Friday, June 19, 2020

కరోనా తెలంగాణ

హైదరాబాద్ : 19/06/2020

*కరోనాపై ప్రభుత్వానికి టీఎస్‌ హైకోర్టు ఆదేశాలు*


హైదరాబాద్‌: కరోనా పరీక్షల విషయంలో రాష్ట్ర పభుత్వానికి తెలంగాణ హైకోర్టు మరోసారి కీలక ఆదేశాలు జారీ చేసింది. కరోనా కీలక సమాచారం మీడియా బులెటిన్‌లో ఉండాలని సూచించింది. వైద్యులకు పీపీఈ కిట్లు, మాస్కులు, రక్షణ పరికరాలు ఇవ్వడం లేదంటూ దాఖలైన పిటిషన్‌పై బుధవారం విచారణ జరిపిన న్యాయస్థానం మరోసారి ఇవాళ కూడా విచారణ నిర్వహించింది. దీనికి రాష్ట్ర పబ్లిక్‌ హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరావు, గాంధీ సూపరింటెండెంట్‌ రాజారావు హాజరయ్యారు. 
రాష్ట్రంలో 79 మంది వైద్యులకు కరోనా సోకినట్లు పబ్లిక్‌ హెల్త్ డైరెక్టర్‌ కోర్టుకు వెల్లడించారు. 
గాంధీలో ప్లాస్మా, యాంటీ  వైరల్‌ డ్రగ్స్‌ ప్రయోగాలు చేస్తున్నట్లు రాజారావు కోర్టుకు తెలిపారు.
విచారణ సందర్భంగా తెలంగాణ హైకోర్టు ప్రభుత్వానికి పలు ఆదేశాలు ఇచ్చింది. ఎక్కువగా కరోనా కేసులు వెలుగు చూస్తున్న జీహెచ్‌ఎంసీ పరిధిలో వార్డుల వారీగా కేసుల వివరాలు వెల్లడించాలని ఆదేశించింది. కేసుల వివరాలు ఆయా కాలనీ సంఘాలకు ఇవ్వాలని సూచించింది. ర్యాపిడ్‌ యాంటీజెంట్‌ టెస్ట్‌ నిర్వహించాలంటూ ఐసీఎంఆర్‌ చెప్పిన సూచనలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. రాష్ట్రవ్యాప్తంగా 54 ఆస్పత్రుల్లో కరోనా పరీక్షలు జరుగుతున్న విషయాన్ని ప్రచారం చేయాలంది. సంచార పరీక్షలు ఎందుకు వీలుకాదో ప్రభుత్వం వివరించాలని ఆదేశించింది. గాంధీ ఆస్పత్రిలో వైద్య సిబ్బందితో పాటు పోలీసులకు కూడా రక్షణ కిట్లు ఇవ్వాలని సూచించింది. ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ సిబ్బందికి షిఫ్ట్‌ల విధానం అమలు చేయాలని, రాష్ట్రవ్యాప్తంగా కరోనా పరీక్షలు పెంచాలని ఆదేశించింది. ఈ నెల 29లోగా నివేదిక సమర్పించాలని సూచించింది.

ప్రజా సంకల్పం 

https://prajasankalpam1.blogspot.com/

Thursday, June 18, 2020

తెలంగాణ ఆశ ఉద్యోగులు

హైదరాబాద్ : 19/06/2020

*ఆదరించండి.. అవమానించకండి.*

కష్టకాలంలో కుటుంబాలకు దూరంగా పనిచేస్తున్నాం
సమావేశంలో కంటతడి పెట్టిన ఆశ కార్యకర్తలు

ఎల్లారెడ్డిపేట: ‘నేను ఆశ కార్యకర్తను.. సీజనల్‌ వ్యాధులు రాకుండా ముందుగా అప్రమత్తం చేసే సామాజిక కార్యకర్తను.. ఇంటింటికీ తిరిగి మందులిచ్చి, అన్నీ కనిపెట్టుకొని పనిచేసే సంరక్షకురాలిని. కరో నా కష్టకాలంలోనూ ప్రాణాలు పణంగా పెట్టి పనిచేస్తున్నాం. సమాజం కోసం పాటుపడుతున్న మమల్ని ఆదరించండి.. అవమాననించకండి’ అంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లికి చెందిన ఆశ కార్యకర్త గోవర్ధన గీత కన్నీటి పర్యంతమైంది. కుటుంబాలకు దూరంగా ఉంటూ పనిచేస్తుంటే అర్థం చేసుకోకపోగా ఊళ్లోని ప్రజలు ద్వేషిస్తున్నారని, అమర్యాదగా మాట్లాడుతున్నారంటూ’ గురువారం ఎల్లారెడ్డిపేటలో జరిగిన ఏఎన్‌ఎం, ఆశ కార్యకర్తల సమావేశంలో ఆమె గోడువెళ్లబోసుకోగా అక్కడున్న వారంతా కంటతడి పెట్టారు.

ప్రజా సంకల్పం 

https://prajasankalpam1.blogspot.com/

తెలంగాణ ఇంటర్మీడియట్ లో అగ్రగామి

హైదరాబాద్ : 19/06/2020

*ఇడ్లీల విక్రేత కుమార్తె ఇంటర్‌లో టాపర్‌*

కాగజ్‌నగర్‌, న్యూస్‌టుడే: *పట్టుదల ఉంటే చదువులో రాణించేందుకు పేదరికం అడ్డంకి కాదని మరోసారి నిరూపించింది ఆసిఫాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌కు చెందిన విద్యార్థిని కల్యాణి.*  ఇంటర్‌ ఫలితాల్లో రాష్ట్ర స్థాయి అగ్రగామిగా నిలిచింది. తల్లిదండ్రులు ఇంటి వద్ద ఇడ్లీలు తయారు చేసి ఇంటింటా తిరిగి విక్రయిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. స్థానిక ద్వారకానగర్‌ నివాసి కాటే శేషగిరి-అనిత దంపతుల చిన్నకూతురు కల్యాణి. ‘మేధా ట్రస్ట్‌’ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రతిభ పరీక్షలో టాపర్‌గా నిలిచింది. ఆ ట్రస్ట్‌ ఆధ్వర్యాన హైదరాబాద్‌ శ్రీచైతన్య కళాశాలలో చేరి ఎంపీసీ చదివింది. 992 మార్కులు సాధించింది. ఐఐటీ మెయిన్స్‌లోనూ 97 మార్కులు పొందింది.

