Wednesday, July 5, 2023

తప్పించెంత తప్పు ఏంచేసారు...అన్న..నిన్ను మరువదు...కాషాయ యువత

*తప్పించెంత తప్పు ఏంచేసారు... అన్న..నిన్ను మరువదు    కాషాయ యువత....అంటున్న బీజేపీ క్యాడర్...!*

హైదరాబాద్: బండి సంజయ్ కుమార్.. ఆ పేరుకు తెలంగాణలో రాజకీయాల్లో, యువతలో ఓ వినూత్న బ్రాండ్ ఉంది. ఆ పేరు చెబితే వైబ్రేట్ అయ్యే యూత్ కూడా ఉంది. బీజేపిలో పాదయాత్ర చేసిన తొలి నేతగా, మోదీ దేవుడన్నా అని గొంతు చించుకుని అరిసినా..ఎందుకు తిట్టాలన్నా మోదీని అని ఎలుగెత్తి చాటినా, తెలంగాణ సీఎంను జైలుకు పంపించి తీరుతామని బల్ల గుద్ది చెప్పినా.. ఒక్క అవకాశం ఇవ్వండి బీజేపికీ అని వేడుకున్నా.. పాత బస్తీలో సర్జికల్ స్ట్రైక్ నిర్వహిస్తామని గర్జించినా బండి సంజయ్ తర్వాతే అనేంత వరకూ పార్టీని ఉర్రూతలూగించారు బండి సంజయ్.

*ఎందుకు తప్పించారో అర్ధం కావట్లేదంటున్న యువత*
అంతే కాకుండా 6విడతలుగా ప్రజా సంగ్రామ పాద యాత్రతో ప్రజలకు బీజేపిని అత్యంత సన్నిహితంగా తీసుకెళ్లారు బండి సంజయ్. బండి సంజయ్ పాద యాత్రతో తెలంగాణలో పార్టీకి మంచి ఊపొచ్చిందనే చర్చ కూడా క్షేత్ర స్ధాయిలో చోటుచేసుకుంది. బండి సంజయ్ నేత్రుత్వంలో జరిగిన మూడు ఉప ఎన్నికలో రెండు చోట్ల పార్టీ విజయాన్ని సొంతం చేసుకుంది. అంతే కాకుండా నగర పాలక సంస్ధ ఎన్నికల్లో 5 సీట్లు ఉన్న బీజేపి బండి సంజయ్ నేతృత్వంలో ఏకంగా 47 సీట్లను గెలుచుకుందంటే బండి సంజయ్ కృషి ఎంతుందో అర్థమవుతోంది.

*బండి సంజయ్ చేసిన తప్పేంటి*పాదయాత్రలతో, ప్రజా సమస్యల పరిష్కారాలతో, పబ్లిక్ సమావేశాలతో, ప్రగతి భవన్ పోరాటాలతో అప్రతిహతంగా దూసుకెళ్తున్న బండి సంజయ్ ని పార్టీ అద్యక్షబాద్యతలనుండి అదిష్టానం తప్పించింది. దీంతో తెలంగాణ బీజేపి క్యాడర్ మొత్తం నిరుత్సాహంలో పడిపోయింది. బహిరంగంగా ఎవరూ ఈ అంశాన్ని చెప్పకపోయినప్పటికీ యువతలో మాత్రం ఇందుకు సంబందించిన నైరాశ్యం కొట్టొచ్చినట్టు కనపడుతోంది. అసలు బండి సంజయ్ చేసిన తప్పేంటని యువత ప్రశ్నిస్తోంది.వేలమంది కార్యకర్తల నిరుత్సాహం*అంతే కాకుండా బండి సంజయ్ కు అసలు బాద్యతలు తెలంగాణ బీజేపి బాద్యతలు ఎందుకు కట్టడబెట్టారు.. ఎందుకు తొలగించారని బీజేపి యువత ప్రశ్నిస్తోంది. దేశం కోసం, ధర్మం కోసం పనిచేద్దాం అనుకునే ప్రతి యువకుడిలో ఆత్మస్తైర్యాన్ని నింపి సామాన్య యువకులు కూడా క్రమశిక్షణ తో ఉంటే రాజకీయాల్లో రానించోచ్చు అని నిరూపించిన నాయకుడని యువత బండి సంజయ్ ని కొనియాడుతున్నారు. నేడు కొన్నివేలమంది కార్యకర్తలు నిరుత్సాహనికి గురి అవుతున్నమాట వాస్తవం కాని అధినాయకత్వం నిర్ణయాన్ని శిరసా వహించాల్సిందే కదా అంటూ బండి సంజయ్ కు సందేశాలు పంపిస్తున్నారు యువత.

