Friday, June 23, 2023

కేసీఆర్ దారిలో కేజ్రీవాల్....? ఇది కాంగ్రెస్ కు రిక్వెస్ట్ కాదు అల్టిమేటం....!

*కేసీఆర్ దారిలో కేజ్రీవాల్....? ఇది కాంగ్రెస్ కు రిక్వెస్ట్ కాదు అల్టిమేటం....!*
ఢిల్లీ: వివిధ రాష్ట్రాల్లోసార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిని ఓడించడమే లక్ష్యంగా ప్రతిపక్షాలన్నీ ఏకమయ్యాయి.ఇందులో భాగంగా శుక్రవారం బీహార్‌ సీఎం, జేడీయూ అధినేత నితీశ్‌కుమార్‌ నివాసంలో కాంగ్రెస్‌తోపాటు వివిధ ప్రతిపక్షాలు హాజరు అయ్యారు. గతంలోనే ఈ భేటీలో ప్రధాని అభ్యర్థిపై ఎలాంటి చర్చ జరగదని ఈ పార్టీలు ఇప్పటికే స్పష్టం చేశాయి. ఈ తరుణంలో ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రతి పక్షాలకు సడన్‌గా షాక్‌ ఇచ్చారు.

*కాంగ్రెస్‌కు కేజ్రీవాల్ అల్టిమేటం*
శుక్రవారం విపక్షాల సమావేశం నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కాంగ్రెస్‌కు అల్టిమేటం ఇచ్చారు. ఢిల్లీలో ప్రభుత్వ అధికారుల బదిలీలు, నియామకాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ ఆర్డినెన్స్‌ను కాంగ్రెస్ వ్యతిరేకించాలని, లేనిపక్షంలో తాను భవిష్యత్తులో ప్రతిపక్ష పార్టీల ఐక్యతకు సంబంధించిన అన్ని సమావేశాలకు దూరంగా ఉండనున్నట్లు తెలిపారు. ఆర్డినెన్స్‌పై కాంగ్రెస్ తన వైఖరిని వెల్లడించాలని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా ఈ సమావేశానికి సీఎం కేజ్రీవాల్‌ కూడా హాజరయ్యారు.

భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ప్రతి పక్షాలన్నీ సమావేశమైన ఈ సమయంలో రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ఆప్‌ పార్టీ విషయంలో కాంగ్రెస్‌ ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే. కాగా ఇప్పటికే కేంద్రం ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా మద్దతు కూడగట్టేందుకు అరవింద్ కేజ్రీవాల్ పలువురు ఆప్ నేతలను కలిశారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీని కూడా కలిసేందుకుప్రయత్నించాగా.. అది కుదరలేదు.

*కాంగ్రెస్‌ మద్దతు ఇవ్వకపోతే.. కేసీఆర్‌ దారిలో కేజ్రీవాల్‌?*
ఒక వేళ ఆర్డినెన్స్‌ విషయంలో కాంగ్రెస్‌ ఆప్‌కు మద్దతు తెలపకపోతే.. కేజ్రీవాల్‌ కూడా సీఎం కేసీఆర్‌ దారిలో నడిచే అవకాశం ఉంది. ఇటీవల టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చి జాతీయ పార్టీగా ప్రకటించిన కేసీఆర్‌.. అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ రెండింటిపై దాడి చేస్తూ వివిధ రాష్ట్రాల్లో తన సంస్థాగత బలాన్ని చాటుకుంటూ రానున్న ఎన్నికల కోసం సిద్ధం అవుతున్నారన్న సంగతి తెలిసిందే.

