Monday, July 17, 2023

నెలకు రూ.5 వేలు ఇచ్చే.. 'నేష‌న‌ల్ యూత్ వాలంటీర్ స్కీమ్' గురించి తెలుసా?

నెలకు రూ.5 వేలు ఇచ్చే.. 'నేష‌న‌ల్ యూత్ వాలంటీర్ స్కీమ్' గురించి తెలుసా?

యువతకు వారి ప్రాంతంలో వాలంటీర్‌గా కొంత‌కాలం ప‌నిచేయ‌డానికి అవ‌కాశం క‌ల్పిస్తూ 'నేష‌న‌ల్ యూత్ వాలంటీర్' స్కీమ్‌ని కేంద్ర ప్రభుత్వం అమ‌లు చేస్తోంది.

Courtesy By: అంజి (న్యూస్ మీటర్ ట్విట్టర్ )Published on  18 July 2023 10:53 AM

National Youth Volunteer Scheme, Central Govt, National news
నెలకు రూ.5 వేలు ఇచ్చే.. 'నేష‌న‌ల్ యూత్ వాలంటీర్ స్కీమ్' గురించి తెలుసా?

సమాజానికి తమ వంతు సేవ చేయాలని చాలా మంది యువత అనుకుంటూ ఉంటారు. అయితే వారు.. సమాజానికి ఎలాంటి సేవ చేయాలో తెలియక అటువైపు వెళ్లరు. అలాంటి యువతకు వారి ప్రాంతంలో వాలంటీర్‌గా కొంత‌కాలం ప‌నిచేయ‌డానికి అవ‌కాశం క‌ల్పిస్తూ 'నేష‌న‌ల్ యూత్ వాలంటీర్' స్కీమ్‌ని కేంద్ర ప్రభుత్వం అమ‌లు చేస్తోంది. ఈ స్కీమ్‌లో చేరి వాలంటీర్‌గా పని చేసిన వారికి కేంద్ర సర్కార్‌ నెలకు రూ. 5 వేల వేతనం కూడా అందిస్తోంది. ఈ స్కీమ్‌ కింద చేరేవారినే 'నేష‌న‌ల్ యూత్ కాప్స్' అని కూడా పిలుస్తారు. ఈ స్కీమ్‌ని 2011 నుంచి కేంద్ర యువ‌జ‌న, క్రీడ‌ల శాఖ నేతృత్వంలోని ‘నెహ్రూ యువ కేంద్రా సంఘ‌ట‌న్’ ప‌ర్యవేక్షిస్తోంది. ఈ స్కీమ్‌లోని వారు గరిష్ఠంగా రెండేళ్లు వాలంటీర్‌గా పనిచేసేందుకు ఛాన్స్‌ ఇస్తారు.

ప్రతి నెల రూ.5 వేలు ఇస్తారు. ప్ర‌తి సంవ‌త్స‌రం కేంద్ర ప్ర‌భుత్వం ఈ ప‌థ‌కం కింద 12,000 మంది వాలంటీర్ల‌ను ఎంపిక చేసి, వారిని ఆయా రాష్ట్రాల్లో బ్లాక్ లెవ‌ల్ స్థాయి ప్రాంతాల‌కు పంపి, అక్క‌డ వారితో సేవ చేయిస్తుంది. ఈ స్కీమ్‌లో వాలంటీర్‌గా చేరాల‌నుకున్నవారి వ‌య‌సు 18 నుంచి 29 సంవ‌త్స‌రాల మధ్య ఉండాలి. ఎంపికైన వారికి 4 వారాల పాటు శిక్ష‌ణ ఇస్తారు. ఈ స్కీమ్‌లో చేరాలనుకునే వారు 10వ త‌ర‌గ‌తి త‌ప్ప‌నిస‌రిగా పాసై ఉండాలి. అయితే మొదట నేష‌న‌ల్ యూత్ వాలంటీర్‌గా ఎంపిక‌లో గ్రాడ్యుయేష‌న్ పూర్తి చేసి, టెక్నికల్‌ స్కిల్స్‌ క‌లిగిన అభ్య‌ర్థుల‌కు ప్రాధాన్యం ఇస్తారు. స్మార్ట్‌ ఫోన్‌లో యాప్‌లు ఉప‌యోగించ‌డంపై అనుభవం ఉన్న‌వారికి కూడా ప్రాధాన్యం ఇస్తారు.

