Saturday, November 12, 2022

బీజేపీ కార్యకర్తల పోరాటం అభినందనీయం.... నన్ను తిట్టినా పర్వాలేదు కానీ,... ప్రధాని మోదీ....!

*బీజేపీ కార్యకర్తల పోరాటం అభినందనీయం.... నన్ను తిట్టినా పర్వాలేదు కానీ,... ప్రధాని మోదీ....!*

హైదరాబాద్‌: తెలంగాణ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడానికి రావడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.అయితే తెలంగాణలో చీకట్లు తొలగిపోవాలంటే.. బీజేపీ అధికారంలోకి రావాల్సిందేనని అన్నారు. శనివారం రామగుండం పర్యటనకు బయలుదేరే ముందు బేగంపేట ఎయిర్‌పోర్ట్‌ బయట బీజేపీ శ్రేణులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.

భారత్‌ మాతా కీ జై.. నినాదంతో తన ప్రసంగం ప్రారంభించారు ప్రధాని మోదీ. ''రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని జాతికి అంకితం చేయబోతున్నాం. హైదరాబాద్‌లో కార్యకర్తలతో మాట్లాడాలని బండి సంజయ్‌ కోరారు. నేను కూడా మీలాగే బీజేపీకి చెందిన ఓ చిన్న కార్యకర్తను. తెలంగాణలో బీజేపీ కార్యకర్తల తీరు నాకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తోంది. ఎవరికీ భయపడకుండా పని చేస్తున్నారు. మీరు ఎంత గట్టిగా పోరాడారో మునుగోడు ఉప ఎన్నికను చూస్తే అర్థమవుతుంది.

తెలంగాణ పేరుతో పార్టీ పెట్టినవాళ్లు.. పదవులు అనుభవిస్తున్నారు. తెలంగాణ ప్రజలకు నమ్మక ద్రోహం చేస్తున్నారు. తెలంగాణ ప్రజలను మాత్రం పట్టించుకోవట్లేదు. తెలంగాణలో కమలం వికసించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అందుకు ఉప ఎన్నికల ఫలితాలే నిదర్శనం. మునుగోడు బైపోల్‌ కోసం.. మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా వచ్చారు. ఒక్క ఉప ఎన్నిక కోసం ప్రభుత్వమే తరలివచ్చింది.

అవినీతిపరులంతా ఒక్కటయ్యేందుకు యత్నిస్తున్నారు. కానీ, ఆన్‌లైన్‌ పేమెంట్స్‌తో అవినీతికి చెక్‌ పడుతోంది. తెలంగాణలో అవినీతి రహిత పాలన అందించేందుకు బీజేపీ సిద్ధంగా ఉంది. ఐటీ హబ్‌ అయిన హైదరాబాద్‌లో మూఢనమ్మకాలు రాజ్యమేలుతున్నాయి. కేబినెట్‌లో ఎవరినీ ఉంచాలో.. ఎవరిని తొలగించాలో ఆ మూఢనమ్మకాలే నిర్ణయిస్తున్నాయి. తెలంగాణలో జరిగే ఈ వ్యవహారం దేశానికి తెలియాల్సిన అవసరం ఉంది. ఫ్యామిలీ ఫస్ట్‌ కాదు.. పీపుల్స్‌ ఫస్ట్‌ అనేది బీజేపీ నినాదం.

22 ఏళ్లుగా నన్ను తిట్టడమే కొందరు పనిగా పెట్టుకున్నారు. మోదీని తిట్టేవాళ్లను మీరు(కార్యకర్తలను ఉద్దేశించి..) పట్టించుకోవద్దు. వాళ్లకు నన్ను తిట్టడం తప్ప వేరే పనిలేదు. తిట్లు తింటూనే బీజేపీ పెరిగి.. పెద్దైంది. ప్రతీరోజూ రెండు, మూడుకేజీల తిట్లను తింటాను. అందుకే అలిసిపోను. ఆ తిట్లు ప్రోటీన్లుగా మారడంతో ప్రజాసేవ చేస్తాను. నన్ను, బీజేపీని తిడితే తెలంగాణకు లాభం ఉంటుందంటే తిట్టండి. కానీ, తెలంగాణ ప్రజలను తిడితే మాత్రం సహించం. తెలంగాణ ప్రజల ఆకాంక్షలతో ఆడుకుంటే ఊరుకోం.

