_అంతర్జాతీయ స్కాంలో ఆంధ్రప్రదేశ్..._
*_రూ.1750 కోట్ల లంచం మింగింది ఎవరు.?_*
------------------
_'మీడియా టుడే' ఎక్స్ క్లూజివ్_
-------------------
_# సోలార్ విద్యుత్ కొనుగోలు ఒప్పందం అసలు దొంగలు_
_# స్కాం జాబితాలో ఆంధ్రప్రదేశ్ తో పాటు తమిళనాడు, జమ్మూకశ్మీర్, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాలు_
_# 2021 ఆగస్టు 7, సెప్టెంబర్ 12, నవంబర్ 20తేదీలలో భేటీలు_
_# ఆ పత్రికా వాణిజ్య ప్రకటనల వెనుక..._
_(అనంచిన్ని వెంకటేశ్వరరావు, ప్రముఖ పరిశోధన పాత్రికేయులు, 9440000009)_
*https://epaper.mediatodaydaily.in/view/740/22-11-2024*
*_ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీపై అమెరికాలోని న్యూయార్క్ లో అవినీతి కేసు నమోదైంది. భారత్ లో సోలార్ విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో వేర్వేరు రాష్ట్రాల ప్రభుత్వాధినేతలకు అదానీ గ్రూప్ రూ.2029 కోట్ల లంచాలు ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, జమ్మూకశ్మీర్, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాలు ఉన్నాయి. 2019-24 మధ్య అప్పటి ఏపీ ప్రభుత్వాధినేతకు రూ.1750 కోట్ల లంచం ఇచ్చినట్లు బ్రూక్లిన్ కోర్టులో చేసిన ఆరోపణల్లో ఉంది._*
*_అదానీ లంచం స్కాంలో.. అప్పటి జగన్ ప్రభుత్వ అధికారులు_*
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను కుదిపేస్తున్న అదానీ లంచాల కేసు.. ఇప్పుడు ఏపీ రాష్ట్రాన్ని తాకింది. విద్యుత్ ఒప్పందాలు, గ్రీన్ ఎనర్జీ, పవర్ ప్రాజెక్టుల్లో అధిక లాభాల కోసం దేశంలోని పలువురు అధికారులకు 2 వేల 100 కోట్ల రూపాయలు లంచాలు ఇచ్చినట్లు అమెరికా ఏజెన్సీలు బయటపెట్టాయి. ఆ ఏజెన్సీ తన అభియోగ పత్రంలో అప్పట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జగన్ ప్రభుత్వంలోని అధికారులను సైతం ప్రస్తావించింది. ఏపీలో విద్యుత్ ఒప్పందాల్లో భాగంగా.. 200 మిలియన్ డాలర్లు.. అంటే రూ. 1750కోట్లు ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు.. అదానీ నుంచి లంచం తీసుకున్నట్లు అదానీపై నమోదైన అభియోగ పత్రంలో ప్రస్తావించారు.
*_2021లో ఎస్ఇసిఐతో..._*
విద్యుత్ సరఫరా ఒప్పందానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారులు అదానీ గ్రీన్ నుండి 200 మిలియన్ల డాలర్ల మేరకు లంచాలు అందుకున్నారని అమెరికాలోని బ్రూక్లిన్‌లోని ఫెడరల్ కోర్టులో ఆరోపించారు. 2019-24లో అధికారంలో ఉన్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
*_నేరారోపణ ప్రకారం.._*
గౌతమ్ అదానీ 2021 ఆగస్టులో అప్పటి ఏపీ సీఎం జగన్ రెడ్డితో వ్యక్తిగతంగా సమావేశమయ్యారు. విద్యుత్ సరఫరా ఒప్పందం, రాష్ట్ర ప్రభుత్వం 7000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలు కోసం ఒప్పందం కుదుర్చుకోవడానికి అవసరమైన 'లంచాల' గురించి చర్చించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ అధికారులకు లంచం ఇస్తానని కూడా అదానీ వాగ్దానం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
*_దేశవ్యాప్తంగా ప్రకంపనలు_*
భారతీయ పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానిపై అమెరికాలో కేసు నమోదు కావడం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న వేళ తెలుగు రాష్ట్రాలలో ఆసక్తికర చర్చ జరుగుతుంది. ముఖ్యంగా ఈ కేసుతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధాలు ఉన్నట్టు తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అప్పటి ఏపీ అధికారులతో ఈ లంచాల వ్యవహారం నడిపినట్టుగా సమాచారం. ముఖ్యంగా ఈ కేసుతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధాలు ఉన్నట్టు తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అప్పటి ఏపీ అధికారులతో ఈ లంచాల వ్యవహారం నడిపినట్టుగా సమాచారం.
