Thursday, October 3, 2024

అన్యాయాన్ని ప్రశ్నిస్తే ముదిరాజ్ ల మీద దాడులు


స్థానిక *పార్లమెంట్ సభ్యులు* గౌరవనీయులైన *ఈటెల రాజేందర్ గారిని కలిసిన ముదిరాజ్ మత్స్యకార సంఘాల* నాయకులు..
 *బోడుప్పల్ మున్సిపల్ నగర అధ్యక్షులు గోనె శ్రీనివాస్* గారి ఆధ్వరియం లో నిన్న అల్మాస్కుంట లో జరిగిన ఘటన ను ఉద్దేశించి కలవడం జరిగింది.. క్లుప్తంగా వివరించడం జరిగింది 
సానుకూలంగా స్పందించిన ఈటెల రాజేందర్ గారు అప్పటికప్పుడు మేడిప్పల్లి *మండల రెవిన్యూ అధికారిని (MRO) గారికి* ఫోన్ చేసి తక్షణమే చర్య తీసుకోవాల్సిందిగా ఆదేశించడం జరిగింది..
అదేవిధంగా పోలీస్ శాఖ వారిని తగిన విధంగా న్యాయం చేయవలసిందిగా కోరుతూ ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించడం జరిగింది..
ఇట్లు 
 *ముదిరాజ్ మత్స్యకార సంఘాలు*

*****---*****---*****---*****
పాత్రకేయ మిత్రులకు నా నమస్కారాలు...
బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సిగ్గుతో తలదించుకొనే రోజు...
ముదిరాజ్ మత్స్యకార సంఘం అద్వరియం లో చెరువుల కుంటలను కాపాడే తరుణం లో 
 ఆల్మస్ కుంటలో సేంట్ జోసెఫ్ స్కూల్ కొంత భాగం బఫర్ జోన్ ఉందని ఇరిగేషన్ నిర్థరించడం జరిగింది.. అది కాకుండా మళ్ళీ ఇంకో కొత్త కట్టడం బఫర్ జోన్ లో నిర్మిస్తున్నారు అని తెలిసి వాటి ఫోటోలు, వీడియో తీసి తిరిగి వస్తుండగా. తోటకూర ప్రవీణ్ తన కారుతో నన్ను వెంబడించి  బూతు మాటలు తిట్టడం తో పాటు దౌర్జన్యం చేసి ఫోన్ కూడా పగలగొట్టాడు. మా ముదిరాజ్ కులాన్ని హీనంగా దూషించడమే కాకుండా ఇంకోసారి ఇలాంటి పని  చేస్తే నన్ను రెండు రోజుల్లో బ్రతకనీయకుండా చేస్తానని బెదిరించడం జరిగింది. తోటకూర  ప్రవీణ్ వల్ల నాకు ప్రాణగండం  ఉంది అని  అని పోలీస్ లను ఆశ్రయించడం జరిగింది..
అక్రమాలను వెలిగులోకి తేవడం ఒక పౌరునిగా నా హక్కుగా భావించాను..
కానీ ఇలాంటి పరిణామం ఎదురవడం చాలా దురదుష్టకరం..
ఏది ఏమైనా సరే జరిగే అన్యాయాన్ని ఎదుర్కొని ముదిరాజ్ మత్స్యకార సంఘాల సత్తా చాటుతాం..
ఇట్లు 
ముదిరాజ్ మత్స్యకార సంఘాలు



No comments:

Post a Comment