Monday, September 4, 2023

సమాజంలో గురువుల పాత్ర వెలకట్టలేనిది.... కేసీఆర్....!

*సమాజంలో  గురువుల  పాత్ర వెలకట్టలేనిది.... కేసీఆర్....!*

హైదరాబాద్‌: మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్‌  జయంతి సందర్భంగా ఉపాధ్యాయులందరికీ ముఖ్యమంత్రి కేసీఆర్‌  శుభాకాంక్షలు తెలిపారు.విద్యార్థుల్లో క్రమశిక్షణ, జ్ఞానం పెంపొందించి, లక్ష్యం పట్ల వారికి స్పష్టమైన అవగాహన కలిగించి, కార్యసాధకులుగా తీర్చిదిద్దడంలో గురువుల పాత్ర వెలకట్టలేనిదని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు, ఉపాధ్యాయుల, విద్యార్థుల సంక్షేమం, అభివృద్ధికి సమర్థమైన కార్యాచరణ అమలు చేస్తో్ందని చెప్పారు. గురుకుల విద్యలో దేశానికే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందన్నారు. నాణ్యమైన విద్య అందిస్తూ రేపటి తరాన్ని తీర్చిదిద్దడంలో ముందంజలో ఉందని, గుణాత్మక విద్యనందిస్తూ సత్ఫలితాలను ఇస్తోందని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వ విధానాలతో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులు చదువులు, క్రీడల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్ర ఖ్యాతిని ప్రపంచానికి చాటుతున్నారని కితాబిచ్చారు.

*సుజీవన్ వావిలాల*🖋️

తెలంగాణ.....బీజేపీ టికెట్ కౌంటర్ ఓపెన్....!

*తెలంగాణ.....    బీజేపీ టికెట్ కౌంటర్ ఓపెన్....!*

హైదరాబాద్‌: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ అభ్యర్థుల దరఖాస్తు స్వీకరణ మొదలైంది. ఆశావహుల నుంచి దరఖాస్తులకు ఆహ్వానం పలికింది రాష్ట్ర బీజేపీ.ఇందుకోసం హైదరాబాద్‌ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్‌ ఏర్పాటు చేశారు. మొత్తం మూడు పేజీలతో కూడా ఫారమ్‌ సమర్పించాల్సి ఉంటుంది.

దరఖాస్తు ఫారంలో నాలుగు పార్ట్‌లు ఉన్నాయి. మొదటి పార్ట్‌లో బీజేపీలో ఎప్పుడు చేరారు?.. వ్యక్తిగత వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. పార్ట్‌-2లో ఎక్కడి నుంచి పోటీ చేశారనే విషయం ప్రస్తావించాలి. పార్ట్‌-3లో ప్రస్తుతం పార్టీలో నిర్వహిస్తున్న బాధ్యతలను పేర్కొనాలి. ఇక పార్ట్‌4లో క్రిమినల్‌ కేసులేమైనా ఉంటే.. ఆ వివరాలు పొందుపర్చాల్సి ఉంటుంది.తొలి దరఖాస్తును సికింద్రాబాద్ నుంచి రవి ప్రసాద్ గౌడ్ అందజేశారు. అభ్యర్థుల నుంచి దరఖాస్తుల స్వీకరణలో కౌంటర్ ఇంచార్జీలుగా మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి, GhMC మాజీ డిప్యూటీ మేయర్ సుభాష్ చందర్, మల్లేష్ తదితరులు ఉన్నారు. ఇవాళ సాయంత్రం నాలుగు గంటల వరకు దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది. చివరి తేదీని సెప్టెంబర్‌ 10వ తేదీగా నిర్ణయిచింది తెలంగాణ బీజేపీ.

*సుజీవన్ వావిలాల*🖋️

Sunday, September 3, 2023

ఇంట్లోకీ చొరబడి ప్రేమోన్మాది దాడి

*ఇంట్లోకీ చొరబడి  ప్రేమోన్మాది దాడి.... తమ్ముడు మృతి అక్క కు తీవ్ర గాయాలు....!*

హైదరాబాద్‌: ఎల్బీనగర్‌ ఆర్టీసీ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. ఓ ఇంట్లోకి చొరబడిన యువకుడు.. యువతి, ఆమె తమ్ముడిపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో యువకుడు మృతి చెందగా, అతని సోదరికి తీవ్ర గాయాలయ్యాయి.పోలీసులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం మధ్యాహ్నం 2.45 గంటలకు ఆర్టీసీ కాలనీలోని సంఘవి ఇంటికి రామంతపూర్‌కి చెందిన శివకుమార్‌ వచ్చాడు. ఆ సమయంలో ఇంట్లో సంఘవి, ఆమె తమ్ముడు చింటూ ఉన్నారు. కొద్దిసేపటి తర్వాత చింటూ, శివకుమార్‌ మధ్య వాగ్వాదం జరిగింది.

