Tuesday, September 20, 2022

జనరల్ కోటా నుంచే ఈడబ్ల్యూఎస్.... కేద్రం

*జనరల్ కోటా నుంచే ఈడబ్ల్యూఎస్.... కేద్రం*

న్యూఢిల్లీ: సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు అమలవుతున్న 50 శాతం రిజర్వేషన్‌ కోటాలో ఎలాంటి కోత లేదని, కేవలం జనరల్‌ కోటా నుంచే ఈడబ్ల్యూఎస్‌కు స్థానం కల‍్పించామని కేంద్రం సుప్రీంకోర్టులో స్పష్టంచేసింది.ఓబీసీ, ఎస్‌సీ, ఎస్‌టీలకు ఉన్న 50 శాతం రిజర్వేషన్‌ స్వాతంత్య్రతకు ఎలాంటి భంగం వాటిల్లలేదని కేంద్రప్రభుత్వం తరఫున హాజరైన అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌ సుప్రీంకోర్టు సీజే జస్టిస్‌ లలిత్‌ నేతృత్వంలోని ఐదుగురు జడ్జీల రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించారు.

ప్రవేశాలు, ఉద్యోగాల్లో ఆర్థికంగా బలహీనమైన వర్గాల(ఈడబ్ల్యూఎస్‌)కు కేంద్రం 10 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తున్న విషయం విదితమే. రిజర్వేషన్‌ కల్పనకు ఆర్థిక పరిస్థితి గీటురాయి కాదని, ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్‌ను కోర్టు సమరి్థంచాలనుకుంటే అంతకుముందుగా ఇందిరా సహానీ(మండల్‌) తీర్పును çసమీక్షించాలని తమిళనాడు ప్రభుత్వం కోరింది.

*సుజీవన్ వావిలాల*🖋️

బుల్లెట్ బండి పెళ్లి కూతురు... భర్త ఏసీబీ వలకు చిక్కాడు

*బుల్లెట్ బండి పెళ్లి కూతురు... భర్త ఏసీబీ వలకు చిక్కాడు*

హైదరాబాద్‌: బడంగ్‌పేట మున్సిపల్‌ కార్పొరేషన్‌ పట్టణ ప్రణాళిక అధికారి ఆకుల ఆశోక్‌ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారుల వలకు చిక్కాడుప్రణాళికా విభాగంలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న అశోక్‌.. దేవేందర్‌రెడ్డి అనే వ్యక్తి నుంచి ఇంటి నిర్మాణం కోసం రూ.30 వేలు లంచం డిమాండ్‌ చేశాడు. ఆ మొత్తం నగదును తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయంతో పాటు అశోక్‌ నివాసంలోనూ ఏసీబీ అధికారులు సోదాలు కొనసాగించారు. 'బుల్లెట్‌ బండి' పాటకు డ్యాన్స్‌ చేసి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన పెళ్లి కుమార్తె భర్తే ఈ అశోక్‌. ఈ సాంగ్‌తో అతడు కూడా సామాజిక మాధ్యమాల్లో ప్రచారంలోకి వచ్చిన విషయం తెలిసిందే.

*సుజీవన్ వావిలాల*🖋️

ప్రతి పోలీస్ స్టేషన్ లో ఆడియోతో కూడిన CCTV కెమెరాలు

*ప్రెస్ నోట్ - పత్రికా ప్రకటన - ప్రతి పోలీస్ స్టేషన్ లో ఆడియోతో కూడిన CCTV  కెమెరాలు*

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం లోని ప్రతి పోలీస్ స్టేషన్ లో ఆడియోతో కూడిన సీసీ కెమెరాలు అమర్చాలి - తెలంగాణ రాష్ట్ర డీజీపీ కార్యాలయం లో పోలీస్ ఉన్నత అధికారులను కలిసి వినతిపత్రం సమర్పించిన సీసీఆర్ హైదరాబాద్ విభాగం