దోచుకున్న వాళ్లను విడిచిపెట్టే ప్రసక్తే లేదు. మీ(బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి) పని తీరు చూస్తుంటే తెలంగాణలో చీకట్లు తొలగిపోయి.. కమలం వికసించడం ఖాయమనిపిస్తోంది అని కార్యకర్తల్లో జోష్‌ నింపారు ప్రధాని మోదీ.

*సుజీవన్ వావిలాల*🖋️ 

Friday, November 11, 2022

ICFAI Business School Hyderabad లో విద్యార్ధి ఫై దాడి

*హైదరాబాద్ ఐబీఎస్ లో విద్యార్థిపై దాడి*

హైదరాబాద్‌: శంకర్‌పల్లిలోని ఐబీఎస్‌లో(ఐసీఎఫ్‌ఏఐ ICFAI బిజినెస్‌ స్కూల్‌) దారుణం వెలుగుచూసింది. ఓ జూనియర్‌పై సీనియర్‌ విద్యార్థులు దాడి చేశారు.హాస్టల్‌ రూమ్‌లో బంధించి చిత్రహింసలకు గురిచేశారు. తనేం చేయలేదని విద్యార్థి చెబుతున్నా.. పట్టించుకోకుండా సీనియర్లు పైశాచికంగా ప్రవర్తించారు. ఈ ఘటనను అక్కడే ఉన్న మరో విద్యార్థి వీడియో తీయగా.. దాడి దృశ్యాలను మంత్రి కేటీఆర్‌, పోలీస్‌ కమిషనర్‌కు ట్విటర్‌లో షేర్‌ చేశారు.

*సుజీవన్ వావిలాల*🖋️ 

బిల్లులను తొక్కి పెట్టాననడం సబబు కాదు..... గవర్నర్ తమిళసై.....!*

*బిల్లులను తొక్కి పెట్టాననడం సబబు కాదు..... గవర్నర్  తమిళసై.....!*

హైదరాబాద్‌: పెండింగ్‌లో ఉన్న బిల్లులపై సందేహాలు నివృత్తి చేసుకోవాల్సిన అవసరముందని తెలంగాణ గవర్నర్‌ తమిళి సై సౌందరరాజన్‌ తెలిపారు.రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గవర్నర్‌ మాట్లాడుతూ... ప్రభుత్వ బిల్లుల విషయమై పరిశీలిస్తున్నట్టు చెప్పారు. ''ప్రభుత్వం నుంచి నా వద్దకు బిల్లులు వచ్చాయి. బిల్లుల విషయమై పరిశీలిస్తున్నాం. సందేహాలు నివృత్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది. అన్ని బిల్లులను సమగ్రంగా పరిశీలించేందుకే సమయం తీసుకున్నా. ఆ బాధ్యత నాపై ఉంది. ఖాళీగా ఉన్న టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ పోస్టులను భర్తీ చేయాలని చెప్పాను.