నేష‌న‌ల్ యూత్ వాలంటీర్‌గా లేదా నేష‌న‌ల్ యూత్ కాప్‌గా ఎంపికైన వారిని నెహ్రూ యువ‌జ‌న కేంద్రం అధికారులు ఆయా ప్రాంతాల్లోని బ్లాక్ లెవ‌ల్ స్థాయికి తీసుకెళ్లి సామాజిక సేవ‌లు అందించేలా చేస్తారు. ప్ర‌స్తుతం ఏపీ, తెలంగాణ‌లో ఈ స్కీమ్‌ కింద చేరిన వాలంటీర్లు ‘ఆజాదీకా అమృత్‌కాల్’ కార్య‌క్ర‌మాల‌ను ప‌ర్య‌వేక్షిస్తున్నారు. ఈ స్కీమ్‌లో చేరాలంటే ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. దీనికి సంబంధించి ఆయా జిల్లాల క‌లెక్ట‌ర్లు యూత్ వాలంటీర్ల నియామ‌కానికి నోటిఫికేష‌న్ జారీ చేస్తారు. దీనిపై ఆ ప్రాంతంలోని ప్ర‌ముఖ ప‌త్రిక‌ల్లో కూడా ప్ర‌క‌ట‌న‌లు ఇస్తారు. అప్పుడు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. క‌లెక్ట‌ర్ నేతృత్వంలో జిల్లా యువ‌జ‌న వ్య‌వ‌హారాల అధికారి, మ‌రో ఇద్ద‌రు అనుభ‌వ‌జ్ఞులైన స‌భ్యులతో కూడిన ఒక క‌మిటీ ఉంటుంది. ఇది ద‌ర‌ఖాస్తుల‌ను ప‌రిశీలించి వాలంటీర్ల‌ను ఎంపిక చేస్తుంది.

_దేవుడి దగ్గర నీ గొప్ప ఏందిరా బై...!

*_దేవుడి దగ్గర నీ గొప్ప ఏందిరా బై...! పైలట్ రోహిత్ రెడ్డీ..జస్ట్ నువ్వు ప్రస్తుతానికి ఎమ్మెల్యేవి మాత్రమే..._*

*_మిస్టర్ రోహిత్ రెడ్డి... ఈ కింది వార్త ఎమ్మెల్యేల గ్రూపులో చూసి.. నన్ను తులనాడుతూ..కులం ప్రస్తావన చేసి.. అదీ తప్పుగా.. ఈ ఐటెం చివరిలో నా కులం చెప్పాను.. ఇంకా నుంచి నోరు జారకు.._*

Courtesy by : _(అనంచిన్ని వెంకటేశ్వరరావు, పరిశోధన పాత్రికేయులు, 9440000009)_

కుడిఎడమల పలు తుపాకుల కాపలా... ఇది సాయుధ రాజశ్యామలం... - 

“రథ-గజ తురగ-పదాతి సమావృత…పరిజన మండిత లోకనుతే… శాంతి సమావృత హాస్య ముఖే…” అని అమ్మవారిని పూజిస్తాం. రథాలు, ఏనుగులు, గుర్రాలు, కాల్బలం (నేల మీద నడిచే సాయుధ దళాలు) వెంట రాగా రాజ వీధుల్లో ఊరేగే అమ్మవారిని చూస్తే చాలట- మన కష్టాలన్నీ తీరిపోతాయి. మన భయాలన్నీ పటాపంచలవుతాయి. ఇన్ని బలగాలు వెంట ఉన్నాయి కాబట్టి ఆమె “శాంతి సమావృత” అయ్యిందని పొరబడ్డవారు కూడా లేకపోలేదు. ఆ బలగాలతో లోకాలకు రక్షణ ఇవ్వడంలో ఆమె శాంతి పొందుతూ ఉంటుందని అర్థం. అంటే ఆమె దగ్గర ఉన్న సాయుధులు మనల్ను రక్షించడానికే తప్ప…ఆమెను రక్షించడానికి కానే కాదు.

