Tuesday, March 26, 2024

భుజంగారావు...భూదందాలు, సెటిల్మెంట్ లు..అక్రమ ఫోన్ ట్యాపింగ్

భుజంగారావు.. ఈయన పేరు వింటేనే గుర్తుకొచ్చేది భూదందాలు, సెటిల్మెంట్ లు. అక్రమ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తమ వెల్మ సామాజిక వర్గానికి చెందిన కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు, కవిత, ఎర్రబెల్లి దయాకర్ రావు, కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణా రావు తదితరుల అండదండలతో తన అవినీతికి భూకబ్జాలకు, హవాలా, సెటిల్మెంట్ లకు అంతు లేకుండా పోయింది. తమ వెల్మ సామాజిక వర్గాల వారికి ఏ ఇబ్బంది వచ్చినా అండగా ఉంటూ సెటిల్మెంట్ లు చేసేది. తన అక్రమ సంపాదనతో వందల కోట్లు వెనకేసుకొని గిట్టని వారి మీద తన కండకావరాన్ని ప్రదర్శించేదని చెబుతుంటారు. ఎస్సై నుండి ASP దాకా ఎదిగిన భుజంగారావు ఇప్పుడు అక్రమ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్ట్ అయి ఊచలు లెక్కబెడుతున్న ఈ భుజంగారావు భాగోతాలు చూస్తుంటే దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అవుతుంది. డిపార్ట్మెంట్ లోకి రాకముందు మిర్యాలగూడ లో సినిమా టికెట్లు అమ్మేవాడంట. ఆ తర్వాత ఉస్మానియా విశ్వవిద్యాలయంలో డిగ్రీ పూర్తి చేసి మొదటి పోస్టింగ్ ఎస్సై గా మల్కాజిగిరి పీఎస్ లో చేశాడు. ఆ తర్వాత నాచారం పీఎస్ లో విధులు నిర్వర్తిస్తూ  భూకబ్జాలకు భీజం వేశాడు. రామకృష్ణ అనే వ్యక్తి ద్వారా రెండు వేల గజాల పార్క్ స్థలాన్ని కబ్జా చేసి కోట్లకు పడగెత్తాడు. ఆ తర్వాత వనస్తలిపురం అక్కడ నుండి మాదాపూర్‌ పోలీస్ స్టేషను కు సీఐ గా ప్రమోషన్ పొంది ఆ ఏరియా లో ఇద్దరు రిటైర్డ్ సర్వేయర్లను నియమించుకొని తన భూదందాలకు మరింత పదును పెట్టి తన భూదందాలకు సెటిల్మెంట్ లకు అంతు లేకుండా పోయేది. ఆ తర్వాత భువనగిరి డీఎస్పీగా కొనసాగుతూ నయూం కేస్ విషయంలో విచారణ అధికారిగా కొనసాగుతూ టాస్క్ ఫోర్స్ DCP గా ఉన్న రాధాకృష్ణన్ అండదండలతో పలువురు ఎస్సై లను సీఐ లను తమ ఏజెంట్లు గా పెట్టుకుని నయూం అక్రమ ఆస్తులను కొన్ని తారుమారు చేసి వందల కోట్ల రూపాయలు వెనకేసుకుని దాదాపుగా పది ఇండ్లు కొన్నాడు. ఇతడికి ముగ్గురు భార్యలు. రేవంత్ రెడ్డి Anumula Revanth Reddy  గారికి వ్యతిరేకంగా ఫోన్ ట్యాపింగ్ చేసి కేసులో అడ్డంగా బుక్ అయిన అతడు రేపో మాపో ఏసీబీ విచారణ ను ఎదుర్కొని ఈడీ నజర్ పడే అవకాశం ఉంది.
Courtesy / Source by :
https://twitter.com/sreereddi77/status/1772560376392982741?t=AxbdFeWjZzo8GZNNLq1dUA&s=19

Monday, March 25, 2024

అధికారమే పరమావధిగా నేతల జంపింగ్‌లు...

