ఓటీఎస్ గడువు పెంపు
=================
# ఈ నెల 30 వరకు పొడిగింపు
# వినియోగదారుల డిమాండ్ మేరకు నిర్ణయం
ఓటీఎస్-2024 గడువును ప్రభుత్వం పొడిగించింది. ఈ నెల 30 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. పథకం గడువును పెంచాలని వినియోగదారుల నుంచి భారీ ఎత్తున డిమాండ్ లు రావడంతో జలమండలి ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈ లేఖకు స్పందించిన ప్రభుత్వం.. పథకం గడువును పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
హైదరాబాద్ నగరంలో దీర్ఘకాలికంగా పేరుకుపోయిన నల్లా కనెక్షన్ బిల్లులను వసూలు చేసేందుకు ఈ పథకం ప్రవేశపెట్టింది. దీని ప్రకారం.. ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న నల్లా బిల్లుల్ని.. ఎలాంటి ఆలస్య రుసుం, వడ్డీ లేకుండా చెల్లించే అవకాశాన్ని కల్పించింది. మొదటగా ఈ పథకాన్ని అక్టోబర్ 1 నుంచి 31 వరకు ప్రకటించి అమలు చేశారు. కానీ ఇదే నెలలో దసరా, దీపావళి వంటి పండగలు రావడంతో వినియోగదారులపై ఆర్థిక భారం పడింది. మరి కొందరు సొంతూళ్లకు వెళ్లారు. అలాంటి వారు ఈ పథకాన్ని వినియోగించుకోలేకపోయారు. దీంతో మరో అవకాశం ఇవ్వాలని అధికారుల్ని కోరారు. దీంతో జలమండలి.. ప్రభుత్వానికి లేఖ రాయగా, అందుకు సానుకూలంగా స్పందించి.. పథకం గడువును నవంబర్ 30 వరకు పొడిగించింది.
#బిల్లులు_చెల్లించే_విధానం
# జలమండలి కార్యాలయాలు, ఆన్ లైన్ విధానంలో మీ-సేవ, ఏపీ ఆన్ లైన్ కేంద్రాలు, # ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం, NEFT, RTGS, BPPS, జలమండలి అధికారిక వెబ్ సైట్, లైన్ మెన్ల ద్వారా చెల్లించవచ్చు.
# జలమండలి అందించిన QR Code ను స్కాన్ చేయడం ద్వారా.. వినియోగదారులు తమ బకాయిలు, చెల్లించే మొత్తం, రాయితీ తదితర వివరాలు తెలుసుకోవచ్చు.
ఓటీఎస్ పథకంపై ఏవైనా సందేహాలుంటే.. జలమండలి కస్టమర్ కేర్ నంబర్ 155313 కు ఫోన్ చేసి వాటిని నివృతి చేసుకోవచ్చు.
@TelanganaCMO @TelanganaCS @PrlsecyMAUD @MDHMWSSB
Courtesy / Source by : https://x.com/HMWSSBOnline/status/1853469487598862691?t=uieZWX8GFJRELEtG6WSrcA&s=19
No comments:
Post a Comment