*మంచి సంకల్పం తో, పట్టుదలతో కష్టపడి ఇంటర్మీడియట్ ఫలితాలలో రాష్ట్రస్థాయిలో అగ్రగ్రామిగా నిలిచినందుకు ప్రజా సంకల్పం  గ్రూప్ తరపున అభినందనలు తెలుపుతున్నాను 👍*

గ్రూప్ link Media 
ఈనాడు సౌజన్యంతో 

ప్రజా సంకల్పం 

https://prajasankalpam1.blogspot.com/

జవాన్లకు నివాళులు

హైదరాబాద్ : 19/06/2020

*కొన్ని వివరించాలంటే అక్షరాలు సరిపోవు... **

Sometimes words can’t amount to describe precious things..

(Tamilnadu—An Indian Paying respects to Col B Santhosh Babu, Havildar Palani and Sepoy Ojha) 
#HumanityFirst 
 @MPsantoshtrs @TelanganaDGP @RachakondaCop @cyberabadpolice 
@Praja_Snklpm 

Source : Group link Media 

Praja Sankalpam 

https://prajasankalpam1.blogspot.com/

Telangana IPS Officer's Promotion

https://prajasankalpam1.blogspot.com/

జవాన్ స్పందన

హైదరాబాద్ : 18/06/2020

కేవలం ఒక్క మనిషే నిల్చునేంత చిన్న స్థలంలో చైనాతో మన సైనికులు పోరాడారా? సంచలన విషయాలు చెప్పిన జవాన్

న్యూఢిల్లీ : కేవలం ఒకే ఒక్క మనిషి నిలబడేటంత సన్నని ఒడ్డుపై చైనా, భారత జవాన్లకు మధ్య ఘర్షణ జరిగిందా? ఎముకలు గడ్డకట్టేంత చిన్న కాలువలో చైనా జవాన్లకు మన భారత జవాన్లు దీటైన సమాధానం చెప్పారా? అసలు గాల్వాన్‌లో ఏం జరిగిందో అందులో పాల్గొన్న సురేంద్ర సింగ్ అనే జవాన్ ఓ ఛానల్‌తో పంచుకున్నారు. ఆయన మాటల్లోనే...

‘‘చైనా సైనికులు మనకు ధోకా ఇచ్చారు. ఉన్నట్లుండి హఠాత్తుగా మనపై దాడికి దిగారు. 4 నుంచి 5 గంటల వరకూ నదిలోనే వారితో ఘర్షణ జరిగింది. మన సైనికులు 200 నుంచి 250 మంది ఉన్నారు. చైనా వాళ్లు 1,000 కంటే ఎక్కువ మందే ఉన్నారు. ఈ ఘర్షణ మొత్తం కూడా ఎముకలు గడ్డ కట్టిపోయే, గొంతు కోసే చల్లని నీటిలోనే సాగింది. నది ఒడ్డున కేవలం ఒక్క మనిషి మాత్రమే నిలబడేంత చోటు మాత్రమే ఉంది. అంత చిన్న స్థలంలో వారితో పోరాడాం. అందుకే పో్రాటంలో చాలా ఇబ్బందులు పడ్డాం. లేకపోతే భారత సైనికులు ఎందులో తక్కువ? మేం చైనా వాళ్లకు సరైన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగానే ఉన్నాం. కానీ మాపై కుట్రతో, మోసపూరితంగా దాడికి దిగారు.’’ అని గాల్వాన్‌లో జరిగిన పోరాటాన్ని కళ్లకు కట్టినట్లు సురేంద్ర సింగ్ వెల్లడించారు. 

సురేంద్ర సింగ్.... గాల్వాన్‌లో భారత్ - చైనాకు మధ్య జరిగిన పోరాటంలో పాల్గొన్నారు. తీవ్రంగా గాయపడ్డారు. తలలో డజనుకు పైగా కుట్లు వేశారు. ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంగానే ఉన్నట్లు ఆయన ప్రకటించారు.  లడఖ్‌లోని సైనిక ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. ఈయన స్వస్థలం రాజస్థాన్. 

గ్రూప్ link Media 
ABN ఆంధ్రజ్యోతి సౌజన్యంతో 

ప్రజా సంకల్పం 

https://prajasankalpam1.blogspot.com/

తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు

హైదరాబాద్ : 18/06/2020

#intermediate మొదటి రెండో సంవత్సరం పరీక్షా ఫలితాలను ఈ రోజు #Telangana ఇంటర్మీడియేట్ విద్యా బోర్డు ప్రకటించింది. విద్యా మంత్రి @SabithaindraTRS లాంఛనంగా ఈ ఫలితాలను వెల్లడించారు. అధికారిక వెబ్ సైట్ లో ఈ ఫలితాలు అందుబాటులో ఉన్నాయి. ఫలితాల్లో బాలికలు ముందంజలో ఉన్నారు.

ప్రజా సంకల్పం 

https://prajasankalpam1.blogspot.com/