Monday, July 17, 2023

_దేవుడి దగ్గర నీ గొప్ప ఏందిరా బై...!

*_దేవుడి దగ్గర నీ గొప్ప ఏందిరా బై...! పైలట్ రోహిత్ రెడ్డీ..జస్ట్ నువ్వు ప్రస్తుతానికి ఎమ్మెల్యేవి మాత్రమే..._*

*_మిస్టర్ రోహిత్ రెడ్డి... ఈ కింది వార్త ఎమ్మెల్యేల గ్రూపులో చూసి.. నన్ను తులనాడుతూ..కులం ప్రస్తావన చేసి.. అదీ తప్పుగా.. ఈ ఐటెం చివరిలో నా కులం చెప్పాను.. ఇంకా నుంచి నోరు జారకు.._*

Courtesy by : _(అనంచిన్ని వెంకటేశ్వరరావు, పరిశోధన పాత్రికేయులు, 9440000009)_

కుడిఎడమల పలు తుపాకుల కాపలా... ఇది సాయుధ రాజశ్యామలం... - 

“రథ-గజ తురగ-పదాతి సమావృత…పరిజన మండిత లోకనుతే… శాంతి సమావృత హాస్య ముఖే…” అని అమ్మవారిని పూజిస్తాం. రథాలు, ఏనుగులు, గుర్రాలు, కాల్బలం (నేల మీద నడిచే సాయుధ దళాలు) వెంట రాగా రాజ వీధుల్లో ఊరేగే అమ్మవారిని చూస్తే చాలట- మన కష్టాలన్నీ తీరిపోతాయి. మన భయాలన్నీ పటాపంచలవుతాయి. ఇన్ని బలగాలు వెంట ఉన్నాయి కాబట్టి ఆమె “శాంతి సమావృత” అయ్యిందని పొరబడ్డవారు కూడా లేకపోలేదు. ఆ బలగాలతో లోకాలకు రక్షణ ఇవ్వడంలో ఆమె శాంతి పొందుతూ ఉంటుందని అర్థం. అంటే ఆమె దగ్గర ఉన్న సాయుధులు మనల్ను రక్షించడానికే తప్ప…ఆమెను రక్షించడానికి కానే కాదు.

*_కట్ చేస్తే..._*
తెలంగాణ తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి రాజశ్యామల యాగం చేశారు. రాజ శ్యామల, చండీ, ప్రత్యంగిరా, బగళాముఖి, మంత్రిణి, దండిని, వారాహి…అన్నీ అమ్మవారి రూపాలే అయినా ఒక్కో రూపం ఒక్కో రాక్షసుడిని చంపడానికి వచ్చినది. ఇప్పుడు రాజకీయ నాయకులందరికీ ఏ పీఠాధిపతులు చెబుతున్నారో కానీ…రాజశ్యామల యాగం చేస్తే రాజకీయంగా ఇక తిరుగు ఉండదనే నమ్మకం బలంగా నాటుకుపోయింది. కోట్లకు కోట్లు ఖర్చు చేసి అందరూ రాజశ్యామల యాగాలే చేస్తున్నారు. రాజశ్యామలలో ఉన్న “రాజ” అన్న మాట రాజు కావడానికి, రాజకీయంగా బలపడడానికి అని అనుకుంటూ సంపన్న రాజకీయ నాయకులందరూ స్థానిక ఓరుగల్లు భద్రకాళి, బాసర సరస్వతి, వర్గల్ చదువులమ్మ, ఏడుపాయల వన దుర్గలను వదిలేసి రాజశ్యామలమ్మను పట్టుకున్నారు.

శ్రీశైలంలో నాలుగువేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోందని అనుకుందాం. దాన్ని నేరుగా మన సెల్ ఫోన్ ఛార్జింగ్ కు పెట్టుకోగలమా? దాన్ని తట్టుకోగల అత్యంత బలమయిన హై టెన్షన్ వైర్ల ద్వారా ప్రసారమై మొదట పెద్ద ట్రాన్స్ ఫార్మర్లకు…ఆ తరువాత 33 కేవీ , 11 కేవీ ట్రాన్స్ ఫార్మర్లకు…చివర మన ఇంట్లో 230 వోల్ట్స్ మాత్రమే ప్లగ్గులో వస్తే…వాడుకోగలం. నాలుగు వేల మెగావాట్ల హై టెన్షన్ వైర్ మన ఇంటికో, ఒంటికో కనెక్ట్ చేస్తే…చిటికెలో కాలి బూడిద కూడా మిగలదు.

