Saturday, July 6, 2024

తెలంగాణ.. ఆంద్రప్రదేశ్ దోస్తీ

విభజన అనంతరం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య సుధీర్ఘ కాలంగా అపరిష్కృతంగా ఉన్న అంశాలపై జ్యోతీరావు పూలె ప్రజాభవన్‌లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం చాలా సుహృద్భావ వాతావరణంలో జరిగింది.

🔹తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ @ncbn పాటు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి శ్రీ @Bhatti_Mallu, మంత్రులు శ్రీ @OffDSB , శ్రీ @PonnamLoksabha ఏపీ మంత్రులు శ్రీ @SatyaAnagani , శ్రీ @kanduladurgesh , శ్రీ @bcj_reddy  లతో పాటు ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

🔹ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని అపరిష్కృత అంశాలను పరిష్కరించుకోవడానికి ఇరు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శుల స్థాయిలో ఒక ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని సమావేశం నిర్ణయించింది.

🔹పైస్థాయిలో నిర్ణయాలు తీసుకోవలసిన అంశాలను పరిశీలించి నిర్ణయించడానికి ఇరు రాష్ట్రాల మంత్రుల స్థాయిలో మరో కమిటీని ఏర్పాటు చేయాలని సమావేశం తీర్మానించింది.

🔹మంత్రుల స్థాయి కమిటీలో అంగీకారానికి రాలేని ఏవైనా అంశాలంటే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల స్థాయిలో నిర్ణయాలు తీసుకోవాలని నిర్ణయించింది.

🔹మాదక ద్రవ్యాల నియంత్రణ, సైబర్ క్రైమ్ నియంత్రణ కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రత్యేక డ్రైవ్ విషయంలో తెలంగాణ విజ్ఞప్తి మేరకు ఇరు రాష్ట్రాల నుంచి అదనపు డీజీ స్థాయి అధికారులతో సమన్వయ కమిటీని ఏర్పాటు చేయడానికి ఆంధ్రప్రదేశ్ అంగీకరించింది.
#Telangana #AndhraPradesh 

Courtesy / Source by : https://x.com/TelanganaCMO/status/1809626367685980242?t=kGbSZJ8S6iTZ8v4iRRPn1g&s=19

Friday, July 5, 2024

_*జర్నలిస్టుల కుటుంబ సభ్యులకు... రూ. లక్ష చొప్పున ఆర్థిక సహాయం...*_

*జర్నలిస్టుల కుటుంబ సభ్యులకు... రూ. లక్ష చొప్పున ఆర్థిక సహాయం....*

హైదరాబాద్ : తెలంగాణలో ఆరునెలల కాలంలో మరణించిన 34 మంది జర్నలిస్టుల కుటుంబ సభ్యులకు రూ. లక్ష చొప్పున ఆర్థిక సహాయం అందజేయనున్నామని మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.శుక్రవారం జరిగిన ప్రెస్ అకాడమీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆయన వెల్లడించారు. జర్నలిస్టుల సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా తెలంగాణ మీడియా అకాడమీ జర్నలిస్టుల సంక్షేమ నిధి నుంచి అందజేయనున్నామని వివరించారు. చనిపోయిన జర్నలిస్టుల భార్యలకు నెలకు రూ. 3వేలు పెన్షన్ ఐదు సంవత్సరాల పాటు అందజేస్తామని అన్నారు.

పెన్షన్ తో పాటు వారి పిల్లలకు ఎల్కేజీ నుంచి పదవ తరగతి వరకు చదువుల కోసం నెలకు రూ. వెయ్యి అందజేస్తామన్నారు. ప్రాణాంతకర వ్యాధులతో బాధపడుతూ ప్రమాదానికి గురైన జర్నలిస్టులకు రూ. 50 వేలు ఆర్థిక సాయం అందజేస్తామని తెలిపారు.క్యాన్సర్ తో బాధపడుతున్న జర్నలిస్ట్ గురు ప్రసాద్, ప్రమాదంలో రెండు కాళ్లు పోగొట్టుకున్న బండి నారాయణకు ఒక్కొక్కరికి లక్ష రూపాయలు మంజూరు చేస్తూ కమిటీ నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. వీరితోపాటు మరో ఇద్దరూ జర్నలిస్టులకు రూ. 50 వేలు మంజూరు చేశామన్నారు. ఈ సమావేశంలో సమాచార పౌర సంబంధాల శాఖ జాయింట్ డైరెక్టర్ జగన్, మీడియా అకాడమీ సెక్రెటరీ నాగులపల్లి వెంకటేశ్వరరావు, మేనేజర్ పిసి వెంకటేశం, అకౌంట్స్ ఆఫీసర్ పూర్ణచంద్రరావు పాల్గొన్నారు.