సామాన్యులు పోలీస్ స్టేషన్ కు వస్తే సత్వర & పారదర్శకంగా న్యాయం జరగాలన్న లక్ష్యంతో ప్రతి పోలీస్ స్టేషన్ లో ఆడియోతో కూడిన సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని కోరుతూ కౌన్సిల్ ఫర్ సిటిజెన్ రైట్స్ (సీసీఆర్) సంస్థ సభ్యులు సోమవారం తెలంగాణ రాష్ట్ర డీజీపీ కార్యాలయంలో సుప్రీంకోర్టు ఆర్డర్ తో కూడిన వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా సీసీఆర్ సంస్థ హైదరాబాద్ విభాగం వారు మాట్లాడుతూ సమ సమాజ స్థాపనకు సీసీఆర్ సంస్థ ఎల్లప్పుడూ కృషి చేస్తుందని అన్నారు. ప్రజలకు నిజమైన న్యాయం లభించినప్పుడే తమ పనికి సార్ధకత ఏర్పడుతుందని, సామాజిక & ప్రజా ప్రయోజనాల నిమిత్తం ఈ కార్యక్రమం నిర్వహించామని, మెరుగైన పోలీస్ సేవల కోసం, పోలీస్ వ్యవస్థలో జవాబుదారీతనం పెంచడం, పోలీస్ వ్యవస్థపై భయం పోయి నమ్మకం రావడం, పోలీస్ స్టేషన్ లలో సత్వర & పారదర్శక న్యాయం కోసం సీసీ కెమెరాల ఏర్పాటు చేయాలని పోలీస్ కమిషనర్ కు వినతి పత్రం అందించామని సంస్థ సభ్యులు తెలిపారు.

సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం సీసీ కెమెరాలు ఉండవలసిన చోట్లు, సీసీఆర్ సంస్థ పిటిషన్ వివరాలు : పోలీస్ స్టేషన్ లోని అన్ని ప్రవేశ మరియు నిష్క్రమణ పాయింట్లు; పోలీస్ స్టేషన్ యొక్క ప్రధాన ద్వారం; అన్ని లాక్-అప్‌లు, అన్ని కారిడార్లు; లాబీ / రిసెప్షన్ ప్రాంతం; అన్ని వరండాలు / అవుట్‌హౌస్‌లు; ఇన్‌స్పెక్టర్ గది, సబ్-ఇన్‌స్పెక్టర్ గది; లాక్-అప్ గది వెలుపల ఉన్న ప్రాంతాలు, స్టేషన్ హాల్; పోలీస్ స్టేషన్ కాంపౌండ్ ముందు; వెలుపల (లోపల కాదు) వాష్‌రూమ్‌లు / మరుగుదొడ్లు; డ్యూటీ ఆఫీసర్ గది, పోలీస్ స్టేషన్ వెనుక భాగం మొదలైనవి.
CCTV కెమెరాలు రాత్రి దృష్టితో ఉండాలి మరియు తప్పనిసరిగా ఆడియో మరియు వీడియో ఫుటేజీని కలిగి ఉండాలి. రికార్డింగ్‌లను 18 నెలల పాటు భద్రపరచాలి.

ఈ కార్యక్రమంలో సీసీఆర్ సంస్థ తెలంగాణ రాష్ట్ర సెక్రటరీ యెలిశెట్టి ప్రసాద్, జోనల్ లీగల్ అడ్వైజర్ సెక్రటరీ గుండ్ల మణికంఠ, తదితరులు పాల్గొన్నారు.

సందేహాలకు సంప్రదించగలరు: 90145 86589, 70418 61001, 91824 99025.

అవినీతి రహిత & అలసత్వం లేని భారత వ్యవస్థ మా లక్ష్యం
సిసిఆర్ సంస్థ ఆఫీషియల్ ఈమేల్: councilforcitizenrights@gmail.com

Monday, September 19, 2022

తెలంగాణ..... బతుకమ్మ ఉత్సవాల తేదీల .... ఖరారు

*తెలంగాణ..... బతుకమ్మ ఉత్సవాల   తేదీల .... ఖరారు*

హైదరాబాద్: తెలంగాణలో ఈనెల 25 నుంచి అక్టోబర్‌ 3 వరకు బతుకమ్మ ఉత్సవాలు జరగనున్నాయి. బతుకమ్మ వేడుకలకు ఏర్పాట్లు చేయాలని టీఎస్‌ సర్కార్‌ నిర్ణయం తీసుకుంది.అక్టోబర్‌ 3న ట్యాంక్‌బండ్‌ దగ్గర ఉత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. బీఆర్‌కే భవన్‌లో సమన్వయ సమావేశం జరిగింది. ఈ భేటీలో ప్రభుత్వ సలహాదారు రమణాచారి, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి, ఆయాశాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బతుకమ్మ వేడుకల కోసం చేయాల్సిన ఏర్పాట్లపై చర్చించారు. ఈ నెల 25 నుంచి అక్టోబర్‌ 3వ తేదీ వరకు బతుకమ్మ వేడుకలకు విస్తృతమైన ఏర్పాట్లు చేయాలని సీఎస్ అధికారులను ఆదేశించారు.

