*_అరెస్ట్ అయ్యేది ఎవరు.?_*
Courtesy / Source by :
*_(FREE SPONCER BY అనంచిన్ని బ్రాడ్ కాస్టింగ్)_*
_• బీఆర్ఎస్ నేతల్లో టెన్షన్ టెన్షన్_
_• నేడు పేలనున్న పొలిటికల్ బాంబ్_
_• సాయంత్రం 4 గంటలకు ముహూర్తం ఫిక్స్_
_• కేబినెట్ మీటింగ్ లో సంచలన నిర్ణయం_
_• కాళేళ్వరం, ఫోన్ ట్యాపింగ్, భూదాన్ భూములు, ధరణి, విద్యుత్ కొనుగోళ్లపై విచారణ_
_• అన్నిట్లోనూ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ పేర్లు_
_• నలుగురిలో ఎవరిని అరెస్ట్ చేస్తారోనని ఉత్కంఠ.!_
_• మాజీ మంత్రుల్లోనూ అరెస్ట్ భయం_
_• జాబితాలో మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్ పేర్లు_
_• గత సర్కారులో కీలక నేతలను అరెస్టు చేస్తామన్న మంత్రి పొంగులేటి_
_• నాలుగు రోజుల ముందుగానే దీపావళి_
_• రాష్ట్రంలో చర్చనీయంశంగా పొలిటికల్ బాంబ్స్_
*_('మీడియా టుడే', 'తెలంగాణ వాచ్'ల కోసం ప్రత్యేకంగా అనంచిన్ని వెంకటేశ్వరరావు ప్రముఖ పరిశోధన పాత్రికేయులు, 9440000009)_*
*_రాష్ట్రంలో నాలుగు రోజుల ముందే దీపావళి రానుందా..? అంటే 'అవును' అనే సమాధానం వినిపిస్తోంది. మంత్రి పొంగులేటి వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాలన్నీ ప్రస్తుతం పొలిటికల్ బాంబుల చుట్టూనే తిరుగుతున్నాయి. ధరణి పోర్టల్, కాళేశ్వరం ప్రాజెక్ట్, టెలిఫోన్ ట్యాపింగ్ తో పాటు మొత్తం పదిహేడు అంశాల్లో గత ప్రభుత్వం చేసిన తప్పులపై తాజా ప్రభుత్వం విచారణ చేస్తోంది. సరైన ఆధారాలతో నిందితులపై చర్యలు తీసుకోవడానికి రంగం సిద్ధమైంది. అయితే శుక్రవారం నాడు పొంగులేటి సియోల్ పర్యటన నుంచి హైదరాబాద్ కు చేరుకున్నారు. దీంతో ఎవరి అరెస్ట్ జరగబోతోంది? అన్న అంశం ఉత్కంఠగా మారింది. నేడు సాయంత్రం నాలుగు గంటలకు కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అనేక కుంభకోణాలపై కీలక చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. అనంతరం పొలిటికల్ బాంబ్ పేలనున్నట్లు తెలుస్తోంది. గత సర్కారులో కీలక నేతలు నంబరు 1 నుంచి 8 వరకు అందరినీ అరెస్టు చేస్తామని మంత్రి ప్రకటించారు. దీంతో కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు, సంతోష్ తోపాటు మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్ లు మరికొంతమంది నేతల అరెస్ట్ కు రంగం సిద్ధమైనట్టు ప్రచారం సాగుతోంది. అయితే తమ నాయకులను అరెస్టు చేస్తారనే వార్తల నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తల్లో టెన్షన్ నెలకొంది._*
*_ఫార్ములా రేసుతో మొదలు:_*
అధికారంలోకి వచ్చాక కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని ఆరోపించింది. విచారణకు న్యాయమూర్తిని సైతం నియమించింది. కమిషన్ విచారణ కూడా చేస్తోంది. కాళేశ్వరం విచారణకు హాజరైన అధికారులంతా ప్రాజెక్టుకు కర్త, కర్మ, క్రియా అంతా 'కేసీఆర్' అనే స్పష్టం చేశారు. దీంతో కాళేశ్వరం ఇష్యూలో కేసీఆర్, హరీశ్ రావును అరెస్ట్ చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇక ఫోన్ ట్యాపింగ్ విషయంలోనూ కేసీఆర్, కేటీఆర్ పేర్లే వినిపిస్తున్నాయి. మరోవైపు విద్యుత్ కొనుగోళ్లు కూడా కేసీఆర్ మెడకే చుట్టుకునే ప్రమాదం ఉందన్న చర్చ సాగుతోంది. అలాగే కేసీఆర్ హయాంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా పని చేసిన ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్ ను ఇప్పటికే ఈడీ విచారిస్తోంది. మంత్రి ఎర్రబెల్లి కుటుంబ సభ్యులతో పాటు కేటీఆర్ కుటుంబానికి చెందిన మరికొందరికి మేలు జరిగేలా అమోయ్ కుమార్ అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలా ఏ కేసులో చూసినా కేసీఆర్, కేటీఆర్ పేర్లే వినిపిస్తున్నాయి. మరో వైపు గత ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఫార్ములా రేసులో సైతం అక్రమాలు జరిగాయని రేవంత్ సర్కార్ చెబుతోంది. ఈ అంశంపై సైతం ఏసీబీ సైతం రంగంలోకి దిగింది. ఇవన్నీ గత కేసీఆర్ ప్రభుత్వ హాయంలో జరిగినవే కావడం గమనార్హం.
*_జైలుకు వెళ్లడానికి సిద్ధం: కేటీఆర్_*
తాను జైలుకు వెళ్లానికి సిద్ధమని అదిలాబాద్ మీటింగ్ లో కేటీఆర్ వ్యాఖ్యానించడం సైతం చర్చనీయాశమైంది. పొంగులేటి కామెంట్ల నేపథ్యంలోనే ఆయన ఇలా అన్నారా? అన్న చర్చ జోరుగా సాగుతోంది. ఏ కేసులో రాష్ట్ర ప్రభుత్వం బాంబులు పేలుస్తుందన్నది సాయంత్రానికి తేలనుంది.
బాక్స్:
*_పాపం పండుతోంది..!_*
ఎంతో మంది జర్నలిస్టులను, సామాజిక ఉద్యమకారులను, సమాచార హక్కు కార్యకర్తలను తప్పుడు కేసులతో వేధించిన గులాబీ నేతలు ఊచలు లెక్కించటం ఆహ్వానించ దగ్గ పరిణామం. ఏం పోలీసులను కట్టు బానిసలుగా వాడుకున్నారో అదే పోలీసులు ఇప్పుడు ఆ,యా నేతలను 'బొక్క'లో తోయనున్నారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఏ ఉద్దేశ్యంతో అధికారాన్ని కట్టబెట్టారో... ఆ లక్ష్యం వైపు అడుగులు వేయడం అభినందనీయం.
No comments:
Post a Comment