https://x.com/dishatelugu/status/1772130356163944773?t=zxlmbtYG6fLrHPd4RnTfuQ&s=08                               epaper.dishadaily.com/3846257/Specia…

*నిన్న ఒక పార్టీ, నేడు మరో పార్టీ, రేపు ఇంకో పార్టీ...*
*అధికారమే పరమావధిగా నేతల జంపింగ్‌లు...*
*గోల్డ్ విన్నర్ గడ్డం వివేక్.. సిల్వర్ దానం, ఎన్నం.. బ్రాంజ్ ఎవరెవరు..*

*#Dishanewspaper  #DishaSpecialEdition #Congress #BRS #BJP #TeluguNews*

Sunday, March 24, 2024

*రాష్ట్ర ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపిన... సీఎం రేవంత్ రెడ్డి*

*రాష్ట్ర ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపిన... సీఎం రేవంత్ రెడ్డి*

తెలంగాణరాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమ, ఆప్యాయత సంతోషాల హరివిల్లుగా, శాంతి సౌభ్రాతృత్వానికి ప్రతీకగా నిలిచే హోలీ రంగుల పండుగను అందరూ ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.సహజ సిద్ధమైన రంగులతో సాంప్రదాయ పద్ధతులతో రంగుల పండుగను సంతోషంగా జరుపుకోవాలన్నారు. అన్నారు. కొత్త ప్రభుత్వం రాష్ట్రంలో అనుసరిస్తున్న ప్రజా పాలనలో అటు సంక్షేమం, ఇటు అభివృద్ధి ఫలాలు అందరి కుటుంబాల్లో సప్తవర్ణ రంగుల శోభను నింపుతాయని అభిప్రాయపడ్డారు. కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజల సమైక్యతను చాటిచెప్పే ఈ పండుగ దేశమంతటా కొత్త మార్పునకు శ్రీకారం చుడుతుందని అన్నారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా త్వరలోనే దేశంలో అన్ని వర్గాలకు న్యాయం చేకూర్చే కొత్త ప్రజాస్వామ్య వాతావరణం వెల్లివిరిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు.

*V.S. జీవన్*

Friday, March 22, 2024

Supreme Court Rebukes Telangana Police

Supreme Court Rebukes Telangana Police Again, Says Preventive Detention Must Not Be Applied Routinely Without Application Of Mind Yash Mittal 22 Mar 2024 6:40 PM Share this Listen to this Article In a significant development, the Supreme Court has yet again rebuked the Telangana Police for routinely exercising the powers of preventive detention to detain individuals without considering the fundamental rights guaranteed under the constitution. The Bench Comprising CJI DY Chandrachud and Justic

https://www.livelaw.in/supreme-court/supreme-court-rebukes-telangana-police-again-says-preventive-detention-must-not-be-applied-routinely-without-application-of-mind-253186?utm_source=social&utm_partner=livelaw&utm_campaign=sticky-share&utm_medium=twitter

Courtesy / Source by : LiveLaw.in

Thursday, March 21, 2024

*_కేజ్రీవాల్‌ను అరెస్టు చేసిన ఈడీ.. దిల్లీలో టెన్షన్‌ టెన్షన్‌_*

*_కేజ్రీవాల్‌ను అరెస్టు చేసిన ఈడీ.. దిల్లీలో టెన్షన్‌ టెన్షన్‌_*
_# రేపు కవితతో ముఖాముఖి కూర్చోబెట్టే అవకాశం.!_