Courtesy / Source by :
*V.S. జీవన్*

fear creeping into all such corrupt employees-TelanganaACB

Just wanted to inform all friends that the number of  cases which ACB has been doing since 6 months has finally resulted in fear creeping into all such corrupt employees across the state . It is proved by the extra difficulty my officers are facing in concluding the traps and other cases as such suspect officers are now taking lot of precautions and looking at everything suspiciously . But , their habit and greed are making them fall into the trap . It is reported that people are able to get their works done in various offices in the state more easily now , without having to pay bribes . The harassment is lesser it is being said . It’s a long haul but we ll continue the drive despite the operational challenges 🙏🏻

Courtesy / Source by: https://x.com/CVAnandIPS/status/1809270651464909296?t=tdUFupINuLVZyQidJISB2Q&s=19

రేపే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ::నూతన శకం మొదలైనట్టేనా...?

*రేపే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ::నూతన శకం మొదలైనట్టేనా...?* 

హైదరాబాద్:
ఆంధ్ర, తెలంగాణ, రెండు రాష్ట్రాల్లోనూ ఆసక్తి రేపు తున్న అంశం ఏదైనా ఉం దంటే అది ఇద్దరు ముఖ్య మంత్రుల సమావేశమే. 

అటు చంద్రబాబునాయుడు గురించి అందరికీ తెలుసు. అలాగే రేవంత్ రెడ్డి గురించి కూడా ఎవరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ ఇద్దరి మధ్య ఉన్న గాఢానుబంధం కూడా ఎవరికీ తెలియందేం కాదు. 

ఈ క్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రితో భేటీ అయ్యేందుకు ఉత్సాహం చూపుతూ.. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు లేఖ రాయడం అందుకు రేవంత్ రెడ్డి వైపు నుంచి గ్రీన్ సిగ్నల్ రావడం చకచకా జరిగిపోయాయి. 

*మరి ఆ ఇద్దరి మధ్య చోటు చేసుకోబోయే చర్చాంశాలేంటి..?*

ఆంధ్రా-తెలంగాణ రాష్ట్రాల మధ్య ఒక అసాధారణమైన సమావేశం చోటు చేసుకోబో తోంది. వ్యక్తిగతంగా ఎంతో చనువున్న ఇద్దరు ముఖ్య మంత్రులు 6,వ తేదీన హైదరాబాద్ లో సమావేశం అవుతున్నారు. 

వారిద్దరూ వ్యక్తిగతంగా కలుసుకోవడంలో పెద్ద చెప్పుకోదగ్గ అంశాలేమీ లేకపోయినా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రు  లుగా కలుసుకోవడమే ఆసక్తి రేపుతోంది. 

ఏపీ నుంచి చంద్రబాబునా యుడు, తెలంగాణ నుంచి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రు ల హోదాలో కలుసుకోబో తుండడంతో రెండు రాష్ట్రా ల మధ్య నలుగుతున్న అనేక సమస్యలు ఇక కొలిక్కి వచ్చే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. 

ముఖ్యంగా రెండు రాష్ట్రాల మధ్య ఆస్తుల వాటాల పంపిణీతో పాటు గోదావరి, కృష్ణా జలాలే కీలకంగా మారుతున్నాయి. అయితే పలు సంస్థల ఆధ్వర్యంలో ఉన్న ఆస్తుల పంపిణీ ఈపాటికే జరిగి ఉండేదని ఏపీ ముఖ్యమంత్రులు మొండిపట్టుదలకు పోయి విషయాలను జటిలం చేస్తున్నారన్న వ్యాఖ్యలు ఉన్నాయి. 

అయితే ఇటీవల చంద్ర బాబునాయుడు ముఖ్య మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక తాను భేషజాలకు పోబోవడం లేదని రెండు రాష్ట్రాల మధ్య నలుగుతు న్న సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తామని చెప్పడం విశేషం. 

తన ముందున్న లక్ష్యాల్లో అమరావతి రాజధాని నిర్మాణంతోపాటు పోలవరం బహుళార్థసాధక ప్రాజెక్టును పూర్తి చేయడమేనని చెప్పడం కొసమెరుపు. మరోవైపు బహుశా ఇలాంటి అనేక అంశాలు దృష్టిలో ఉంచుకునే చంద్రబాబు స్వయంగా రేవంత్ కు లేఖ రాసి ఉంటారని తెలుస్తుంది.

