Sunday, February 26, 2023

మన్నించు తల్లీ..😔

*మన్నించు తల్లీ..*
*'సమాజంలో భాగమైన' ఈ వేదింపులకు బలయిన ప్రీతి కన్నుమూత*
*దారుణ ఘటన పై స్పందించాలో వద్దో అనే సందిగ్ధంలో సమాజము వుండిపోయింది.* 
*(కులం,మతం,జాతి,వర్గం,రాజకీయాలు,...)*
*బాధితురాలి కోసం సమాజం నామమాత్ర స్పందన, కానీ వేదింపులు గురిచేసిన వాడికి దొరికిన కొద్దిపాటి మద్దతు!!*
*Shame!!*

😔
తల్లీ నిన్ను మానసికంగా చంపేసిన ఈ వ్యవస్థలో వున్నందుకు సిగ్గుపడుతున్నాను.

మేధావులు అనుకునే వెధవల్లారా ఇప్పుడైనా స్పందించండి

ఓం శాంతి సద్గతి 🙏

Bplkm🪶

వైద్య విద్యార్థిని ప్రీతి ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలి.... ఈటల రాజేందర్.....!

*వైద్య విద్యార్థిని ప్రీతి ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలి.... ఈటల రాజేందర్.....!*

హైదరాబాద్‌: వరంగల్‌ కేఎంసీ వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యాయత్నం ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలని భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్  డిమాండ్‌ చేశారు.బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రీతికి మెరుగైన వైద్యం అందించేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఆదివారం నిమ్స్‌ ఆస్పత్రికి వెళ్లిన ఈటల.. ఆమె ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ''రాష్ట్రంలోని వైద్య కళాశాలల్లో నిగూఢంగా ఇంకా ర్యాగింగ్‌ కొనసాగుతోంది. మెడికల్‌ కాలేజీల్లో పీజీ చదివే అమ్మాయిల మీద సీనియర్లు వేధింపులకు గురిచేస్తున్నారని ప్రీతి ఘటనతో స్పష్టమైంది. ఇలాంటి ఘటనలు వెలుగుచూసినప్పుడు హెచ్‌వోడీలే చర్యలు తీసుకోవాలి. ప్రీతి విషయంలో సకాలంలో హెచ్‌వోడీ స్పందించి చర్యలు తీసుకుని ఉంటే ఆమె ఆత్మహత్యాయత్నం చేసుకునేదికాదు. చివరకు ప్రిన్సిపల్‌ దగ్గరికి వెళ్లి ఆమె గోడు వెళ్లబోసుకున్నప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు. ఈ ఘటనపై ప్రీతి తండ్రి పోలీసులకు చెప్పినా ప్రయోజనం లేకపోయింది. ఇక్కడ అన్నీ వ్యవస్థలు విఫలమయ్యాయని అర్థమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం దీనిపై సమగ్ర విచారణ జరిపించాలి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలి'' అని ఈటల డిమాండ్‌ చేశారు. ప్రీతి ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా ఉందని.. వెంటిలేటర్‌పై ఆమెకు చికిత్స అందిస్తున్నామని నిమ్స్‌ వైద్యులు తెలిపారు.

*సుజీవన్ వావిలాల*🖋️

తెలంగాణలో టీడీపీ ని ప్రతిఒక్కరు గుండెల్లో.... పెట్టుకున్నారు.... చంద్రబాబు....!

*తెలంగాణలో టీడీపీ ని ప్రతిఒక్కరు గుండెల్లో.... పెట్టుకున్నారు.... చంద్రబాబు....!*

హైదరాబాద్: ఎన్టీఆర్ భవన్‌ కు టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఇవాళ్టి నుంచి తెలంగాణ లో ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం 'ఇంటింటికీ తెలుగుదేశం' కిట్లను చంద్రబాబు పంపిణీ చేశారు.సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ''41 ఏళ్లుగా తెలుగువారి కోసమే పనిచేస్తోన్న పార్టీ టీడీపీ. తెలంగాణలో ప్రతిఒక్కరూ టీడీపీని గుండెల్లో పెట్టుకున్నారు. తెలంగాణ గడ్డపైనే ఎన్టీఆర్‌ టీడీపీని ఏర్పాటు చేశారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకే టీడీపీని స్థాపించారు. యువత, మహిళలకు టీడీపీ మాత్రమే పెద్దపీట వేసింది. సమిష్టిగా కృషిచేసి టి.టీడీపీకి పూర్వవైభవం తేవాలి. సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టిందే టీడీపీ. టీడీపీ ప్రవేశపెట్టిన పథకాలు నేటికీ కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌ను ఐటీలో అగ్రగామిగా తీర్చిదిద్దిన ఘనత టీడీపీదే. దేశంలో ఎక్కడాలేని విధంగా హైదరాబాద్‌లో మౌళిక వసతులు సైబరాబాద్‌ను నిర్మించిన ఘనత టీడీపీదే. కాసాని జ్ఞానేశ్వర్‌(Kasani Gnaneshwar) నేతృత్వంలో పార్టీ బలోపేతం'' అవుతోందని చంద్రబాబు అన్నారు.