అలా అమ్మవారి రాజశ్యామల, చండీ, ప్రత్యంగిరా, బగళాముఖి, మంత్రిణి, దండిని, వారాహి రూపాలు కొన్ని కోట్ల కోట్ల మెగావాట్ల విద్యుత్ శక్తి ఉన్నవి. ఆ రూపాలను తలచుకున్నా…ఆ నామాలను స్మరించుకున్నా చాలు- సమస్యలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. మరి ఆ రూపాలను ఆవాహన చేసే యాగాలు…వారిని పిలిచి కూర్చోబెట్టే మంత్రాలు, యంత్రాలు, తంత్రాలు జరిగినప్పుడు- లోకానికి మంచి జరుగుతుందా? చెడు జరుగుతుందా? అన్నది ఆగమశాస్త్ర నిపుణులు తేల్చాల్సిన విషయం. ఒకవేళ నిజంగా మంచి జరుగుతుందనుకున్నా…వాటికి పాటించాల్సిన నియమాలు వేరే ఉన్నాయి. యజ్ఞయాగాదులు లోక కల్యాణానికి పనికివచ్చేవే కానీ…వ్యక్తిగతంగా ఒకరి ప్రయోజనానికి ఉద్దేశించినవి కావు.

*_ఈ కోణంలో-_*
లోక కల్యాణానికి పైలట్ రోహిత్ రెడ్డి కోట్లకు కోట్లు ఖర్చు పెట్టి రాజశ్యామల యాగం చేసి…యాగశాలలో సాయుధులు వెంటరాగా…పెదవి మీద నవ్వు పెదవి దాటి రాకుండా అదిమి పట్టి…యాగ దీక్షా కాషాయ వస్త్రాలతో నడిచి వస్తుంటే…రాజశ్యామలమ్మే భయపడి పక్కకు తప్పుకుని ఉంటుంది. అలాంటిది…ఆయనేదో కే జి ఎఫ్ సినిమా బ్యాగ్రౌండ్ తో సోషల్ మీడియాకు రీల్స్ షూటింగ్ చేశారని…అదని…ఇదని…నానా మాటలు అనడం మర్యాదస్తులు చేయాల్సింది కాదు.

…తప్పు. కళ్లు పోతాయి. లెంపలేసుకోండి!

“రథ-గజ తురగ-పదాతి సమావృత…పరిజన మండిత లోకనుతే… శాంతి సమావృత హాస్య ముఖే…” అన్న ఎత్తుగడ మాటతోనే ముగిస్తే- లోకాలను రక్షించడంలో పొందే ఆనందంతో లోకనుత అమ్మ నవ్వుతూ ఉంటుంది. లోకకల్యాణానికి సాయుధ యజ్ఞ దీక్షతో పొందిన, పొందబోయే శాంతితో సాయుధ పరిజన మండిత లోకనుత కాషాయాంబరధారి పెదవి మీద నవ్వు మొగ్గ తొడిగి ఉంటుంది!

*_లోకాస్సమస్తాసుఖినో భవంతు. సాయుధ జెడ్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు చండీ, ప్రత్యంగిరా, బగళాముఖి, మంత్రిణి, దండిని, వారాహి సహిత రాజశ్యామల ఆర్ముడ్ ఫోర్స్ అనుగ్రహ ప్రాప్తిరస్తు!_*

*_నోట్: బీట్ నేను బ్రాహ్మణ్ కాదు.. చౌదరి. వేదాలు చదవటానికి కులం, మతం అడ్డు కాదు. జస్ట్ జాగ్రత్తగా ఉండు.. 'నీ' మీద కన్నేశాను.. ఎమ్మెల్యేగారూ.._*

No comments:

Post a Comment