*_కట్ చేస్తే..._*
తెలంగాణ తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి రాజశ్యామల యాగం చేశారు. రాజ శ్యామల, చండీ, ప్రత్యంగిరా, బగళాముఖి, మంత్రిణి, దండిని, వారాహి…అన్నీ అమ్మవారి రూపాలే అయినా ఒక్కో రూపం ఒక్కో రాక్షసుడిని చంపడానికి వచ్చినది. ఇప్పుడు రాజకీయ నాయకులందరికీ ఏ పీఠాధిపతులు చెబుతున్నారో కానీ…రాజశ్యామల యాగం చేస్తే రాజకీయంగా ఇక తిరుగు ఉండదనే నమ్మకం బలంగా నాటుకుపోయింది. కోట్లకు కోట్లు ఖర్చు చేసి అందరూ రాజశ్యామల యాగాలే చేస్తున్నారు. రాజశ్యామలలో ఉన్న “రాజ” అన్న మాట రాజు కావడానికి, రాజకీయంగా బలపడడానికి అని అనుకుంటూ సంపన్న రాజకీయ నాయకులందరూ స్థానిక ఓరుగల్లు భద్రకాళి, బాసర సరస్వతి, వర్గల్ చదువులమ్మ, ఏడుపాయల వన దుర్గలను వదిలేసి రాజశ్యామలమ్మను పట్టుకున్నారు.

శ్రీశైలంలో నాలుగువేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోందని అనుకుందాం. దాన్ని నేరుగా మన సెల్ ఫోన్ ఛార్జింగ్ కు పెట్టుకోగలమా? దాన్ని తట్టుకోగల అత్యంత బలమయిన హై టెన్షన్ వైర్ల ద్వారా ప్రసారమై మొదట పెద్ద ట్రాన్స్ ఫార్మర్లకు…ఆ తరువాత 33 కేవీ , 11 కేవీ ట్రాన్స్ ఫార్మర్లకు…చివర మన ఇంట్లో 230 వోల్ట్స్ మాత్రమే ప్లగ్గులో వస్తే…వాడుకోగలం. నాలుగు వేల మెగావాట్ల హై టెన్షన్ వైర్ మన ఇంటికో, ఒంటికో కనెక్ట్ చేస్తే…చిటికెలో కాలి బూడిద కూడా మిగలదు.

అలా అమ్మవారి రాజశ్యామల, చండీ, ప్రత్యంగిరా, బగళాముఖి, మంత్రిణి, దండిని, వారాహి రూపాలు కొన్ని కోట్ల కోట్ల మెగావాట్ల విద్యుత్ శక్తి ఉన్నవి. ఆ రూపాలను తలచుకున్నా…ఆ నామాలను స్మరించుకున్నా చాలు- సమస్యలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. మరి ఆ రూపాలను ఆవాహన చేసే యాగాలు…వారిని పిలిచి కూర్చోబెట్టే మంత్రాలు, యంత్రాలు, తంత్రాలు జరిగినప్పుడు- లోకానికి మంచి జరుగుతుందా? చెడు జరుగుతుందా? అన్నది ఆగమశాస్త్ర నిపుణులు తేల్చాల్సిన విషయం. ఒకవేళ నిజంగా మంచి జరుగుతుందనుకున్నా…వాటికి పాటించాల్సిన నియమాలు వేరే ఉన్నాయి. యజ్ఞయాగాదులు లోక కల్యాణానికి పనికివచ్చేవే కానీ…వ్యక్తిగతంగా ఒకరి ప్రయోజనానికి ఉద్దేశించినవి కావు.

*_ఈ కోణంలో-_*
లోక కల్యాణానికి పైలట్ రోహిత్ రెడ్డి కోట్లకు కోట్లు ఖర్చు పెట్టి రాజశ్యామల యాగం చేసి…యాగశాలలో సాయుధులు వెంటరాగా…పెదవి మీద నవ్వు పెదవి దాటి రాకుండా అదిమి పట్టి…యాగ దీక్షా కాషాయ వస్త్రాలతో నడిచి వస్తుంటే…రాజశ్యామలమ్మే భయపడి పక్కకు తప్పుకుని ఉంటుంది. అలాంటిది…ఆయనేదో కే జి ఎఫ్ సినిమా బ్యాగ్రౌండ్ తో సోషల్ మీడియాకు రీల్స్ షూటింగ్ చేశారని…అదని…ఇదని…నానా మాటలు అనడం మర్యాదస్తులు చేయాల్సింది కాదు.

