Sunday, July 7, 2024

'ఐ డ్రీం మురళీ'ని అర్భన్ నక్సలైట్ల (?) ముసుగులో బెదిరిస్తున్నారా?

ఐ డ్రీం మురళీపై..
*_అర్బన్ నక్సల్ కన్ను_*
_# హైదరాబాద్ లో కేసు నమోదు_
_# పోలీసు వర్గాల ఆరా.!_
_# అండగా ఉంటామన్న టిజేఎస్ఎస్, ఆలిండియా వర్కింగ్ జర్నలిస్ట్ సంఘాలు_

Courtesy / Source by:
_(అనంచిన్ని వెంకటేశ్వరావు, ప్రముఖ పరిశోధన పాత్రికేయులు, 9440000009)_

*_అతనో సీనియర్ పాత్రికేయులు, ఆసక్తి కొద్ది క్రైం వార్తలపై ఫోకస్. ఇంటర్వ్యూలు, లోతైన సంభాషణలు ఆయనకు సొంతం. వృత్తిలో భాగంగా ఆయన అటు పోలీసు అధికారులను, ఇటు మాజీ నక్సలైట్లను, మారిన నేరస్థుల గురించి, వారి జీవితానుభవాలను 'బుల్లి తెర'పై ఎలాంటి అరమరికలు లేకుండా సమర్థవంతంగా చూపుతారు. అలాంటి 'ఐ డ్రీం మురళీ'ని అర్భన్ నక్సలైట్ల (?) ముసుగులో బెదిరిస్తున్నట్లు కేసు నమోదు కావడం సంచలనం కలిగిస్తోంది._*

*_అసలేం జరిగింది.?:_*
గత కొద్ది సంవత్సరాలుగా దేశంలో తీవ్రవాదం ప్రబలింది. సామాజిక బాద్యతగా, సమాజంలో మార్పు ఆశించే పాత్రికేయులు డిజిటల్ మీడియా వేదికగా ప్రజలకు అనేక అంశాల ద్వారా చేరువవుతున్నారు‌. అందులో 'ఐ డ్రీం' ద్వారా పోలీసులు చేధించిన పలు కేసులు, వివాదాస్పద విషయాలు, మాజీ మావోయిస్టుల స్థితిగతులు, వ్యక్తిగత జీవన విధానాలతో పాటు, మారిన నేరస్తుల అంతరంగాలను ఆయన ఆవిష్కరిస్తున్నారు. ఈ విధంగా సుమారు వేలాది కథనాలను ప్రజలకు అందించారు. అభినందనీయం. హర్షణీయం.

*https://epaper.prajaprashna.com/clip/37708*

*_2020 నుంచే టార్గెట్:_*
అందరూ అనుకున్నట్లు
'ఐ డ్రీం మురళీ'ని టార్గెట్ చేయటం ఇది మొదటిసారి కాదు. బంజారాహిల్స్ పోలీస్టేషన్ లో తాజాగా నమోదైన కేసు పూర్వాపరాలలోకి వెళితే 2020 నుంచే అర్బన్ నక్సలైట్  లోగోతో బెదిరింపులకు దిగినట్లు తెలుస్తోంది. మాజీ మావోయిస్టుల ఇంటర్వ్యూలు వద్దంటూ 'పీపుల్స్ మర్చ్' పత్రికలో హెచ్చరించినట్లు తెలిసింది. 

*_అమెరికా కేంద్రంగా..:_*
'ఐ డ్రీం' మురళీని 
+1 (530) 564-1311 నెంబర్ ద్వారా బెదిరింపులకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఇది అమెరికా,  స్వీడన్ నుంచి వచ్చినట్లు కనిపిస్తున్నా... తీవ్రవాద ప్రభావిత ప్రాంతం అయిన అప్ఘనీస్థాన్ పరిసర ప్రాంతాల నుంచి వచ్చినట్లు తెలుస్తోంది. వచ్చిన వాయస్ మెసేజ్ లో రాయలసీమ యాస ఉండటం గమనార్హం. అయితే ఆ ప్రాంతం నుంచి ఎవరైనా ఈ వాయస్ మెసేజ్ ను ఇతరులకు పంపితే... వారు విదేశీ నెంబర్ నుంచి మురళీకి పంపారా..? అనే కోణంలో పోలీసులు పరిశోధన చేస్తున్నారని తెలిసింది.

Box:
*_అండగా ఉంటాం: జర్నలిస్ట్ సంఘాలు_*
సీనియర్ జర్నలిస్ట్ 'ఐ డ్రీం' మురళీని అర్భన్ నక్సలైట్ల పేరుతో బెదిరించటాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు, తాము మురళీకి అండగా ఉంటామన్న తెలంగాణ రాష్ట్ర జర్నలిస్టుల సంక్షేమ సంఘం, ఆల్ ఇండియా వర్కింగ్ జర్నలిస్ట్ సంఘాలు ప్రకటించాయి. మురళీకి, ఆయన కుటుంబ సభ్యులకు భద్రత కల్పించాలని 
టిజేఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి గౌటి రామకృష్ణ, ఏఐడబ్ల్యూజెఎఫ్ జాతీయ అధ్యక్షులు కే.కోటేశ్వర్ రావులు సోమవారం తెలంగాణ రాష్ట్ర డిజిపిని, చీఫ్ సెక్రటరీలను కలసి వినతి పత్రం అందజేయనున్నట్లు తెలిపారు.

No comments:

Post a Comment