Monday, July 17, 2023

నెలకు రూ.5 వేలు ఇచ్చే.. 'నేష‌న‌ల్ యూత్ వాలంటీర్ స్కీమ్' గురించి తెలుసా?

నెలకు రూ.5 వేలు ఇచ్చే.. 'నేష‌న‌ల్ యూత్ వాలంటీర్ స్కీమ్' గురించి తెలుసా?

యువతకు వారి ప్రాంతంలో వాలంటీర్‌గా కొంత‌కాలం ప‌నిచేయ‌డానికి అవ‌కాశం క‌ల్పిస్తూ 'నేష‌న‌ల్ యూత్ వాలంటీర్' స్కీమ్‌ని కేంద్ర ప్రభుత్వం అమ‌లు చేస్తోంది.

Courtesy By: అంజి (న్యూస్ మీటర్ ట్విట్టర్ )Published on  18 July 2023 10:53 AM

National Youth Volunteer Scheme, Central Govt, National news
నెలకు రూ.5 వేలు ఇచ్చే.. 'నేష‌న‌ల్ యూత్ వాలంటీర్ స్కీమ్' గురించి తెలుసా?

సమాజానికి తమ వంతు సేవ చేయాలని చాలా మంది యువత అనుకుంటూ ఉంటారు. అయితే వారు.. సమాజానికి ఎలాంటి సేవ చేయాలో తెలియక అటువైపు వెళ్లరు. అలాంటి యువతకు వారి ప్రాంతంలో వాలంటీర్‌గా కొంత‌కాలం ప‌నిచేయ‌డానికి అవ‌కాశం క‌ల్పిస్తూ 'నేష‌న‌ల్ యూత్ వాలంటీర్' స్కీమ్‌ని కేంద్ర ప్రభుత్వం అమ‌లు చేస్తోంది. ఈ స్కీమ్‌లో చేరి వాలంటీర్‌గా పని చేసిన వారికి కేంద్ర సర్కార్‌ నెలకు రూ. 5 వేల వేతనం కూడా అందిస్తోంది. ఈ స్కీమ్‌ కింద చేరేవారినే 'నేష‌న‌ల్ యూత్ కాప్స్' అని కూడా పిలుస్తారు. ఈ స్కీమ్‌ని 2011 నుంచి కేంద్ర యువ‌జ‌న, క్రీడ‌ల శాఖ నేతృత్వంలోని ‘నెహ్రూ యువ కేంద్రా సంఘ‌ట‌న్’ ప‌ర్యవేక్షిస్తోంది. ఈ స్కీమ్‌లోని వారు గరిష్ఠంగా రెండేళ్లు వాలంటీర్‌గా పనిచేసేందుకు ఛాన్స్‌ ఇస్తారు.

ప్రతి నెల రూ.5 వేలు ఇస్తారు. ప్ర‌తి సంవ‌త్స‌రం కేంద్ర ప్ర‌భుత్వం ఈ ప‌థ‌కం కింద 12,000 మంది వాలంటీర్ల‌ను ఎంపిక చేసి, వారిని ఆయా రాష్ట్రాల్లో బ్లాక్ లెవ‌ల్ స్థాయి ప్రాంతాల‌కు పంపి, అక్క‌డ వారితో సేవ చేయిస్తుంది. ఈ స్కీమ్‌లో వాలంటీర్‌గా చేరాల‌నుకున్నవారి వ‌య‌సు 18 నుంచి 29 సంవ‌త్స‌రాల మధ్య ఉండాలి. ఎంపికైన వారికి 4 వారాల పాటు శిక్ష‌ణ ఇస్తారు. ఈ స్కీమ్‌లో చేరాలనుకునే వారు 10వ త‌ర‌గ‌తి త‌ప్ప‌నిస‌రిగా పాసై ఉండాలి. అయితే మొదట నేష‌న‌ల్ యూత్ వాలంటీర్‌గా ఎంపిక‌లో గ్రాడ్యుయేష‌న్ పూర్తి చేసి, టెక్నికల్‌ స్కిల్స్‌ క‌లిగిన అభ్య‌ర్థుల‌కు ప్రాధాన్యం ఇస్తారు. స్మార్ట్‌ ఫోన్‌లో యాప్‌లు ఉప‌యోగించ‌డంపై అనుభవం ఉన్న‌వారికి కూడా ప్రాధాన్యం ఇస్తారు.

నేష‌న‌ల్ యూత్ వాలంటీర్‌గా లేదా నేష‌న‌ల్ యూత్ కాప్‌గా ఎంపికైన వారిని నెహ్రూ యువ‌జ‌న కేంద్రం అధికారులు ఆయా ప్రాంతాల్లోని బ్లాక్ లెవ‌ల్ స్థాయికి తీసుకెళ్లి సామాజిక సేవ‌లు అందించేలా చేస్తారు. ప్ర‌స్తుతం ఏపీ, తెలంగాణ‌లో ఈ స్కీమ్‌ కింద చేరిన వాలంటీర్లు ‘ఆజాదీకా అమృత్‌కాల్’ కార్య‌క్ర‌మాల‌ను ప‌ర్య‌వేక్షిస్తున్నారు. ఈ స్కీమ్‌లో చేరాలంటే ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. దీనికి సంబంధించి ఆయా జిల్లాల క‌లెక్ట‌ర్లు యూత్ వాలంటీర్ల నియామ‌కానికి నోటిఫికేష‌న్ జారీ చేస్తారు. దీనిపై ఆ ప్రాంతంలోని ప్ర‌ముఖ ప‌త్రిక‌ల్లో కూడా ప్ర‌క‌ట‌న‌లు ఇస్తారు. అప్పుడు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. క‌లెక్ట‌ర్ నేతృత్వంలో జిల్లా యువ‌జ‌న వ్య‌వ‌హారాల అధికారి, మ‌రో ఇద్ద‌రు అనుభ‌వ‌జ్ఞులైన స‌భ్యులతో కూడిన ఒక క‌మిటీ ఉంటుంది. ఇది ద‌ర‌ఖాస్తుల‌ను ప‌రిశీలించి వాలంటీర్ల‌ను ఎంపిక చేస్తుంది.

No comments:

Post a Comment