Sunday, October 27, 2024

రాష్ట్ర మంత్రిమండలి సమావేశం పలు నిర్ణయాలు తీసుకుంది.🔹రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఒక డీఏ ఇవ్వాలని మంత్రిమండలి నిర్ణయించింది. డా. బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో ముఖ్యమంత్రి @revanth_anumula గారి అధ్యక్షతన సుధీర్ఘంగా జరిగిన రాష్ట్ర మంత్రిమండలి సమావేశం పలు నిర్ణయాలు తీసుకుంది.

🔹రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని దీపావళి పండుగ సందర్భంగా ఒక డీఏను విడుదల చేయాలని మంత్రివర్గం తీర్మానించింది.

🔹హైదరాబాద్‌లో మెట్రో రైలు రెండో దశ విస్తరణకు సంబంధించిన డీపీఆర్‌కు మంత్రివర్గం ఆమోదించింది.

🔹నాగోల్ – శంషాబాద్, రాయదుర్గం – కోకాపేట్, ఎంజీబీఎస్ – చాంద్రాయణగుట్ట, మియాపూర్ – పటాన్ చెరు, ఎల్ బీ నగర్ – హయత్ నగర్ మొత్తం 76.4 కిలోమీటర్ల మేరకు విస్తరణ చేపట్టాలని మంత్రిమండలి నిర్ణయించింది.

🔹కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్య విధానంలో చేపట్టే మెట్రో రైలు రెండో దశ ప్రాజెక్టు కోసం రూ. 24,269 కోట్లతో ప్రతిపాదనలతో సిద్ధం చేసిన డీపీఆర్‌ను కేంద్రానికి నివేదించాలి.

🔹జీవో 317 కు సంబంధించి మంత్రివర్గ ఉపసంఘం సిఫారసుల మేరకు ఉద్యోగుల మెడికల్, స్పౌజ్, మ్యూచువల్ బదిలీలకు ఆమోదం.

🔹జీవో 46 కు సంబంధించి కీలకమైన స్థానికత అంశం రాష్ట్రపతి పరిధిలో ఉన్నందున న్యాయ సలహా తీసుకుని శాసనసభలో చర్చించిన తర్వాత నిర్ణయం.

🔹రాష్ట్రంలో నవంబర్ 30 వరకు కుల, ఆర్థిక, సామాజిక గణన సర్వే పూర్తి చేయాలి. ఇందుకోసం 80 వేల మంది ఎన్యుమరేటర్లను నియమించి నవంబర్ 4 నుంచి 19 వరకు రాష్ట్రమంతా ఇంటింటి సర్వే చేపడుతారు.

🔹రాష్ట్రంలో పంచాయతీ రాజ్, ఆర్ అండ్ బీ పరిధిలో చేపట్టాల్సిన రోడ్ల నిర్మాణానికి దాదాపు రూ. 25 నుంచి 28 వేల కోట్లు అవసరమని అంచనా వేయగా పీపీపీ విధానంలో పూర్తి చేయడానికి తగిన ప్రణాళికలు సిద్ధం చేయాలి.

🔹ఉస్మానియా ఆస్పత్రి కొత్త భవన నిర్మాణానికి గోషా మహల్ లో పోలీసు శాఖ పరిధిలోని స్థలాన్ని వైద్య శాఖకు  బదిలీ.

🔹ములుగులో ప్రతిపాదిత గిరిజన విశ్వవిద్యాలయానికి 211 ఎకరాల స్థలం కేటాయింపు.

🔹గచ్చీబౌలీ స్టేడియాన్ని ప్రతిపాదిత యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీకి బదలాయింపు.

🔹మధిర, వికారాబాద్, హుజూర్ నగర్ ఏటీసీల ఏర్పాటు, కావలసిన పోస్టుల మంజూరు.

🔹దీపావళి కానుకగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మొదటి విడతగా 3500 ఇళ్ల మంజూరు.

🔹రాష్ట్రంలో ప్రాజెక్టులు, రిజర్వాయర్లలో స్టోరేజీ కెపాసిటీ తగ్గిపోతున్న కారణంగా వాటిల్లో స్టిల్ట్ తొలగించాలని నిర్ణయం.  పైలట్ ప్రాజెక్టుగా మొదట కడెం ప్రాజెక్టులో స్టిల్ట్ తొలగింపు.

🔹గత ప్రభుత్వ హయాంలో రైస్ మిల్లర్ల వద్ద పేరుకుపోయిన దాదాపు రూ. 20 వేల కోట్ల విలువైన ధాన్యం క్లియరెన్స్ కు సంబంధించి సబ్ కమిటీ సమర్పించిన నివేదికకు ఆమోదం.

🔹రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన కోర్టుల్లో ఉద్యోగాల భర్తీకి ఆమోదం.

🔹సమావేశం అనంతరం మంత్రులు @mpponguleti గారు, @Ponnam_INC గారు మీడియాకు ఈ వివరాలను వెల్లడించారు. #Telangana 

Courtesy / Source by : https://x.com/TelanganaCMO/status/1850241613483909631?t=ooqzyNn8tnTRBPVwlKvMXQ&s=19

No comments:

Post a Comment