Wednesday, May 26, 2021

స‌మ్మె సైర‌న్ మోగించిన జూనియ‌ర్ డాక్ట‌ర్లు

హైదరాబాద్ : 26/05/2021

స‌మ్మె సైర‌న్ మోగించిన జూనియ‌ర్ డాక్ట‌ర్లు

తొలివెలుగు మీడియా సౌజన్యంతో (ట్విట్టర్)

తెలంగాణ‌లో జూనియ‌ర్ డాక్ట‌ర్లు, రెసిడెంట్ డాక్ట‌ర్లు స‌మ్మెబాట ప‌ట్టారు. 15రోజుల కింద ఇచ్చిన స‌మ్మె నోటీసు మేర‌కు జూడాలు స‌మ్మెలోకి వెళ్లారు. గాంధీ, ఉస్మానియా స‌హా రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆసుప‌త్రుల్లో విధులు బ‌హిష్క‌రించారు. ప్ర‌భుత్వం స్పందించకుంటే గురువారం నుండి అత్య‌వ‌స‌ర సేవ‌ల‌ను కూడా బ‌హిష్క‌రిస్తామ‌ని హెచ్చ‌రించారు.

జూడాల డిమాండ్లు ఇవే-

– పెంచిన స్టైఫండ్ ను వెంట‌నే అమ‌లు చేయాలి

– ప్ర‌భుత్వం ఇప్ప‌టికే ప్ర‌క‌టించి, పెండింగ్ లో పెట్టిన కోవిడ్ ప్రోత్స‌హకాల‌ను వెంట‌నే విడుద‌ల చేయాలి

– క‌రోనా బారిన ప‌డిన వైద్య సిబ్బందికి నిమ్స్ లో చికిత్స అందించాలి

Tuesday, May 25, 2021

తెరాస MLA లు & రెవిన్యూ అధికారుల భూ వివాదాలు

హైదరాబాద్ : 25/05/2021

https://youtu.be/jwVRlNxzJXQ..... *ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గం MLA బేతి సుభాష్ రెడ్డి గారు మీకు నిజంగా చిత్తశుద్ధి వుంటే మీ నియోజకవర్గంలో ఎంత ప్రభుత్వభూమి వుంది అన్ని డివిజన్ ల వారిగా బహిర్గతం చేయాలి అలాగే వాటిని ప్రజాప్రతినిదిగా మీరు మరియు రెవిన్యూ అధికారులు కబ్జాలకు గురికాకుండా ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలుపగలరు.గౌరవ భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి MLA గా ప్రమాణస్వీకారం చేశారు అది మరిచిపోవద్దు. మీ నియోజకవర్గంలోని ప్రతి ఓటరుకు అడిగే హక్కు వుంది అందుకే అడుగుతున్నాము మీరు సమాధానం ఇవ్వాలి.... Bplkm* prajasankalpam1.blogspot.com

Monday, May 24, 2021

క‌న్న కొడుకు అవినీతి చేసినా సహించను‘.. కేసీఆర్.. మ‌రి ఈ ఎమ్మ‌ల్యేల‌ను ఏం చేస్తారు?

హైదరాబాద్ : 24/05/2021

కేసీఆర్.. మ‌రి ఈ ఎమ్మ‌ల్యేల‌ను ఏం చేస్తారు?

తొలివెలుగు మీడియా సౌజన్యంతో (ట్విట్టర్)
కేసీఆర్.. మ‌రి ఈ ఎమ్మ‌ల్యేల‌ను ఏం చేస్తారు?