…తప్పు. కళ్లు పోతాయి. లెంపలేసుకోండి!

“రథ-గజ తురగ-పదాతి సమావృత…పరిజన మండిత లోకనుతే… శాంతి సమావృత హాస్య ముఖే…” అన్న ఎత్తుగడ మాటతోనే ముగిస్తే- లోకాలను రక్షించడంలో పొందే ఆనందంతో లోకనుత అమ్మ నవ్వుతూ ఉంటుంది. లోకకల్యాణానికి సాయుధ యజ్ఞ దీక్షతో పొందిన, పొందబోయే శాంతితో సాయుధ పరిజన మండిత లోకనుత కాషాయాంబరధారి పెదవి మీద నవ్వు మొగ్గ తొడిగి ఉంటుంది!

*_లోకాస్సమస్తాసుఖినో భవంతు. సాయుధ జెడ్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు చండీ, ప్రత్యంగిరా, బగళాముఖి, మంత్రిణి, దండిని, వారాహి సహిత రాజశ్యామల ఆర్ముడ్ ఫోర్స్ అనుగ్రహ ప్రాప్తిరస్తు!_*

*_నోట్: బీట్ నేను బ్రాహ్మణ్ కాదు.. చౌదరి. వేదాలు చదవటానికి కులం, మతం అడ్డు కాదు. జస్ట్ జాగ్రత్తగా ఉండు.. 'నీ' మీద కన్నేశాను.. ఎమ్మెల్యేగారూ.._*

Sunday, July 16, 2023

ఎమ్మెల్యేలను కొనడంలో రేవంత్ సిద్దహాస్తుడు.... మంత్రి KTR....!

*ఎమ్మెల్యేలను కొనడంలో రేవంత్ సిద్దహాస్తుడు.... మంత్రి KTR....!*

జగిత్యాల: ఐదు దశాబ్దాల పాటు దేశ ప్రజలను కాంగ్రెస్‌ రాచి రంపాన పెట్టిందని మంత్రి కేటీఆర్‌ విమర్శించారు. జగిత్యాలలో ఎమ్మెల్యే సంజయ్‌ నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు.రేవంత్‌రెడ్డి మాటలు అవగాహనా రాహిత్యానికి నిదర్శనమన్నారు. రైతులపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ హయాంలో రైతులకు కరెంటు, విత్తనాలు ఇవ్వలేని పరిస్థితి ఉండేదన్నారు. విత్తనాలు, ఎరువుల కోసం చెప్పుల్ని లైన్‌లో పెట్టి నిల్చున్నది నిజం కాదా?అని ప్రశ్నించారు.

''ముఖ్యమంత్రి కేసీఆర్‌ తొమ్మిదేళ్ల పాలనలో రైతుల పరిస్థితి మారిపోయింది. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత రైతుల్ని రాజుగా చేసిన పార్టీ భారాస మాత్రమే. మూడెకరాలున్న రైతులకు 3 గంటల విద్యుత్‌ చాలన్న రేవంత్‌ రెడ్డి మాటలు పార్టీ మాటలు కాదా? కేసీఆర్‌ది 3 పంటల నినాదమైతే కాంగ్రెస్‌ది మూడు గంటల నినాదం.'' అని కేటీఆర్‌ మండిపడ్డారు. ప్రజలు.. రైతుబంధు తీసుకొచ్చిన కేసీఆర్‌ను
విశ్వసిస్తారా లేదా కాంగ్రెస్‌ని నమ్ముతారా? అని కేటీఆర్‌ ప్రశ్నించారు. గతంలో ఏ చెరువులనైనా నింపిన చరిత్ర కాంగ్రెస్‌కు ఉందా? అని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో రూ. లక్ష కోట్ల కుంభకోణం జరిగిందని రాహుల్‌గాంధీ అంటున్నారని, అదెలా జరిగిందో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

