Tuesday, March 19, 2024

బీఆర్ఎస్ లీడర్స్ యే బ్రోకర్స్.

Continue illegal Business between BRS Leaders - officials.


  • బీఆర్ఎస్ లీడర్స్ యే బ్రోకర్స్.
  • మున్సిఫల్, రెవెన్యూ, పోలీస్ అధికారులతో కుమ్మక్కు.
  • పాలన మారి 100 రోజులు దాటిన వారికే ప్రాముఖ్యత.
  • నిజాంపేట్ ఏసీపీతో పాటు బీఆర్ఎస్ నేత రాములు అరెస్ట్.
  • అధికారులకు డబ్బులు వసూలు చేసి ఇచ్చేది వీళ్లే.
  • కాంగ్రెస్ నేతలు పిర్యాదులు చేసిన పట్టించుకోని అధికార ఘనం.  
  •  అక్రమ మైనింగ్ తో మట్టిలో నుంచి ఇసుక దందా.?
  • రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా కోనసాగుతున్న బీఆర్ఎస్ నేత అక్రమాలు.
  • కార్పోరేషన్స్, మున్సిపాల్టీల్లో కొనసాగుతున్న అక్రమ నిర్మాణాలు.
  • ముడుపులే ముఖ్యమంటున్న ఆఫీసర్స్.
  • మాజీ మంత్రుల కన్నుసన్నలోనే కలెక్టర్స్.
  • ఇంకా ఆగమాగంగానే అడ్మినిస్ట్రేషన్ పై
  • ల్యాండ్స్ అండ్ రికార్డ్స్ స్పెషల్ స్టోరీ.

Courtesy / Source by :

Devender Reddy

9848070809.

తెలంగాణ రాష్ట్రాన్ని అక్రమ మైనింగ్ తో బొందల గడ్డలగా మారుస్తున్నారు. బీఆర్ఎస్ నేతలతో కుమ్మక్కై అధికారులు అక్రమాలకు తెర లేపుతున్నారు. అధికారంలో ఉన్నప్పటి కంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా బరి తెగించారు. ఇప్పుడు ఎదైనా పైసలతో కొట్టి పని చేయించుకుంటున్నారు. మధ్యవర్తులుగా ఈ బీఆర్ఎస్ నేతలే ఉంటున్నా.. అధికార పార్టీ నేతలు ఇంకా కళ్లు తెరవడం లేదు. కాంగ్రెస్ నేతలు, బీఆర్ఎస్ అవినీతిని చూడలేని వారు అధికారులను ప్రశ్నించినా.. ఆ ఆఫీసర్లు పట్టించుకోవడం లేదు. ఎదో వంక చెప్పి తప్పించుకోవం అలవాటుగా చేసుకున్నారు. బీఆర్ఎస్ నేతలతో చేతికి మరక అంటకుండా భారీగా డబ్బులు వస్తుండటంతో ఎవ్వరితో మాకేంటి అంటూ విచ్చల విడితనం పెరిగిపోతుంది. అందుకు ఉదహారణ నిజాంపేట్ కార్పోరేషన్ ఏసీపీ శ్రీనివాస్ రావు వ్యవహారమే. ఒక్క టీ స్టాల్ ని రోడ్డుకు అడ్డగా ఉంచేందుకు అక్షరాల 1 లక్ష 50 వేలు డిమాండ్ చేయడం, బీఆర్ఎస్ నేత రాములు వాటిని తీసుకెళ్లి ఇవ్వడంతో ఇలాంటి అంశాల పై ఫోకస్ పెట్టాల్సి ఉంది. నిజాం పేట్ నుంచి బాచుపల్లి వరకు అక్రమ నిర్మాణాలతో నిత్యం ట్రాఫిక్ తో ప్రయాణికులు కొట్టుమిట్టులాడుతున్నారు. ఎన్ని సార్లు పిర్యాదు చేసిన పట్టించుకున్న నాథుడే లేడు. పైగా ఆ వంకతో లక్షల రూపాయలు బీఆర్ఎస్ నేతల నుంచి చేరుతున్నాయి. 

లే-అవుట్స్ కబ్జా చేసినా పట్టించుకోలేదు.