*సుజీవన్ వావిలాల*🖋️ 

#ముదిరాజ్ జాగో

https://youtu.be/x0oOSTfqgNo                                              
 *#ముదిరాజ్ బంధు మిత్రులారా మీకు #ఆత్మగౌరవం లేదా ??#ముదిరాజ్ సంఘాలు వివిధ పార్టీలలో వున్న ముదిరాజ్ నాయకులు నిద్దుర పోతున్నారా ?? #ముదిరాజ్ బిడ్డను అమ్మనా బూతులు తిడుతుంటే ఇంకెన్నాళ్లు మౌనంగా వుంటారు??..... Bplkm🪶*                                          
*@TelanganaCMO* *@KTRBRS*
*@Eatala_Rajender*                                                                                                                             https://twitter.com/Praja_Snklpm/status/1672256798882148353?t=eoG8Amo5348SxiVbCQ6nsA&s=19

Thursday, June 22, 2023

మంత్రి మల్లారెడ్డి కాలేజీలో భారీగా నగదు స్వాధీనం

మంత్రి మల్లారెడ్డి కాలేజీలో భారీగా నగదు స్వాధీనం: ఈడీ

హైదరాబాద్‌: తెలంగాణ మెడికల్‌ కాలేజీల్లో సోదాలపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ గురువారం ప్రకటన చేసింది. రాష్ట్రంలోని ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లో సోదాలు జరిపామని తెలిపింది..

మంత్రి మల్లారెడ్డి కాలేజీలో భారీగా నగదు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది. రూ. కోటి 40 లక్షలు నగదు, బ్యాంక్‌ ఖాతాల్లోని రూ. 2.89 లక్షలు అనధికార నగదు సీజ్‌ చేసినట్లు తెలిపింది.

'హైదరాబాద్‌, ఖమ్మం, కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌ మెడికల్‌ కాలేజీల్లో సోదాలు నిర్వహించాం. వరంగల్‌ పీజ మెడికల్‌ సీట్స్‌ స్కామ్‌పై కేసు నమోదు చేశాం. సోదాల్లో పెద్ద ఎత్తున నగదు, పత్రాలు స్వాధీనం చేసుకున్నాం. మనీలాండరింగ్‌ కింద కేసు నమోదు చేశాం. ఇద్దరు మంత్రులకు చెందిన మమత, మల్లారెడ్డి కాలేజీల్లో సోదాలు జరిపాం. ఎలక్ట్రానిక్‌ వస్తువులు స్వాధీనం చేసుకున్నాం' అని ఈడీ పేర్కొంది..


Courtesy by : సుజీవన్ వావిలాల 

Wednesday, June 21, 2023

UAPA లాంటి చట్టాలను దుర్వినియోగం చేస్తుండ్రు

భీమ కోరెగవ్ కేసులో దేశ స్థాయిలో ప్రశ్నించే గొంతులను పట్టుకుంటే, ములుగు UAPA కేసు రాష్ట్ర స్థాయిలో అదే పని చేయడానికి ప్రయత్నిస్తోంది. 

హరగోపాల్ అంటే ఫేమస్ వ్యక్తి కాబట్టి, ముఖ్యమంత్రి ఆయన మీద కేసుని తీసేయండి అంటే తీసేసారు.  అది UAPA కేసు కాబట్టి మీడియా దృష్టిని ఆకర్షించింది, కొంత మంది బయట పడ్డారు. 

ముఖ్యమంత్రి గారు చెప్పగానే, ములుగు పోలీసులకు ఆ కొంతమంది మీద ఆధారాలు లేవు అని అప్పటికి అప్పుడు తెలుసుకొని, కోర్టుకు వాళ్ళ పేర్లు కొట్టెయ్యమని చెప్పారు.  

కారణం లేకుండా ఒక వ్యక్తిని అరెస్ట్ చేయరాదు అని చెబుతున్న వ్యవస్థ అడ్డుపడలేకపోయింది. పోలీసులు అధికార పార్టీ నాయకులు చెప్పినట్టు విని, ఎవరిని పడితే వారిని అరెస్ట్ చేస్తారు అని సినిమాలలో చూపించిన విధంగా జరిగింది. 