_(అనంచిన్ని వెంకటేశ్వరావు ప్రముఖ పరిశోధన పాత్రికేయులు, 9440000009)_

దిల్లీ మద్యం పాలసీ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. దిల్లీ ముఖ్యమంత్రి, ఆప్‌ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ ను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ఈ సాయంత్రం దాదాపు 12 మంది అధికారులతో కూడిన ఈడీ బృందం ఆయన నివాసానికి చేరుకొని కేజ్రీవాల్‌ను విచారించింది. ఆ తర్వాత ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఆయన్ను అదుపులోకి తీసుకుంది. తాజా పరిణామాలతో సీఎం ఇంటివద్ద భారీగా పోలీసులు మోహరించడంతో హైటెన్షన్‌ వాతావరణం నెలకొంది. సీఎం నివాసానికి ఆప్‌ నేతలు, పెద్ద సంఖ్యలో ఆప్‌ కార్యకర్తలు తరలివచ్చి ఆందోళన చేస్తున్నారు. కేజ్రీవాల్‌ అరెస్టయినప్పటికీ ఆయన సీఎంగా కొనసాగుతారని దిల్లీ మంత్రి అతిషీ స్పష్టం చేశారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు కేజ్రీవాల్‌ అరెస్టు పెద్ద కుట్రేనని ఎంపీ రాఘవ్‌ చద్దా అన్నారు. 

మద్యం పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో విచారణకు రావాలని ఇప్పటికే ఈడీ తొమ్మిది సార్లు సమన్లు ఇచ్చినా కేజ్రీవాల్‌ హాజరయ్యేందుకు నిరాకరించిన విషయం తెలిసిందే. మరోవైపు, ఈ కేసులో కేజ్రీవాల్‌కు దిల్లీ హైకోర్టులో ఈరోజు ఊరట లభించలేదు. అరెస్టు నుంచి మినహాయింపు ఇచ్చేందుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. ప్రస్తుతం ఈ కేసు పురోగతి దృష్ట్యా ఇందులో తాము జోక్యం చేసుకోలేమని చెప్పిన గంటల వ్యవధిలోనే ఈడీ అధికారులు ఆయన ఇంటికికి చేరుకుని అదుపులోకి తీసుకున్నారు. కేజ్రీవాల్‌ అరెస్టయినప్పటికీ ఆయన సీఎంగా కొనసాగుతారని దిల్లీ మంత్రి అతిషీ స్పష్టం చేశారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు కేజ్రీవాల్‌ అరెస్టు పెద్ద కుట్రతో కూడుకున్నదని ఎంపీ రాఘవ్‌ చద్దా అన్నారు. 

*_సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేజ్రీవాల్‌_*
ఇదిలా ఉండగా.. ఈ అంశంపై కేజ్రీవాల్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మద్యం విధానం కేసులో మధ్యంతర ఉపశమనం కల్పిస్తూ ఆదేశాలిచ్చేందుకు దిల్లీ హైకోర్టు నిరాకరించడాన్ని ఆయన లాయర్లు సర్వోన్నత న్యాయస్థానంలో సవాల్‌ చేశారు. ఈ అంశాన్ని అత్యవసర జాబితాలో చేర్చి విచారణ జరిపించేందుకు లీగల్‌ టీమ్‌ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఈ పిటిషన్‌పై శుక్రవారం ఉదయం వరకు విచారణ చేపట్టే అవకాశం లేదని తెలుస్తోంది.

*_కేజ్రీవాల్‌ గొంతు అణచివేసేందుకే.. అసెంబ్లీ స్పీకర్‌_*
కేజ్రీవాల్‌ ఇంటికి ఈడీ అధికారుల రాకపై దిల్లీ అసెంబ్లీ స్పీకర్‌ రాం నివాస్‌ గోయెల్‌ స్పందించారు. మనీశ్‌ సిసోదియాను అరెస్టు చేసినా ఇప్పటివరకు ఏమీ దొరకలేదన్న విషయం అందరికీ తెలిసిందేనన్నారు. ఎన్నికలకు ముందు కేజ్రీవాల్‌ గొంతు అణిచివేసేందుకే.. ఆయన్ను అరెస్టు చేయాలని చూస్తున్నారని గోయెల్‌ విమర్శించారు.