*సుజీవన్ వావిలాల*🖋️ 

Tuesday, July 4, 2023

కాంగ్రెస్ మానిఫోస్టో కసరత్తులు


*కాంగ్రెస్ మానిఫోస్టో కసరత్తులు_*
_★ కేసీఆర్ కి ఊహకందని ఎత్తుగడలతో ముందుకు_
_★ బిసిలు, మహిళలు, పేదలకు దగ్గరగా.._
_◆ ఎస్టీ, ఎస్సీలకు సరికొత్త పథకాలు_
_★ నిర్భంధాలకు దూరంగా 'స్వేచ్ఛ_'
_★ జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలపై అక్రమ కేసుల ఎత్తివేత_

Courtesy by :-
_(అనంచిన్ని వెంకటేశ్వరరావు, దశాబ్ది ఉత్తమ పరిశోధన పాత్రికేయ అవార్డు గ్రహీత, 'ఆదాబ్ హైదరాబాద్'కు ప్రత్యేకం, 9440000009)_

_https://epaper.aadabhyderabad.in/c/72853752_

*_తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల వేడి రాజుకుంది. కాంగ్రెస్ వ్యూహాత్మకంగా ముందుకు వెళుతోంది. మరీ ముఖ్యంగా చెప్పాలంటే కేసీఆర్ 'ఎత్తుగడలకు ఎలా చెక్ పెట్టవచ్చు.?' అనే కోణంలో తీవ్రంగా కసరత్తులు మొదలు పెట్టలేదు... పూర్తి చేయటం విశేషం._*

*_అసలు మానిఫోస్టోలో ఏం ఉంది..?:_*
తెలంగాణలో ఉన్న వ్యవస్థలను నోర్వీర్యం చేయటంపై కాంగ్రెస్ ప్రధానంగా దృష్టి సారించింది. ఇందుకోసం మూడు కీలకమైన అంశాలపై దృష్టి సారించింది. అందులో ప్రధానంగా నిర్భంధం, అక్షర, ఆశ్రయ వంటి వాటితో అణగారిన వర్గాలను ఆదుకునే ప్రయత్నం చేసింది. ఇంకా కాంగ్రెస్ మేనిఫెస్టోలో యువత, మహిళలు, పేదలు వంటి ఆరు అంశాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం చెప్పుకోదగ్గ అంశం.

*_బిసిలు, మహిళలు, పేదలకు దగ్గరగా..:_*
కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో గృహ జ్యోతి (200 యూనిట్ల వరకు పేదలకు ఉచిత విద్యుత్), గృహలక్ష్మీ (ప్రతి కుటుంబంలోని మహిళకు రూ.2000), ఇందిరమ్మ స్త్రీ (బీపీఎల్ కుటుంబంలోని ప్రతి వ్యక్తికి 10 కిలోల ఆహారధాన్యాలు). శక్తి (మహిళలకు ఉచిత బస్సు రవాణా), బీసీలకు బిసీ కమిషన్ ద్వారా నిరుద్యోగ యువతకు ఆర్థిక సహాయం. ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణ పేదలు, ఇతర కులాలకు చెందిన పేదలకు కార్పొరేషన్ ద్వారా వడ్డీ లేని రుణాల మంజూరు.

