*_బిచాణ ఎత్తేస్తున్న స్వరూపానంద స్వామి_*
_# సెక్యూరిటీ వద్దని లేఖ_
_# రుషికేశ్‌లో మకాం.!_
Courtesy / Source by :
_(అనంచిన్ని వెంకటేశ్వరరావు, ప్రముఖ పరిశోధన పాత్రికేయులు, 9440000009)_
*_రాజకియాలు తిరగబడితే ఓడలు బండ్లు.. బండ్లు ఓడలు అవుతాయంటారు కదా.! సరిగ్గా వివాదాస్పద స్వామీజీ స్వరూపానంద పరిస్థితి అదే.! వైసిపి అధికారంలో ఉన్నప్పుడు ఈ స్వామి రాజభోగాలు అనుభవించారు. ప్రభుత్వం మారటంతో పవర్ పోయింది. వైజాగ్, తిరుపతిలో కేటాయించిన భూములు తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. విచారణకు సైతం రంగం సిద్ధమైంది. ఈయన గారి భూ బాగోతాలపై 'మీడియా టుడే' వరుస సంచలన కథనాలు అందించిన విషయం తెలిసిందే.!_*
*https://epaper.mediatodaydaily.in/view/745/28-11-2024*
*_వై కాటగిరి టు గ్రీన్ ఛానల్:_*
విశాఖ శారదాపీఠం స్వామీజీ స్వరూపానందేంద్రకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఎక్స్ క్యాటగిరీ భద్రతను ఉపసంహరించుకోవాలని పీఠం మేనేజర్ ఏపీ డీజీపీని ఓ లేఖ ద్వారా కోరారు. ఇకపై ఆయన రుషికేశ్‌లో తపస్సులో ఎక్కువ సమయం గడపాలని నిర్ణయించుకున్నారని తెలిపారు. ఆయనకు గతంలో వైకాపా ప్రభుత్వం వై క్యాటగిరీ భద్రత కల్పించింది. పీఠాధిపతితోపాటు ఉత్తరాధికారికీ గన్‌మెన్ ఉండేవారు. వీరు పీఠం విడిచి ఎక్కడికి వెళ్లినా ట్రాఫిక్ అవాంతరాలు లేకుండా గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసేవారు. కూటమి అధికారంలోకి వచ్చాక వై క్యాటగిరీ భద్రత నిలిపివేయగా.. ప్రస్తుతం వన్ ప్లస్ వన్ పోలీసు బందోబస్తు కొనసాగుతోంది.
*_కేటాయింపులు రద్దు:_*
వైకాపా ప్రభుత్వ హయాంలో శారదా పీఠానికి రూ. 300 కోట్ల విలువ చేసే భూమిని కేవలం రూ. 15 లక్షలకే అప్పగించగా, కూటమి ప్రభుత్వం ఇటీవల ఆ కేటాయింపులను రద్దు చేసిన సంగతి తెలిసిందే. తిరుపతిలో కూడా సేమ్ సీన్. వైకాపా ప్రభుత్వ హయాంలో రాజగురువులా ఓ వెలుగు వెలిగిన స్వరూపానందేంద్ర త్వరలో రాష్ట్రాన్ని వీడి రుషికేశ్‌లోనే ఉంటారనే ప్రచారం జరుగుతోంది.
*_కొసమెరుపు:_*
ఇప్పటికైనా స్వరూపానంద స్వామికి తపస్సుపై మనసు మళ్ళడం ఆహ్వానించదగ్గ పరిణామం.
No comments:
Post a Comment