Tuesday, March 19, 2024

ప్రస్తుత రాజకీయాలు - ఎత్తుగడలు

ప్రస్తుత రాజకీయాలు - ఎత్తుగడలు 
* మహనీయుల పేర్ల ను అనుక్షణం ఉచ్చరించడం, వాళ్లను  వాడుకోడం ఒక ఎత్తుగడ 
* ⁠మహనీయుల భావజాలాలు సొంత స్వార్దానికి వాడుకోడం ఒక ఎత్తుగడ 
* ⁠మహనీయులు తమ తమ కాలంలో చేసిన రాజకీయ ప్రయోగాలను తమకు ఇష్టారీతిగా అన్వయించుకోడం ఒక ఎత్తుగడ 
* ⁠తమ కులాన్ని పెత్తనం చేసే కులాల దగ్గర తాకట్టు పెట్టి రాజకీయం చెయ్యడం ఒక ఎత్తుగడ్డ 
* ⁠ఎంత చెత్త పార్టీ అయినా పర్లేదు అధికారం కొరకు దానికి దాసోహం అనడం ఒక ఎత్తుగడ 
* ⁠రాజకీయానికి డబ్బు అవసరం, ఆ డబ్బును ఎలా సమకూర్చుకున్న కూడా పర్లేదు - ఒక ఎత్తుగడ 
* ⁠రోజుకొక పార్టీ తో బేరసారాలు ఆడడం, చివరికి ఎదో ఒక పార్టీ తో అంటకాగడం - ఒక ఎత్తుగడ 
* ⁠చట్టసభలకు పోవడానికి ఎంత చెత్త పని చేసినా ఎంత లంగ పని చేసిన పర్లేదు అనేది ఒక ఎత్తుగడ 
* ⁠ఎన్ని అబద్దాలు ఆడిన పర్లేదు అధికారం లోకి వెళ్ళాలి - ఒక ఎత్తుగడ 
* ⁠సోషల్ మీడియా టీం (లు) ఏర్పాటు చేసుకుని తమను విమర్శించేవాళ్ల మీద దాడి చేయడం బూతులు తిట్టించడం ఒక ఎత్తుగడ 
* ⁠తనను నమ్ముకొని పనిచేయడానికి వచ్చిన క్యాడర్ ని ముంచినా పర్లేదు అధికారం ముఖ్యం - ఒక ఎత్తుగడ 
* ⁠అధికారం కొరకు బొంత పురుగును అయినా ముద్దుపెట్టుకోడం - ఒక ఎత్తుగడ 
* ⁠వంద ఎలుకల్ని తిన్న పిల్లిని ఇంకొక ఎలుక వచ్చి అదే పిల్లిని ఎలుకల అభ్యున్నతి గురించి అదే పిల్లితో ఉండడం ఒక ఎత్తుగడ
* రాజకీయాలలో విలువలు గాలికి వదిలెయ్యడం ఒక ఎత్తుగడ
* ⁠⁠మామూలు మనుషుల ఊహలకందని ఎత్తులుజిత్తులు వెయ్యడం ఒక బ్రహ్మాండమైన ఎత్తుగడ 
🙏🙏🙏
Courtesy / Source by :
https://twitter.com/Murali_IASretd/status/1769978463245737999?t=B2RZMOw0orEDzNQI3AjdKg&s=19

బీఆర్ఎస్ లీడర్స్ యే బ్రోకర్స్.

Continue illegal Business between BRS Leaders - officials.