*_ఎస్టీ, ఎస్సీలకు సరికొత్త పథకాలు:_*
'దళిత బందు' ద్వారా జరిగిన అక్రమాలను  ఒకవైపు విచారణ చేస్తూ... మరోవైపు దళితులకు పెద్ద ఎత్తున ఆర్థిక సహాయం, సబ్సిడీలతో వడ్డీలేని రుణాలను పారదర్శకంగా అందించటం. ఇందులో ఎంపీ,ఎమ్మెల్యేల ప్రమేయంం లేకుండా ఆరోపణలు లేని స్థానిక నాయకులతో కమిటీ ఏర్పాటు చేయటం.

*_యువత కోసం ఇలా...:_*
యువ నిధి (నిరుద్యోగులకు నెలకు రూ.5 వేలు), నిర్భంధం ఎదుర్కొంటున్న జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తల కోసం ప్రత్యేక పథకం ఈ ఆరు అంశాలపై ప్రధానంగా దృష్టి సారించింది. ఇప్పటికే ఉద్యోగాల కల్పన, మహిళా సాధికారత, నిరుద్యోగ నిర్మూలన, రైతు సంక్షేమం వంటి అంశాలను చేర్చింది. ఈ కొత్త పథకాలు అదనం.

*_కేసీఆర్ కు ఊహించని షాక్.!:_*
ఈ ఎన్నికల మానిఫోస్టోలో కాంగ్రెస్ మొత్తం 108 పథకాలను చేపట్టింది. తెలంగాణలో భారస ఎక్కడ విఫలమయిందో... కాంగ్రెస్ అక్కడ సక్సెస్ మంత్రం చేపట్టింది. విద్య, వైద్య , మహిళా, బిసి, పేద వర్గాలకు చేరువలో ఆ,యా పథకాలను చేపట్టింది. ఇది 'భారాసకు ఊహించని షాక్' అని చెప్పవచ్చు.

బండి తీవ్ర... అసంతృప్తి!

*బండి తీవ్ర... అసంతృప్తి!*

*పార్టీ అవసరాల మేరకే మారుస్తున్నామని చెప్పిన నడ్డామీడియా* *కంటపడకుండా వెళ్లిన బండి...!*

దిల్లీ, హైదరాబాద్‌: భాజపా రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తనను దూరం చేయడం పట్ల బండి సంజయ్‌ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.కీలక సమయంలో అనూహ్య నిర్ణయం తీసుకోవడం, ఒక వైపు రాష్ట్ర పార్టీ వ్యవహారాలపై అగ్రనేతలు ప్రశంసిస్తూనే పదవి నుంచి తప్పించడంతో ఆయన ఆవేదన చెందినట్లు సమాచారం. పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి.మనోహర్‌రెడ్డి, కోశాధికారి శాంతికుమార్‌లతో కలిసి సంజయ్‌ పార్టీ కేంద్ర కార్యాలయానికి మంగళవారం మధ్యాహ్నం వెళ్లారు. పార్టీ భాజపా జాతీయ అధ్యక్షుడు నడ్డా, నేతలు ఛుగ్‌, బన్సల్‌లతో సంజయ్‌ సుమారు 2గంటలపాటు సమావేశమయ్యారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, కేంద్ర క్యాబినెట్‌ విస్తరణ తదితర అంశాలు వారి మధ్య చర్చకు వచ్చాయి. పార్టీ అవసరాల మేరకే రాష్ట్ర శాఖ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పిస్తున్నట్లు సంజయ్‌కు నడ్డా తెలిపినట్లు సమాచారం. సమావేశం అనంతరం సంజయ్‌ మీడియా కంటపడకుండా మరో మార్గంలోకారులో వెళ్లిపోయారు. కొద్దిసేపటికే పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కిషన్‌రెడ్డి, ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్‌గా ఈటలను నియమిస్తూ ప్రకటనలు విడుదలయ్యాయి. నడ్డాను కలవడానికి ముందే సంజయ్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి సంతోష్‌ను కలిసినట్లు సమాచారం.