‘క‌న్న కొడుకు అవినీతి చేసినా సహించను‘ అంటూ చెప్పుకునే తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు.. క‌నీసం పార్టీ నేత‌లు చేసే అక్ర‌మాలు కూడా క‌నిపించ‌డం లేదు. వ‌రుస‌పెట్టి ఎమ్మెల్యేలు అవినీతి, అక్ర‌మాల‌కు పాల్ప‌డుతూ అడ్డంగా దొరికిపోతున్నా.. చ‌ర్య‌లు కాదు క‌దా క‌నీసం విచార‌ణకు ఆదేశించ‌డం లేదు. దీంతో అదే త‌మ అవినీతికి కేసీఆర్ ఇస్తున్న‌ గ్రీన్ సిగ్న‌ల్‌గా భావిస్తున్న టీఆర్ఎస్ ప్ర‌జాప్ర‌తినిధులు మ‌రింత రెచ్చిపోతున్నారు. ఒక‌రిని చూసి మ‌రొక‌రు పోటీప‌డి మ‌రీ అక్ర‌మాల‌కు పాల్ప‌డుతున్నారు.

తాజాగా హైద‌రాబాద్‌లో ఒకేరోజు ఇద్ద‌రు ఎమ్మెల్యేల అవినీతి చిట్టా బ‌య‌ట‌ప‌డింది. భూ వివాదం కేసులో ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డిపై కేసు నమోదైంది. జవహర్ నగర్ పీఎస్ ప‌రిధిలోని కాప్రాలో సర్వే నెంబర్ 152లో 90 ఎకరాల భూవివాదంలో తలదూర్చినట్లు ఎమ్మెల్యేపై ఆరోపణలు వచ్చాయి. ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి తమ వద్ద డబ్బులు డిమాండ్ చేశారంటూ మేకల శ్రీనివాస్ అనే వ్య‌క్తి కోర్టును ఆశ్ర‌యించాడు. ఆయ‌న స‌మ‌ర్పించిన ఆధారాల‌ను ప‌రిశీలించిన కోర్టు.. ఆయ‌న‌పై కేసు న‌మోదు చేయాల‌ని ఆదేశించింది.

ఇక న‌గ‌రానికే చెందిన కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్‌పై తాజాగా భూఆక్ర‌మ‌ణ ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. కొంప‌ల్లిలోని రంగారెడ్డి బండ అనే ప్రాంతంలో ప్ర‌భుత్వ ఆధీనంలోని క్వారీ గుంత స్థ‌లాన్ని ఆయ‌న‌ ఆక్ర‌మించుకున్న‌ట్టుగా స్థానికులు ఆరోపిస్తున్నారు. ఎన్ఎస్‌యూపై నేత ఒక‌రు అక్క‌డికి వెళ్లి అక్క‌డ జ‌రుగుతున్న తతంగాన్ని బ‌య‌ట‌పెట్టారు. ఈ భూవివాదంలో ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ జోక్యం ఉంద‌ని, చేసుకున్నార‌ని.. స్వ‌యంగా స్థానిక వీఆర్వోనే స్ప‌ష్టం చేస్తున్నారు. ఆలెక్క‌న‌ అసైన్డ్ భూముల‌ను డ‌బ్బులిచ్చి కొనుగోలు చేసిన ఈట‌లను మంత్రివ‌ర్గం నుంచి బ‌ర్త‌ర‌ఫ్ చేసిన కేసీఆర్.. భూవివాదంలో త‌ల‌దూర్చిన ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి, ప్ర‌భుత్వ భూమినే క‌బ్జా చేయ‌బోయిన ఎమ్మెల్యే వివేకాంద గౌడ్‌పై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటార‌న్న‌ది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

ఈట‌ల విష‌యంలో అలా ఫిర్యాదు చేస్తే ఇలా విచార‌ణ‌కు ఆదేశిస్తున్న ముఖ్య‌మంత్రి.. వీరి వ్య‌వ‌హారంపై ఫిర్యాదులు వ‌చ్చేదాకా ఆగుతారా.. మంత్రి మ‌ల్లారెడ్డి, ఎమ్మెల్యే ముత్తిరెడ్డిల విష‌యంలోలా చూసీచూడ‌న‌ట్టు వ‌దిలేస్తారా చూడాలి.