  • బీఆర్ఎస్ లీడర్స్ యే బ్రోకర్స్.
  • మున్సిఫల్, రెవెన్యూ, పోలీస్ అధికారులతో కుమ్మక్కు.
  • పాలన మారి 100 రోజులు దాటిన వారికే ప్రాముఖ్యత.
  • నిజాంపేట్ ఏసీపీతో పాటు బీఆర్ఎస్ నేత రాములు అరెస్ట్.
  • అధికారులకు డబ్బులు వసూలు చేసి ఇచ్చేది వీళ్లే.
  • కాంగ్రెస్ నేతలు పిర్యాదులు చేసిన పట్టించుకోని అధికార ఘనం.  
  •  అక్రమ మైనింగ్ తో మట్టిలో నుంచి ఇసుక దందా.?
  • రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా కోనసాగుతున్న బీఆర్ఎస్ నేత అక్రమాలు.
  • కార్పోరేషన్స్, మున్సిపాల్టీల్లో కొనసాగుతున్న అక్రమ నిర్మాణాలు.
  • ముడుపులే ముఖ్యమంటున్న ఆఫీసర్స్.
  • మాజీ మంత్రుల కన్నుసన్నలోనే కలెక్టర్స్.
  • ఇంకా ఆగమాగంగానే అడ్మినిస్ట్రేషన్ పై
  • ల్యాండ్స్ అండ్ రికార్డ్స్ స్పెషల్ స్టోరీ.

Courtesy / Source by :

Devender Reddy

9848070809.

తెలంగాణ రాష్ట్రాన్ని అక్రమ మైనింగ్ తో బొందల గడ్డలగా మారుస్తున్నారు. బీఆర్ఎస్ నేతలతో కుమ్మక్కై అధికారులు అక్రమాలకు తెర లేపుతున్నారు. అధికారంలో ఉన్నప్పటి కంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా బరి తెగించారు. ఇప్పుడు ఎదైనా పైసలతో కొట్టి పని చేయించుకుంటున్నారు. మధ్యవర్తులుగా ఈ బీఆర్ఎస్ నేతలే ఉంటున్నా.. అధికార పార్టీ నేతలు ఇంకా కళ్లు తెరవడం లేదు. కాంగ్రెస్ నేతలు, బీఆర్ఎస్ అవినీతిని చూడలేని వారు అధికారులను ప్రశ్నించినా.. ఆ ఆఫీసర్లు పట్టించుకోవడం లేదు. ఎదో వంక చెప్పి తప్పించుకోవం అలవాటుగా చేసుకున్నారు. బీఆర్ఎస్ నేతలతో చేతికి మరక అంటకుండా భారీగా డబ్బులు వస్తుండటంతో ఎవ్వరితో మాకేంటి అంటూ విచ్చల విడితనం పెరిగిపోతుంది. అందుకు ఉదహారణ నిజాంపేట్ కార్పోరేషన్ ఏసీపీ శ్రీనివాస్ రావు వ్యవహారమే. ఒక్క టీ స్టాల్ ని రోడ్డుకు అడ్డగా ఉంచేందుకు అక్షరాల 1 లక్ష 50 వేలు డిమాండ్ చేయడం, బీఆర్ఎస్ నేత రాములు వాటిని తీసుకెళ్లి ఇవ్వడంతో ఇలాంటి అంశాల పై ఫోకస్ పెట్టాల్సి ఉంది. నిజాం పేట్ నుంచి బాచుపల్లి వరకు అక్రమ నిర్మాణాలతో నిత్యం ట్రాఫిక్ తో ప్రయాణికులు కొట్టుమిట్టులాడుతున్నారు. ఎన్ని సార్లు పిర్యాదు చేసిన పట్టించుకున్న నాథుడే లేడు. పైగా ఆ వంకతో లక్షల రూపాయలు బీఆర్ఎస్ నేతల నుంచి చేరుతున్నాయి. 

లే-అవుట్స్ కబ్జా చేసినా పట్టించుకోలేదు.