 ఎప్పుడో పోయిన సంవత్సరం పెట్టిన కేసు గురించి ఇప్పటి దాకా నిందితులకు కూడా తెలియదు. విచారణ మొదలు అవ్వలేదు. ప్రజా ఉద్యమాల కోణం లో ఆలోచిస్తే, అవసరం అయినప్పుడు హరగోపాల్ గారిని జైల్ లోకి తోయడం కోసం పేపర్ వర్క్ సిద్దం చేసుకున్నారు అనుకోవచ్చు. అది తప్పు అని చెప్పడానికి పెద్దగా చర్చ అవసరం లేదు. 

ఒకవేళ,  152 మీద ఏటువంటి  రాజకీయ వొత్తిడి లేకుండా, వారు రాజద్రోహం చేస్తారు, చేయబోతున్నారు అని నమ్మి కేసు పెడితే, సంవత్సరం వరకు విచారణ మొదలు అవ్వక పోవడం ఏంటి?

ములుగు పోలీసులు జూన్ 17, 2023 రోజు ఇచ్చిన స్టేట్మెంట్ లో, మావోయిస్టు లీడర్స్ మీద, మావోయిస్టు సానుభూతి పరుల మీద, అక్కడ దొరికిన విప్లవ సాహిత్యం లో ఉన్న మనుష్యుల పేర్ల ఆధారంగా కేసులు పెట్టడం జరిగింది అని చెప్పారు. క్రైమ్ చేసిన వారి మీద, అనుమానం ఉన్న వారి మీద కేసులు పెట్టాలి కానీ, నక్సల్స్ దగ్గర దొరికిన పుస్తకాలలో రాసి ఉన్న పేర్లు అని, వారికి సానుభూతిపరులు అని కేసు పెట్టడం ఏమిటో? ఆ పుస్తకాలో  కార్ల్  మార్క్స్  పేరు , మజుందార్ పేరు కూడా ఉండే ఉంటాయి, వారి మీద కూడా కేసులు బుక్ అయ్యాయా?

ఇక్కడ అందరు భయపడాల్సిన విషయం ఏమిటంటే,   దాదాపు సంవత్సరం పాటు తెలియకపోవడం. అంటే ఎవరి మీద ఎక్కడ ఏమి కేసు ఉందో తెలియదు, కాబట్టి సరైన సమయం చూసి ఎవరినైనా అరెస్ట్ చేయవచ్చు.  

ఒక పద్దతి, ఒక నియమం లేకుండా జరిగే పనుల వల్ల, ప్రజలకు వ్యవస్థ పట్ల నమ్మకం పోయే అవకాశం ఎక్కువ. అలా నమ్మకం పోయిన రోజున, తాము నిర్బంధానికి గురికాకుండా ఉండాలంటే, అధికార పార్టీ మనుష్యులతో  సత్సంబంధాలు ఉంచుకోవల్సిన పరిస్థితి వచ్చిన రోజు, మానవ హక్కుల మాట పక్కన పెడితే, అసలు వ్యవస్థ నే  కూలిపోయినట్టు భావించాలి. 

UAPA లాంటి చట్టాలు భారత దేశం లో కొత్త కాదు.  ప్రభుత్వాన్ని విమర్శించే వారిని, వ్యతిరేకించే వారిని అదుపులో పెట్టడానికి POTA,UAPA లు ఉంటాయి. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వ్యక్తులను , సంఘ విద్రోహ వ్యక్తులుగా చిత్రీకరించడం అనేది కూడా కొత్తది కాదు.  అయితే, ఇలా ప్రశ్నించే వారు, విమర్శించే వారు తక్కువ సంఖ్య లో  ఉండటం వలన ఇలాంటి నల్ల  చట్టాలతో వారి నోరుని నొక్కెయ్యడం తేలిక. అలాకాకుండా ప్రతి వ్యక్తి , ప్రభుత్వ చట్టాలు , విధానాలతో తన జీవితం, తన చుట్టూ ఉన్న సంఘ్ ఎలా మారచ్చో అర్థం చేసుకున్న రోజు, ప్రభుత్వాల ఆలోచనా విధానం మారుతుంది, ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుంది, మానవ హక్కులు కాపాడబడతాయి.  