కలెక్టరే ఫోన్ కొనివ్వాలి.. ఛత్తీస్ గఢ్ సీఎం ఆదేశాలు…

హైదరాబాద్ : 24/05/2021

కలెక్టరే ఫోన్ కొనివ్వాలి.. ఛత్తీస్ గఢ్ సీఎం ఆదేశాలు…

తొలివెలుగు మీడియా సౌజన్యంతో (ట్విట్టర్)
కలెక్టరే ఫోన్ కొనివ్వాలి.. ఛత్తీస్ గఢ్ సీఎం ఆదేశాలు…

కలెక్టర్ చెంప దెబ్బ వ్యవహారం ఛత్తీస్ గఢ్ సీఎం వరకు వెళ్లడంతో వివాదం సద్దుమణిగింది. యువకుడ్ని కొట్టిన కలెక్టర్ ను బదిలీ చేశారు భూపేష్. అంతేకాదు బాధితుడికి కొత్త ఫోన్ కొనిపెట్టాలని కూడా ఆదేశించారు. సీఎం నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.

ఛత్తీస్ గఢ్ సూరజ్ పూర్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి అత్యవసరంగా మెడిసిన్స్ కోసం బయటకు వచ్చాడు. అయితే కలెక్టర్ రణ్ బీర్ శర్మ, పోలీసులు అతడ్ని అడ్డుకుని దురుసుగా ప్రవర్తించారు. మందులకు సంబంధించిన చీటీ చూపిస్తున్నా… ఫోన్ లాక్కొని నేలకేసి కొట్టి చెంప చెళ్లుమనిపించాడు కలెక్టర్. పోలీసులను కూడా కొట్టమని ఆదేశాలిచ్చాడు. ఇద్దరు కానిస్టేబుళ్లు లాఠీలతో చావబాదారు.

సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతో.. అది సీఎం దృష్టికి వెళ్లింది. ఇలా దురుసుగా ప్రవర్తించడం కరెక్ట్ కాదంటూ ఆయనపై చర్యలు తీసుకున్నారు. సెక్రటేరియట్‌ కు బదిలీ చేశారు. రణ్ వీర్ స్థానంలో రాయ్ పూర్ జిల్లా పంచాయతీ సీఈఓ గౌరవ్ కుమార్ ను జిల్లా కలెక్టర్ గా నియమించారు. అలాగే బాధితుడికి కలెక్టరే కొత్త ఫోన్ కొని ఇవ్వాలని ఆదేశించారు సీఎం భూపేష్.

Sunday, May 23, 2021

అన్ని నివేదికలు అందాల్సిందే.. తర్వాతే ఆనందయ్య మందు పంపిణీ: ఏపీ సర్కార్

హైదరాబాద్ : 23/05/2021

అన్ని నివేదికలు అందాల్సిందే.. తర్వాతే ఆనందయ్య మందు పంపిణీ: ఏపీ సర్కార్

asianet news తెలుగు సౌజన్యంతో (ట్విట్టర్)

కరోనా రోగులు, ప్రజలు ఆశలు పెట్టుకున్న కృష్ణపట్నం ఆనందయ్య మందు పంపిణీ మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐసీఎంఆర్, ఆయుష్ సహా నిపుణుల నివేదికలు అందే వరకు మందు పంపిణీని నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.

anandaiah ayurvedic medicine distribution updates ksp
కరోనా రోగులు, ప్రజలు ఆశలు పెట్టుకున్న కృష్ణపట్నం ఆనందయ్య మందు పంపిణీ మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐసీఎంఆర్, ఆయుష్ సహా నిపుణుల నివేదికలు అందే వరకు మందు పంపిణీని నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. నివేదికలు రాకుండా మందు పంపిణీ సాధ్యం కాదని ప్రభుత్వం చెబుతోంది. ఐసీఎంఆర్ నివేదికకు సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. 

మరోవైపు కృష్ణపట్నం ఆయుర్వేదం మందుపై నివేదిక అందాల్సి వుందన్నారు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. సాంప్రదాయంగా వాడే మందులను ప్రభుత్వం కట్టడి చేయాల్సిన అవసరం లేదన్నారు.

