Sunday, October 6, 2024

“ఇది ఉద్యోగం కాదు.ఒక భావోద్వేగం. ఉద్యోగాన్ని ఉద్యోగంగా కాకుండా ఒక బాధ్యతగా నిర్వర్తించాలి”

కొత్తగా ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరుతున్న యువతీ యువకులు తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి @revanth_anumula గారు కోరారు. “ఇది ఉద్యోగం కాదు. ఒక భావోద్వేగం. ఉద్యోగాన్ని ఉద్యోగంగా కాకుండా ఒక బాధ్యతగా నిర్వర్తించాలి” అని ఉద్భోదించారు.

🔸ప్రజాపాలనలో కొలువుల పండుగ పేరుతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్‌, అగ్రికల్చర్ ఆఫీసర్స్‌, రెసిడెన్షియల్ స్కూల్స్‌ ప్రిన్సిపల్స్‌, ఫిజికల్‌ ఎడ్యుకేషన్ టీచర్స్‌, వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్స్‌, లైబ్రేరియన్స్‌ తదితర 1635 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఉద్యోగ నియామకాల పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా సీఎం గారు పలు అంశాలపై మాట్లాడారు.

🔸కొత్తగా ఉద్యోగాల్లో చేరుతున్నప్పుడు ఎంతటి ఉత్సాహంతో చేస్తారో ఉద్యోగ విరమణ చేసే సందర్భంలో కూడా అంతే ఉత్సాహం ఉండేలా పని చేయాలి.

🔸ఎంతో మంది యువకుల బలిదానాలపైన తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది.  ఆ బాధ్యతను గుర్తెరిగే అత్యంత ప్రాధాన్యతగా ఉద్యోగ నియామకాలు చేపడుతున్నాం.

🔸అధికారం చేపట్టిన 90 రోజుల్లో 30 వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగ నియామక పత్రాలు అందించాం. దసరా పండుగ శుభసందర్భంలో కుటుంబాల్లో ఆనందం నింపాలని 11,062 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తున్నాం.

🔸తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా చేపడుతున్న రీజినల్‌ రింగ్‌ రోడ్డు, మూసీ రివర్‌ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌, ఫోర్త్‌ సిటీ వంటి వాటిల్లో కొత్తగా ఉద్యోగాల్లో చేరిన వారు  భాగస్వాములు కావాలి.

🔸హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ, హైకోర్టు, ఉస్మానియా హాస్పిటల్‌, అసెంబ్లీ భవనాల వంటి చారిత్రక కట్టడాలు, నాగార్జున సాగర్‌, శ్రీశైలం, శ్రీరాంసాగర్‌, నిజాం సాగర్‌, హిమాయత్‌సాగర్‌, ఉస్మాన్‌ సాగర్‌ లాంటి గత ప్రాజెక్టుల వైభవాలను వివరిస్తూ కొత్తగా ఉద్యోగాల్లో చేరుతున్న ఇంజనీర్లు అటువంటి నిర్మాణాల నాణ్యత, ప్రమాణాలను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.

🔸మురికి కూపంగా మారి విషం చిమ్ముతున్న మూసీని ప్రక్షాళన చేపట్టాం. గత నిర్లక్ష్యం కారణంగా ఇప్పటికే అనేక జీవితాలు మూసీలో మగ్గిపోయాయి. ఆ కుటుంబాలను బాగుపరిచేందుకు మంచి ఇళ్లు, వారి పిల్లలకు స్కూలు సౌకర్యాలు కల్పించే ఏర్పాట్లు చేస్తున్నాం.

🔸మూసీ ప్రక్షాళ కోసం గత ఆరు నెలలుగా 33 టీమ్‌లతో సర్వే చేయించాం. పేద వారి కష్టం నష్టం తెలిసిన వాడిగా నిర్వాసితులందరికీ మంచి జీవితం అందిస్తాం.

🔸ఈ కార్యక్రమంలో మంత్రివర్గ సహచరులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగారు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. #TGPSC #Telangana
#MusiRiverFrontDevelopment #RegionalRingRoad 

Courtesy / Source by :  https://x.com/TelanganaCMO/status/1842982442031849485?t=alT6_ICAW7WiylE0xXwwvA&s=19

No comments:

Post a Comment