ఖాళీల విషయమై ప్రభుత్వానికి సమగ్ర నివేదిక ఇచ్చాను. పోస్టులు భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని పదే పదే డిమాండ్‌ చేస్తున్నా. వర్సిటీల ఉమ్మడి నియామక బోర్డుపై ప్రక్రియ కొనసాగుతోంది. నేను ఎలాంటి బిల్లులు ఆపలేదు. బిల్లులను తొక్కిపెట్టాననడం సబబుకాదు. కొత్త విధానంపై నాకు సందేహాలు ఉన్నాయి. కొత్త విధానం అవసరమా? కాదా అని పరిశీలిస్తున్నాం. బోధనా పోస్టులను భర్తీ చేయాలని మొదటి నుంచి చెబుతూనే ఉన్నా. కొత్త నియామక బోర్డు అవసరం ఏమొచ్చింది. వీసీ పోస్టులు కూడా చాలా రోజులుగా ఖాళీగా ఉన్నాయి. నేను పదే పదే డిమాండ్‌ చేశాక వీసీలను నియమించారు. 8 ఏళ్లుగా వీసీలను నియమించకపోతే ఐకాస ఎందుకు ఆందోళన చేయలేదు. ఒక నెల నావద్ద ఆగిపోగానే ఎందుకు ఆందోళన చేస్తున్నారు. నియామకాల బిల్లుకే మొదటి ప్రాధాన్యం ఇచ్చాను. బిల్లులను ఒకదాని వెంట ఒకటి పరిశీలిస్తున్నా. బిల్లులు పంపించగానే ఆమోదించడం మాత్రమే నా విధి కాదు. నేను ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాననడం ఆశ్చర్యకరం'' అని గవర్నర్‌ అన్నారు
*ప్రగతి భవన్‌లా కాదు.. రాజ్‌భవన్‌ తలుపులు తెరిచే ఉంటాయి..*

కొంత మంది ప్రొటోకాల్‌ గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారు. నా పర్యటనలకు సంబంధించి పూర్తి వివరాలు ముందుగానే సంబంధిత అధికారులకు పంపిస్తాను. గతంలో నా పర్యటనల్లో ప్రొటోకాల్‌ పాటించని కలెక్టర్లు, ఎస్పీలపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందో చెప్పాలి. మీరు ప్రొటోకాల్‌ పాటించేవారైతే గవర్నర్‌కు స్వాగతం పలికేందుకు రాని అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోలేదు? మీరు మీకు నచ్చినట్లు చేయొచ్చు.. ప్రతిఒక్కరిపై ఆరోపణలు చేయొచ్చు. కేవలం రాజ్‌భవన్‌ గౌరవాన్ని దిగజార్చేందుకే ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తోంది. రాష్ట్రంలో ఎక్కడ ఎలాంటి సమస్య ఉన్నా రాజ్‌భవన్‌కు వెళ్లి నిరసన తెలపాలని చెబుతున్నారు. రాజ్‌భవన్‌ ఎప్పుడూ అందుబాటులోనే ఉంటుంది. ఎంతో మంది వచ్చి కలుస్తున్నారు. ఇక్కడికి వచ్చేవారిని ఎవరూ అడ్డుకోవడం లేదు. ప్రగతిభవన్‌లా కాదు.. రాజ్‌భవన్‌ ద్వారాలు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. ఎవరైనా రాజ్‌భవన్‌కు రావొచ్చు... విజ్ఞప్తులు ఇవ్వొచ్చు'' అని గవర్నర్‌ తెలిపారు.

*సుజీవన్ వావిలాల*🖋️

Thursday, November 10, 2022

పదేళ్ల కోసారి ఆధార్ అప్ డేట్..... చేయాల్సిందే...!

*పదేళ్ల కోసారి ఆధార్ అప్ డేట్..... చేయాల్సిందే...!*

*సపోర్టింగ్‌ డాక్యుమెంట్లు ఇవ్వాలి*

*నోటిఫికేషన్‌ జారీ*

న్యూఢిల్లీ: ఆధార్‌ నియమ నిబంధనలను కేంద్ర ప్రభుత్వం సవరించింది.ఆధార్‌ నంబర్‌ కలిగి ఉన్నవారు ఎన్‌రోల్‌మెంట్‌ తేదీ నుంచి పదేళ్లు పూర్తయ్యాక గుర్తింపు, చిరునామా ధ్రువీకరణ వంటి పత్రాలను (సపోర్టింగ్‌ డాక్యుమెంట్స్‌) కనీసం ఒక్కసారైనా అప్‌డేట్‌ చేసుకోవాలని వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. దీనివల్ల సీఐడీఆర్‌ డేటాబేస్‌లో ఆధార్‌కు సంబంధించిన సమాచారంలో కచ్చితత్వాన్ని కొనసాగింవచ్చని తెలియజేసింది. ఎన్‌రోల్‌మెంట్‌ జరిగాక ప్రతి పదేళ్లకోసారి సపోర్టింగ్‌ డాక్యుమెంట్లు ఆప్‌డేట్‌ చేసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని వివరించింది.