ఈక్రమంలో శివకుమార్‌ తన వెంట తెచ్చుకున్న కత్తితో సంఘవి, చింటూపై విచక్షణా రహితంగా దాడి చేశాడు. భవనంలోని మొదటి అంతస్థులో ఘర్షణ జరిగి కిటికీ అద్దాలు పగులగొట్టిన శబ్ధం రావడంతో స్థానికులు చేరుకుని దాడికి పాల్పడిన యువకుడిని ఇంట్లోనే బంధించారు. తీవ్ర గాయాలతో పడి ఉన్న సంఘవి, చింటూలను స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ చింటూ మృతి చెందినట్టు వైద్యులు వెల్లడించారు. సంఘవికి చికిత్స అందిస్తున్నారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని ఎల్బీనగర్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనకు ప్రేమ వ్యవహారమే కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఎల్బీనగర్‌ ఆర్టీసీ కాలనీలో కత్తిపోట్లు జరిగిన స్థలాన్ని డీసీపీ సాయిశ్రీ పరిశీలించారు. దాడికి పాల్పడిన నిందితుడు శివకుమార్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని తెలిపారు. కత్తిపోట్లకు గురైన చింటూ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్టు చెప్పారు. బాధితురాలు సంఘవిని మెరుగైన చికిత్స కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించామని తెలిపారు. నిందితుడిని విచారిస్తే ఘటనకు గల కారణాలు తెలుస్తాయన్నారు.

*సుజీవన్ వావిలాల*🖋️

Saturday, September 2, 2023

బంగాళాఖాతంలో మరో ఆవర్తన ద్రోణి

*బంగాళాఖాతంలో మరో ఆవర్తన ద్రోణి*

*౼ హైదరాబాద్ వాతావరణ శాఖ కీలక ప్రకటన*

*౼ రానున్న 3 రోజుల పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం*

హైదరాబాద్ వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది రానున్న 3 రోజుల పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఇంకా కొనసాగుతూనే ఉంది. సెప్టెంబర్ 3 నాటికి ఉత్తర బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో మరో ఆవర్తన ద్రోణి ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో సెప్టెంబరు 2 ఈ రోజు నుండి 8వ తేదీ వరకు రాష్ట్రంలోని పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా 2, 3, 4 (నేడు, రేపు) తేదీల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా శుక్రవారం రాత్రి కూడా ఆదిలాబాద్, మంచిర్యాల, కుమురం భీం ఆసిఫాబాద్, నిజామాబాద్, జగిత్యాల, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురిశాయి. కానీ.. శని, ఆది, సోమవారాల్లో కూడా.. ఆదిలాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని వివరించారు. దీంతో వాతావరణశాఖ ఆయా జిల్లాల్లో పసుపు హెచ్చరిక జారీ చేసింది. హైదరాబాద్ నగరంలో రానున్న 48 గంటల పాటు ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షం లేదా చినుకులు పడే అవకాశం ఉంది.

_అక్రిడిటేషన్ లేని వారు కూడా విలేఖరులే_

*అక్రిడిటేషన్ లేని వారు కూడా విలేఖరులే". జర్నలిస్ట్ లకు అక్రిడిటేషన్ ప్రామాణికం కాదు..*


*కేంద్ర ప్రభుత్వం గుర్తించిన,RNI సర్టిఫికెట్ కలిగిన, పత్రికల్లో పనిచేసే వారు విలేఖరి లే...*

మరి RNI సర్టిఫికెట్ దానికి ఎటువంటి విలువ లేదా? వారు సంపాద కులు కాదా? అక్రెడిటిటేషన్ కన్నా కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన R.N.I.కె విలువ ఎక్కువ. అక్రెడిటిటేషన్ బస్సులో ప్రయాణించడానికి, రైలు లో ప్రయాణించడానికి మాత్రమే ఉపయోగపడుతుంది.....