*సుజీవన్ వావిలాల*🖋️
ప్రజల పక్షం 

Sunday, September 18, 2022

గవర్నర్ తమిళిసై ని కలిసిన MLA రాజా సింగ్ భార్య....!

*గవర్నర్ తమిళిసై ని కలిసిన MLA రాజా సింగ్ భార్య....!*

గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ భార్య రాష్ట్ర గవర్నర్ తమిళిసైని కలిశారు. అయితే తన భర్తపై తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా కేసులు బనాయించిందని, వీటిపై జోక్యం చేసుకోవాలంటూ గవర్నర్‌కు ఉషాభాయి వినతి చేశారుతన భర్తపై ఉద్దేశపూర్వకంగానే కేసులు పెట్టారని ఫిర్యాదు చేశారు. రాజాసింగ్ సతీమణి గతకొద్దిరోజులుగా న్యాయం చేయాలంటూ అటు కేంద్ర ప్రభుత్వానికి, గవర్నర్‌తో పాటు అవకాశం ఉన్న ప్రతీ చోట ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే గవర్నర్‌ను కలిసిన ఉషాభాయి. తన భర్తపై కేసులు ఎత్తివేయాలని లేఖ అందజేశారు. ఇంకోవైపు ప్రభుత్వం చెబుతున్నట్లు వంద కేసులు తన భర్తపై లేవని, అవన్నీ ప్రజాకోర్టులో కొట్టేసినవే అని తెలిపారు. ప్రభుత్వం ఒక వర్గానికి మాత్రమే కొమ్ముకాసేలా వ్యవహరిస్తోందని, దాన్ని ప్రశ్నించిన రాజాసింగ్‌పై తప్పుడు కేసులు పెట్టిందని రాజాసింగ్ సతీమణి తెలిపారు

*సుజీవన్ వావిలాల*🖋️

Friday, September 16, 2022

TS: రేపు సెలవు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం

TS: రేపు సెలవు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం

హైదరాబాద్‌:  తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం రేపు (శనివారం) సెలవు ప్రకటించింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

అవాక్కయ్యే ఘటన.... జయహో జగదీష్ రెడ్డి.... జిల్లా పోలీస్ బాస్ అత్యుత్సాహం

*అవాక్కయ్యే ఘటన.... జయహో జగదీష్ రెడ్డి.... జిల్లా పోలీస్ బాస్ అత్యుత్సాహం*

సూర్యాపేట జిల్లా: సూర్యాపేటలో జరిగిన వజ్రోత్సవ వేడుకల్లో షాకింగ్‌ ఘటన చోటు చేసుకుంది. సాక్షాత్తూ ఒక జిల్లా ఎస్పీనే అత్యుత్సాహం ప్రదర్శించారు.వజ్రోత్సవాల్లో ఏర్పాటు చేసిన సభలో జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్‌.. 'జయహో జగదీష్‌రెడ్డి' అంటూ నినాదాలు చేశారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన తెలంగాణ జాతీయ వజ్రోత్సవాల్లో మంత్రి జగదీష్‌రెడ్డి, జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్‌ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు... ''జయహో జగదీష్‌రెడ్డి'' అంటూ నినాదాలు చేయడంతో అక్కడ ఉన్నవారంతా ఆశ్చర్యానికి గురయ్యారు. వేదిక ముందున్నవారితో కూడా ఎస్సీ.. 'జయహో జగదీషన్న' అంటూ నినాదాలు చేయించారు. జిల్లా పోలీస్‌ బాస్‌ తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. టీఆర్‌ఎస్‌ నేత మాట్లాడినట్లుగా ఎస్పీ ప్రసంగం ఉందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు

*సుజీవన్ వావిలాల*🖋️