Tuesday, November 5, 2024

*_కేటీఆర్ పై ఏసీబీ కేసు.?_*

*_కేటీఆర్ పై ఏసీబీ కేసు.?_*
_@ ఫార్ములా ఈ-రేస్ వ్యవహారంలో కీలక పరిణామం_
_@ ఏసీబీ విచారణకు ప్రభుత్వం పర్మిషన్_
_@ కేసుతో లింక్ ఉన్నవారందరికీ త్వరలో నోటీసులు_
_@ ఇప్పటికే నాటి మున్సిపల్ శాఖ అధికారి అర్వింద్ కుమార్‌ కు నోటీసులు_
_@ కేటీఆరకూ నోటీసులు ఇచ్చి అరెస్టు చేస్తారనే చర్చ_
_@ రూ.55 కోట్లు దారిమళ్లినట్లు అధికారుల నివేదిక_

Courtesy / Source by :
_(అనంచిన్ని వెంకటేశ్వరరావు, ప్రముఖ పరిశోధన పాత్రికేయులు, 9440000009)_

*_బీఆర్ఎస్ కీలక నేతలకు మరిన్ని చిక్కులు ఎదురవుతున్నాయి. ఫార్ములా ఈరేస్ వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇందులో జరిగిన అక్రమాలపై అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) విచారణకు ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. ఈ వ్యవహారంలో పూర్తిగా విచారణ జరిపి నిజాలను బయటకు తీయాలని ఆదేశించింది. నిందితులు ఎవరైనా కూడా వదలొద్దని ఆదేశించింది. అయితే ఈ కేసుతో లింక్ ఉన్నవారందరికీ నోటీసులు ఇవ్వాలని ఏసీబీ నిర్ణయం తీసుకుంది. దీంతో బీఆర్ఎస్ నేతల్లో ఆందోళన నెలకొంది. అప్పటి మున్సిపల్ శాఖ అధికారి అర్వింద్ కుమార్ కు ఇప్పటికే అది కారులు నోటీసులు ఇచ్చారు. అయితే కేటీఆర్‌కు కూడా నోటీసులు ఇస్తారనే చర్చ నడుస్తోంది._*

*https://epaper.mediatodaydaily.in/view/717/05-11-2024*

*_ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు:_*
గత ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఫార్ములా ఈ రేస్ లో అవినీతికి బాధ్యులైనవారు ఎంతటి వారైనా వదలొద్దని స్పష్టం చేసింది. ఈ రేస్ లో రూ.55 కోట్లు అక్రమాలు జరిగినట్లు గుర్తించిన మున్సిపల్ శాఖ.. మంగళవారం ఏసీబీకి ఫిర్యాదు చేసింది. ఐఏఎస్ లు సహా అప్పటి బీఆర్ఎస్ సర్కారు పెద్దల ప్రమేయం ఉండడంతో కేసు నమోదు చేసేందుకు అనుమతి కోరుతూ ఏసీబీ అధికారులు ప్రస్తుత ప్రభుత్వానికి లేఖ రాశారు. దీనిని పరిశీలించిన అనంతరం కేసు నమోదు చేసి విచారణ చేపట్టేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. వచ్చే వారం నుంచి ఏసీబీ రంగంలోకి దిగనుంది. ఉన్నత స్థాయి కేసు కావడంతో ఏసీబీలోని సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ (సీఐయూ) విభాగానికి దర్యాప్తు బా ధ్యతలు అప్పగించనున్నట్లు తెలిసింది. సీఐయూ జాయింట్ డైరెక్టర్ (జేడీ) నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేసినిర్విరామం గా కేసు విచారణ చేపట్టనున్నారు.

*_అందరికీ నోటీసులు..:_*
కేసుతో సంబంధమున్న అందరికీ నోటీసులు ప్రస్తుతం సెలవులో ఉన్న జేడీ సోమవారం విధుల్లో చేరనున్నారు. న్యాయపరమైన అంశాలను పరి శీలించిన తర్వాత వచ్చే వారం నుంచి కేసుతో సంబంధం ఉన్నవారందరికీ విడివిడిగా నోటీసులు ఇచ్చి, విచారించి స్టేట్మెంట్లు రికార్డు చేయనున్నా రు. ఐఏఎస్ లు మొదలు కీలక అధికారులు, నాటి ప్రజాప్రతినిధుల దాక వీరిలో ఉండే అవకాశం ఉంది. స్టేట్మెంట్ ఆధారంగా గత ప్రభుత్వంలో ని కీలక నేతలకు నోటీసులు జారీ చేసి ప్రశ్నించే వీలుంది. ఫార్ములా ఈ రేస్కు సంబంధించి అప్పటి ప్రభుత్వంలోని ప్రజాప్రతినిధులు ఆదేశి స్తేనే విదేశీ సంస్థలకు నిధులు విడుదల చేశామని ఇప్పటికే అధికారులు వెల్లడించారు. అయితే, నాటి ప్రభుత్వంలోని ప్రజాప్రతినిధులు ఎక్కడా నోట్ ఫైల్ గానీ, ఆదేశాలిస్తూ పత్రాలు కానీ జారీ చేయలేదు. ఇప్పుడు విచారణ సంస్థకు ఏం చెప్పాలో తెలియని పరిస్థితి అధికారులది. వారు ఏసీబీకి ఏం చెప్పను న్నారు..? ఎలాంటి ఆధారాలు సమర్పించనున్నా రు..? వాటి ఆధారంగా గత సర్కారులోని కీలక ప్రజాప్రతినిధుల వరకు ఏసీబీ ఎలా చేరుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.

*_అనుమతి లేకుండా..._*
రూ.55 కోట్ల చెల్లింపులు 2023లో హైదరాబాద్లో ఫార్ములా ఈ రేస్ నిర్వ హించారు. సచివాలయం ఎదురుగా ట్యాంక్బండ్ చుట్టూ ప్రత్యేకంగా సుమారు మూడు కిలోమీటర్ల ట్రాక్ నిర్మించారు. దేశ, విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో అభిమానులు హాజరయ్యారు. దీంతో 2024 ఫిబ్రవరి 10న రెండోసారి రేస్ నిర్వహించేందుకు 2023 అక్టోబరులోనే విదేశీ సంస్థలతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు విదేశీ సంస్థలకు మున్సిపల్ అడ్మినిస్ట్రే షన్అర్బన్ డెవల్ పమెంట్ (ఎంఏయూడీ) రూ.55 కోట్లు చెల్లించింది. అయితే, ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమితో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ప్రభుత్వం మారిన వెంటనే విదేశీ సంస్థలు తాము ఫార్ములా ఈ ఆపరేషన్ నిర్వహించడం లేదని ప్రకటించా యి. ఒప్పందంలో ప్రస్తావించిన అంశాలు పాటిం చకపోవడమే కారణంగా పేర్కొన్నాయి. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం ఫార్ములా ఈ రేస్ నిర్వహణలో అక్రమాలు జరిగినట్లు గుర్తించింది. ఆర్థిక శాఖ, ఇతర విభాగాల నుంచి ముందస్తు అనుమతులు లేకుండానే విదేశీ సంస్థలకు రూ.55 కోట్లు చెల్లించినట్లుగా తేల్చింది.
l

No comments:

Post a Comment