Thursday, June 18, 2020

జవాన్ స్పందన

హైదరాబాద్ : 18/06/2020

కేవలం ఒక్క మనిషే నిల్చునేంత చిన్న స్థలంలో చైనాతో మన సైనికులు పోరాడారా? సంచలన విషయాలు చెప్పిన జవాన్

న్యూఢిల్లీ : కేవలం ఒకే ఒక్క మనిషి నిలబడేటంత సన్నని ఒడ్డుపై చైనా, భారత జవాన్లకు మధ్య ఘర్షణ జరిగిందా? ఎముకలు గడ్డకట్టేంత చిన్న కాలువలో చైనా జవాన్లకు మన భారత జవాన్లు దీటైన సమాధానం చెప్పారా? అసలు గాల్వాన్‌లో ఏం జరిగిందో అందులో పాల్గొన్న సురేంద్ర సింగ్ అనే జవాన్ ఓ ఛానల్‌తో పంచుకున్నారు. ఆయన మాటల్లోనే...

‘‘చైనా సైనికులు మనకు ధోకా ఇచ్చారు. ఉన్నట్లుండి హఠాత్తుగా మనపై దాడికి దిగారు. 4 నుంచి 5 గంటల వరకూ నదిలోనే వారితో ఘర్షణ జరిగింది. మన సైనికులు 200 నుంచి 250 మంది ఉన్నారు. చైనా వాళ్లు 1,000 కంటే ఎక్కువ మందే ఉన్నారు. ఈ ఘర్షణ మొత్తం కూడా ఎముకలు గడ్డ కట్టిపోయే, గొంతు కోసే చల్లని నీటిలోనే సాగింది. నది ఒడ్డున కేవలం ఒక్క మనిషి మాత్రమే నిలబడేంత చోటు మాత్రమే ఉంది. అంత చిన్న స్థలంలో వారితో పోరాడాం. అందుకే పో్రాటంలో చాలా ఇబ్బందులు పడ్డాం. లేకపోతే భారత సైనికులు ఎందులో తక్కువ? మేం చైనా వాళ్లకు సరైన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగానే ఉన్నాం. కానీ మాపై కుట్రతో, మోసపూరితంగా దాడికి దిగారు.’’ అని గాల్వాన్‌లో జరిగిన పోరాటాన్ని కళ్లకు కట్టినట్లు సురేంద్ర సింగ్ వెల్లడించారు. 

సురేంద్ర సింగ్.... గాల్వాన్‌లో భారత్ - చైనాకు మధ్య జరిగిన పోరాటంలో పాల్గొన్నారు. తీవ్రంగా గాయపడ్డారు. తలలో డజనుకు పైగా కుట్లు వేశారు. ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంగానే ఉన్నట్లు ఆయన ప్రకటించారు.  లడఖ్‌లోని సైనిక ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. ఈయన స్వస్థలం రాజస్థాన్. 

గ్రూప్ link Media 
ABN ఆంధ్రజ్యోతి సౌజన్యంతో 

ప్రజా సంకల్పం 

https://prajasankalpam1.blogspot.com/

No comments:

Post a Comment