*_బాల సాయిబాబా ఆస్తి మటాష్.!_*
_# నవీన్ మిట్టల్ భూదందా!_
_• రియల్ సంస్థలకు బాలసాయి ట్రస్ట్ భూములు_
_• 42 ఎకరాల భూమి అక్రమ మార్పిడి_
_• ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి మోసం_
_• భూపతి అసోసియేట్స్ కుకేటాయిస్తూ జీవో నెం.45 జారీ_
_• ఐఏఎస్ అమోయ్ తో కలిసి భారీ దోపిడీ_
_• ఈడీని ఆశ్రయించిన మిట్టల్ బాధితులు_
_• తమను మోసం చేశారని లిఖితపూర్వక ఫిర్యాదు_
_• త్వరలో విచారణకు పిలవనున్న ఈడీ_
Courtesy / Source by :
_(అనంచిన్ని వెంకటేశ్వరరావు, ప్రముఖ పరిశోధన పాత్రికేయులు, 9440000009)_
*_'రాజుల సొమ్ము రాళ్ళ పాలు. బాబాల సొమ్ము రియల్ ఎస్టేట్ పాలు' అన్నట్లు ఎందరో బాబాల సొమ్ము రకరకాల చేతుల్లోకి వెళ్ళింది. తాజాగా బాల సాయిబాబా ఆస్తులు కూడా అలా..అలా ఒక్కొక్కటిగా పొలిటికల్ అనఫిషియల్ బ్యాగ్రౌండ్ లో ఇద్దరు ఐఏఎస్ ల చాతుర్యంతో ఓ రియల్ ఎస్టేట్ సంస్థకు అప్పనంగా కట్టబెట్టారు._*
*https://epaper.mediatodaydaily.in/view/714/2-11-2024*
*_ఫిర్యాదులే ఫిర్యాదులు:_*
తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారు తున్నాయి. ఇప్పటికే వందల ఎకరాల ప్రభుత్వ, భూదాన్ భూములను అక్రమంగా ప్రైవేటు వ్య క్తులకు కట్టబెట్టారనే ఆరోపణల దృష్ట్యా ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్ ను ఈడీ విచారిస్తున్న సంగతి తెలిసిందే. అమోయ్ అక్రమాలపై బాధితులు వరుస పెట్టి ఈడీకి ఫిర్యాదులు చేస్తూ వచ్చారు. తాజాగా బుధవారం నాడు అమోయ్ పాటు మరో ఇద్దరు ఐఏఎస్ అధికారులపై ఈడీకి ఫిర్యాదు అందింది. ఐఏఎస్ లు నవీన్ మిట్టల్, మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ పై ఈడీకి బాధితులు ఫిర్యాదు చేశారు.
*_అసలేం జరిగిందంటే..?:_*
కొండాపూర్ పరిధిలోని మజీద్ బండిలో 88 ఎకరాల భూమిని ఓ కుటుంబం బాలసాయి ట్రస్టుకు దానం చేసింది. అయితే ఆ భూమిపై కన్నేసిన ఐఏఎస్ లు ఓ ప్రైవేటు సంస్థకు కట్టబెట్టేందుకు పక్కాగా స్కెచ్ వేశారు. ఆ భూమిలో 42 ఎకరాలకు ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి.. భూపతి అసోసియేట్స్ కు ఇస్తున్నట్లు జీవో నెం.45 జారీ చేశారు. ఈమేరకు బాధితులు ఈడీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ భూమికి ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి.. ముగ్గురు ఐఏఎస్ అధికారులు మోసం చేశారని తమకు న్యాయం చేయాలని కోరారు.