Courtesy by :
సంజీవ్
మానవ హక్కుల వేదిక.

తెలంగాణ ప్రజల్ని మోసం చేసినందుకు దశాబ్ది ఉత్సవాలా?

*తెలంగాణ ప్రజల్ని మోసం చేసినందుకు దశాబ్ది ఉత్సవాలా?*
 
*BSP-ఉప్పల్ నియోజకవర్గ అధ్యక్షులు*
*గందమల్ల శ్రీనివాస్*

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా ధనంతో హంగు, ఆర్భాటలతో నిర్వహిస్తున్న దశాబ్ది సంబరాలు, ముందుగా వారి కుటుంబం మొత్తం బాగుపడినందుకు, మరియు KCR పెట్టిన నూతన పార్టీ BRSను ప్రచారం చేసుకోవటం కోసం
మాత్రమే అని అన్నారు

గడిచిన 9 సంవత్సరాల  కాలంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా నెరవేర్చలేదు అని అన్నారు
మాయమాటలతో అధికారంలోకి వచ్చి మిగులు బడ్జెట్ గా ఉన్న తెలంగాణను నేడు అప్పుల తెలంగాణగా మార్చిన ఘనత మన KCR గారిది అని విలేకరుల సమావేశంలో అన్నారు

తెలంగాణలో గద్దెనెక్కదానికి ఇచ్చిన హామీలలో KCR ఇంత వరకు నెరవేర్చని వాటిలో కొన్ని హామీలు మాత్రమే

1) తెలంగాణ రైతులకు రుణమాఫీ చేయనందుకు సంబరాలా?

2) నిరుద్యోగులను మోసం చేసినందుకు సంబరాలా


 3) ఉద్యోగులకు జీతాలు సమయానికి ఇవ్వనందుకు సంబరాలా

 4) డబల్ బెడ్ రూములు ఇవ్వనందుకు సంబరాలా

(ని ఫామ్ హౌస్, ,ప్రగతి భవన్, నూతన సచివాలయం నిర్మాణం కేవలం 6 నెలల్లోనే పూర్తి చేసుకోవటం కోసం వందల కోట్లు ఉంటాయి కానీ
పేదవాడికి ఇల్లు కట్టుకోవటానికి 9 సంవత్సరాల నుండి బడ్జెట్ ఇవ్వనందుక)

 5)  కేజీ టు పీజీ విద్య అమలు చేయనందుకు సంబరాలా 

 6)  ధరణి పేరుతో వేల ఎకరాల భూమిని దగా చేసినందుకు సంబరాలా 

 7) దళితులకు మూడెకరాల భూమి ఇవ్వనందుకు సంబరాలా  

 8) నిరుద్యోగ భృతి ఇవ్వనoదుకు సంబరాలా 

9)  TSPSC లో పేపర్లు లీకేజీ చేసి 36 లక్షల మంది నిరుద్యోగులకు అన్యాయం చేసినందుకు  సంబరాలా 

 10) ప్రశ్నించే గొంతులను అణిచివేస్తున్నందుకు సంబరాలా 

 11)  నల్ల మట్టిని  దోస్తునందుకు,ఇసుక మాఫియాను పెంచి పోషిస్తున్నదుక సంబరాలా 

 12) లిక్కర్ స్కాము చేశాం అని సంబరాలా 

13)ఎలాంటి మార్గదర్శకాలు లేకుండా,హర్హులను వదిలేసి కేవలం BRS కార్యకర్తలకు దళిత బంధు ఇచ్చినoదుక

15) తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలను వదిలిన కుటుంబాలను వదిలి
తెలంగాణ ఉద్యమాన్ని నిరుగార్చిన వారికి ఈ రోజు MLA, MP టిక్కెట్లు ఇచ్చి 
సామాన్య ప్రజలను దోచుకుంటుంనందుక

16)దళితుడిని ముఖ్యమంత్రి చేయనందుక

16)ఉద్యోగాలు రాక ఆత్మహత్య చేసుకుంటున్న, విద్యార్థుల, తల్లిదండ్రుల ఆనాదలు అయినందుక
అని ప్రశ్నించారు

18)నిటమునిగిన ఇళ్లకు ఇంత వరకు నష్ట పరిహారం ఎవ్వనందుక

19)ఒక్క వనకే ఇండ్లు, మునిగిపోయే డ్రైనేజీలు, ఏర్పాటు చేసినందుక
కాళేశ్వరం, వంటి ప్రాజెక్టులాల్లో లక్షలాది రూపాయలను కమీషన్ల రూపంలో మీ కుటుంబాలకు దోచిపెట్టినందుక 

20) చెరువులు, సామాన్య ప్రజల భూములు కబ్జా చేస్తున్నాదుక ఈ సంబరాలు
అని అన్నారు

వీటి అన్నిటికి ఉప్పల్ MLA బేతి సుభాష్ రెడ్డి  గారు
సమాధానం చెప్పాలి అని అన్నారు
ఎమ్ సాధించారు అని దశాబ్ది ఉత్సవాలు అని ఆగ్రహం వ్యక్తం చేశారు
మీరు చేసే ప్రజా వ్యతిరేక కార్యక్రమాల అన్నిoటిని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు అని రాబోయే ఎన్నికల్లో BRS కు తగిన బుద్ధి చెప్పి BSP కి అధికారం ఇస్తారు అని అన్నారు
రాబోయే రోజుల్లో తెలంగాణ బహుజన సమాజం మొత్తం 
బహుజన్ సమాజ్ పార్టీ
తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు 
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అభ్యర్థి
Dr RS ప్రవీణ్ కుమార్ గారి వెంట ఉంటూ ఆయన చేస్తున్న పోరాటానికి పూర్తిగా మద్దతు ఇవ్వడానికి తెలంగాణ ప్రజలు అదే విదంగా ఉప్పల్ నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారు అని అన్నారు
బహుజనులకు రాజ్యాధికారామే అంతిమ లక్ష్యంగా BSP  పని చేస్తుంది అని అన్నారు.

డిల్లీలో ఎన్నికల అధికారులను కలిసిన.... గద్దర్

*డిల్లీలో ఎన్నికల అధికారులను కలిసిన.... గద్దర్*

ప్రజాయుద్ధనౌక గద్దర్ ప్రత్యక్ష రాజకీయాల వైపు అడుగులు వేశారు. కొత్త రాజకీయ పార్టీ దిశగా పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలోనే గద్దర్ బుధవారం న్యూఢిల్లీలోని కేంద్ర ఎన్నికల కార్యాలయానికి వెళ్లారు.రాజకీయ పార్టీ రిజిస్ట్రేషన్ కోసం ఎన్నికల అధికారులను గద్దర్ కలిశారు. అనంతరం గద్దర్ మీడియాతో మాట్లాడుతూ.. ''గద్దర్ ప్రజా పార్టీ'' పేరుతో పార్టీని ఏర్పాటు చేసేందుకు ఢిల్లీకి వచ్చినట్టుగా చెప్పారు. పార్టీ రిజిస్ట్రేషన్ కోసం ఎన్నికల అధికారులకు అప్లికేషన్‌ ఇవ్వడం జరిగిందన్నారు.