*నేతలకు, కార్యకర్తలకు, ప్రజలకు ధన్యవాదాలు*
భాజపా అధ్యక్ష పదవి నుంచి నిష్క్రమిస్తున్నట్లు ట్విటర్‌లో బండి సంజయ్‌ పేర్కొన్నారు. ప్రధాని మోదీ సహా భాజపా అగ్రనేతలకు, ప్రజా సంగ్రామ యాత్ర సమయంలో తనను స్వాగతించిన ప్రజలకు, అరెస్టుల సమయంలో తనకు అండగా నిలిచిన కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. కిషన్‌రెడ్డి నేతృత్వంలో మరింత ఉత్సాహంతో పార్టీ కోసం పనిచేస్తానని వెల్లడించారు.

*సుజీవన్ వావిలాల*🖋️ 

తెలంగాణలో మరోసారి ఐఏఎస్‌ల బదిలీలు

*తెలంగాణలో మరోసారి ఐఏఎస్‌ల బదిలీలు*

*GHMC కమిషనర్‌గా రోనాల్డ్ రోస్*

హైదరాబాద్ :జులై 04
రాష్ట్రంలో పలువురు ఐఏఎస్‌లను ప్రభుత్వం బదిలీ చేసింది. జీహెచ్ఎంసీ కమిషనర్‌గా రోనాల్డ్ రోస్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన రాష్ట్ర ఆర్థిక శాఖ ఓఎస్‌డీగా ఉన్నారు. జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్‌ను అదనపు ఎన్నికల ప్రధానాధికారిగా నియమించడంతో ఈ మార్పులు జరిగాయి. మొత్తం నలుగురు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఎక్సైజ్ శాఖ డైరెక్టర్‌గా ఉన్న సర్ఫరాజ్ అహ్మద్‌ను జాయింట్ సీఈఓగా నియమించడంతో ఆ స్థానంలో వెయిటింగ్‌లో ఉన్న ముషర్రఫ్ ఆలీ ఫారూఖీని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు... 

Monday, July 3, 2023

అల్లూరి సీతారామరాజు 125 జయంతి వేడుకలు

*నేడు రాష్ట్రపతి రాక గచ్చిబౌలిలో ట్రాఫిక్ ఆంక్షలు....!*

అల్లూరి సీతారామరాజు 125 జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు మంగళవారం గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రానున్నారు.ఈ నేపథ్యంలో గచ్చిబౌలి స్టేడియం పరిధిలోని ప్రధాన రోడ్లపై ట్రాఫిక్‌ ఆంక్షలు విధించినట్లు సైబరాబాద్‌ ట్రాఫిక్‌ జాయింట్‌ కమిషనర్‌ నారాయణ్‌నాయక్‌ తెలిపారు.

మంగళవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయన్నారు. లింగంపల్లి నుంచి గచ్చిబౌలి వరకు, విప్రో సర్కిల్‌ నుంచి గచ్చిబౌలి స్టేడియం వరకు, గచ్చిబౌలి కూడలి నుంచి స్టేడియం వరకు ఉన్న రోడ్లపై ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని, ఇందుకోసం వాహనదారులంతా ప్రత్యామ్నాయ మార్గాలలో రాకపోకలు సాగించాలని ఆయన సూచించారు. పోలీసులకు వాహనదారులంతా సహకరించాలని ఆయన కోరారు.

*సుజీవన్ వావిలాల*🖋️

Sunday, July 2, 2023

Sangareddy District Mining officials...No Action was taken

Respected Sirs,

TOP PRIORITY.

It has been 4 months since #Lakdaram village inspection was conducted by your Assistant Mining officer along with Sangareddy District Mining officials, however, no action was taken and there is no response as of today.

KSR mining company started mining activity by occupying Govt assigned lands, and carrying out huge irregular blastings that are endangering the life of the entire villages and also Animals are worst affected as all the fields are filled with chemicals and Dust particles.