బీఆర్ఎస్ నేతలతో చెట్టాపట్టాలు వేసుకుని తిరుగిన నిజాంపేట్ ఏసీపీ శ్రీనివాస్ రావు రేణుకా ఎల్లమ్మ కాలనీ భూమిని కేటీఆర్ కి అత్యంత సన్నిహితుడని చెప్పుకునే రైజ్ డెవలఫర్స్ కి ఒత్తస్సు పలికి అక్రమ నిర్మాణాలను ప్రొత్సహిస్తున్నారు. తహాశీల్దార్ ని అడిగితే కమిషనర్ ని కమిషనర్ ని అడిగేతే హెచ్ఎండీఏ ని ఇలా ఒక్కిరి పై ఒక్కరు నిందలు వేసుకుంటూ ప్రజా అవసరాల కోసం ఉండే 800 గజాలను కబ్జాకు ప్రొత్సహించారు. నిజాం పేట్ లో ఎన్నో ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురవడానికి కారణం ఈ ఏసీపీ శ్రీనివాసరావుయే నని అంటున్నారు.

 మైనింగ్ పై మౌనమేళ.

బీఆర్ఎస్ నేతల రెండో అక్రమ సంపద  ఇల్లీగల్ మైనింగ్ యే . పఠాన్ చెరువు ఎమ్మెల్యే సొదరుడు గూడెం మధుసుధన్ రెడ్డిని అక్రమంగా క్రషర్ మైనింగ్ జరిపారని  అరెస్ట్ చేశారు పోలీసులు. పఠాన్ చెరువు నియోజక వర్గం మొత్తం అక్రమ మైనింగ్ యే నడుస్తుంది. హీరో ప్రభాస్ దత్తత తీసుకున్న 1800 ఎకరాల్లోను మైనింగ్ మాఫీయా రాజ్యమేలుతుంది. దాని చుట్టుపక్కల ఉన్న ప్రభుత్వ భూముల్లో మట్టి తీసుకెల్లుతున్నారు. అక్రమ మొరం మట్టితో మోటర్స్ సహాయంతో మట్టిలో నుంచి ఇసుకను తీస్తున్నారు. ఇసుకకు భారీగా డిమాండ్ ఉండటంతో మట్టి ఇసుకనే  భయట మార్కెట్ లో అమ్మేసి సొమ్ముచేసుకుంటున్నారు. ఇదంతా అధికారులకు తెలిసినా గులాబీ నోట్లకు ఆశ పడి మౌనంగానే ఉంటున్నారు. సహాజ వనరులను కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి పౌరుడి పైనా ఉంది.

అక్రమ నిర్మాణాల్లోను అదే చేతివాటం.

నిజాం పేట్ , దుండిగల్, పోచారం, మీర్ పేట్, నార్సింగ్, రాజేంద్రనగర్, అమీన్ పూర్ ఇలా నగర శివార్లలో ఉన్న పాతిక మున్సిపాల్టీలలో అక్రమ నిర్మాణాలు యద్దేశ్చగా కొనసాగుతున్నాయి. చట్టాలు, హైకోర్టు తీర్పులు ఎన్ని ఉన్నా.. అధికారులతో కుమ్మక్కైనా బీఆర్ఎస్ నేతలు మాముళ్లను ఇప్పించడంతో అటూ వైపు కూడా చూడటం లేదు. కాంగ్రెస్ , బీజేపీ నేతలు పిర్యాదు చేసినా.. పూర్తి అయ్యిపోయాయి మేము ఎమి చేయలేం అంటూ చేతులెత్తేస్తున్నారు. జీ+1 అంటూ 5 ఏండ్ల క్రితం గ్రామ పంచాయితీ నుంచి తీసుకున్న ఫేక్ అనుమతులతో  ఒక్కొక్క ప్లాట్ కి లక్ష ల్లో వసూలు చేసి ఇస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. 

మాజీ మంత్రుల కనుసన్నలోనే కలెక్టర్స్,

సిద్దిపేట్ జిల్లాలో అధికారులు అంతా మాజీ మంత్రి కనుసన్నల్లోనే పనులు చేస్తున్నారు. అక్రమాలు , అవినీతి అంతా వారి చేతులు మీదిగానే జరుగుతున్నట్లు నిఘా వర్గాలు తెల్చాయి. ప్రభుత్వం మారిన తర్వాత కూడా కోట్లాది రూపాయలు చేతులు మారినట్లు సమాచారం. వీటన్నింటి పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.