ఇది ప్రజల కోసం ఏర్పాటు చేస్తున్న పార్టీ అని గద్దర్ చెప్పారు. భారత రాజ్యాంగం ప్రకారం ఈ దేశం నడవాలని అన్నారు. తాను పార్లమెంటరీ మార్గంలోకి వచ్చానని.. ఓట్ల యుద్దంలోకి దిగానని చెప్పారు. తాను ఏర్పాటు చేస్తున్న గద్దర్ ప్రజా పార్టీ ఒక తెలంగాణదే కాదని.. దేశంలోని ఒక పార్టీగా నిర్మాణం చేసేందుకు తాను బుద్దుడిలా కృషి చేస్తానని తెలిపారు. ఇక, గద్దర్ ప్రజా పార్టీ జెండాను మూడు రంగులతో రూపొందించినట్లు తెలుస్తోంది. అందులో ఎరుపు, నీలి, ఆకుపచ్చ ఉండనున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. అలాగే జెండా మధ్యలో పిడికిలి గుర్తును పెట్టారు.

*సుజీవన్ వావిలాల*🖋️ 

Tuesday, June 20, 2023

విద్యా దినోత్సవంలో చోటుచేసుకున్న విషాదం

*వెంట పడిన కుక్కలు... ట్రాక్టర్ కింద పడి విద్యార్థి దుర్మరణం*

*విద్యా దినోత్సవంలో చోటుచేసుకున్న విషాదం*

*హనుమకొండ జిల్లా మర్రిపల్లిగూడెంలో దుర్ఘటన*

*కమలాపూర్...* కుక్కలు వెంటపడటంతో తప్పించుకునే ప్రయత్నంలో ఓ బాలుడు ట్రాక్టర్‌ కిందపడి దుర్మరణం పాలైన విషాదకర ఘటన హనుమకొండ జిల్లా కమలాపూర్‌ మండలంలోని మర్రిపల్లిగూడెంలో మంగళవారం చోటు చేసుకుంది.పోలీసుల వివరాల మేరకు.. మర్రిపల్లిగూడేనికి చెందిన ఇనుగాల జయపాల్‌-స్వప్న దంపతుల ఒక్కగానొక్క కుమారుడు ధనుష్‌ (10) ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 6వ తరగతిలో చదువుతున్నాడు.

తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం విద్యా శాఖ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ధనుష్‌ ఈ ర్యాలీలో పాల్గొనేందుకు వెళ్తున్న క్రమంలో వీధి కుక్కలు వెంట పడ్డాయి. వాటినుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తుండగా అదే గ్రామంలోని రిక్కల నారాయణరెడ్డికి చెందిన ట్రాక్టర్‌ను డ్రైవర్‌ తోట విజయేందర్‌ అతివేగంగా, అజాగ్రత్తగా నడుపుతూ వచ్చి బాలుడుని ఢీకొట్టాడు. ప్రమాదంలో ధనుష్‌ ట్రాక్టర్‌ కింద పడిపోయి తీవ్రంగా గాయపడ్డాడు.గమనించిన స్థానికులు వెంటనే కమలాపూర్‌ ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలే తమ కుమారుడిని బలి తీసుకున్నాయని, ఈ ఉత్సవాలు లేకుంటే తమ కుమారుడు బతికేవాడని ధనుష్‌ తల్లిదండ్రులు విలపించారు. ధనుష్‌ తండ్రి జయపాల్‌ ఫిర్యాదు మేరకు ట్రాక్టర్‌ యజమాని నారాయణరెడ్డి, డ్రైవర్‌ తోట విజయేందర్‌లపై పోలీసులు కేసు నమోదు చేశారు.

*ప్రభుత్వం పరిహారం ఇవ్వాలి: ఈటల*
హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ విద్యార్థి ధనుష్‌ కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడి పరామర్శించారు. ధనుష్‌ కుటుంబానికి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి కమలాపూర్‌ ప్రభుత్వాస్పత్రికి చేరుకుని విద్యార్థి మృతదేహాన్ని పరిశీలించారు. బాధిత కుటుంబీకులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

*సుజీవన్ వావిలాల*🖋️