Thursday, November 28, 2024

*ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లు,వ‌స‌తిగృహాలు,గురుకుల విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్ధినీ విద్యార్థుల‌ను సొంత బిడ్డ‌ల్లా చూడాలి*

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లు, వ‌స‌తిగృహాలు, గురుకుల విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్ధినీ విద్యార్థుల‌ను సొంత బిడ్డ‌ల్లా చూడాల‌ని, వారికి ప‌రిశుభ్ర‌మైన వాతావ‌ర‌ణంలో పౌష్టికాహారం అందించే విషయంలో ఎటువంటి అల‌క్ష్యానికి తావు ఇయ్యరాదని ముఖ్య‌మంత్రి @revanth_anumula గారు అన్ని జిల్లాల క‌లెక్ట‌ర్ల‌కు సూచించారు.

🔹 బడి పిల్లలకు అందించే ఆహారానికి సంబంధించి ఘటనలు పునరావృతం కావడం పట్ల ఆగ్రహం వ్య‌క్తం చేసిన ముఖ్యమంత్రి గారు ఈ విషయంలో ఉదాసీనంగా వ్య‌వ‌హ‌రించే అధికారులు, సిబ్బందిపై చ‌ర్య‌లు తీసుకుంటామని హెచ్చ‌రించారు. నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించిన‌ట్లు రుజువైతే వారిని ఉద్యోగాల నుంచి తొల‌గించేందుకు కూడా వెనుకాడ‌బోమని స్ప‌ష్టం చేశారు. క‌లెక్ట‌ర్లు త‌ర‌చూ పాఠశాలలు, వ‌స‌తిగృహాలు, గురుకులాలను త‌నిఖీ చేసి, నివేదిక‌ల‌ను సమ‌ర్పించాల్సిందే అని ఆదేశించారు.

🔹 గడిచిన పదేండ్లలో గాడితప్పిన విద్యా వ్యవస్థను తిరిగి దారిలో పెట్టే క్రమంలో ప్రస్తుత ప్రజా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని ముఖ్యమంత్రి గారు పునరుద్ఘాటించారు.

🔹 విద్యార్థినీ విద్యార్థుల విష‌యంలో  సానుకూల నిర్ణ‌యాలు తీసుకుంటున్న‌ప్ప‌టికీ కొంద‌రు దురుద్దేశంతో ప్ర‌భుత్వాన్ని అప్ర‌తిష్ట‌పాలు చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని, లేనివి ప్ర‌చారం చేస్తూ విద్యార్థుల త‌ల్లిదండ్రుల్లో భ‌యాందోళ‌న‌లు సృష్టిస్తున్నార‌ని, అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్య‌మంత్రి గారు అధికారులను ఆదేశించారు. #Telangana

Courtesy / Source by : https://x.com/TelanganaCMO/status/1862017098853331080?t=gAkuqJEggMibO2X5iUrqVA&s=19

No comments:

Post a Comment