_ఎంత మెక్కారో.!_
*_పగులుతున్న పాపాల పుట్ట_*
* ‘దందాల తలసాని’..
* ‘కన్నింగ్ కమలాకర్’
* దగాకోర్ దయాకర్ రావు
* మహా చెడ్డ మంచిరెడ్డి’ పేరిట
* మంత్రులపై కాంగ్రెస్ ఛార్జిషీట్
* 'నిరుద్యోగం' యూత్ చార్జిషీట్
Courtesy / Source by :
_(అనంచిన్ని వెంకటేశ్వరరావు, పరిశోధన పాత్రికేయులు, 9440000009)_
*https://epaper.mediatodaydaily.in/view/711/29-10-2024*
*_అసెంబ్లీ ఎన్నికల ముంగిట విమర్శల జోరు పెరిగింది. అది నెమ్మది, నెమ్మదిగా గత సీఎం కేసీఆర్ ప్రభుత్వం 30 శాతం కమీషన్లు తీసుకుంటుందని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ బహిరంగంగా చార్జిషీట్ విడుదల చేసింది. నాటి మంత్రుల అవినీతిపై ఆధారాలను సైతం విడుదల చేసింది. నాటి బీఆర్ఎస్ నాయకుల అవినీతి అంటూ 9 పాయింట్లతో ఛార్జ్ షీట్లను విడుదల చేసింది._*
మాజీ సీఎం కేసీఆర్ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేస్తోంది. ప్రతి పని, ప్రాజెక్టుల్లో ప్రభుత్వం అవినీతికి పాల్పడుతుందంటూ, 30 శాతం వాటా తీసుకుంటున్నారంటూ ఆరోపిస్తున్న కాంగ్రెస్ నాయకత్వం.. బీఆర్ఎస్ మంత్రులపై ఛార్జిషీట్ వేస్తోంది. నాటి మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకరరావులపై ఛార్జిషీట్లను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ నేతలు చేసిన అక్రమాలు అంటూ ఇందులో 9 అంశాలను ప్రస్తావించింది. 'దందాల తలసాని' అంటూ.. 'శ్రీనివాస్ యాదవ్'పై, 'కన్నింగ్ కమలాకర్' అంటూ గంగుల కమలాకర్ పై, 'దగాకోరు దయాకర్ రావు' ఎర్రబెల్లి దయాకరరావులపై పలు ఆరోపణలు చేసింది.
*_ఓ నటి కూతురుపై లైంగిక వేధింపులు:_*
నాటి మంత్రి తలసాని తనయుడు సాయికిరణ్ యాదవ్ గతేడాది హోలీ వేడుక సందర్భంగా తన స్నేహితులతో కలిసి ఓ నటి కూతురుపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించింది. మరోవైపు గంగుల కమలాకర్ వక్ఫ్ భూములను ఆక్రమించారని ఛార్జ్ షీట్లలో పేర్కొంది. మంత్రి, ఆయన బంధువులు రూ. 750 కోట్ల పన్నులు ఎగవేశారని ఆరోపించింది. ఎర్రబెల్లి దయాకరరావుపై పెద్ద ఎత్తున భూముల కబ్జా, కమీషన్ల బాగోతం బయటపెట్టింది.
No comments:
Post a Comment