ఎడిటర్ ఇచ్చే పాస్ కి విలువ ఎక్కువ. అక్రెడిటిటేషన్ బ్రహ్మ పదార్థమైనట్లు అక్రెడిటిటేషన్ ఉంటేనే వారు జర్నలిస్టులు అనే సంప్రదాయం ఏదైతో ఉందో అది మనిషి యొక్క ప్రాథమిక విధులను‌భంగం కలిగించడమే...

ఈ రోజు అక్రెడిటిటేషన్ ఉంటేనే నిజమైన రిపోర్టర్ లేకపోతే నకిలీ రిపోర్టర్ అని పోలీసులను, ప్రజలను ప్రక్క తోవ పట్టించి... అక్రెడిటిటేషన్లు లేని తోటి రిపోర్టర్స్ ని కించపరిచే విధంగా మాట్లాడుతున్నారట...

*వీరికి నాకో ప్రశ్న..?*

దయచేసి ఎవ్వరు తప్పుగా అనుకోకండి ఇది తోటి రిపోర్టర్స్ చేసే వ్యాఖ్యలకు స్పందించి అడుగుతున్నాము..

కొంచం రాగద్వేషాలు లేకుండా అన్ని చోట్లా ఒకరినొకరు మనమే కలుపుకొని ఐకమత్యంగా నిలబడదాం..

అక్రెడిటిటేషన్ ఉన్న విలేఖరులారా...అక్రెడిటిటేషన్ లేకపోతే రిపోర్టర్స్ కాదని ఎక్కడైనా... ఏమైనా రూల్ రాసి పెట్టి ఉందా...? ఉంటే కొంచెం చూపించండి?

పేపర్... ఛానల్ లకు ఇన్ని అక్రెడిటిటేషన్లు ఇవ్వాలి అని లిమిట్ ఉంటుంది. మరి అక్రెడిటిటేషన్లు లేనివారందరు రిపోర్టర్స్ కారా...?

పని చేసే సంస్థ గుర్తింపు కార్డ్... లెటర్ ఇవ్వనిది అక్రెడిటిటేషన్లు ఎలా వస్తాయి...

నకిలీ రిపోర్టర్స్ అని నెత్తి, నోరు కొట్టుకుంటున్నారు. రిపోర్టర్లకి సంస్థ గుర్తింపు కార్డ్ ఉండగా నకిలీ అని ఎలా అంటారు...?

ఫ్రెండ్స్ నకిలీ జర్నలిస్ట్ అంటే ఆ సంస్థలో పని చేయకుండా ఆ సంస్థ పేరు చెప్పుకొని తిరిగే వాళ్ళు నకిలీ జర్నలిస్టులు అది గుర్తుంచుకోండి...

అక్రెడిటిటేషన్ రాకపోయినా ఆ సంస్థ ఐడి కార్డు ఉంటే చాలు అక్రెడిటిటేషన్ కొలమానం కాదు...


అక్రెడిటిటేషన్ లేనివారు పెట్టింది వార్త కావడం లేదా...?మావి పత్రికలు, ఛానెల్స్ కానప్పుడు గవర్నమెంట్ ఎందుకు రిజిస్ట్రేషన్స్ చేస్తున్నారు...?వారికి లేని బాధ మీకెందుకు...?అసలు అక్రెడిటిటేషన్ అంటే ఏమిటో... సంస్థ గుర్తింపు కార్డ్ అంటే ఏమిటో ముందు తెలుసుకోండి..

మీ దమ్ము అన్నది మీ వార్తలో చూపించండి.మీ దగ్గర ఉన్న ప్రాంతాల్లో ఎన్నో చట్టవ్యతిరేకమైన పనులు జరుగుతున్నాయి వాటిని భయటపెట్టండి..

రాజకీయ నాయకులకు తొత్తులుగా ఉండకుండా ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందేలా చూడండి..

మీ ప్రతాపాలు తోటి రిపోర్టర్స్ పైన కాకుండా అవినీతి పైన చూపించండి. మనలో మనకు ఐక్యత లేకనే మనం అందరికి చులకన అయిపోతున్నాం...

