర్‌ దుయ్యబట్టారు.

ఉత్తరప్రదేశ్, ఉత్తర భారతానికి మాత్రమే మోదీ ప్రధాని అనుకుంటా. డబ్బుల రాళ్లేసి ఊపుడు తప్ప ఏం చెయ్యడం లేదు. గిరిజనులకు, రైతులకు, దళితులకు కేటాయింపు లు లేవు. దేశం కోసం ధర్మం కోసం అంటారు తప్ప దేశానికి ఏం చేస్తారో చెప్పరు. ఎల్‌ఐసీకి రైతు బీమా అవకాశం మనం ఇస్తే.. మోదీ మాత్రం ప్రైవేట్ పరం చెయ్యాలని చూస్తున్నారు. మరోసారి అవకాశం ఇస్తే తెలంగాణ, ఆంధ్రను కలుపుతారంటూ'' కేటీఆర్‌ వ్యాఖ్యానించారు.

link Media ప్రజల పక్షం🖋️ 

Tuesday, February 15, 2022

క్రమబద్దీకరణ చేస్తాము అని చెప్పిన కేసీఆర్ సారు / కేటీఆర్ సారు మాట తప్పారు.

*మేడ్చల్ జిల్లా మేడ్చల్ పార్లమెంట్ నియోజకవర్గం / ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గం రామంతాపూర్ బాలకృష్ణ నగర్(కేసీఆర్ నగర్) & సత్యనగర్ & కేటీఆర్ నగర్ ప్రజలకు 2014 ఎన్నికల నుండి ఆశపెట్టి భూములను క్రమబద్దీకరణ చేస్తాము అని చెప్పిన కేసీఆర్ సారు / కేటీఆర్ సారు మాట తప్పారు. డీ నోటిఫికేషన్ పేరుతో మళ్ళీ ఎన్నికలప్పుడు ఓట్ల కోసం కొత్త సినిమా షురూ చేస్తారు... ప్రజలు ప్రశ్నించేతత్వన్ని అలవాటు చేసుకునే వరకు మోస పోతూనే వుంటారు. అందుకే ఎవరైతే క్రమబద్దీకరణ కోసం పోరాటం చేస్తున్నారో వారు అందరు @ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేసి @TelanganaCMO / @KTRTRS సార్లను నిద్దురపోకుండా ప్రతిరోజూ ట్విట్టర్ ద్వారా ఉద్యమం చేయండి లేకపోతే మీ సమస్య పరిష్కారం కాదు.... Bplkm*  *Copy to Group link Media*  *Note : దయచేసి మళ్ళీ ఎప్పుడు పాలభిషేకాలు చేయకండి. అవే పాలు అనాధఆశ్రయం లోని పిల్లలకు అందేలా చేయండి 🙏*  16/02/2022 prajasankalpam1.blogsot.com

'కులం' అనే పదంతో ఒక కవి రాసిన 'పదకేళి'.!!

*'కులం' అనే పదంతో ఒక కవి  రాసిన 'పదకేళి'..* 

బాల్యంలో బాలకులం
యవ్వనంలో యువకులం
వృద్ధాప్యంలో పండుటాకులం
రాలిపోయే ఎండుటాకులం..!

         ఎవరూ లేకుంటే ఏకాకులం
         ప్రేమలో ఉంటే ప్రేమికులం
         పెళ్ళైతే సంసారికులం
         కాకుంటే బ్రహ్మచారికులం

రక్షిస్తే రక్షకులం
భక్షిస్తే భక్షకులం 
దేశ సైనికులం
సమాజ సేవకులం

      ప్రయాణిస్తే ప్రయాణికులం
      నిత్య వాహన చోదకులం
      యాత్రలు చేస్తే యాత్రికులం
      మాయలు చేస్తే మాంత్రికులం

ఉపన్యసిస్తే ఉపన్యాసకులం
హాస్యం పండిస్తే విధూషకులం
పాడితే గాయకులం
సభలో ఉంటే సభికులం
సినిమా హాల్లొ ప్రేక్షకులం
టీవీ ల ముందు వీక్షకులం

      చదివింది గురుకులం 
      అభ్యసిస్తే అభ్యాసకులం 
      బోధిస్తే బోధకులం
      వృత్తిరీత్యా అధ్యాపకులం
      పత్రికల పాఠకులం
      నేర్పించే శిక్షకులం

కొందరితో ఉంటే సామాజీకులం
అందరితో ఉంటే అనేకులం
ఫలానోల్ల కుటుంభీకులం
ఆ వంశ సంబంధీకులం

మేం
        ధనముంటే దనికులం 
        లేకుంటే బీదకులం
        దేవుణ్ణి నమ్మితే ఆస్తికులం
        నమ్మకుంటే నాస్తికులం
 
మేమే..
        నాగరికత నేర్పిన నాగరికులం
        జాతకాలు నమ్మే అమాయకులం
        మూఢత్వంపోని మూర్ఖులం..!

మేమే మేమే..
         సమానత్వ సాధకులం
         మతాలను గౌరవించే లౌకికులం
         ఎల్లలు లేని దేశ ప్రేమికులం..