*_భారీ సోలార్ ఎనర్జీ ప్రాజెక్టు కోసం భారీ లంచాలిచ్చిన అదానీ_*
లంచం, మోసం కేసులో అదాని గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ పై కేసు నమోదు చేసిన యూఎస్ బ్రూక్లిన్ లోని ఫెడరల్ కోర్టు గౌతమ్ అదానితో పాటు ఏడుగురిపైన కేసులు నమోదు చేశారు. భారతదేశంలో భారీ సోలార్ ఎనర్జీ ప్రాజెక్టును దక్కించుకోవడానికి గౌతమ్ అదాని మరో ఏడుగురుతో కలిసి అధికారులకు లంచాలు ఆఫర్ చేసినట్టు అమెరికా ఫెడరల్ కోర్టు పేర్కొంది.
*_ఏపీతో అదానీ కేసుకు లింకులు_*
బ్యాంకులు, ఇన్వెస్టర్లకు తప్పుడు సమాచారం అందించి, నిధులు సమకూర్చేందుకు ప్రయత్నం చేసినట్టు ఆరోపణలు చేస్తుంది. కాగా ఈ ఆరోపణలలో అమెరికా ఇన్వెస్టర్ల నిధులు కూడా ఉండడంతో ఈ కేసులో అమెరికా దర్యాప్తును ప్రారంభించింది. అయితే తాజాగా ఈ కేసులో ఏపీతో ఉన్న లింకులు బయటకు వచ్చాయి.
*_మొత్తం రూ.2029 కోట్లు_*
ఆ సోలార్ ఎనర్జీ ప్రాజెక్ట్ కోసం 2029 కోట్ల రూపాయల లంచాలు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ తో జరిగిన ఒప్పందం స్కామ్ కేసులో వేర్వేరు రాష్ట్రాల ప్రభుత్వ అధికారులకు 2029 కోట్ల రూపాయల లంచాలు ఇచ్చినట్టు ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా 2021లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కొందరు అధికారులకు గౌతమ్ అదాని లంచాలు ఇచ్చారని అభియోగాలు ఉన్నాయి. వేలకోట్లు ఈ సందర్భంగా చేతులు మారినట్టు యూఎస్ కోర్టు అభియోగం.
*_2021 ఆగస్టు 7, సెప్టెంబర్ 12, నవంబర్ 20తేదీలలో భేటీలు_*
జగన్ ప్రభుత్వ హయాంలో అధికారులకు 1750 కోట్ల రూపాయల లంచాలు
విదేశీ అధికారులతో ఏపీలోనే గౌతమ్ అదాని భేటీ జరిగిందని, 2021 ఆగస్టు 7, సెప్టెంబర్ 12, నవంబర్ 20తేదీలలో గౌతమ్ అదాని భేటీ అయినట్టు ఈ క్రమంలోనే ప్రభుత్వ అధికారులకు 2029 కోట్లు లంచం ఇవ్వజూపారని తాజా కేసులో వస్తున్న ఆరోపణలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒప్పందాల కోసం జగన్ ప్రభుత్వ హయాంలో కొందరు అధికారులకు 228మిలియన్ డాలర్లు, దాదాపు రూ.1750కోట్ల లంచాలను ఇచ్చినట్టు బ్రూక్లిన్ కోర్టులో చేసిన ఆరోపణలలో ఉంది.
****----*****---*****---*****
*#YSJaganScams*
*#AndhraPradesh #AdaniBribe @AdaniOnline @gautam_adani #AdaniPower*
*@AndhraPradeshCM @ncbn @APDeputyCMO @naralokesh @IPRAndhra @RamMNK @PurandeswariBJP @PayyavulaOffl @ysjagan @YSRCParty*
https://x.com/Praja_Snklpm/status/1859841017484280313?t=fNWNUqqE39V3zUpGP1wb9A&s=09
No comments:
Post a Comment