బీఆర్ఎస్ నేతలతో చెట్టాపట్టాలు వేసుకుని తిరుగిన నిజాంపేట్ ఏసీపీ శ్రీనివాస్ రావు రేణుకా ఎల్లమ్మ కాలనీ భూమిని కేటీఆర్ కి అత్యంత సన్నిహితుడని చెప్పుకునే రైజ్ డెవలఫర్స్ కి ఒత్తస్సు పలికి అక్రమ నిర్మాణాలను ప్రొత్సహిస్తున్నారు. తహాశీల్దార్ ని అడిగితే కమిషనర్ ని కమిషనర్ ని అడిగేతే హెచ్ఎండీఏ ని ఇలా ఒక్కిరి పై ఒక్కరు నిందలు వేసుకుంటూ ప్రజా అవసరాల కోసం ఉండే 800 గజాలను కబ్జాకు ప్రొత్సహించారు. నిజాం పేట్ లో ఎన్నో ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురవడానికి కారణం ఈ ఏసీపీ శ్రీనివాసరావుయే నని అంటున్నారు.

 మైనింగ్ పై మౌనమేళ.

బీఆర్ఎస్ నేతల రెండో అక్రమ సంపద  ఇల్లీగల్ మైనింగ్ యే . పఠాన్ చెరువు ఎమ్మెల్యే సొదరుడు గూడెం మధుసుధన్ రెడ్డిని అక్రమంగా క్రషర్ మైనింగ్ జరిపారని  అరెస్ట్ చేశారు పోలీసులు. పఠాన్ చెరువు నియోజక వర్గం మొత్తం అక్రమ మైనింగ్ యే నడుస్తుంది. హీరో ప్రభాస్ దత్తత తీసుకున్న 1800 ఎకరాల్లోను మైనింగ్ మాఫీయా రాజ్యమేలుతుంది. దాని చుట్టుపక్కల ఉన్న ప్రభుత్వ భూముల్లో మట్టి తీసుకెల్లుతున్నారు. అక్రమ మొరం మట్టితో మోటర్స్ సహాయంతో మట్టిలో నుంచి ఇసుకను తీస్తున్నారు. ఇసుకకు భారీగా డిమాండ్ ఉండటంతో మట్టి ఇసుకనే  భయట మార్కెట్ లో అమ్మేసి సొమ్ముచేసుకుంటున్నారు. ఇదంతా అధికారులకు తెలిసినా గులాబీ నోట్లకు ఆశ పడి మౌనంగానే ఉంటున్నారు. సహాజ వనరులను కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి పౌరుడి పైనా ఉంది.

అక్రమ నిర్మాణాల్లోను అదే చేతివాటం.

నిజాం పేట్ , దుండిగల్, పోచారం, మీర్ పేట్, నార్సింగ్, రాజేంద్రనగర్, అమీన్ పూర్ ఇలా నగర శివార్లలో ఉన్న పాతిక మున్సిపాల్టీలలో అక్రమ నిర్మాణాలు యద్దేశ్చగా కొనసాగుతున్నాయి. చట్టాలు, హైకోర్టు తీర్పులు ఎన్ని ఉన్నా.. అధికారులతో కుమ్మక్కైనా బీఆర్ఎస్ నేతలు మాముళ్లను ఇప్పించడంతో అటూ వైపు కూడా చూడటం లేదు. కాంగ్రెస్ , బీజేపీ నేతలు పిర్యాదు చేసినా.. పూర్తి అయ్యిపోయాయి మేము ఎమి చేయలేం అంటూ చేతులెత్తేస్తున్నారు. జీ+1 అంటూ 5 ఏండ్ల క్రితం గ్రామ పంచాయితీ నుంచి తీసుకున్న ఫేక్ అనుమతులతో  ఒక్కొక్క ప్లాట్ కి లక్ష ల్లో వసూలు చేసి ఇస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. 

మాజీ మంత్రుల కనుసన్నలోనే కలెక్టర్స్,

సిద్దిపేట్ జిల్లాలో అధికారులు అంతా మాజీ మంత్రి కనుసన్నల్లోనే పనులు చేస్తున్నారు. అక్రమాలు , అవినీతి అంతా వారి చేతులు మీదిగానే జరుగుతున్నట్లు నిఘా వర్గాలు తెల్చాయి. ప్రభుత్వం మారిన తర్వాత కూడా కోట్లాది రూపాయలు చేతులు మారినట్లు సమాచారం. వీటన్నింటి పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. 

No comments:

Post a Comment