''సంపద సృష్టించడం, ఉపాధి కల్పించడం,..అభివృద్ధి చేయడమే టీడీపీ ధ్యేయం. సంపద సృష్టించడమెంత ముఖ్యమో, పేదలకు అందించడం అంతే ముఖ్యం. టీడీపీ ఎక్కడ ఉంది అనేవారికి ఖమ్మం సభే సమాధానం. ఇక్కడికి వచ్చి చూస్తే టీడీపీ ఎక్కడ ఉందో కనిపిస్తోంది. తెలుగువారు ఎక్కడున్నా వారికోసం టీడీపీ పనిచేస్తుంది. చరిత్ర ఉన్నంత వరకూ టీడీపీ ఉంటుంది. కాసాని నేతృత్వంలో టి.టీడీపీ పరుగులు పెడుతోంది. తెలంగాణలో మొదటి సీటు నాయిబ్రాహ్మణులకు..రెండో సీటు రజకులకు ఇస్తాం. టి.టీడీపీకి యువత అండగా ఉండాలి. విభజన తర్వాత లేనిపోని సమస్యలు పెట్టుకోవటం సరికాదు. తెలంగాణలో సంపద సృష్టించడానికి కారణం టీడీపీనే..పేదలను నాయకులుగా ప్రమోట్ చేసిన పార్టీ టీడీపీ మాత్రమే. ప్రజల్లో ఉన్న నాయకులను మాత్రమే పార్టీ గౌరవిస్తోంది. ఎన్టీఆర్‌ భవన్ చుట్టూ కాకుండా.. నేతలు గ్రామాల్లో తిరగాలి టీడీపీని కాపాడుకోవడం చారిత్రక'' అవసరం ఉందని చంద్రబాబు అన్నారు.

*సుజీవన్ వావిలాల*🖋️ 

Saturday, February 25, 2023

తెలంగాణలో రేపటి నుండి ఇంటింటికి.... తెలుగుదేశం..... కాసాని జ్ఞానేశ్వర్

*తెలంగాణలో రేపటి నుండి ఇంటింటికి.... తెలుగుదేశం..... కాసాని జ్ఞానేశ్వర్*

హైదరాబాద్‌: తెలంగాణలో తెలుగుదేశం పూర్వవైభవం దిశగా అడుగులు పడుతున్న వేళ యువత, మహిళలు, విద్యావంతులకు పెద్దపీట వేస్తామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ అన్నారు.రాష్ట్రంలో రేపట్నుంచి ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం మొదలవుతుందని ఆయన తెలిపారు. ఆదివారం ఉదయం 10 గంటలకు ఎన్టీఆర్ భవన్‌లో తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారని ప్రకటించారు. హైదరాబాద్ ఎస్ఆర్‌నగర్‌లోని తన నివాసంలో మీడియాతో కాసాని చిట్‌చాట్ నిర్వహించారు.

రాష్ట్రంలో పది రోజులపాటు మండలం యూనిట్‌గా ప్రతి బూత్ స్థాయిలో ఇంటింటికీ తెదేపా కార్యక్రమం ఉంటుందని కాసాని జ్ఞానేశ్వర్‌ తెలిపారు. అన్ని పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థల్లో డివిజన్ల వారీగా కొనసాగుతుందని చెప్పారు. అదే ఇంట్లో కుటుంబ సభ్యుల పేర్లు నమోదు చేసుకుంటూ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా చేపడతామన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అన్ని డివిజన్లలో ఇంటింటికీ తెదేపా కార్యక్రమంలో భాగంగా నాడు ఎన్టీఆర్, చంద్రబాబు హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ ఫలాలు ప్రజలకు వివరిస్తామని స్పష్టం చేశారు. కిలో రూ.2 బియ్యం పథకం, పట్వారీ, పటేల్ వ్యవస్థ రద్దు, మహిళలకు ఆస్తి హక్కు, బీసీ వర్గాలకు పెద్దపీట వంటి అంశాలు వివరించడంతోపాటు తెదేపా పూర్వ వైభవం కోసం సలహాలు, సూచనలు స్వీకరిస్తామన్నారు. పది రోజుల తర్వాత మరో 20 రోజులపాటు ప్రతి మండలంలో అన్ని గ్రామాల్లో బస్సు యాత్రలు చేపడతామని తెలిపారు. తెదేపా ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని మార్చి 27వ తేదీన సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో 'సింహగర్జన' పేరిట లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని... ఆ సభకు ముఖ్య అతిథిగా చంద్రబాబు హాజరవుతారని కాసాని వెల్లడించారు.

*సుజీవన్ వావిలాల*🖋️ 

సీఎం కేసీఆర్ నాయకత్వంలో వేగంగా పాలమూరు - రంగారెడ్డి.... MP రంజిత్ రెడ్డి....!