రేపటి నుంచి రైతు వేదికలో 'కాంగ్రెస్ పార్టీ కటిక చీటక్ల పాలన వద్దు' అని తీర్మానం చేస్తామన్నారు. ఉచిత కరెంటు మీద మాట్లాడే హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదన్న కేటీఆర్‌.. ఇప్పుడున్నది రాజశేఖర్‌రెడ్డి కాంగ్రెస్‌ కాదని, చంద్రబాబు కాంగ్రెస్‌ పార్టీ అని విమర్శించారు. '' మహారాష్ట్ర రైతులు కూడా కేసీఆర్‌ పాలనను మెచ్చుకుంటున్నారు. రేవంత్ రెడ్డి అర్ఎస్ఎస్ నుంచి వచ్చిన కార్యకర్త. ఆర్ఎస్ఎస్ ఎజెంట్. రేవంత్‌రెడ్డి ఏనాడూ మోదీని ప్రశ్నించలేదు. రేవంత్‌ పూర్వాశ్రమం అంతా ఆర్‌ఎస్‌ఎస్‌దే. ఎమ్మెల్యేలని కొనడంలో రేవంత్‌ సిద్ధహస్తుడు. గాంధీభవన్‌లో గాడ్సే రేవంత్‌రెడ్డి.'' అనికేటీఆర్‌ అన్నారు. హిమాన్షు మాట్లాడిన మాటల్లో తప్పులేదని, ప్రతి పాఠశాలని కేసీఆర్‌ ప్రభుత్వమే బాగు చేస్తుందన్నారు.

*సుజీవన్ వావిలాల*🖋️ 

మానవత్వం చాటిన మంత్రి KTR

*మానవత్వం చాటిన మంత్రి KTR.... క్షతగాత్రులను  ఆసుపత్రికి తరలింపు*

చేగుంట: ఆపదలో ఉన్న వారని ఆదుకోవడంలో ముందుండే ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ మరోసారి తన గొప్ప మనసు చాటారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని తన కాన్వాయ్‌లో తూప్రాన్‌ ఆసుపత్రికి తరలించారు.రామాయంపేట నుంచి సికింద్రాబాద్‌ వెళ్తున్న రాణిగంజ్ డిపో బస్సు చేగుంట జాతీయ రహదారి బైపాస్‌ వద్ద మలుపు తీసుకుంటుండగా.. జగిత్యాల జిల్లా కోరుట్ల నుంచి అతి వేగంగా వస్తున్న కారు బస్సును వెనుక వైపు నుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న షేక్‌ సల్మాన్‌, జమీరుద్దీన్‌ గాయపడ్డారు. వారిని స్థానికులు కారులో నుంచి బయటకు తీశారు. జగిత్యాల నుంచి హైదరాబాద్‌కు వస్తున్న మంత్రి కేటీఆర్‌, కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌ తనయుడు సంజయ్‌ కారు ఆపి క్షతగాత్రులను పరామర్శించారు. అనంతరం వారిని తమ కాన్వాయ్‌లో ఆసుపత్రికి తరలించారు.

*సుజీవన్ వావిలాల*🖋️

ఫ్లెక్సీ లో ఫొటోలేదని.... MLA మాగంటి గోపి నాథ్ వీరంగం....!

*ఫ్లెక్సీ లో ఫొటోలేదని.... MLA మాగంటి గోపి నాథ్ వీరంగం....!*

హైదరాబాద్‌: బోనాల వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో తన ఫోటో పెట్టలేదంటూ జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ వీరంగం సృష్టించారు.వెంగళరావునగర్‌లో బోనాల వేడుకలు జరుగుతుండగా అక్కడకొచ్చిన ఎమ్మెల్యే గోపీనాథ్‌ ఫ్లెక్సీలో తన ఫోటో పెట్టలేదని మండిపడ్డారు.ఈ క్రమంలోనే ఆ బోనాల వేడుకల్లో భాగమైన సామాన్య వ్యక్తి గణేష్‌ ఇంటిపై దాడి చేశారు. తన అనుచరులతో కలిసి గణేష్‌ ఇంట్లోకి చొచ్చుకువెళ్లి దాడికి పాల్పడ్డారు. పోలీసుల సమక్షంలోనే దాడికి పాల్పడగా.. వారు ఏమీ చేయలేక చేతులెత్తేశారు.

*సుజీవన్ వావిలాల*🖋️

మేడ్చల్ నుంచి మంత్రి మల్లారెడ్డి పై తీన్మార్ మల్లన్న పోటీ....!

