Saturday, October 19, 2024

పోలీస్ డ్యూటీమీట్ ముగింపు వేడుకల్లో ముఖ్యమంత్రి @revanth_anumula గారు

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్ట మొదటిసారి నిర్వహించిన పోలీస్ డ్యూటీమీట్ ముగింపు వేడుకల్లో ముఖ్యమంత్రి @revanth_anumula గారు పాల్గొన్నారు. రాజాబహదూర్ వెంకటరామారెడ్డి తెలంగాణ పోలీస్ అకాడమీలో జరిగిన ఈ వేడుకలో పోలీసులకు వారు దిశానిర్దేశం చేశారు.

🔸పెరుగుతున్న సైబర్ నేరాలను అరికట్టడంలో అనుసరించాల్సిన విధి విధానాలపై రూపొందించిన పుస్తకాన్ని ముఖ్యమంత్రి గారు ఆవిష్కరించారు.

🔸పోలీసు శాఖకు సంబంధించి వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన వారికి ట్రోఫీలు అందజేశారు. మొదటి బహుమతి పొందిన టీమ్‌కు రూ. 5 లక్షలు, రెండో బహుమతికి రూ3 లక్షలు, మూడో బహుమతిగా రూ. 1.5 లక్షల నగదు అవార్డును ప్రకటించారు.

🔸క్షేత్రస్థాయి నుంచి ఉన్నతాధికారుల వరకు తెలంగాణ పోలీసు శాఖకు స్పూర్తినిచ్చే విధంగా డ్యూటీ మీట్ కార్యక్రమం నిర్వహించినందుకు ఈ సందర్భంగా ఆ శాఖను అభినందించారు.

🔸నేషనల్ పోలీస్ డ్యూటీ మీట్‌లో కూడా తెలంగాణ పోలీసులు రాణించాలని ఆకాంక్షించారు. అందుకు ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తుందని చెప్పారు. దేశంలోనే మిగతా పోలీసులకు ఆదర్శంగా నిలువాలని కోరారు.

🔸సైబర్ క్రైమ్స్, మాదక ద్రవ్యాల రవాణా వంటి కొత్త పుంతలు తొక్కుతున్న నేరాలను అరికట్టడానికి పోలీసులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని సూచించారు.

🔸కానిస్టేబుల్ కిష్టయ్య లాంటి ఎంతో మంది త్యాగాలను తెలంగాణ ప్రజలు మరిచిపోలేదు. పోలీసు ఉద్యోగం జీవనోపాధి కోసం చేసే ఉద్యోగం కాదు. ఇదొక భావోద్వేగం.

🔸పోలీసు కుటుంబాల కష్టం, నష్టాన్ని గమనించే అంతర్జాతీయ స్థాయిలో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ప్రారంభిస్తున్నాం.

🔸శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నందునే హైదరాబాద్ ప్రపంచ స్థాయి నగరంగా ఎదిగింది.

🔸రాష్ట్రంలోకి గంజాయి లాంటి మత్తుపదార్థాలు సరిహద్దు జిల్లాల పోలీసులు అప్రమత్తంగా ఉండాలి.

🔸ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2013 లో కాకినాడలో జరిగిన పోలీస్ డ్యూటీ మీట్ తర్వాత తెలంగాణలో తొలిసారి డ్యూటీ మీట్ నిర్వహణకు అంగీకరించడంపై డీజీపీతో పాటు పోలీసు ఉన్నతాధికారులు ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.

🔸ఈ కార్యక్రమంలో హోం సెక్రెటరీ రవి గుప్తా గారు, @TelanganaDGP డాక్టర్ జితేందర్ గారు, ఇంటలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి గారు, తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీజీపీ (సీఐడీ) @Shikhagoel_IPS గారు ఇతర ఉన్నతాధికారులు, వివిధ విభాగాల పోలీసులు పాల్గొన్నారు. @RBVRR_TGPA @abhilasha_bish
#TelanganaPolice #PoliceDutyMeet 

Courtesy / Source by : https://x.com/TelanganaCMO/status/1847670006143725970?t=5kf9n9oVOASMYZEclk7uTg&s=19

No comments:

Post a Comment