Saturday, July 6, 2024

తెలంగాణ.. ఆంద్రప్రదేశ్ దోస్తీ

విభజన అనంతరం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య సుధీర్ఘ కాలంగా అపరిష్కృతంగా ఉన్న అంశాలపై జ్యోతీరావు పూలె ప్రజాభవన్‌లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం చాలా సుహృద్భావ వాతావరణంలో జరిగింది.

🔹తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ @ncbn పాటు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి శ్రీ @Bhatti_Mallu, మంత్రులు శ్రీ @OffDSB , శ్రీ @PonnamLoksabha ఏపీ మంత్రులు శ్రీ @SatyaAnagani , శ్రీ @kanduladurgesh , శ్రీ @bcj_reddy  లతో పాటు ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

🔹ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని అపరిష్కృత అంశాలను పరిష్కరించుకోవడానికి ఇరు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శుల స్థాయిలో ఒక ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని సమావేశం నిర్ణయించింది.

🔹పైస్థాయిలో నిర్ణయాలు తీసుకోవలసిన అంశాలను పరిశీలించి నిర్ణయించడానికి ఇరు రాష్ట్రాల మంత్రుల స్థాయిలో మరో కమిటీని ఏర్పాటు చేయాలని సమావేశం తీర్మానించింది.

🔹మంత్రుల స్థాయి కమిటీలో అంగీకారానికి రాలేని ఏవైనా అంశాలంటే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల స్థాయిలో నిర్ణయాలు తీసుకోవాలని నిర్ణయించింది.

🔹మాదక ద్రవ్యాల నియంత్రణ, సైబర్ క్రైమ్ నియంత్రణ కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రత్యేక డ్రైవ్ విషయంలో తెలంగాణ విజ్ఞప్తి మేరకు ఇరు రాష్ట్రాల నుంచి అదనపు డీజీ స్థాయి అధికారులతో సమన్వయ కమిటీని ఏర్పాటు చేయడానికి ఆంధ్రప్రదేశ్ అంగీకరించింది.
#Telangana #AndhraPradesh 

Courtesy / Source by : https://x.com/TelanganaCMO/status/1809626367685980242?t=kGbSZJ8S6iTZ8v4iRRPn1g&s=19

No comments:

Post a Comment