*మేడ్చల్ నుంచి మంత్రి మల్లారెడ్డి పై తీన్మార్ మల్లన్న పోటీ....!*

తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్.. వచ్చే ఎన్నికల్లో పోటీపై తేల్చేశారు. తాను మేడ్చల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నట్లు తీన్మార్ మల్లన్న ప్రకటించారు.శనివారం రోజున మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ బాలుర బాలికల ఉన్నత పాఠశాల 9, 10వ తరగతి విద్యార్థులకు తీన్మార్ మల్లన్న నోట్ బుక్స్ పంపిణీ చేశారు. అయితే.. రాష్ట్రంలో ప్రశ్నించే గొంతు మిగిలే ఉండాలంటే.. తనపై విపక్ష పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులను పోటీకి నిలుపొద్దని తీన్మార్ మల్లన్న విజ్ఞప్తి చేశారు.

గత పదేళ్లుగా సీఎం కేసీఆర్‌ను ఎదుర్కొంటున్న ఏకైక వ్యక్తి తానేనని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో రాష్ట్రంలో ఏ వ్యక్తి మీద పెట్టని కేసులు తనపై పెట్టారని తెలిపిన తీన్మార్ మల్లన్న.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇంతకన్నా అర్హత ఇంకేముంటదని మల్లన్న ప్రశ్నించారు. అయితే..గత కొంతకాలంగా నవీన్ పోటీపై వస్తున్న వార్తలపై మంత్రి మల్లారెడ్డి స్పందిస్తూ.. తీన్మార్ మల్లన్న తనపై పోటీ చేస్తే డిపాజిట్లు కూడా రావు అంటూ.. కామెంట్ చేశారు. ఈ కామెంట్‌‍పై స్పందించిన తీన్మార్ మల్లన్న.. ఆయన డిపాజిట్ల స్పెల్లింగ్ చెప్పిన తర్వాత ఆ వ్యాఖ్యలపై స్పందిస్తానని.. సెటైర్ వేస్తూనే కొట్టిపారేశారు.

*సుజీవన్ వావిలాల*🖋️

Saturday, July 15, 2023

వైరస్ ను గుర్తించే..... స్మార్ట్ వాచులు...!

*వైరస్ ను గుర్తించే..... స్మార్ట్ వాచులు...!*

కోవిడ్‌' మహమ్మారి దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా వైరస్‌ పేరు చెబితేనే జనాలకు వెన్నులో వణుకు మొదలయ్యే పరిస్థితి దాపురించింది. వైరస్‌ల నిర్మూలన కోసం శాస్త్రవేత్తలు తమ ప్రయత్నాలను మరింత ముమ్మరం కూడా చేశారు.కోవిడ్‌' తర్వాత వైరస్‌ల ఆచూకీని కనిపెట్టే సాంకేతికత కూడా అభివృద్ధి చెందింది. తాజాగా వైరస్‌ల జాడ గుర్తించగలిగే 'విక్లోన్‌' అనే ఈ స్మార్ట్‌వాచ్‌ అందుబాటులోకి వచ్చింది.

టైమ్‌ చూపించడం సహా మిగిలిన పనులన్నీ ఇది ఇతర స్మార్ట్‌వాచీల మాదిరిగానే చేయడమే కాకుండా, చుట్టుపక్కల గాలిలో వైరస్‌లు ఉంటే, వెంటనే అప్రమత్తం చేస్తుంది. గాలిలోని సూక్ష్మకణాలను ఇది లోపలికి పీల్చుకుంటుంది.

ఇందులో అమర్చిన అధునాతన సాంకేతికత ద్వారా ప్రమాదకరమైన బ్యాక్టీరియా కణాలు, వైరస్‌ కణాలు ఉన్నట్లయితే, వాటిని వెంటనే గుర్తించి అప్రమత్తం చేస్తుంది. అమెరికన్‌ కంపెనీ 'డిజైనర్‌ డాట్‌' వైరస్‌ను గుర్తించే ఈ స్మార్ట్‌వాచీని 'విక్లోన్‌' పేరుతో రూపొందించింది.

*సుజీవన్ వావిలాల*🖋️