*అయ్య మీరు ముఖ్యంగా ఈ విషయాలు తెలుసుకొండి.*

ఒక సంస్థ కొన్ని లక్షల పెట్టి ఛానల్ లేదా పత్రిక స్థాపించి,ప్రభుత్వం చేత పర్మిషన్స్ తీసుకొని, పూర్తి అవగాహనతో ఉన్న రిపోర్టర్స్ ని నియమించుకొని, సంస్థ ఐడి కార్డ్ మరియు లోగో ఇచ్చి న్యూస్ కొరకు వస్తే నకిలీ రిపోర్టర్స్ అని ఎలా చెప్పగలరు.?

దయఉంచి గమనించండి.. ఒక ఛానల్ లో ఒక జిల్లాలో 100 మంది పనిచేస్తారు కానీ నిర్దేశిత ప్రకారం కొన్ని అక్రెడిటిటేషన్ కార్డులను మాత్రమే మంజూరు చేయపడుతుంది.. మిగిలిన రిపోర్టర్స్ అందరూ నకిలీ నా..?

ఇంకొక విషయం ముఖ్యంగా చెప్పవల్సింది ఏంటి అంటే అక్రెడిటిటేషన్ ఎప్పటికీ జర్నలిస్టుకు ప్రామాణికం కాదు...

*అతను రాసే వార్తలే ప్రామాణికం..*

వార్త లో సత్తా ఉండాలి..ఇక మీ కలానికి పదును పెట్టండి... కత్తిలా మార్చండి.. చెత్త రాజకీయాలను వదిలివేసి, మరల విలేఖరి అనే పదానికి సమాజంలో గౌరవం కలిపిద్దాం .....

*మీలో ఒక జర్నలిస్ట్ *🙏🇮🇳🙏
(సేకరణ డి. సురేష్) 

ఫీజుల వివరాలు వెబ్ సైట్ లో ఉంచాలి

*ఫీజుల వివరాలు వెబ్ సైట్ లో ఉంచాలి...... విద్యాశాఖ ఆదేశం!*

హైదరాబాద్‌: రాష్ట్రంలో అన్ని ప్రైవేట్‌ పాఠశాలలు తాము వసూలు చేసే ఫీజులు ఎంతో విద్యాశాఖ పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయడమే కాకుండా పాఠశాలల వెబ్‌సైట్లోనూ ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది.ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలోని జారీ చేసిన జీఓ 1, జీఓ 95ల ప్రకారం ఉపాధ్యాయులకు వేతనాలు నిర్ణయించాలని, ఫీజులు ఖరారు చేయాలని ఆదేశించారు. మరోవైపు ఈ ఉత్తర్వులపై హైదరాబాద్‌ స్కూల్స్‌ పేరెంట్స్‌ అసోసియేషన్‌ (హెచ్‌ఎస్‌పీఏ) ప్రధాన కార్యదర్శి వెంకట సాయినాథ్‌ మండిపడ్డారు. హైకోర్టులో తాము కోర్టు ధిక్కరణ కేసు దాఖలు చేసినందున దాన్నుంచి తప్పించుకునేందుకు ప్రభుత్వం తూతూమంత్రంగా ఈ ఆదేశాలిచ్చిందని విమర్శించారు. ఫీజులను ఎలా నియంత్రించాలో చెప్పకుండా పాత జీఓల్లో ఉన్న వాటిని ప్రస్తావిస్తే ఎలా అని ఆయన ప్రశ్నించారు.

*సుజీవన్ వావిలాల*🖋️

Friday, September 1, 2023

సత్వర న్యాయం అందించాలి.. సీపీ రాచకొండ

https://www.instagram.com/p/CwpcLY-P1nZ/?igshid=NmQ4MjZlMjE5YQ==                                                                                                                                                     *_రాచకొండ పోలీస్ కమీషనరేట్ పరిధిలో గల అన్ని పోలీస్ స్టేషన్లలో మీకు న్యాయం జరుగకపోయినా అక్కడి పోలీస్ అధికారులు / సిబ్బంది  చట్టాలను ఉల్లంఘించి మీతో దురుసుగా మాట్లాడినా, మిమ్మల్ని ఇబ్బందులకు గురిచేసినా, 'ప్రజాసంకల్పం & Link Media' ద్రుష్టికి తీసుకురావచ్చు.... ప్రజాసంకల్పం లీగల్ బృందం మీకు న్యాయపరమైన సలహాలు ఇస్తుంది.... Bplkm🪶_*