Monday, July 8, 2024
. మేడ్చల్ జిల్లా లో విద్యాశాఖ అధికారులు లేరా?
రచయిత,మాజీ మావోయిస్టు మహ్మద్ హుస్సేన్ ను అరెస్ట్ చేసిన పోలీసులు
మహ్మద్ హుస్సేన్ ను వెంటనే విడుదల చేయాలి
Human Rights Forum

రచయిత, మాజీ మావోయిస్టు మహ్మద్ హుస్సేన్ ను పోలీసులు జమ్మికుంట లోని ఆయన ఇంటినుండి అక్రమంగా పట్టుకెళ్ళటాన్ని ఖండిస్తున్నాం.
జమ్మికుంట లోని పాత మార్కెట్ వద్ద తన సొంత ఇంటిలో ఉన్న మహమ్మద్ హుస్సేన్ ను ఈరోజు తెల్లవారుజామున ఆరు గంటలకు పోలీసులు దౌర్జన్యం గా ఇంట్లోకి ప్రవేశించి, అరెస్టు నోటీసు లేకుండా, బంధువులకు ఏ విషయమూ తెలియజేయకుండా జీపులో ఎక్కించుకొని వెళ్లిపోయారు. మఫ్టీలో వచ్చిన వాళ్ళు పోలీసులమని చెప్పటం తప్ప, తాము ఎక్కడ నుండి వచ్చాము, ఎందుకు తీసుకెళ్తున్నాము వంటి కనీస సమాచారం కూడా ఇవ్వలేదు. స్థానిక పోలీస్ స్టేషన్లో కూడా సమాచారం లేదు. బందువులు, తెలిసిన వాల్లు అనేక ప్రయత్నాలు చేస్తే కరీంనగర్ పోలీసులనీ, బెల్లంపల్లి పోలీసులనీ అనధికారిక సమాచారం తప్ప అధికారిక సమాచారం ఏదీ లేదు.
మహ్మద్ హుస్సేన్ గత పదిహేనేళ్లుగా సాధారణ, చట్టబద్ధ జీవనం సాగిస్తున్న సీనియర్ సిటిజన్. ఒక పాత పరిచయస్తునికి కోర్టులో స్యూరిటీ పడ్డాడనే ఏకైక కారణంతో, చట్టాలను గౌరవించాల్సిన పోలీసులే ఈ విధంగా అక్రమ పద్ధతుల్లో చట్ట విరుద్ధంగా పట్టుకెళ్లటం పౌరుల రాజ్యాంగ హక్కులను ఉల్లంఘించటమే అవుతుంది. పోలీసులు ఇప్పటికైనా మహమ్మద్ హుస్సేన్ ను ఏదైనా విచారణకై తీసుకెళ్ళి ఉంటే, ఆ విషయం ప్రకటించి, వెంటనే విడుదల చేయాలి.
ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పాలకులు వెంటనే కల్పించుకొని పోలీసుల ఈ దౌర్జన్యాన్నీ, చట్ట బాహ్యతనూ ఆపించి, మహమ్మద్ హుస్సేన్ ను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం.
ప్రస్తుత ప్రభుత్వం ఈ విషయంలో కల్పించుకోకపోతే గత ప్రభుత్వం లాగానే ఈ ప్రభుత్వం కూడా పోలీసుల చట్ట బాహ్యతను సమర్డిస్తున్నట్టుగా భావించవలసి వస్తుంది.
ఎస్. జీవన్ కుమార్,
ఉభయ రాష్ట్రాల సమన్వయ కమిటీ సభ్యులు.
డాక్టర్ ఎస్. తిరుపతయ్య,
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.
జమ్మికుంట,
08.07.2024
Sunday, July 7, 2024
A scientist from Hyderabad has spearheaded a groundbreaking development
𝗠𝗮𝗻𝗶𝗸𝗼𝗻𝗱𝗮 𝗣𝘂𝗯 𝗥𝗮𝗶𝗱 𝗥𝗲𝘃𝗲𝗮𝗹𝘀 𝗦𝗵𝗼𝗰𝗸𝗶𝗻𝗴 𝗗𝗲𝘁𝗮𝗶𝗹𝘀
Thanks for all the responses
'ఐ డ్రీం మురళీ'ని అర్భన్ నక్సలైట్ల (?) ముసుగులో బెదిరిస్తున్నారా?
Saturday, July 6, 2024
*_రెండు తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలి_*
ఈరోజు జరిగిన ఈ సమావేశం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు హర్షించారు.
2014 జూన్ నుంచి 2023 డిసెంబర్ వరకు ఏమి జరిగిందో అందరికి తెలిసిందే కండ్ల ముందు కనిపిస్తుంది.
పెద్దలు @ncbn గారు & @revanth_anumula గార్ల సహృద్బావ సమావేశం అభినందనీయం ✊
@TelanganaCMO @INCTelangana @JaiTDP
Bplkm✍️