పదేళ్ల కంటే ఎక్కువ రోజుల క్రితం ఆధార్‌ కార్డు పొంది, ఇప్పటిదాకా ఒక్కసారి కూడా గుర్తింపు, నివాస ధ్రువీకరణ పత్రాలను అప్‌డేట్‌ చేసుకోనివారు వెంటనే ఆ పూర్తి చేయాలని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(యూఐడీఏఐ) గత నెలలో విజ్ఞప్తి చేసింది. మై ఆధార్‌ పోర్టల్, మై ఆధార్‌ యాప్‌ ద్వారా లేదా ఆధార్‌ ఎన్‌రోల్‌మెంట్‌ కేంద్రాల్లో డాక్కుమెంట్లు సమర్పించి, వివరాలు ఆప్‌డేట్‌ చేసుకోవచ్చని సూచించింది. దేశంలో ఇప్పటిదాకా 134 కోట్ల మందికి ఆధార్‌ సంఖ్యలను జారీ చేశారు. గుర్తింపు కార్డులు, చిరునామా మారినవారు కూడా సంబంధిత ధ్రువపత్రాలను సమర్పించి, ఆధార్‌ కార్డుల్లో వివరాలు మార్చుకోవచ్చు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాల ద్వారా లబ్ధి పొందాలంటే ఆధార్‌ నంబర్‌ కలిగి ఉండడం తప్పనిసరిగా మారింది.

*సుజీవన్ వావిలాల*🖋️ 

తెరాస MP ఇంట్లో ఈడీ సోదాలు....!

*తెరాస MP ఇంట్లో ఈడీ సోదాలు....!*

హైదరాబాద్‌: తెరాస రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) సోదాలు నిర్వహించింది. హైదరాబాద్‌ శ్రీనగర్‌ కాలనీలోని ఆయన ఇంట్లో గురువారం ఉదయం నుంచి ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.గ్రానైట్ వ్యాపారాలతో ఎంపీ రవిచంద్రకు సంబంధమున్న నేపథ్యంలో ఈ సోదాలు జరిగినట్లు తెలుస్తోంది. బుధవారం తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్‌తో పాటు మరికొందరు గ్రానైట్‌ వ్యాపారుల ఇళ్లలో ఈడీ సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే.

*సుజీవన్ వావిలాల*🖋️ 

Wednesday, November 9, 2022

MLA రాజాసింగ్ కు బెయిల్....మంజూరు

*MLA రాజాసింగ్  కు బెయిల్....మంజూరు*

హైదరాబాద్‌: గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు ఎట్టకేలకు ఊరట లభించింది. హైకోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది.సమాజంలో మతవిధ్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నారంటూ రాజాసింగ్‌పై ఇటీవల పోలీసులు పీడీ యాక్టు నమోదు చేసి అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో అప్పటి నుంచి ఆయన చర్లపల్లి జైల్లో రిమాండ్‌ ఖైదీగా ఉన్నారు.