Apart from KSR Mining Company, all the other existing Mining and Crusher companies operating from Lakdaram villages have destroyed the entire village by polluting the Ground Water, Air and Soil as they have been continuously using heavy blastings meterials to extract the mine, and most of them already dug more than 900 meters depth and still going inside that is resulted in huge ground water pollution, and also, the chemical filled water being dumped into the nearby agricultural lands that is causing irrevocable damage to the soil, and generating huge Air, Water Soil Pollution in the entire village  which is a clear violation of the fundamental rights of the citizens under Article 21.

More importantly, the said KSR company has been openly destroying Lakdaram Peddacheruvu which is on an extent of 500 acres and that is the only source of water for 2000 plus acres of agriculture land, as the said company operating from just 100 meters from the toe of the Lake.

Please NOTE that Article 21 of the Constitution includes the right to enjoyment of pollution free water and air for full enjoyment of life. If anything endangers or impairs that quality of life in derogation of laws a citizen has recourse to the Article 21. Also, Article 51 a g places duty on every citizen to protect the Lakes and natural national assets and it is the directive principle of the State Policy.

All the mining and Crusher companies operating from Lakdaram Village has been openly violating all the Laws including Environmental Act, WALTA act DAM Safety act, Pollution Control Acts, and fundamental rights of the citizens, however, despite rising multiple complaints with evidence, all the authorities have been mute spectators for the reasons best known to them.

Therefore, I most humbly request your kind authority to act immediately in the interest of the Justice and equity and the Public at large.

Courtesy by :-
V. Ravikrishna
Advocate.
9618531012.
@Collector_SRD @CPCB_OFFICIAL @TelanganaCMO @TelanganaCS @CWCOfficial_GoI @TelanganaCS @TelanganaCMO @KTRBRS @moefcc @BRSHarish #Lakdaram #Peddacheruvu #Patancheru @MinesMinIndia #Sangareddy  @spsangareddy @TelanganaDGP

Saturday, July 1, 2023

గ్రూప్ 4 పరీక్ష రాస్తూ ఫోన్ తో పట్టుబడ్డ అభ్యర్థి....!

*గ్రూప్ 4 పరీక్ష రాస్తూ ఫోన్ తో పట్టుబడ్డ అభ్యర్థి....!*

హైదరాబాద్... గ్రూప్‌ -4 పరీక్ష రాస్తూ సెల్‌ఫోన్‌తో ఓ అభ్యర్థి పట్టుబడ్డాడు. సరూర్‌నగర్‌లోని సక్సెస్‌ కళాశాలలో ఈ ఘటన జరిగింది. పరీక్ష ప్రారంభమైన అరగంట తర్వాత ఇన్విజిలేటర్‌ గుర్తించి..అభ్యర్థి నుంచి ఫోన్‌ తీసుకుని సీజ్‌ చేశారు. మాల్‌ ప్రాక్టీస్‌ కింద అభ్యర్థిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ సంఘటన మినహా జిల్లా వ్యాప్తంగా ఉదయం సెషన్‌లో జరిగిన గ్రూప్-4 పేపర్-1 పరీక్ష ప్రశాంతంగా జరిగిందని కలెక్టర్‌ తెలిపారు.

రాష్ట్రంలో గ్రూప్-4 పరీక్ష ప్రశాంతంగా కొనసాగుతోంది. 8,180 ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన ఈ పరీక్షకు 9,51,321 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు జనరల్ స్టడీస్ పరీక్ష రాశారు. మధ్యాహ్నం 2.30గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు సెక్టరేరియల్ ఎబిలిటీస్ పరీక్షను అభ్యర్థులు రాయనున్నారు. కొన్ని చోట్ల వివిధ కారణాలతో అభ్యర్థులు సమయానికి పరీక్ష కేంద్రాలకు చేరుకోలేకపోవడంతో నిర్వాహకులు పరీక్ష రాసేందుకు అనుమతించలేదు. దీంతో వారు నిరాశతో వెనుదిరిగారు.

*సుజీవన్ వావిలాల*🖋️