*_ఈడీ విచారణ తప్పదా..?_*
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ నగర శివార్లలో దాదాపు కోట్ల రూపాయల భూ దందా జరిగినట్లు తెలుస్తోంది. ధరణిని అడ్డం పె ట్టుకుని ఐఏఎస్ అమోయ్ కుమార్ దాదాపు 1000 ఎకరాలకు పైగా భూ అక్రమాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. గతంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా పనిచేసిన సమయంలో అమోయ్ కుమార్ మహేశ్వరం మండలం నాగారంలోని దాదాపు 50 ఎకరాల భూదాన్ భూములను అక్రమంగా ఓ మహిళ పేరు మీదకు బదిలీ చేశారు. అనంతరం దాన్ని 4 రియల్ ఎస్టేట్ కంపెనీలకు అమ్మేసినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో పెద్ద ఎత్తున నగదులా వాదేవీలు జరిగినట్లు సమాచారం అందండంతో ఈడీ రంగంలోకి దిగి మూడు రోజుల పాటు అమోయ్ కుమార్ ను ప్రశ్నించింది. ఈ నేపథ్యంలోనే పలువురు బాధితులు ఈడీకి వరుసగా ఫిర్యాదులు చేశారు. అయితే అమోయ్ వెనుక ఎవరున్నారన్న దానిపై ఈడీ సమాచారం సేకరిస్తోంది. ఈ నేపథ్యంలో నవీన్ మిట్టల్, సోమేష్ కుమార్లపై బాధితులు ఫిర్యాదు చేయడంతో త్వరలోనే వారిద్దరి ని కూడా విచారించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఎంత భూమి అక్రమంగా ప్రైవేటు వ్యక్తులకు కట్టబె ట్టారు..? ఎన్ని చోట్ల ఈ తంతు జరిగింది..? అక్రమ డబ్బును ఎక్కడ దాచారు..? వీరి వెనుక నాటి ప్రభు త్వ పెద్దల హస్తం ఉందా...? అన్న కోణంలో ఈడీ దర్యాప్తు చేయనుంది.
*_అమోయ్ కుమార్ ఉత్తర్వులు రద్దు..:_*
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గుట్టల బేగంపేటలోని సర్వే నంబర్ 63లో ప్రభుత్వానికి చెందిన 78 ఎకరాల్లో 52 ఎకరాలను నిషేధిత జాబితానుంచి తొలగిస్తూ అప్పటి కలెక్టర్ అమోయ్ కుమార్ జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది. ఆ భూములపై కలెక్టర్ ఇచ్చిన ఉత్తర్వులు సరికావని తప్పుబట్టింది. కోర్టు వివాదాలు సదు స్తుండగా నిషేధిత జాబితా నుంచి తొలగించడం చెల్లదని, ఆ భూముల్లో జోక్యం చేసుకోరాదని ఆదేశాలు జారీ చేసింది. గుట్టల బేగంపేటలోని 78 ఎకరాల భూమి హక్కులపై సుదీర్ఘకాలంగా కోర్టు వివాదాలు నడుస్తున్నాయి. 2018లో ఈ భూమి ప్ర భుత్వానిదేనంటూ బోర్డులు ఏర్పాటు చేయడంతో.. తమ భూముల్లో జోక్యం చేసుకోరాదంటూ ప్రైవేటు వ్యక్తులు కోర్టును ఆశ్రయించడంతో యథాతథస్థి తి కొనసాగించాలంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, నిషేధిత జాబితాలో ఉన్న 78 ఎకరాల్లో 52 ఎకరాలను తొలగిస్తూ 2022 ఆగస్టు 8న అప్పటి కలెక్టర్ అమోయ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈ భూమిలో ప్ర భుత్వ జోక్యాన్ని అడ్డుకోవాలని, నిషేధిత జాబితాలో నుంచి 52 ఎకరాలను తొలగించడం ద్వారా రిజిస్ట్రే షన్కుఅవకాశం కల్పిస్తూ జారీచేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై మంగళవారం జస్టిస్ కె. లక్ష్మణ్ విచారణ చేపట్టారు. సుదీర్ఘ వాద నలను విన్న జడ్జి.. కలెక్టర్ జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేస్తూ, ఆ భూముల్లో జోక్యం చేసుకోరాదంటూ తీర్పుచెప్పారు..
No comments:
Post a Comment