పోలీసులు పీడీ చట్టం నమోదు చేయడాన్ని వ్యతిరేకిస్తూ రాజాసింగ్‌ సతీమణి ఉషాభాయి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ కౌంటరు దాఖలు చేశారు. ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్‌ను వ్యతిరేకిస్తూ రాజాసింగ్‌ తరఫు న్యాయవాది రవిచందర్‌ వాదనలు వినిపించారు. పీడీ చట్టం కింద నమోదైన కేసులను కొట్టివేస్తూ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను రవిచందర్‌ ప్రస్తావించారు. రాజాసింగ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ సమాజంలో రెచ్చగొట్టేవిధంగా వ్యవహరిస్తున్నారని అడ్వొకేట్‌ జనరల్‌ ప్రసాద్‌ వాదించారు. ఇప్పటికే ఆయనపై వివిధ పోలీస్‌ స్టేషన్లలో 100కు పైగా కేసులు నమోదయ్యాయని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. నిన్న ఇరువైపులా వాదనలు విన్న హైకోర్టు ఇవాళ తీర్పు వెలువరించింది

*సుజీవన్ వావిలాల*🖋️ 

భారత దేశంలో మానవ హక్కుల పరిస్థితి పై ఐక్య రాజ్య సమితి లో భారత దేశ ప్రతినిదుల వివరణ విందాం


*భారత  దేశంలో మానవ హక్కుల పరిస్థితి పై ఐక్య రాజ్య సమితి లో  భారత దేశ ప్రతినిదుల వివరణ విందాం* 

ఐక్య రాజ్య సమితి లో ఒక శాఖ గా పని చేసే,మానవ హక్కుల కౌన్సిల్ (U.N.O-HUMAN RIGHTS COUNCIL) ప్రతి నాలుగున్నర సంవత్సరాల కొక సారి ,సమితి సభ్య దేశాలుగా ఉన్న ఆయా 193 దేశాల నుండి వాళ్ళ దేశాల్లో  హక్కుల  పరిస్థితి పై నివేదిక తెప్పించుకొని ఆయా  దేశాలకు నివేదికను పంపించి వివరణ ను కోరుతుంది.

ఈ నివేదిక లోని హక్కుల ఉల్లంఘన అంశాలను వివిధ హక్కుల సంఘాలు, స్వచ్ఛంద  సంస్థలు ,సామాజిక ఆలోచనా పరుల నుండి ఐక్య రాజ్య సమితి సేకరించి నివేదిక తయారు చేస్తుంది.

ఈ ప్రక్రియను యూనివర్సల్ పీరియాడిక్  రివ్యూ అని (Universal Periodic Review) పిలుస్తారు. 
 ప్రతి నాలుగు న్నర  సంవత్సరాలకు జరిగే ఈ ప్రక్రియను సైకిల్ (విడత ) పిలు స్టారు. 
2022 వ సంవత్సరం లో జరిగే ఈ ప్రక్రియ నాలుగవది . 

ఐక్య రాజ్య సమితి మన దేశంలో హక్కుల పరిస్థితిపై తయారు చేసిన నివేదిక పై భారత ప్రతినిధుల బృందం వివరణ ఇస్తూ జవాబు 
చెప్పుతారు. 
ఈ కార్యక్రమం రేపటి రోజున (10-11-222-గురువారం )భారత కాలమానం ప్రకారం రాతి 7 గంటల నుంచి 10.30 వరకు ఉంటుంది . 

ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్ /స్మార్ట్ ఫోన్/లాప్ టాప్ /డెస్క్ టాప్ కంప్యూటర్లలో చూడవచ్చు.

ఈ కింద ఇవ్వ బడిన లింక్ పై క్లిక్ చేసి మీరు వీక్షించవచ్చు. 
//htpps://media.un.org/en/webtv//

హక్కుల సంఘాల సభ్యులు,వివిధ సంస్థల భాద్యులు,రాజకీయ పార్టీల కార్య కర్తలు,ప్రజాస్వామిక ఆలోచనా  పరులు, ఈ కార్యక్రమాన్ని వీక్షించాలని 
కోరుతున్నాం.  
తెలంగాణ రాష్ట్రం లో
*మానవ హక్కులఅంశాల 
ఉల్లంఘనల పై నివేదిక  తయారు చేసిన గ్రూప్*
తరపున
ఎస్.జీవన్ కుమార్
---------
వివరాలకు :
రోహిత్ --99858 03222
సంజీవ్--99855 88384