మేమే..
          కష్టపడే కర్షకులం
          నిరంతర శ్రామికులం
          పరిశ్రమించే పారిశ్రామికులం
          కర్మాగారాల్లోని కార్మికులం
          నిజాలు చెప్తే వాస్తవికులం
          చెప్పకుంటే అపద్దీకులం

మేమవుతాం
           కొందరికి పూర్వీకులం
           మరికొందరికి సమకాలికులం
           ప్రస్తుత వర్తమానికులం
           కొందరికి స్ఫూర్తిదాయకులం 
           మరికొందరికి మార్గదర్శకులం

    మేం
          మార్పు కోరే పరివర్తకులం
          వినూత్న ఔత్సాహికులం
          కొత్త కొత్త ప్రయోగకులం 
          సరికొత్త ఆవిష్కర్తకులం
          వ్యాపారాలు చేసే వర్తకులం
          సంస్థల,సంఘాల వ్యవస్థాపకులం

మేం
         పరిపాలిస్తే పాలకులం
         పాలించబడితే ఎలీకులం
         వంచిస్తే వంఛకులం
         పంచుకుంటే భాగస్వామికులం

మొత్తానికి
           బాల్యంలో చిగురుటాకులం
           కుర్రతనంలో బాకులం
           యవ్వనంలో చాకులం
           మధ్య వయస్సులో మేకులం
           చరమాంకంలో రేకులం
           రాలిపోయే ఆకులం 

విదేశాల్లో మేము ఒకే దేశకులం
పక్క రాష్ట్రాల్లో మేము ఒకే ప్రాంతీకులం
పరబాషల వారికాడ ఒకే భాషకులం
ఒకే భాష వారికాడ ఫలానా యాసకులం
మొత్తానికి అవుతాం ఈ దేశంలో ఏదో ఒకకులం
 
నిత్యం కులం పేరుతో తిట్టుకుంటాం,
కొట్టుకుంటాం , కానీ బేధాలెన్ని ఉన్నా,
నిలబెట్టుకుంటాం మా దేశాన్ని ,
 ఎందుకంటే ........ !
      
             మేమే భరత జాతి వంశీకులం..
            
       భావి భారత రథసారథికులం...
రచయిత ఎవరో కానీ చాలా అద్భుతంగా రాసారు వారికి వారి భావుకతకు 🙏🙏🙏

ప్రముఖ సంగీత దర్శకుడు..... బప్పి లహరి కన్నుమూత!

*ప్రముఖ సంగీత దర్శకుడు..... బప్పి లహరి కన్నుమూత!*

ముంబై: ప్రముఖ గాయకుడు, బాలీవుడ్‌ సంగీత దిగ్గజం బప్పి లహిరి కన్నుమూశారు. ముంబైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తుదిశ్వాస విడిచారు.ఆయన వయసు 69 ఏళ్లు. 1952 నవంబర్‌ 27న బెంగాల్‌లో జన్మించిన బప్పి.. తెలుగులో సింహాసనం, స్టేట్‌ రౌడీ, సామ్రాట్‌, గ్యాంగ్‌ లీడర్‌, రౌడీ అల్లుడు, రౌడీ ఇన్‌స్పెక్టర్‌ చిత్రాలకు సంగీతం అందించారు. తెలుగులో చివరిగా డిస్కో రాజా చిత్రంలో పాటపాడారు. కాగా 2014లో బీజేపీ నుంచి ఎంపీగా పోటీ చేశారు.

బప్పి ఎప్పుడూ ఒంటినిండ బంగారంతో ప్రత్యేక ఆకర్షణగా కనిపించేవారు. మిథున్‌ చక్రవర్తికి డిస్కో డ్యాన్సర్‌ పాటతో లైఫ్‌ ఇచ్చిన బప్పి లహరి.. డిస్కో కింగ్‌గా గుర్తింపు పొందారు. డిస్కో పాటలతో 80,90 దశకాల్లో బాలీవుడ్‌ను ఏలారు. లెజెండరీ సింగర్‌ కిశోర్‌ కుమార్‌కు బప్పిదా బంధువు. హిందీతోపాటు తెలుగు, తమిళ్‌, కన్నడ, గుజరాతీ భాషల్లో బప్పి లహిరి సంగీతం అందించారు.

link Media ప్రజల పక్షం🖋️ 

ప్రవేశ రుసుము పెట్టడం అంటే ప్రజలను దోచుకోవడమే..... Bplkm

https://twitter.com/Praja_Snklpm/status/1493780157446131712?t=At4mj2hy47lEGc9fM5mQEQ&s=08.... *ప్రవేశ రుసుము పెట్టడం అంటే ప్రజలను దోచుకోవడమే..... Bplkm*

*జీయర్ స్వామి గారు మళ్ళీ ఒక్కసారి ఆలోచించండి.... 🙏*

Bapatla Krishnamohan 
prajasankalpam1@gmail.com
@Praja_Snklpm (Twitter)
https://t.co/WO6gsdKESY   (youTube)
https://t.co/8MYTUFaD3U

*@HHCHINNAJEEYAR* https://t.co/3RJiVepiA5