*ప్రెస్ నోట్ - పత్రికా ప్రకటన - ప్రతి పోలీస్ స్టేషన్ లో ఆడియోతో కూడిన CCTV కెమెరాలు*
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం లోని ప్రతి పోలీస్ స్టేషన్ లో ఆడియోతో కూడిన సీసీ కెమెరాలు అమర్చాలి - తెలంగాణ రాష్ట్ర డీజీపీ కార్యాలయం లో పోలీస్ ఉన్నత అధికారులను కలిసి వినతిపత్రం సమర్పించిన సీసీఆర్ హైదరాబాద్ విభాగం
సామాన్యులు పోలీస్ స్టేషన్ కు వస్తే సత్వర & పారదర్శకంగా న్యాయం జరగాలన్న లక్ష్యంతో ప్రతి పోలీస్ స్టేషన్ లో ఆడియోతో కూడిన సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని కోరుతూ కౌన్సిల్ ఫర్ సిటిజెన్ రైట్స్ (సీసీఆర్) సంస్థ సభ్యులు సోమవారం తెలంగాణ రాష్ట్ర డీజీపీ కార్యాలయంలో సుప్రీంకోర్టు ఆర్డర్ తో కూడిన వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా సీసీఆర్ సంస్థ హైదరాబాద్ విభాగం వారు మాట్లాడుతూ సమ సమాజ స్థాపనకు సీసీఆర్ సంస్థ ఎల్లప్పుడూ కృషి చేస్తుందని అన్నారు. ప్రజలకు నిజమైన న్యాయం లభించినప్పుడే తమ పనికి సార్ధకత ఏర్పడుతుందని, సామాజిక & ప్రజా ప్రయోజనాల నిమిత్తం ఈ కార్యక్రమం నిర్వహించామని, మెరుగైన పోలీస్ సేవల కోసం, పోలీస్ వ్యవస్థలో జవాబుదారీతనం పెంచడం, పోలీస్ వ్యవస్థపై భయం పోయి నమ్మకం రావడం, పోలీస్ స్టేషన్ లలో సత్వర & పారదర్శక న్యాయం కోసం సీసీ కెమెరాల ఏర్పాటు చేయాలని పోలీస్ కమిషనర్ కు వినతి పత్రం అందించామని సంస్థ సభ్యులు తెలిపారు.
సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం సీసీ కెమెరాలు ఉండవలసిన చోట్లు, సీసీఆర్ సంస్థ పిటిషన్ వివరాలు : పోలీస్ స్టేషన్ లోని అన్ని ప్రవేశ మరియు నిష్క్రమణ పాయింట్లు; పోలీస్ స్టేషన్ యొక్క ప్రధాన ద్వారం; అన్ని లాక్-అప్‌లు, అన్ని కారిడార్లు; లాబీ / రిసెప్షన్ ప్రాంతం; అన్ని వరండాలు / అవుట్‌హౌస్‌లు; ఇన్‌స్పెక్టర్ గది, సబ్-ఇన్‌స్పెక్టర్ గది; లాక్-అప్ గది వెలుపల ఉన్న ప్రాంతాలు, స్టేషన్ హాల్; పోలీస్ స్టేషన్ కాంపౌండ్ ముందు; వెలుపల (లోపల కాదు) వాష్‌రూమ్‌లు / మరుగుదొడ్లు; డ్యూటీ ఆఫీసర్ గది, పోలీస్ స్టేషన్ వెనుక భాగం మొదలైనవి.
CCTV కెమెరాలు రాత్రి దృష్టితో ఉండాలి మరియు తప్పనిసరిగా ఆడియో మరియు వీడియో ఫుటేజీని కలిగి ఉండాలి. రికార్డింగ్‌లను 18 నెలల పాటు భద్రపరచాలి.
ఈ కార్యక్రమంలో సీసీఆర్ సంస్థ తెలంగాణ రాష్ట్ర సెక్రటరీ యెలిశెట్టి ప్రసాద్, జోనల్ లీగల్ అడ్వైజర్ సెక్రటరీ గుండ్ల మణికంఠ, తదితరులు పాల్గొన్నారు.
సందేహాలకు సంప్రదించగలరు: 90145 86589, 70418 61001, 91824 99025.
అవినీతి రహిత & అలసత్వం లేని భారత వ్యవస్థ మా లక్ష్యం
సిసిఆర్ సంస్థ ఆఫీషియల్ ఈమేల్: councilforcitizenrights@gmail.com
No comments:
Post a Comment