ఆనందయ్య మందులో నష్టం కలిగించేది ఏమీ లేవని చెబుతున్నారని అనిల్ కుమార్ తెలిపారు. సంప్రదాయ మందుకు, ఆయుర్వేద మందుకు తేడా వుంటుందని.. ఆయుర్వేద మందుగా గుర్తించాలంటే కొన్ని పద్ధతులు పాటించాల్సి వుంటుందని ఆయన పేర్కొన్నారు. 

Also Read:ఆనందయ్య మందుకు అనుమతిస్తే ఆయుర్వేద ఫార్మసీలో తయారీకి సిద్దం: చెవిరెడ్డి

కాగా, ఆనందయ్య మందును ఆయుర్వేదంగా గుర్తించే అవకాశం వుందన్నారు ఆయుష్ కమీషనర్ రాములు. మందుపై తుది అధ్యయనం జరుగుతుందన్నారు. నిబంధనల ప్రకారం క్లినికల్ ట్రయల్స్ పూర్తయితే ఆయుర్వేదంగా గుర్తించవచ్చని రాములు తెలిపారు.

మందు తయారీలో వాడుతున్న పదార్ధాలన్నీ ఆయుర్వేదంలో ఉపయోగించేవేనని.. ఇవాళ సాయంత్రానికల్లా నివేదిక ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని రాములు వెల్లడించారు. క్లినికల్ ట్రయల్స్, లైసెన్స్ వంటివి పూర్తయితే ఆయుర్వేదంగా గుర్తించవచ్చని పేర్కొన్నారు. ఆయుర్వేదంగా గుర్తింపు ఇచ్చే అంశం రాష్ట్ర పరిధిలో వుంటుందని.. కానీ కేంద్ర సాయం తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు

Saturday, May 22, 2021

ఈటల కుమారుడు నితిన్‌రెడ్డిపై భూకబ్జా ఫిర్యాదు.. విచారణకు సీఎం ఆదేశం

హైదరాబాద్ : 23/05/2021

ఈటల కుమారుడు నితిన్‌రెడ్డిపై భూకబ్జా ఫిర్యాదు.. విచారణకు సీఎం ఆదేశం

ఈటల కుమారుడు నితిన్‌రెడ్డిపై భూకబ్జా ఫిర్యాదు.. విచారణకు సీఎం ఆదేశం


హైదరాబాద్‌ : భూకబ్జా వ్యవహారాల్లో మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ కుటుంబ సభ్యులపై వరుస ఫిర్యాదులు వస్తున్నాయి. ఈటల బాగోతం మరువకముందే ఆయన కుమారుడిపైనా ఇదే తరహా ఫిర్యాదులు అందుతున్నాయి. ఈటల రాజేందర్‌ కుమారుడు నితిన్‌రెడ్డి తన భూమిని కబ్జా చేశాడని ఓ బాధితుడు సీఎం కేసీఆర్‌కు ఫిర్యాదు చేశాడు. మేడ్చల్‌ మండలం రావల్‌కోల్‌ గ్రామానికి చెందిన మహేశ్‌ అనే వ్యక్తి నితిన్‌ రెడ్డి కబ్జాలపై సీఎంకు ఫిర్యాదు అందించారు.

తన భూమిని నితిన్‌రెడ్డి చెర నుంచి రక్షించి తనకు న్యాయం చేయాలని మహేశ్‌ దరఖాస్తులో పేర్కొన్నారు. దీంతో తక్షణమే విచారణ ప్రారంభించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌కు సీఎం సూచించారు. వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని రెవెన్యూ, అవినీతి నిరోదకశాఖ, విజిలెన్స్‌ అధికారులను సీఎం ఆదేశించారు.