ఈ నేపథ్యంలోనే  ఈసారి రెండు రాష్ట్రాలు సమస్యల పై శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేస్తాయన్న అం చనాలు పెరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల ప్రజలు వేచి చూడాలి మరి.

Courtesy / Source by :
*V.S. జీవన్*

𝑳𝒊𝒗𝒆𝒓𝒅𝒐𝒄 𝑺𝒍𝒂𝒎𝒔 𝑺𝒂𝒎𝒂𝒏𝒕𝒉𝒂 𝑹𝒖𝒕𝒉 𝑷𝒓𝒂𝒃𝒉𝒖 𝒇𝒐𝒓 𝑫𝒂𝒏𝒈𝒆𝒓𝒐𝒖𝒔 𝑯𝒆𝒂𝒍𝒕𝒉 𝑨𝒅𝒗𝒊𝒄𝒆 𝒐𝒏 𝑺𝒐𝒄𝒊𝒂𝒍 𝑴𝒆𝒅𝒊𝒂

𝑳𝒊𝒗𝒆𝒓𝒅𝒐𝒄 𝑺𝒍𝒂𝒎𝒔 𝑺𝒂𝒎𝒂𝒏𝒕𝒉𝒂 𝑹𝒖𝒕𝒉 𝑷𝒓𝒂𝒃𝒉𝒖 𝒇𝒐𝒓 𝑫𝒂𝒏𝒈𝒆𝒓𝒐𝒖𝒔 𝑯𝒆𝒂𝒍𝒕𝒉 𝑨𝒅𝒗𝒊𝒄𝒆 𝒐𝒏 𝑺𝒐𝒄𝒊𝒂𝒍 𝑴𝒆𝒅𝒊𝒂

Dr. Abby Philips, also known as Liverdoc, criticized Tollywood actress Samantha Ruth Prabhu for sharing a potentially dangerous health tip on her Instagram.
Samantha recommended inhaling hydrogen peroxide for flu relief, citing some doctors.

Dr. Philips responded by labeling her as a health and science illiterate for promoting such advice to her followers. He highlighted the dangers of inhaling hydrogen peroxide, referencing warnings from the Asthma and Allergy Foundation of America. Dr. Philips stressed that in a rational and scientifically progressive society, such actions would warrant serious consequences like fines or imprisonment for endangering public health.
He questioned whether India's Health Ministry or any health regulatory body would address the issue of social media influencers spreading harmful health misinformation or continue to remain inactive.

#SamanthaRuthPrabhu @theliverdr @Samanthaprabhu2 #HydrogenPeroxide

Courtesy / Source by :

https://x.com/sudhakarudumula/status/1809053449444806741?t=aWdKGET9V5JK2VzZr5oGkQ&s=19

_*ఖైదీల విడుదలలో @HRF_Humanrights చేసిన పోరాటానికి వందనాలు ✊*_

                                                                      _*#ఎన్నో ఏండ్లుగా #తెలంగాణ లో వివిధ జైల్లలో ఉన్న ఖైదీల విడుదలలో @HRF_Humanrights చేసిన పోరాటానికి వందనాలు ✊*_

*@TelanganaCMO @Bhatti_Mallu*
*@TelanganaCS* *@TelanganaDGP* *@TelanganaCOPs* *@RachakondaCop* *@cyberabadpolice* *@hydcitypolice* 
*@CVAnandIPS* *@AnooradhaR*
*@NAPM_Telangana @TeluguScribe @bigtvtelugu @RamsGTRK @SrinivasRTIA  @BplplH*
                                                                                                                                               *Bplkm✍️*

https://x.com/Praja_Snklpm/status/1809111511811698791?t=NGDQzh5z3bGxraGlgOV8Tg&s=08

*జైలు శాఖ చరిత్రలో మొదటిసారి: 213 మంది ఖైదీల విడుదల..!*

 *జైలు శాఖ చరిత్రలో మొదటిసారి: 213 మంది ఖైదీల విడుదల..!*

హైదరాబాద్:
తెలంగాణలో రాష్ట్రంలో పలువురు ఖైదీల మంచి ప్రవర్తన కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా పలువురు ఖైదీ లను విడుదల .. తెలంగాణ ప్రభుత్వం. 

రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 213 మంది ఖైదీ లు విడు దల..

Courtesy / Source by :
https://x.com/SrinivasDIG/status/1808707705072140762?t=t-e7AVfWSo2pHtrmJMaRIw&s=08    

*****---*****---*****---*****