*సీఎం కేసీఆర్ నాయకత్వంలో  వేగంగా పాలమూరు - రంగారెడ్డి.... MP రంజిత్ రెడ్డి....!*

సీఎం కేసీఆర్‌ (CM KCR) నాయకత్వంలో పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు వేగంగా జరుగుతున్నాయని, త్వరలోనే పూర్తవుతాయని చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి  అన్నారు.ఎత్తిపోతల పథకం పనులు ఎలా జరుగుతున్న తీరును శనివారం నీటిపారుదలశాఖ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ప్రాజెక్టు పనుల్లో మొదటి భాగమైన శ్రీశైలం బ్యాక్‌వాటర్‌ ప్రాంతమైన నాగర్‌ కర్నూల్‌లోని అంజనగిరి రిజర్వాయర్ మొదలుకొని ఉద్దండపూర్ రిజర్వాయర్ వరకు జరుగుతున్న కెనాల్, టన్నెల్, సర్జ్‌పూల్, పంపుహౌస్ పనులను అక్కడి పనిచేస్తున్న ఇంజినీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. త్వరలోనే చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని ప్రజాప్రతినిధులను కూడా ప్రత్యేక వాహనాల్లో పాలమూరు-రంగారెడ్డి ఎత్తి పోతల ప్రాజెక్టు సందర్శనకు తీసుకుకెళ్లే ఏర్పాట్లను చేస్తానని ఎంపీ రంజిత్ రెడ్డి ప్రకటించారు

*సుజీవన్ వావిలాల🖋️* 

Friday, February 24, 2023

కేసులుంటే స్వీపర్ కాలేరు కానీ మంత్రలు కావొచ్చు.... సుప్రీం కోర్ట్

*కేసులుంటే స్వీపర్ కాలేరు కానీ మంత్రలు కావొచ్చు.... సుప్రీం కోర్ట్*

*నేరాభియోగాలున్న వారిని ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించాలి*
*సుప్రీంకోర్టులో పిటిషన్‌*
*కేంద్రం, ఈసీకి సుప్రీం నోటీసులు*


దిల్లీ: అవినీతికి సామాన్య మానవుడు బలవుతున్నాడని, ఏ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లినా లంచం ఇవ్వనిదే పని జరగడం లేదంటూ సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. అవినీతిని రూపుమాపాలంటే అన్నిస్థాయుల్లో జవాబుదారీతనాన్ని తేవాల్సిన అవసరం ఉందని పేర్కొంది. క్రిమినల్‌ కేసుల్లో అభియోగాలు ఎదుర్కొంటున్న వారిని ఎన్నికల్లో పోటీచేయకుండా నిషేధించాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్‌) విచారణ సందర్భంగా జస్టిస్‌ కె.ఎం.జోసెఫ్‌, జస్టిస్‌ బి.వి.నాగరత్న ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.

పిల్‌ను దాఖలు చేసిన న్యాయవాది అశ్విన్‌ ఉపాధ్యాయ్‌ తన వాదనలు వినిపిస్తూ.. ''వేధింపులు, హత్య, అపహరణ లాంటి నేరాలకు పాల్పడిన వ్యక్తి.. ప్రభుత్వ కార్యాలయంలో స్వీపర్‌ లేదా పోలీస్‌ కానిస్టేబుల్‌ కూడా కాలేడు. కానీ అవే నేరాలు చేసిన వ్యక్తి మాత్రం మంత్రి కావొచ్చు'' అని పేర్కొన్నారు. ఈ పిల్‌పై స్పందన తెలపాల్సిందిగా కేంద్రం, ఎన్నికల సంఘానికి ధర్మాసనం నోటీసులు జారీ చేసింది

*సుజీవన్ వావిలాల*🖋️

యువకుడి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ కు.... అభినందనల వెల్లువ.....!

*యువకుడి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ కు.... అభినందనల వెల్లువ.....!*

హైదరాబాద్: రోడ్డుపై కుప్పకూలి పడిపోయిన ఓ యువకుడి ప్రాణాలు కాపాడిన ట్రాఫిక్‌ కానిస్టేబుల్ రాజశేఖర్‌ కు అభినందనలు వెల్లువెత్తున్నాయి.యువకుడిని కానిస్టేబుల్‌ రక్షించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. శభాష్.. రాజశేఖర్ అంటూ నెటిజన్లు సైతం ప్రశంసలు కురిపించారు. ఇటు కానిస్టేబుల్‌ సమయస్ఫూర్తిపై పోలీసు ఉన్నతాధికారులు కూడా అభినందలు తెలియజేశారు. సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర కానిస్టేబుల్ సమయస్ఫూర్తిని అభినందించి రివార్డు అందజేశారు. రాజశేఖర్‌ను సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ హర్షవర్ధన్  శంషాబాద్ ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసనాయుడు రాజేంద్రనగర్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ శ్యాంసుందర్ రెడ్డి  అభినందించారు. పోలీసు ఉన్నతాధికారులు ప్రశంసలపై రాజశేఖర్‌ హర్షం వ్యక్తం చేశారు.

*సుజీవన్ వావిలాల*🖋️