తెలంగాణలో కరోనా కట్టడి: కేసీఆర్ అసహనం, పోలీసుల ఓవర్ యాక్షన్

హైదరాబాద్ : 22/05/2021
https://twitter.com/Praja_Snklpm/status/1396088035754659842?s=1005 
తెలంగాణలో కరోనా కట్టడి: కేసీఆర్ అసహనం, పోలీసుల ఓవర్ యాక్షన్
By Asianet News Telugu (Twitter)

నిన్న కేసీఆర్ తెలంగాణాలో లాక్ డౌన్ అమలవుతున్న తీరు గురించి అసహనం వ్యక్తం చేసారు. మరింత కఠినంగా లాక్ డౌన్ అమలు చేయాలనీ ఆదేశాలను జారీచేశారు. దీనితో పోలీసులు అత్యుఉత్సాహం ప్రదర్శిస్తూ ప్రభుత్వం జీవోలో అనుమతిచ్చిన కార్యక్రమాలకు కూడా అడ్డుపడుతున్నారు. 

In the Name Of Strict Lockdown Implementation, Police create trouble for COVID Relief Work in Telangana
తెలంగాణలో లాక్ డౌన్ ని గత కొన్ని రోజులుగా అమలు చేస్తున్నప్పటికీ... కేసులు మాత్రం తగ్గడం లేదు. అధికారిక లెక్కలు అదే 3,500 నుండి 4,000 మధ్య కేసులను చూబెడుతున్నప్పటికీ... వాస్తవిక పరిస్థితులు ఏమిటనేది అందరికి తెలుసు. మన చుట్టుపక్కల ఎంతమంది రోజు వారీగా కరోనా బారిన పడుతున్నారు అని నోటి లెక్కలు కట్టినా అవి ప్రభుత్వ లెక్కల కన్నా ఎక్కువగానే తేలుతాయి. 

కేసుల నిజనిర్ధారణను కొద్దీ సేపు పక్కనుంచితే నిన్న కేసీఆర్ తెలంగాణాలో లాక్ డౌన్ అమలవుతున్న తీరు గురించి అసహనం వ్యక్తం చేసారు. మరింత కఠినంగా లాక్ డౌన్ అమలు చేయాలనీ ఆదేశాలను జారీచేశారు. దీనితో పోలీసులు అత్యుఉత్సాహం ప్రదర్శిస్తూ ప్రభుత్వం జీవోలో అనుమతిచ్చిన కార్యక్రమాలకు కూడా అడ్డుపడుతున్నారు. 

నేటి ఉదయం నుండి స్విగ్గి, జొమాటో వంటి ఫుడ్ డెలివరీ బాయ్స్ ని ఎక్కడబడితే అక్కడ ఆపుతున్నారు. వారి వాహనాలను సీజ్ చేసి చలాన్లు విధించారు పోలీసులు. నల్గొండలో ఏకంగా విద్యుత్ ఉద్యోగుల మీద లాఠీలను ఝులిపించారు. వారు ఎసెన్షియల్ సర్వీసెస్ కిందకు వచ్చే ప్రభుత్ఉద్యోగులే కదా..? పోలీసుల ఈ స్థాయి ఓవర్ యాక్షన్ అనేక ఇబ్బందులకు కారణమవుతుంది. 

హైదరాబాద్ లో ఎందరో మంది వాలంటీర్స్ ప్రభుత్వం చేయలేకపోతున్న పనులను చేస్తున్నారు. మొన్నటి వరకు తెలంగాణాలో కూడా బెడ్లు దొరకని పరిస్థితి. ఇప్పటికి కూడా కొన్ని మందుల కోసం, ఆక్సిజన్ కోసం ట్విట్టర్ లో మంత్రి కేటీఆర్ ని అడుక్కోవాల్సిన పరిస్థితి. ఆసుపత్రుల్లో రెడీగా అందుబాటులో ఉండాల్సిన వస్తువులు లేవు. అలంటి పరిస్థితుల్లో ఎందరో వాలంటీర్స్ హైదరాబాద్ లో ఎందరో ప్రాణాలను కాపాడారు. ఆసుపత్రి బెడ్ల నుండి మందుల వరకు అన్నిటిని ఏర్పాటు చేసారు.